Rituals & Customs
18 April 2023 న నవీకరించబడింది
గర్భం దాల్చిన తరువాత ప్రతి అమ్మాయి తనకి పుట్టబోయే బిడ్డ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రెగ్నన్సీ సమయంలో ఎన్నో త్యాగాలు చేసి జాగ్రత్తగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తుంది. బిడ్డ గర్భంలో ఉండగానే, తన క్షేమం కోసం సంస్కారాలు ఉన్నాయి. అలాగే.. బిడ్డ పుట్టిన తరువాత కూడా తల్లి తండ్రులు ఆ బిడ్డకు కొన్ని సంస్కారాలు చేయవలసి ఉంటుంది. వాటిల్లో పుట్టు వెంట్రుకలు తీయించడం కూడా ఒకటి.
బిడ్డ పుట్టేటప్పుడే వారి తలకు ఎంతో కొంత జుట్టు ఉండే ఉంటుంది. వీటినే పుట్టు వెంట్రుకలు అని పేర్కొంటారు. పుట్టినప్పుడే ఉన్న వెంట్రుకలను ఓ శుభ సమయం చూసి దేవుని సన్నిధిలో తీయించేస్తారు. దీనినే "పుట్టు వెంట్రుకలు తీయించడం" అంటారు. తెలుగు రాష్ట్రాలలో దీనిని కూడా ఓ చిన్న వేడుకలా జరుపుకుంటారు. దీనినే కేశ ఖండన అని కూడా అంటారు.
పుట్టిన ప్రతి వ్యక్తి తలపై ఎంతో కొంత వెంట్రుకలతో జన్మిస్తారు. శిశువుకు ఉండే తల వెంట్రుకలలో పూర్వ జన్మకు సంబంధించిన విషయ వాసనలు ఉంటాయి. వాటి తాలూకు పాప కర్మలు శిశువు తలను అంటిపెట్టుకుని ఉంటాయి. వీటిని తొలగించాలనే ఉద్దేశ్యంతోనే శిశువులకు చిన్న వయసులోనే కేశ ఖండన చేయించాలని శాస్త్రం చెబుతోంది.
దేవుని సన్నిధిలో తలనీలాలను అర్పించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారమే. భక్తి శ్రద్ధలతో మన తలని సమర్పించేస్తున్నాం అన్న ఉద్దేశ్యంతో తలనీలాలను ఇచ్చేస్తామని మొక్కుకుంటాం. తలనీలాలు తీసివేస్తే.. తల తీసేసినంత పని అవుతుంది. అందుకే దేవుని వద్ద గర్వం లాంటి భావాలను విడనాడి తలనీలాలను సమర్పించుకుంటాం.
అయితే.. బిడ్డ పుట్టిన తరువాత మొదట సారిగా చేసే కేశ ఖండనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా ముహూర్తం కూడా పెట్టించుకుంటారు. ఆ ముహూర్త కాలంలోనే పుట్టు వెంట్రుకలు తీయించి.. దైవ దర్శనం చేయిస్తారు. అయితే.. ముహూర్తం ఎందుకు పెడతారంటే.. మొదటిసారిగా కేశ ఖండన చేయడం వలన పాప ప్రక్షాళన జరగాలని, జ్ఞానాన్ని సముపార్జించాలన్న ముఖ్య సంకల్పం నెరవేరడం కోసం ముహూర్తం నిర్ణయిస్తారు.
శిశువు పుట్టిన మొదటి సంవత్సరంలోపు పుట్టు వెంట్రుకలను తీయించాలి. అది కుదరకపోతే మూడవ ఏడాది, లేదా ఐదవ ఏడాది చేయించాల్సి ఉంటుంది. మగ పిల్లలకు సరి మాసం లోను, ఆడ పిల్లలకు బేసి మాసంలోను చేయించాలని శాస్త్రోక్తి. సాధారణంగా పుట్టు వెంట్రుకలను తొమ్మిదవ నెలలో తీయిస్తూ ఉంటారు. అంతకంటే లేత నెలలలో పుట్టు వెంట్రుకలు తీయాలంటే పసి పిల్లల మాడు చాలా పలచగా ఉంటుంది. అందుకే అది గట్టి పడిన తరువాత.. శిశువు ఆరోగ్యంగా ఉంటె మొదటి ఏడాది లోపే పుట్టు వెంట్రుకలు తీయించేస్తారు. ఇంకా ఉత్తరాయణ పుణ్యకాలంలో కేశఖండన చేయిస్తే చాలా మంచిది. అయితే.. మంచి రోజు ఏది ఎంచుకున్నా.. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు కేశ ఖండన కార్యక్రమం పూర్తి చేయిస్తే బాగుంటుంది.
ఎన్నో ఆచారాలను, సంప్రదాయాలను పెద్దలు మన జీవనం సాఫీగా సాగిపోవడానికి నిర్దేశించారు. ప్రతి సంప్రదాయం వెనుకా ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి. మన జీవిత గమ్యాన్ని సులభతరంగా చేరడానికి మార్గం చూపిస్తాయి. పసి పిల్లల వయసు నుంచే చెప్పబడ్డ ఈ సంస్కారాలను పాటించుకుంటూ ముందుకు వెళ్లడం వలన మన జీవితం సక్రమంగా సాగిపోతుంటుంది. అంతేకాకుండా.. ఇటువంటి చిన్న చిన్న వేడుకలన్నీ మన జీవితంలో సరదని నింపుతూ ఉంటాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: అన్నప్రాశన అంటే ఏమిటి? పిల్లలకు అన్నప్రాశన ఎప్పుడు చేయాలి?
Yes
No
Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips
గర్భవతిగా ఉన్నపుడు ప్రయాణాలు చేయవచ్చా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
సీమంతం అంటే ఏమిటి? గర్భవతులకు ఈ వేడుకని ఎందుకు జరిపిస్తుంటారు?
గర్భానికి, స్త్రీలు కాలికి మెట్టెలు పెట్టుకోవడానికి సంబంధం ఏమిటో తెలుసా?
గర్భవతులు మొబైల్ ఫోన్ వాడచ్చా? ఇది పుట్టబోయే బిడ్డపై ఎంత వరకు ప్రభావం చూపుతుంది?
మీ ప్రీ స్కూలర్ (3-5సంవత్సరాల పిల్లలు) మరియు వారి బెడ్ టైమ్
ఆండ్రాలజి: అర్థం మరియు నిర్ధారణ పరీక్షలు
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |