4 April 2023 న నవీకరించబడింది
పసిపిల్లలకు రోజుకు 12 నుంచి 14 గంటల నిద్ర అవసరం. అయితే ప్రీ స్కూల్ పిల్లలకు (స్కూల్ కు వెళ్లే వయసులేని 3-5 సంవత్సరాల పిల్లలు) రోజుకు 11 నుంచి 13 గంటలు నిద్రపోవడం అవసరం.
మీ బిడ్డకు ఏది మంచిది? 1 నుంచి 2 సంవత్సరాల మధ్య ఉండే పిల్లల నిద్రపోయే సమయం 11 నుంచి 14 గంటల మధ్య ఉండేలా పగలు, రాత్రి విభజించబడింది. ప్రీ స్కూల్ విషయానికి వస్తే అంటే 3 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలకు 10 నుంచి 13 గంటల నిద్ర అవసరం.
న్యాప్స్ (తిన్న తర్వాత కునుకు) ఎప్పుడైనా వేయొచ్చు లేదా ఆపుకోవచ్చు. కానీ మీ శిశువులకు ఒక నిర్ధిష్ట సమయం అంటూ ఉంటే వారికి సహాయంగా ఉంటుంది. మీరు మధ్యాహ్న సమయంలో ఒక నిర్ధిష్ట టైం ఫ్రేమ్ సెట్ చేయడం ద్వారా అతడు/ఆమె రిలాక్స్ అవుతారు. పగటి సమయంలో ఒక గంట నిద్ర సరిపోతుంది.
సాధారణంగా ప్రీ స్కూల్ సమయాల్లో సమస్యలు సంభవిస్తాయి. త్వరగా నిద్రపోకపోవడం, త్వరగా మెలుకువ రావడం, రాత్రి పీడకలలు రావడం, నిద్రలో నడిచే అలవాటు మొదలయినవి.
మీరు బెడ్ టైమ్ ఏర్పాటు చేసుకునే టైమ్ మరియు మీ చిన్నారికి సరైన నిద్ర కోసం చేయాల్సిన పనుల జాబితా ఉంది.
· ప్రతిరోజు పడుకునే సమయం మరియు మేల్కొనే సమయానికి కట్టుబడి ఉండండి. న్యాప్ టైమ్ (తిన్న తర్వాత కునుకు) కు కూడా కట్టుబడి ఉండండి. అది తొందరగా లేదా ఆలస్యంగా జరగకూడదు. ఎందుకంటే అది రాత్రి నిద్ర సమయాన్ని ఆటంకపరుస్తుంది.
· మీ బిడ్డ బెడ్ టైంకి 30 నిమిషాల ముందు రిలాక్స్ అయ్యే ప్రశాంతమైన పనులు చేయండి. మీరు బుక్స్ చదవొచ్చు లేదా పద్యాలు మరియు కవితలు చదవచ్చు. మీ బిడ్డను అతని/ఆమె బొమ్మతో ఆడుకోవడానికి అనుమతించండి. ఈ పనులు మీ బిడ్డ పడుకునే సమయంలో మరింత రిలాక్స్‌గా ఉండేందుకు సహాయపడతాయి.
· పడకగది వాతావరణం నిశ్శబ్దంగా మరియు పడుకునేందుకు సౌకర్యంగా ఉండేలా చూసుకోండి. బెడ్రూంలో టీవీ, స్మార్ట్ ఫోన్ లేదా ఐపాడ్ వంటివి చూడడం మానెయ్యాలి. ఇవి పక్కనే ఉంటే మీ పిల్లల మెదడుని ఉత్తేజపరుస్తాయి. వారు తొందరగా నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తాయి.
· కెఫిన్ ఉన్న ఆహారాలు, పానీయాలను తక్కువగా ఇవ్వండి. ఎందుకంటే ఇది మనసును ఎక్కువ సేపు యాక్టివ్‌గా ఉంచుతుంది.
· మీ బిడ్డ నిద్రపోనప్పటికీ, ఇంకా మెలుకువగా ఉన్నా అదే స్థితిలో వదిలేసి గది నుంచి బయటకు వెళ్లండి. మీ చిన్నారి నిద్రపోవడానికి మరియు అర్ధరాత్రి మెలుకువ వచ్చినా తిరిగి నిద్రపోవడానికి ఇది సహాయం చేస్తుంది.
· ప్రీ స్కూలర్స్లో నిద్ర విధానానికి మీరు తెలుసుకోవాల్సినవి & మీ చిన్నారి సుఖంగా నిద్రించడానికి టిప్స్
· ప్రీ స్కూల్ సమయంలో నిద్ర విధానం మీ చిన్నారి సుఖంగా నిద్రపోవడానికి టిప్స్
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips
ఆండ్రాలజి: అర్థం మరియు నిర్ధారణ పరీక్షలు
మహిళలకు స్క్రీనింగ్ టెస్ట్
పర్ఫెక్ట్ నైట్-టైమ్ మేకప్ కోసం సులువైన 8 బ్యూటీ టిప్స్
గర్భధారణ సమయంలో ఎకోస్ప్రిన్ ఎందుకు సిఫారసు చేయబడుతుంది?
భారతదేశంలో సరైన కార్డ్ సెల్ బ్యాంకులని ఎలా ఎంచుకోవాలి
పిలోనిడల్ సిస్ట్ (తిత్తి) అంటే ఏమిటి? కారణాలు, చికిత్స మరియు లక్షణాలు
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |