Pregnancy
4 April 2023 న నవీకరించబడింది
గర్భం దాల్చడం అనేది ప్రతి స్త్రీకి ఒక వరం లాంటిది. పెళ్లి అయిన స్త్రీలు తమ ప్రేమకి ప్రతిరూపంగా పుట్టబోయే బిడ్డ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే.. పురిటి నొప్పులు ఎంత కష్టతరమైనా వాటిని ఇష్టంగా భరించడానికే స్త్రీలు ఆసక్తి చూపిస్తారు. తమ బిడ్డని చూసుకోవాలని ఎంతగానో ఆశపడతారు.
అయితే.. గర్భం దాల్చిన తరువాత నుంచి ప్రసవం అయ్యే వరకు వారు ఎంతగానో జాగ్రత్తగా ఉంటారు. అలాగే.. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ హిందూ సంప్రదాయంలో కొన్ని వేడుకలను జరిపిస్తూ ఉంటారు. వాటిల్లో దొంగ చలిమిడి పెట్టడం కూడా ఒకటి.
సాధారణంగా గర్భం దాల్చాము అన్న సంగతి ఉన్నట్లుండి వాంతులు అవడం వల్లనో, పీరియడ్స్ మిస్ అవడం వల్లనో మనకు అనుమానం కలిగితే తెలుస్తుంది. స్త్రీ గర్భం దాల్చింది అన్న సంగతి తెలియగానే జరిపే మొదటి వేడుక దొంగ చలిమిడి పెట్టడం. ప్రతి స్త్రీ గర్భం దాల్చాక మొదట ఈ విషయాన్ని తన భర్తకు, తల్లితండ్రులకు, అత్తా మామలకు తెలియ చెబుతుంది.
ఈ విషయం తెలిసిన తరువాత అమ్మాయి పుట్టింటివారు అనగా.. తల్లితండ్రులు అత్తింటికి వచ్చి గర్భవతి అయిన స్త్రీ ఒడిలో దొంగ చలిమిడిని పెడతారు. ఈ వేడుకని బంధువులకు తెలియనివ్వకుండానే చేస్తారు. ఎవరికి చెప్పకుండా చలిమిడిని తీసుకొచ్చి అమ్మాయి ఒడిలో పెడతారు కాబట్టే దీనిని దొంగ చలిమిడి అని పిలుస్తారు. అయితే.. ఈ వేడుకని చాలా నిరాడంబరంగా, కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరుపుకుంటారు. దొంగ చలిమిడి పెట్టిన తరువాత మాత్రమే ఈ విషయాన్ని బంధువులకు, సన్నిహితులకు చెప్పుకుని సంతోషిస్తారు.
ఒకప్పుడు అయితే.. పీరియడ్స్ మిస్ అయితే.. ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకునే వారు. కానీ, ప్రస్తుతం అనేక ప్రెగ్నన్సీ టెస్టింగ్ కిట్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా ఒక నెల పీరియడ్ మిస్ అవ్వగానే టెస్ట్ చేసేసుకుంటున్నారు. ఫలితంగా.. రెండవ నెలలోనే తాము గర్భం దాల్చాము అన్న విషయాన్ని తెలుసుకుంటున్నారు. సాధారణంగా దొంగ చలిమిడిని మూడవ నెలలో పెట్టిస్తారు. అయితే.. రెండవ నెలలోనే గర్భవతి అయిన విషయం తెలిసినప్పటికీ.. మూడవ నెల వచ్చాక, దొంగ చలిమిడి పెట్టేవరకూ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పరు. తల్లి, బిడ్డ క్షేమాన్ని ఆశించి ఈ వేడుకని జరిపిస్తారు.
ముందుగా బియ్యప్పిండిని పట్టించుకుని సిద్ధం చేసుకోవాలి. బయట కొనుక్కున్న బియ్యప్పిండితో కూడా ఈ చలిమిడిని తయారు చేయవచ్చు. తరువాత కొన్ని కొబ్బరి ముక్కలను, బెల్లాన్ని తరిగి పెట్టుకోవాలి. యాలకులు కూడా పొడి చేసి పెట్టుకోవాలి. పదార్ధాలను సిద్ధం చేసుకోవడం పూర్తి అయిన తరువాత, తరిగిన బెల్లంతో ఉండపాకం పట్టుకోవాలి. బెల్లం పాకం పట్టిన తరువాత అందులోనే తరిగిన కొబ్బరి ముక్కలు, యాలకుల పొడి వేయాలి. తరువాత స్టవ్ ను ఆపివేసి బియ్యప్పిండి వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
బియ్యప్పిండిని స్టవ్ ఆన్ లో ఉండగా వేయకూడదు. ఉండలు కట్టకుండా పాకంలో కలుపుతూ బియ్యప్పిండిని వేయాలి. ఈ మిశ్రమం ముద్దలా తయారవుతుంది. ఈ చలిమిడినే తల్లి తన కూతురుని పెళ్లి చేసి పంపించేటప్పుడు, గర్భం దాల్చినప్పుడు, సీమంతం చేసే రోజున కూడా పెడుతూ ఉంటారు. కూతురుకి చలవ చేయాలనీ, కూతురు క్షేమాన్ని ఆశించి తల్లి చలిమిడిని పెడుతుంది.
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips
గర్భధారణ సమయంలో ఎకోస్ప్రిన్ ఎందుకు సిఫారసు చేయబడుతుంది?
భారతదేశంలో సరైన కార్డ్ సెల్ బ్యాంకులని ఎలా ఎంచుకోవాలి
పిలోనిడల్ సిస్ట్ (తిత్తి) అంటే ఏమిటి? కారణాలు, చికిత్స మరియు లక్షణాలు
బారసాల అంటే ఏమిటి..? ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు జరిపించాలి?
పుణ్యవచనం అంటే ఏమిటి? డెలివరీ అయ్యిన తరువాత ఈ ఆచారం ఎందుకు పాటిస్తారు?
అన్నప్రాశన అంటే ఏమిటి? పిల్లలకు అన్నప్రాశన ఎప్పుడు చేయాలి?
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |