

Baby Care
26 April 2023 న నవీకరించబడింది
అంబిలికల్ లేదా బొడ్డు హెర్నియా అనేది బొడ్డు లేదా అంబిలికస్ పై ఏర్పడే అసాధారణ వాపుని సూచిస్తుంది.ఇది ప్రేగులోని ఒక భాగంతోపాటు ఏదైనా ద్రవం లేదా కొవ్వు ఉదర గోడల కండరాల నుండి చొచ్చుకుని పైకి వాపులా ఉబ్బటం ఫలితంగా కన్పిస్తుంది. పిల్లల విషయంలో, ఇది పుట్టుక సమయంలో ఉండే పొత్తికడుపు గోడ తెరుచుకోవటం ఫలితంగా వస్తుంది. ఈ ఉబ్బు ఎప్పుడూ ఉండి బిడ్డ ఏడ్చినప్పుడు, దగ్గినప్పుడు లేదా మలవిసర్జన చేసేటప్పుడు ఒత్తిడికి గురవుతూ ఉంటుంది.
గర్భాశయంలో పెరుగుతున్నప్పుడు బిడ్డకి కడుపులో అవయవాలు బయటివైపు పెరుగుతాయి. అవి కడుపు లోపలికి గర్భం యొక్క 10వ వారంలోకి వస్తాయి. ఈ సమయంలో ఒకవేళ ఆ అవయవాల చుట్టూ ఉదర గోడల కండరాలు ఏర్పడకపోతే, అంబిలికల్ లేదా బొడ్డు హెర్నియా ఏర్పడుతుంది. ఫలితంగా కొన్నిసార్లు ప్రేగులు ఈ లోపం వలన చిక్కుకుపోయి సున్నితంగా మారి నొప్పి కలగవచ్చు. ఈ స్థితిని నిర్భంధ లేదా ఇన్కార్సెరేటెడ్ హెర్నియా అంటారు. ప్రేగుల సరైన స్థితిని అర్థం చేసుకుని, నష్టాన్ని నివారించడానికి దీనికి డాక్టరుచే సరైన పరీక్ష అవసరం అవుతుంది.
90 శాతం కేసులలో, బొడ్డు హెర్నియా 3 నుండి 4 ఏళ్ళు వచ్చే లోపల అదంతట అదే తగ్గిపోతుంది. కానీ, ఒకవేళ ఈ లోపం యొక్క ఉబ్బు 2 సెంటీమీటర్ల వ్యాసం కన్నా పెద్దగా ఉంటే ఆపరేషన్ అవసరం అవుతుంది. ఆపరేషన్లో భాగంగా బొడ్డు వద్ద కింద భాగం చుట్టూ ఒక చిన్న కోతని పెట్టి హెర్నియా లేదా ఉబ్బుని గుర్తిస్తారు, తర్వాత హెర్నియాని తొలగించి ఉబ్బిన ప్రేగుని దాని సరైన స్థానంలోకి వెనక్కి లోపలికి తోస్తారు. ఆ తర్వాత కోత పెట్టిన పొట్ట చర్మానికి కుట్లు వేస్తారు.
మీ పిల్లలకి నొప్పి తగ్గడానికి మందులు ఇస్తారు. నొప్పి నియంత్రణకి ఇవి కొన్ని డోసులు మాత్రమే సరిపోవచ్చు. అవి అయ్యాక మీ బిడ్డ సాధారణంగా తినటం ప్రారంభించవచ్చు. కానీ మీరు చేయాల్సింది ఆపేరేషన్ జరిగిన ప్రాంతానికి ఎటువంటి నష్టం రాకుండా చూడటం, అలాంటివి నివారించడం. ఈ కేసు విషయంలో మీ పిల్లలు ఆడుకోవడం అలాగే బైకు నడపటం లేదా క్రీడల ఈవెంట్లలో పాల్గొనడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ పనులన్నీ డాక్టరు వచ్చేసారి అపాయింట్మెంట్లో పరీక్షించి, తగ్గిపోయిందని అనుమతి ఇస్తేనే మళ్ళీ మొదలుపెట్టవచ్చు.
Yes
No

Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips


అబార్షన్ తర్వాత.. ప్రెగ్నెన్సీ రావడం కష్టం ఎందుకు కష్టం అవుతుంది?

పుట్టు వెంట్రుకలు ఎందుకు తీయిస్తారు? తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆచారానికి కల ప్రాముఖ్యత ఏమిటి?

సీమంతం అంటే ఏమిటి? గర్భవతులకు ఈ వేడుకని ఎందుకు జరిపిస్తుంటారు?

గర్భానికి, స్త్రీలు కాలికి మెట్టెలు పెట్టుకోవడానికి సంబంధం ఏమిటో తెలుసా?

గర్భవతులు మొబైల్ ఫోన్ వాడచ్చా? ఇది పుట్టబోయే బిడ్డపై ఎంత వరకు ప్రభావం చూపుతుంది?

మీ ప్రీ స్కూలర్ (3-5సంవత్సరాల పిల్లలు) మరియు వారి బెడ్ టైమ్

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |