hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Food Cravings arrow
  • గర్భధారణలో పనీర్ తీసుకోవడం మంచిదేనా? దాని ప్రయోజనాలు, దుష్ప్రభావాలు & తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు arrow

In this Article

    గర్భధారణలో పనీర్ తీసుకోవడం మంచిదేనా? దాని ప్రయోజనాలు, దుష్ప్రభావాలు & తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు

    Food Cravings

    గర్భధారణలో పనీర్ తీసుకోవడం మంచిదేనా? దాని ప్రయోజనాలు, దుష్ప్రభావాలు & తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు

    11 December 2023 న నవీకరించబడింది

    తల్లి ఇంకా పుట్టబోయే బిడ్డ ఇద్దరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గర్భధారణ సమయంలో సరైన ఆహార నిర్ణయాలు తీసుకోవాలి. పనీర్ గర్భధారణలో మంచి చేస్తుందా? ఈ కథనం గర్భవతులు పనీర్ తినడం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అలాగే ఏవైనా రాగల ప్రమాదావకాశాలను విశ్లేషిస్తుంది. అంతేకాక, ఇందులో ఇంట్లో సులభంగా తయారుచేసుకోగలిగే కొన్ని రుచికరమైన పనీర్ వంటకాలను కూడా తెలుసుకోవచ్చు.

    గర్భధారణ సమయంలో పనీర్ తీసుకోవచ్చా?

    గర్భధారణ సమయంలో నేను పనీర్ తినవచ్చా?– ఇలాంటి సందేహం చాలా మంది మహిళలకు ఉంటుంది. అయితే వారి సందేహానికి క్లుప్తమైన సమాధానం అవును, తినవచ్చు. కాబోయే తల్లికి లాక్టోస్ పడకపోవడం వంటివి లేనట్లయితే, గర్భధారణ సమయంలో ఆహారంలో పనీర్‌ను చేర్చుకోవచ్చు. పనీర్ ప్రోటీన్లను అందించే అత్యుత్తమ వనరు ఇంకా కాల్షియం లభించే గొప్ప మూలం కాబట్టి, రోజువారీగా కూడా దీనిని తీసుకోవచ్చు. పనీర్ సులభంగా జీర్ణం కావడానికి, పనీర్‌ను రకరకాల పద్ధతులలో వండుకుని తినవచ్చని కూడా సలహా ఇస్తుంటారు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భిణీ మహిళల రోజువారీ సమతుల్య ఆహారం: ఏం తినాలి ఇంకా ఏం తినకూడదు

    పనీర్ అందించే పోషక విలువలు

    పనీర్ గర్భధారణలో మంచిది. అది అందించే పోషక పదార్ధాలు (40 గ్రాములకు) -

    1. 103.15 కిలో కాలరీల శక్తి.
    2. 7.5 గ్రాముల ప్రోటీన్.
    3. 190 మిల్లీ గ్రాముల కాల్షియం.
    4. 37.3 మిల్లీ గ్రాముల ఫోలిక్ యాసిడ్.
    5. 132 మిల్లీ గ్రాముల పొటాషియం.
    6. 4.9 గ్రాముల ధాన్యం.
    7. 6 గ్రాముల కొవ్వులు.

    గర్భధారణ సమయంలో పనీర్ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు

    గర్భధారణలో పనీర్ మంచిదేనా అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పుడు దొరికింది - గర్భధారణ సమయంలో పనీర్ తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి -

    1. పనీర్‌లో క్యాల్షియం ఇంకా ఫాస్పరస్ అధికంగా ఉంటాయి, ఇవి ఎముకలు ఇంకా దంతాల ఎదుగుదలకు మంచిది. శిశువు దంతాలు ఇంకా ఎముకల పెరుగుదల మరియు వృద్ధికి ఇది ప్రయోజనకారిగా ఉంటుంది. అంతేకాక, ఖనిజాలు నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేసేందుకు సహాయపడతాయి ఇంకా గర్భధారణ సమయంలో ఎముకలలో డీమినరైజేషన్‌ను ఇది నిరోధిస్తుంది.
    2. పనీర్, ప్రోటీన్లు అందించే ఉత్తమ వనరు, శక్తి స్థాయిలను పెంచడంలో ఇంకా పటిమను పెంచడంలో సహాయపడుతుంది. ఇది గర్భధారణలో కనిపించే లక్షణాలను, అంటే ప్రధానంగా మొదటి త్రైమాసికంలో ఉదయం కనిపించే చికాకులనుండి ఉపశమనం కలిగించి మహిళలకు సహాయపడుతుంది.
    3. పనీర్ ప్రోటీన్ అందించే అద్భుతమైన మూలం, అందువల్ల తమ ప్రోటీన్ అవసరాలను తీర్చుకొనేందుకు అవసరమైన ఆహార పద్ధతుల కోసం చూస్తున్న గర్భవతులకు ఇది సరైనది. పుట్టబోయే బిడ్డ వృద్ధికి ఇంకా పెరుగుదలకు, ప్రోటీన్ ఎంతో కీలకం.
    4. పనీర్ గర్భధారణ సమయంలో కలిగే తినాలనే కోరికలను సంతృప్తిపరుస్తుంది ఇంకా బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఇది తీసుకున్నప్పుడు కడుపు నిండినట్లు ఉండటం వల్ల ఆరోగ్యకరమైన బరువును కొనసాగించుకొనేలా సహాయపడుతుంది.
    5. గర్భధారణలో పనీర్ తీసుకోవడం వల్ల అధికంగా ఉన్న బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. రాత్రి భోజనంలో జోడించి అలాగే చిరుతిండిగా తినేందుకు, పనీర్ చక్కగా సిఫార్సు చేయబడింది.
    6. గర్భధారణ సమయంలో కీళ్ల నొప్పులు ఇంకా కాళ్లలో ఈడ్పులు సాధారణం, ఇది ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తుంది, పనీర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల, ఇది కొంత వరకు, గర్భధారణ సంబంధిత నొప్పులు ఇంకా వాపులను తగ్గించడంలో దోహదపడుతుంది.

    గర్భధారణ సమయంలో పన్నీర్ తీసుకొంటే కలిగే ప్రభావాలు

    పనీర్‌ను అతిగా తీసుకోవడం వల్ల ఈ క్రింది ప్రతికూల ప్రభావాలు కలగవచ్చు-

    1. పనీర్‌లో సోడియం అధికంగా ఉన్నందున, ఇది రక్తపోటును పెంచుతుంది.
    2. అధికంగా పనీర్ తీసుకోవడం వల్ల అజీర్ణం, పొట్టలో అసౌకర్యం ఇంకా కొన్నిసార్లు ఇది ఫుడ్ పాయిజనింగ్ కలిగించవచ్చు.
    3. అతిగా తీసుకున్నప్పుడు, అధిక కొవ్వుని కలిగిన పనీర్, గర్భధారణ సమయంలో బరువు పెరిగేందుకు కూడా కారణం కావచ్చు.

    గర్భవతులు పచ్చి పనీర్‌ను వండకుండా తినవచ్చా?

    ఎవరైనా ఆస్వాదిస్తూ తింటూంటే, అది ఎటువంటి పనీర్ అయినా సరే, తినాలనిపిస్తుంది. అయితే, కాబోయే తల్లులు పచ్చిగా ఉన్న లేదా వండని పనీర్‌ను తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పనీర్‌ను పాశ్చరైజ్డ్ పాలతో తయారు చేసినప్పటికీ, ముఖ్యంగా స్టోర్‌లో కొనే పనీర్, బ్యాక్టీరియా బారినపడే అవకాశముంది ఇంకా అది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే గర్భధారణ సమయంలో వండని పనీర్‌ను తినకుండా ఉండటమే మంచిది.

    గర్భవతుల కొరకు పనీర్ వంటకాలు

    గర్భధారణ సమయంలో ఎవరైనా పనీర్ ఏవిధంగా తినాలి అని అనుకుంటున్నట్లయితే, ఇంట్లో ప్రయత్నించేందుకు ఇక్కడ రెండు రుచికరమైన వంటకాలు ఉన్నాయి.

    స్పైసీ పనీర్ స్కేవర్స్

    ఈ వంటకాన్ని తయారు చేయు పద్ధతి

    • పెద్ద గిన్నెలో వడగట్టిన గట్టి పెరుగును ఉప్పు మరియు అన్ని మసాలా దినుసులతో కలుపుకోవాలి.
    • అల్లం-వెల్లుల్లి పేస్ట్‌తో పాటు నూనె కూడా వేయాలి.
    • తరిగిన కూరగాయలు ఇంకా పనీర్ ముక్కలను పెరుగు మిశ్రమంలో వేయాలి.
    • దీన్ని కనీసం ఒక గంట పాటు మ్యారినేట్ చేయాలి.
    • పనీర్ ఇంకా కూరగాయల ముక్కలను స్కేవర్‌లు లేదా టూత్‌పిక్‌లతో గ్రుచ్చి, వాటిని ప్రత్యామ్నాయంగా థ్రెడ్ చేయాలి.
    • వాటిని 3 నుండి 4 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఉడికించాలి.
    • ఉడికించడం పూర్తయిన తర్వాత నిమ్మరసం ఇంకా చాట్ మసాలా జోడించవచ్చు.
    • ఇలా చేసిన వాటిని అలానే లేదా పుదీనా చట్నీతో కూడా తినవచ్చు.

    పాలక్ పనీర్

    ఈ వంటకాన్ని ఇలా చేయాలి,

    • పాలకూర ఆకులను తుంచి మెత్తని పేస్ట్‌లా కలపాలి.
    • కరిగించిన వెన్నలో ఉల్లిపాయలు బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
    • ఆ తర్వాత, కాస్త అల్లం-వెల్లుల్లి పేస్ట్ జోడించాలి.
    • టొమాటోలు వేసి బాగా కలపాలి.
    • 6 నుండి 8 నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు ఇంకా ఇతర మసాలా దినుసులు వేయాలి.
    • ఉడికిన తర్వాత, సిద్ధం చేసుకున్న పాలకూర పేస్ట్ వేసి, మూత మూసి మీడియం మంట మీద ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
    • వంట పూర్తి చేసిన తర్వాత, కావాలనుకొంటే కొంచెం క్రీమ్ జోడించవచ్చు.

    లాక్టోస్ పడకపోవడం లేనటువంటి గర్భవతులకు, గర్భధారణ కాలం మొత్తమంతా పనీర్ ఒక చక్కని ఆహార ఎంపిక అవుతుంది. ఎవరైనా సరే తమ గర్భధారణ సమయపు ఆహారంలో పనీర్‌ను చేర్చుకోవచ్చు ఇంకా అది అందించే అన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sri Lakshmi

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |