Rituals & Customs
4 April 2023 న నవీకరించబడింది
గర్భం దాల్చిన తరువాత ప్రతి అమ్మాయి తనకి పుట్టబోయే బిడ్డ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రెగ్నన్సీ సమయంలో ఎన్నో త్యాగాలు చేసి జాగ్రత్తగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తుంది. బిడ్డ గర్భంలో ఉండగానే, తన క్షేమం కోసం సంస్కారాలు ఉన్నాయి. అలాగే.. బిడ్డ పుట్టిన తరువాత కూడా తల్లి తండ్రులు ఆ బిడ్డకు కొన్ని సంస్కారాలు చేయవలసి ఉంటుంది. వాటిల్లో "బారసాల" సంస్కారం కూడా ఒకటి.
పసి పిల్లలు పాలు, నిద్ర, మరియు స్నానం పైనే ఆధార పడతారు. వారికి ఈ మూడే బలాన్ని చేకూరుస్తాయి. పాలు, స్నానం ఎంత అవసరమో.. అలానే నిద్ర కూడా అంతే అవసరం. అందుకే వారిని సౌఖ్యంగా ఉంచి నిద్రపుచ్చాల్సి ఉంటుంది. పసి పిల్లలు ఊపుని ఎక్కువగా ఇష్టపడతారు.
ఊయలలో ఊగుతూ వారు త్వరగా నిద్రపోతారు. ఒక్కోసారి వారికి చిరాకు కలిగినప్పుడు వారిని ఊరడించి నిద్రపుచ్చడం కష్టతరమవుతుంది. ఎక్కువ సేపు వారిని చేతులతోనూ, ఒడిలోనూ ఉంచడం మంచిది కాదు. అటువంటి సమయాలలో వారిని ఊయలలో వేసి నిద్రపుచ్చడం తేలిక అవుతుంది. అయితే.. బిడ్డ పుట్టగానే ఊయలలో వేయకూడదు. అందుకు తగిన ముహూర్తం నిర్ణయించి మంచి సమయంలో ఉయ్యాలలో పడుకోబెడుతుంటారు. ఈ వేడుకని బారసాల అని పిలుస్తారు.
బారసాలనే "నామకరణ డోలారోహణ" లేదా "నామకరణం" అని పిలుస్తారు. బారసాల అసలు పేరు బాల సారె. కాల క్రమంలో, వాడుకలో అది బారసాలగా మారింది.
సాధారణంగా బిడ్డ పుట్టిన 11 వ రోజు, 16 వ రోజు, 21 వ రోజున జరిపిస్తారు. ఈ రోజుల్లో కుదరకపోతే మూడవ నెలలో జరిపిస్తారు. మూడవ నెలలో కూడా కుదరని వారు 29 వ నెలలో జరిపిస్తారు. సాధారణంగా వీలైనంత తొందరగా జరిపించడానికి ఎక్కువ మంది ఆలోచిస్తారు. ఈ వేడుకకు పవిత్రమైన ముహుర్తాన్ని నిర్ణయించుకుని, సమీప ఆలయంలో లేదా ఇంటిలో జరుపుకుంటారు.
ఆ రోజు బిడ్డకు స్నానం చేయించి, తల్లి తండ్రులు ఇద్దరు విఘ్నేశ్వర పూజ చేసి, పుణ్యావచనం చేస్తారు. ఆ తరువాత బిడ్డకు కటి సూత్ర ధారణ చేస్తారు. అనగా.. దిష్టి దోషాలు తగలకుండా బిడ్డకు మొలత్రాడు కడతారు. ఆ తరువాత అతని జన్మ నక్షత్రం ప్రకారం పేరు పెడతారు. లేదా వారికి నచ్చిన పేరుని అయినా పెట్టుకొనవచ్చును.
పళ్లెంలో బియ్యం పోసి అందులో వేలితో పేరు రాస్తారు. ఆ తరువాత పాలు, తేనే కలిపిన మిశ్రమంలో ఉంగరం ముంచి బిడ్డ నాలుకపై ఉంచుతారు. బిడ్డ తండ్రి పేరుని శిశువు చెవిలో మూడు సార్లు గుస గుసగా చెబుతాడు. శిశువు మేనమామ కూడా ఈ విధంగా చేస్తారు. ఆ తరువాత పెద్దలంతా చేరి పిల్లలు గొప్ప వ్యక్తులు కావాలని ఆశీర్వదిస్తారు.
పేరు పెట్టడం పూర్తి అయిన తరువాత ఆ బిడ్డని ఊయలలో పడుకోబెడతారు. కొందరు మహిళలు ఊయల చుట్టూ చేరి నిద్ర పుచ్చడానికి పాటలు పాడతారు. ఆ తరువాత అమ్మాయి తల్లి తండ్రులు కూతురు, అల్లుడు, పుట్టిన బిడ్డకి బట్టలు పెడతారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి పండు తాంబూలాలు ఇచ్చి పంపిస్తారు. అలాగే.. అదే రోజున సాయం సమయంలో బాలింతరాలి చేత బావిలో చేద వేయిస్తారు. అప్పటి వరకు ఆమె పనులు చేయకుండా ఉంటుంది. ఇక నుంచి ఆమె పనులు చేసుకోవచ్చు అని చెప్పడం కోసం ఇలా ఆమె చేత బావిలో చేద వేయిస్తారు.
ఈ వేడుక సరదాగా చేసుకునే వేడుక. బిడ్డ పుట్టిన ఆనందంలో కుటుంబ సభ్యులంతా కలిసి చేసుకునే పండగ. వారి సంతోషాన్ని వ్యక్త పరుచుకుంటూ.. ఇంటిల్లిపాదీ కలిసి ఆహ్లాదంగా చేసుకునే వేడుక ఇది.
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips
గర్భధారణ సమయంలో ఎకోస్ప్రిన్ ఎందుకు సిఫారసు చేయబడుతుంది?
భారతదేశంలో సరైన కార్డ్ సెల్ బ్యాంకులని ఎలా ఎంచుకోవాలి
పిలోనిడల్ సిస్ట్ (తిత్తి) అంటే ఏమిటి? కారణాలు, చికిత్స మరియు లక్షణాలు
పుణ్యవచనం అంటే ఏమిటి? డెలివరీ అయ్యిన తరువాత ఈ ఆచారం ఎందుకు పాటిస్తారు?
అన్నప్రాశన అంటే ఏమిటి? పిల్లలకు అన్నప్రాశన ఎప్పుడు చేయాలి?
పుంసవనం అంటే ఏంటి? ఈ వైదిక కర్మ ద్వారా ఆడబిడ్డ లేదా మగబిడ్డ ను పొందవచ్చా?
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |