Pregnancy
4 April 2023 న నవీకరించబడింది
గత కొన్ని సంవత్సరాల క్రితం వరకూ, భారతదేశ ప్రజలకి బొడ్డుతాడు యొక్క మూల కణాల బ్యాంకు (కార్డ్ సెల్ స్టెమ్ బ్యాంకింగ్) అనేది పూర్తిగా తెలియని కొత్త విషయంగా ఉండేది. కొత్తగా తల్లిదండ్రులi కాబోతున్నప్పుడు, మీ బిడ్డ భవిష్యత్తుని కాపాడటానికి ఉన్న వివిధ మార్గాల గురించి మీకు సలహాలు వచ్చి ఉండవచ్చు. ఇన్సూరెన్స్ పాలసీల నుండి స్టెమ్ సెల్ బ్యాంకు (మూలకణాల బ్యాంకు) వరకూ మీరు అన్నిటి గురించి ఆలోచించి ఉండవచ్చు. ఇన్ని రకాల అవకాశాలు మీకు మరీ ఎక్కువగా అన్పించినప్పటికీ, ఇవన్నీ మీ బిడ్డ భవిష్యత్తుని నిర్ణయించడంలో కీలకపాత్రని పోషిస్తాయి.
మూలకణాలని భద్రపరిచే కార్డ్ సెల్ బ్యాంకింగ్ అనేది మీరు మీ బిడ్డకి అన్నిటికన్నా ముందుగా అలాగే అన్నిటికన్నా నమ్మకంగా అందించగలిగే భద్రత. మూలకణాలు 70కి పైగా ప్రాణాంతక రోగాలని నయం చేయగలవు అలాగే మీ ఇతర కుటుంబ సభ్యులకి కూడా రకరకాల ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తాయి.
అయితే ఈ మూలకణాల కోసం సరైన కార్డ్ సెల్ బ్యాంకు ఏదన్నదే ప్రశ్న. సరైన కార్డ్ సెల్ బ్యాంకుని ఎంపిక చేసుకోవటానికి చాలా పరిగణనలు ఉన్నాయి. పసిబిడ్డ యొక్క సురక్షితమైన భవిష్యత్తు కోసం నమ్మకమైన అలాగే హేతుబద్ధమైన కార్డ్ బ్యాంకుని ఎంపిక చేసుకోవడం చాలా అవసరం.
పసిబిడ్డ యొక్క బొడ్డుతాడులో అలాగే ప్లాసెంటాలో (జరాయువు లేదా మావి) ఉండే రక్తాన్ని తాడు రక్తం అంటారు. దీన్నే బొడ్డుతాడు రక్తం లేదా ప్లేసెంటా రక్తం అని కూడా భావిస్తారు. ఈ రక్తం ప్రాణాలని రక్షించగలిగే శక్తి ఉన్న కణాలైన మూలకణాలని కలిగివుంటుంది. మూలకణాలు లేదా స్టెమ్ సెల్స్ సాధారణంగా వివిధ రోగాలతో పోరాడే, శరీరం అంతటా ఆక్సిజన్ని మోసుకువెళ్ళే ఇంకా రక్తం గడ్డకట్టేలా చేయగలిగే రక్తకణాలుగా అభివృద్ధి చెందుతాయి.
బిడ్డ పుట్టిన తర్వాత, సాధారణంగా మావిని, బొడ్దుతాడుని అలాగే బొడ్డుతాడు రక్తాన్ని పట్టించుకోకుండా వ్యర్థపదార్థాలుగా చెత్తలో పడేస్తారు. కానీ, చాలామంది తల్లిదండ్రులు భవిష్యత్తులో కలిగే ఉపయోగాల కోసం కార్డ్ బ్లడ్ లేదా స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ద్వారా బొడ్డుతాడు రక్తాన్ని నిల్వ చేయడానికి ఆసక్తి చూపిస్తారు.
స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అని కూడా పిలవబడే కార్డ్ సెల్ బ్యాంకింగ్ అంటే కొత్తగా పుట్టిన బిడ్డ యొక్క బొడ్డుతాడు ఇంకా ప్లేసెంటా నుండి మిగిలివున్న రక్తాన్ని సేకరించడం. సేకరించాక ఈ రక్తాన్ని వేడి చేసి, గడ్డకట్టించి భవిష్యత్తులో వచ్చే వైద్య అవసరాల కోసం ప్రత్యేకంగా నిర్మించిన సౌకర్య ప్రాంతాలలో నిల్వ చేస్తారు.
కార్డ్ బ్లడ్ సెల్ బ్యాంకింగ్ కి (బొడ్డుతాడు రక్తకణాల నిల్వ) సంబంధించి, మీకు రెండు ముఖ్యమైన ప్రత్యామ్నాయాలు ఉంటాయి:
బొడ్డుతాడు రక్తం అనేది రక్తంలో ఉండే మూలకణాలకి సంబంధించిన గొప్ప వనరు. మూలకణాలని రక్తవ్యవస్థ ఇంకా రోగనిరోధక వ్యవస్థల యొక్క పునాదిరాళ్ళుగా భావిస్తారు. మూలకణాలు ఇన్ఫెక్షన్ తో పోరాడగల, శరీరం అంతటా ఆక్సిజన్ని మోసుకువెళ్లగల ఇంకా రక్తం గడ్డకట్టడంలో సాయం చేయగల రక్త కణజాలంలోకి ఉత్పత్తి అవుతాయి. ఇవి వివిధ రకాల రోగాలని నయం చేయగల కణజాలాలు, అవయవాలు ఇంకా రక్తనాళాల మరమ్మత్తుని కూడా మొదలుపెట్టగలవు.
ఇవి ఎముకల మజ్జ, మనుషుల పిండాలు, పిండం యొక్క కణజాలం, వెంట్రుకల కుదుళ్ళు, పసిపిల్లల పళ్ళు, కొవ్వు ఇంకా ప్రసరిస్తున్న రక్తం, కండరాలలో కూడా కన్పిస్తాయి. మనిషి శరీరంలో దాదాపుగా ప్రతి అవయవం మూలకణాలని కలిగి ఉంటుంది, కానీ వాటిని జబ్బుల చికిత్సకి ఇంకా వైద్యపరంగా వాడటానికి సేకరించేంత సమృద్ధిగా ఉండవు.
బొడ్డుతాడు రక్తంలోని మూలకణాలు పూర్తిగా పరిపక్వం చెంది ఉండవు అలాగే ఎముక మజ్జలోని మూలకణాలలాగా శరీరం బయటి నుండి వచ్చే కణాలపై దాడి చేయడానికి కూడా పూర్తిగా సన్నద్ధంగా ఉండవు. ఇతర మూలకణాల వనరుల కంటే బొడ్డుతాడు రక్తంతో మార్పిడి చేసిన ట్రాన్స్ ప్లాంట్ పేషెంట్లతో సరిపోల్చడం సులభం అవుతుంది, ఎందుకంటే బొడ్దుతాడు రక్తంలోని మూలకణాలని బదిలీ చేసినప్పుడు అవి తిరస్కరించబడే అవకాశం తక్కువగా ఉంటుంది.
ఈ ప్రత్యేక బొడ్డుతాడు రక్తకణాలు వివిధ రోగాలని నయం చేయడానికి విస్తృతంగా ఉపయోగించబడతాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధన కూడా ఇతర జబ్బులకి వీటిని అనుకూలంగా వాడవచ్చని సూచిస్తోంది.
ట్రాన్స్ ప్లాంట్ కోసం చేసే ఏదైనా థెరపీలో, శరీరం మార్పిడి చేసిన కణాలని తిరస్కరించే లేదా ప్రతిస్పందించే రిస్కుని కలిగివుంటుంది. మీ బిడ్డకి మూలకణాల మార్పిడి అవసరం అయ్యే ఏదైనా అనూహ్య సంఘటన ఎదురైనప్పుడు నిల్వ చేయబడిన బొడ్డుతాడు రక్తం సరైన జత అవుతుంది. రక్తంలోని మూలకణాలు అవసరం అయితే తోబుట్టువులకి లేదా మిగిలిన కుటుంబ సభ్యులకి కూడా సరిపోవచ్చు.
బొడ్డుతాడు రక్తకణాలు చాలా దేశాలలో 80 కన్నా ఎక్కువ వేర్వేరు వ్యాధులని నయం చేయగలవు, ఆ నయం చేయగలిగే వాటిల్లో కొన్నిరకాల క్యాన్సర్లు, రక్తం డిజార్డర్లు ఇంకా రోగనిరోధక లోపాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఇవి :
బొడ్డుతాడు యొక్క రక్తకణాల వాడకాన్ని విశ్లేషించడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జంతువులపై కూడా జరుగుతున్నాయి. ఫలితాలు ప్రోత్సాహకరంగానే ఉన్నప్పటికీ, జంతువులపై జరిగిన అధ్యయనాలని తల్లిదండ్రులు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని చాలామంది నిపుణులు సలహా ఇస్తున్నారు.
చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డ యొక్క బొడ్డుతాడు రక్తంలోని మూలకణాలు వాళ్ళు పెద్దయ్యాక కూడా పనిచేస్తాయా అని ఆలోచిస్తారు. బొడ్డుతాడు రక్తాన్ని ట్రాన్స్ ప్లాంట్ల కోసం కొద్ది సమయం మాత్రమే వాడుతున్నారు కాబట్టి, బొడ్డుతాడు రక్తాన్ని ఎంత కాలంపాటు విజయవంతంగా నిల్వ చేయవచ్చో అలాగే మార్పిడి కోసం వాడవచ్చో తెలియదు. ఏది ఎలా ఉన్నా, బొడ్డుతాడు రక్తకణాలని సరిగ్గా గడ్డకట్టించే అలాగే నిల్వచేసే పద్ధతులతో, శాస్త్రవేత్తలు అవి కనీసం కొన్ని దశాబ్దాల పాటు అలాగే బహుశా పాడయ్యే తేదీ కూడా లేకుండా ఉండవచ్చని అంటున్నారు.
మీ బిడ్డ యొక్క బొడ్డుతాడు రక్తాన్ని బ్యాంకులో భద్రపరచడం గురించి మీరు, మీ కుటుంబం పరిగణించి, ఆలోచించి తీసుకునే నిర్ణయం చాలా వ్యక్తిగతమైనది.
కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ ప్రక్రియ శాస్త్రవేత్తలు అలాగే వైద్యుల కమ్యూనిటీలలో రకరకాల విరుద్ధ అభిప్రాయాలని రేకెత్తించింది, ఎందుకంటే ప్రధానంగా బొడ్డుతాడు రక్తాన్ని ప్రైవేటు బ్యాంకులో నిల్వ చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అలాగే అది ఫలించే అవకాశాలు మీ కుటుంబానికి అనిశ్చితంగా, తక్కువగా కూడా ఉంటాయి. బొడ్డుతాడు రక్తాన్ని ప్రాసెస్ చేయడానికి అలాగే మెడికల్ ఫ్రీజర్లలో ఏళ్లపాటు నిల్వచేయడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉండవచ్చు, కాబట్టి ఈ మొత్తం ప్రక్రియని ఖరీదుగానే పరిగణిస్తారు.
ఒకవేళ మీ కుటుంబంలో వైద్యపరమైన కారణం ఉంటే మాత్రమే, కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ ని పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ పాపులారిటీ పొందుతున్నప్పటికీ, భారతదేశంలో బొడ్డుతాడు రక్తమార్పిడులలో (ట్రాన్స్ ప్లాంట్) కొంతభాగం మాత్రమే నిర్వహించబడుతున్నాయి.
కొద్దిమంది తల్లిదండ్రులకి, ఇంకా చికిత్సలు కనుక్కోని వ్యాధులకి మూలకణాలు ఉపయోగపడవచ్చేమో అనే అవకాశం వారి బిడ్డ యొక్క బొడ్డుతాడు రక్తాన్ని నిల్వ చేయించడానికి ప్రేరేపిస్తుంది. ఒకవేళ మీరు ఈ ప్రత్యామ్నాయాన్ని పరిగణిస్తుంటే, మీరు గర్భం దాల్చినప్పటినుండే వెంటనే కార్డ్ బ్లడ్ బ్యాంకుల గురించి తెలుసుకొవడం, వెతకడం మంచిది. అలా చేయడం వలన సరైన కార్డు బ్లడ్ బ్యాంకుని కనుక్కోటానికి, మీ కుటుంబానికి వాటిల్లో సరిపోయేది ఎంచుకోవడానికి ఉన్న రకరకాల ప్రత్యామ్నాయాలని పరిగణించడటానికి మీకు తగినంత సమయాన్ని ఇస్తుంది.
మీరు ఎంచుకునే సంస్థ అలాగే ప్లాన్ ని బట్టి, ప్రతి బ్యాంకు యొక్క ఖర్చు మారుతూ ఉంటుంది. కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ లేదా మూలకణాల బ్యాంకింగ్ అనేది పరిగణించాల్సిన పెట్టుబడే అయినా, చాలా ప్రైవేటు కంపెనీలు రకరకాల పేమెంట్ ప్లాన్లతో, ప్రత్యేక ప్యాకేజీలని ఇస్తూ దాన్ని మరింత అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాయి. మీకు ఏది మంచి ఆప్షనో ఎంచుకోవడానికి మీరు లాభాలు, ఖర్చులని అంచనా వేయాల్సి ఉంటుంది.
భారతదేశంలో మూలకణాలని సంరక్షించే ఖర్చు ఒక్కో నగరానికి ఒక్కోలా మారుతూ, రకరకాల కారణాల చేత ప్రభావితమవుతుంది. ఇది వివిధ బ్యాంకులు అలాగే సంస్థల మధ్య హెచ్చుతగ్గులకి గురవుతూ ఉంటుంది. మూలకణాలని సంగ్రహించే వనరులు లేదా వాటిని సంరక్షించే విధానం కూడా మూలకణాల సంరక్షణని ప్రభావితం చేసే అంశాలుగా చెప్పవచ్చు. ఈ ప్రక్రియని నిర్వహించే స్పెషలిస్టు రకం కూడా మూలకణాల సంరక్షణ ఖర్చుని ప్రభావితం చేసే అంశాలలో ఒకటి.
భారతదేశంలో స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ని ప్రధానంగా ఇవి అందిస్తున్నాయి:
1. ప్రైవేటుగా నిర్వహించబడే బ్యాంకులు:
ఈ బ్యాంకులని మామూలుగా కుటుంబ బ్యాంకులని పిలుస్తారు, ఇక్కడ తల్లిదండ్రులు తమ బిడ్డ భవిష్యత్తులో వచ్చే ఏదైనా అవసరం కోసం వారి బొడ్డుతాడు రక్తాన్ని భద్రపరుస్తారు. ఈ పనిని ఒక రకమైన జీవపరమైన బీమాగా పరిగణిస్తారు, ఇందులో మూలకణాలని పసిపిల్లలు లేదా అన్నాచెల్లెళ్లలాంటి ఎవరైనా కుటుంబ సభ్యులు ఉపయోగించవచ్చు. భారతదేశంలో, పుట్టిన పసిబిడ్డలు ఏదైనా జన్యుపరమైన లోపాలతో బాధపడుతూ, భవిష్యత్తులో తిరిగి చికిత్స అవసరం అన్పిస్తేనే మూలకణాలని నిల్వ చేసుకోమని చిన్నపిల్లల వైద్య నిపుణులు సూచిస్తారు.
2. ప్రభుత్వ-యాజమాన్య లేదా పబ్లిక్ బ్యాంకులు:
ఈ స్టెమ్ సెల్ బ్యాంకులు ప్రజల విరాళాలపై పనిచేస్తాయి. ఇక్కడ తల్లిదండ్రులు తమ బిడ్డ యొక్క బొడ్డుతాడు రక్తాన్ని దానం చేయవచ్చు, అలాగే అవసరం ఉన్నవారు, ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే పబ్లిక్ బ్యాంకులలో ఇదివరకే రిజర్వు చేయబడిన బొడ్డుతాడు రక్త సాంపిళ్ళ నుండి తీసుకుని వాడుకోవచ్చు. ఈ నిల్వ చేయబడిన మూలకణాలని పరిశోధనలలో కూడా వాడతారు. అంతేకాకుండా, మూలకణాలని దానం చేయడానికి తల్లిదండ్రులకి కూడా తగిన అర్హతలు ఉండాలి, దానికి అర్హతా ప్రమాణాలు ఉన్నాయి. పబ్లిక్ బ్యాంకుల సాంపిళ్ళ డేటాబేస్ డాక్టర్లకి అందుబాటులో ఉంచబడుతుంది, వారికి అవసరమైనప్పుడు వాటిని వాడుకుంటారు. ప్రస్తుతానికి, భారతదేశంలో అందుబాటులో ఉన్న పబ్లిక్ స్టెమ్ సెల్ బ్యాంకులలో పరిమిత సంఖ్యలో మాత్రమే మూలకణ యూనిట్లు చికిత్స కోసం సిద్ధంగా ఉన్నాయి. కావలసిన చికిత్స డిమాండ్లతో పోలిస్తే, మార్పిడి కోసం అందుబాటులో ఉన్న స్టెమ్ సెల్ యూనిట్లు ఊహించలేనంత తక్కువగా ఉన్నాయి.
3. కమ్యూనిటీ స్టెమ్ సెల్ బ్యాంకులు:
ఈ రకమైన స్టెమ్ సెల్ బ్యాంకులు ప్రభుత్వ అలాగే ప్రైవేటు రెండింటి ప్రయోజనాలు కలిగివుంటాయి. ఈ రకమైన మోడల్లో బొడ్డుతాడు మూలకణాలని ఆ ప్రాంత సమూహ (కమ్యూనిటీ) పూల్ కి జోడిస్తారు అలాగే ఆ కమ్యూనిటీ బ్యాంకు సభ్యులు ఏదైనా వైద్యపరంగా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అక్కడ నిల్వ చేసిన అన్ని యూనిట్లని వాడుకోగలిగే యాక్సెస్ ఉంటుంది. ఈవిధంగా ఈ మోడల్ ప్రత్యేకమైనది, భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది. భారతదేశంలో అతిపెద్ద కమ్యూనిటీ స్టెమ్ సెల్ బ్యాంకులు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా మన దేశం ఈ విషయంలో మూడవ స్థానంలో ఉంది.
త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నవారికి కార్డ్ బ్లడ్ బ్యాంకుని ఎంపిక చేసుకోవటాన్ని సులభతరం చేయడానికి ఇక్కడ కొన్ని ప్రమాణాలు ఇవ్వబడ్డాయి:
1. అనుభవం:
ట్రాన్స్ ప్లాంట్ అలాగే ఇతర స్టెమ్ సెల్ థెరపీల కోసం బ్యాంకు అందించే తాడు రక్తం యూనిట్ల సంఖ్యని చూస్తే అవసరమైనప్పుడు పనిచేస్తున్న మూలకణాలని అందించటంలో వారి నైపుణ్యాన్ని సూచిస్తుంది. కొన్ని కుటుంబ బ్యాంకులు ట్రాన్స్ ప్లాంట్ కోసం కొన్ని వందల యూనిట్లని మాత్రమే విడుదల చేయగలిగినప్పటికీ, కొన్ని మాత్రం 1000 కార్డ్ బ్లడ్ ట్రాన్స్ ప్లాంట్లని చేయగలిగాయి. ఎక్కువగా కార్డ్ బ్లడ్ యూనిట్లు ఉండి, ట్రాన్స్ ప్లాంట్ల కోసం ఒక్క యూనిట్ కూడా వాడని బ్యాంకుల పట్ల జాగ్రత్తగా ఉండండి.
2. నిలకడ:
మిగతా వ్యాపారాలలాగానే ఈ కార్డ్ బ్లడ్ బ్యాంకులు కూడా పనిచేస్తాయి, ఏ సమయంలోనైనా దివాలా కూడా తీయవచ్చు. మీరు కార్డ్ బ్లడ్ బ్యాంకుల గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు కార్డ్ బ్లడ్ యూనిట్లకి తాత్కాలికంగా యాక్సెస్ పరంగా అంతరాయం రాకుండా లేదా వాటిని రవాణా చేసే సమయంలో సరిగ్గా తీసుకురాబడ్డాయా అనే ఆందోళనలు ముందే నివారించుకోవడానికి ఆ బ్యాంకులకి ఆర్థిక పరంగా స్థిరత్వం ఉందో లేదో చెక్ చేసుకోవడం అవసరం. చాలామటుకు పెద్ద పేరున్న కార్డ్ బ్లడ్ బ్యాంకులకి స్వంతంగా ల్యాబ్ లు ఉంటాయి. ఒక ల్యాబ్ భాగస్వామ్యం నుండి మరొక ల్యాబ్ భాగస్వామ్యానికి మారే బ్యాంకులకంటే ఎప్పుడూ ఒక సంస్థ వారి ల్యాబ్ నే ఉపయోగించే బ్యాంకులు ఎక్కువ స్థిరమైనవి.
3. ఇన్వెంటరీ:
తమ క్లయింట్ల కోసం నిల్వ చేసిన కార్డ్ బ్లడ్ యూనిట్ల సంఖ్య ఒక కార్డ్ బ్లడ్ బ్యాంకు యొక్క విజయాన్ని సూచించే మరొక సంకేతం. చాలాకాలం నుండి ఉంటున్న బ్యాంకులు సాధారణంగా పెద్దవిగా కూడా ఉంటాయి. కొన్ని బ్యాంకులలో అయితే వారి ఇన్వెంటరీలో దాదాపు 100,000 కార్డ్ బ్లడ్ యూనిట్లు నిల్వ చేయబడి ఉంటాయి.
4.ఇన్సూరెన్స్:
తమ బిడ్డ యొక్క మూలకణాలని వారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మార్పిడి చేయటానికి సాధ్యపడుతుందా అన్నది తల్లిదండ్రులకి ఉండే అతిపెద్ద ప్రశ్న.అందుకని కొన్ని బ్యాంకులు తల్లిదండ్రులకి ఒకవేళ వారి బొడ్డుతాడు రక్తాన్ని వాడవలసి వస్తే వారికి సరిపడా బీమా ప్రోగ్రాములని అందిస్తూ సాయపడతాయి.
5. రవాణా పద్ధతులు:
సజీవంగా ఉండే మూలకణాలు కాలంతోపాటు దెబ్బతినే ఇంకా క్షీణించిపోయే అవకాశం ఉంటుంది, ప్రత్యేకంగా విమానం కార్గో హోల్డ్ యొక్క లేదా లోడింగ్ డాక్ యొక్క వేడిలాంటి తీవ్రమైన పరిస్థితులకి గురైనప్పుడు ఇలా జరగవచ్చు. అందుకని తల్లిదండ్రులు వారి కలెక్షన్ మరియు రవాణా కిట్ల కోసం కార్డ్ బ్లడ్ బ్యాంకు అందించే మెటీరియల్ ఇంకా ఇన్సులేషన్ వాడాలి. తన చుట్టూ ఉష్ణోగ్రతలతో సంబంధం లేకుండా నిర్దేశించిన ఉష్ణోగ్రతనే నిలిపి వుంచే కిట్ సరైనది, అలాగే దాన్ని ధృవీకరించిన బ్యాంకు కూడా ఎంచుకోడానికి మంచిది.
6. గుర్తింపు:
స్టెమ్ సెల్ బ్యాంకింగ్లో మీరు ఎంపిక చేసుకున్న బ్యాంకు యొక్క చట్టబద్ధత ఎంత అనేదే ప్రాథమిక ఆందోళన. రెగ్యులేటింగ్ డిపార్ట్మెంట్లు బ్యాంకుకి గుర్తింపు ఇచ్చారో లేదో మొదటగా చూడాల్సిన విషయం. ఎలాగైతే హాస్పిటల్ కి ఆపరేషన్లు చేయటానికి లైసెన్స్ అవసరమో, అలాగే స్టెమ్ సెల్ బ్యాంకుకి వైద్య సేవల ప్రొవైడర్గా దాని చట్టబద్ధతని నిరూపించే లైసెన్స్ అలాగే గుర్తింపులు (అక్రిడిటేషన్లు) అవసరం. ఈ గుర్తింపులు ఇంకా లైసెన్సులు స్టెమ్ సెల్ బ్యాంకు నిర్దిష్టమైన ప్రమాణాలని నిర్వహించడానికి, పనిచేయటానికి చట్టబద్ధంగా అనుమతించబడిందని ధృవీకరిస్తాయి, అలా ఈ బ్యాంకు సురక్షితమైన ఎంపిక అని నిర్ధారించుకోవచ్చు.
7. ఖర్చు:
తల్లిదండ్రులకి కొత్త ఖర్చులు ఎదురవబోతున్నప్పుడు, కార్డ్ బ్లడ్ బ్యాంకు ఖర్చు కూడా ఒక ఆందోళనగా మారవచ్చు. పబ్లిక్ బ్యాంకులలో సరిపోయే యూనిట్ దొరుకుతుందో లేదో హామీ ఉండదు కాబట్టి, మీ బిడ్డకి అవసరమైనప్పుడు రక్షణ లభిస్తుందని తెలుసుకోవడం వలన వచ్చే మనశ్శాంతికి వెలకట్టడం కష్టం. ఇది ముఖ్యంగా వేర్వేరు జాతుల నుండి వచ్చే మిశ్రమ వారసత్వం ఉన్న వ్యక్తులకి ఉండే ప్రాథమిక ఆందోళన. అయితే, పేమెంట్ ప్లాన్లు కుటుంబ బ్యాంకుల ధరని తగ్గించగలవు, తక్కువ ధరలలో చవకగా మారతాయి.
పరీక్షల నిర్వహణ మరియు ప్రాసెసింగ్ ప్రమాణాలు: బొడ్డుతాడు రక్తాన్ని సేకరణ సమయంలోనో లేదా తిరిగి పంపే సమయంలోనో చేసే సాంపిల్ పరీక్షల గురించి చాలా మార్గదర్శకాలు ఉన్నాయి. అందులో భాగంగా పూర్తి కణాల కౌంట్, స్టెమ్ సెల్ వయబిలిటీ, ఇంకా హెచ్ ఐవి, హెపటైటిస్ మొదలైన అంటువ్యాధుల పరీక్షలు చేస్తారు. బిడ్డ పుట్టినప్పటి నుండి నిల్వ కోసం బొడ్డు తాడు రక్తాన్ని ప్రాసెస్ చేయటానికి మధ్య 48 గంటల పరిమితి ఉన్న బ్యాంకు అన్నిటికన్నా మంచిదని చెప్పవచ్చు. అలాగే, కార్డ్ బ్యాంకు యొక్క ప్రాసెసింగ్ పద్ధతులు మూలకణాలని ఎంత ఎక్కువ సాధ్యమైతే అంత ఎక్కువగా వెలికితీస్తాయి.
చివరిమాట
బొడ్డుతాడు రక్తాన్ని నిల్వచేయడం 80 కన్నా ఎక్కువ ప్రాణాలకి హాని చేసే వ్యాధులని నయం చేయటంలో సాయపడుతుంది. కానీ, మీ బిడ్డ యొక్క సురక్షితమైన అలాగే భద్రత కలిగిన భవిష్యత్తు కోసం విశ్వసనీయమైన, నమ్మదగిన ఆధారాలు కల కార్డ్ బ్లడ్ బ్యాంకుని ఎంచుకోవటం చాలా ముఖ్యమైనది ఇంకా సవాలుతో కూడినది. దీని కోసం పబ్లిక్, ప్రైవేటు అలాగే కమ్యూనిటీ స్టెమ్ సెల్ బ్యాంకుల వంటి చాలా రకాల బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదే కానీ, దీన్ని మరింత చవకగా చేయడానికి చాలా ప్రైవేటు కంపెనీలు రకరకాల పేమెంట్ ప్లాన్లు అలాగే ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తాయి. అందుకని, కార్డ్ సెల్ బ్యాంకింగ్ వలన కలిగే లాభాలు అలాగే ప్రమాద అవకాశాలని ఒక డాక్టరుతో సంప్రదించి, కలిసి అంచనా వేయటం మంచిది.
Yes
No
Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips
గర్భధారణ సమయంలో ఎకోస్ప్రిన్ ఎందుకు సిఫారసు చేయబడుతుంది?
పిలోనిడల్ సిస్ట్ (తిత్తి) అంటే ఏమిటి? కారణాలు, చికిత్స మరియు లక్షణాలు
బారసాల అంటే ఏమిటి..? ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు జరిపించాలి?
పుణ్యవచనం అంటే ఏమిటి? డెలివరీ అయ్యిన తరువాత ఈ ఆచారం ఎందుకు పాటిస్తారు?
అన్నప్రాశన అంటే ఏమిటి? పిల్లలకు అన్నప్రాశన ఎప్పుడు చేయాలి?
పుంసవనం అంటే ఏంటి? ఈ వైదిక కర్మ ద్వారా ఆడబిడ్డ లేదా మగబిడ్డ ను పొందవచ్చా?
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |