Women Specific Issues
22 November 2023 న నవీకరించబడింది
మానసిక ఆరోగ్య సమస్యలు పురుషులు మరియు స్త్రీలలో వివిధ రకాల ప్రభావాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఆందోళన మరియు నిరాశ అనేవి మహిళల్లో ఎక్కువగా ఉంటాయి. స్త్రీలను మాత్రమే ప్రభావితం చేసే కొన్ని రకాల పరిస్థితులు ఉన్నాయి. కొంత మంది మహిళలు హార్మోన్ల మార్పులను అనుభవించినపుడు ప్రినేటల్ నిరాశ, మూడ్ డిస్‌రెగ్యులేషన్ డిజార్డర్, మరియు పెరిమోనోపాజ్ సంబంధిత నిరాశ వంటి మానసిక డిజార్డర్స్ లక్షణాలను అనుభవించవచ్చు. ఇతర మానసిక రుగ్మతలైన స్కిజోఫెర్నియా మరియు బైపోలార్ డిజార్డర్ విషయంలో పురుషులు మరియు స్త్రీలలో సంభవించే రేట్లలో పురుషులు మరియు స్త్రీలలో ఎటువంటి తేడాలు లేవని పరిశోధనలో తేలింది. కానీ కొన్ని రకాల లక్షణాలు మగవారిలో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అనారోగ్యం ఎలా అభివృద్ధి చెందుతుందనే విషయంలో లింగం ప్రధాన పాత్రను పోషిస్తుంది. కాబట్టి మహిళల మానసిక ఆరోగ్యం విషయంలో లక్షణాలు భిన్నంగా వ్యక్తమవుతుతాయి.
ఒత్తిడి మరియు మహిళల మానసిక ఆరోగ్యం ఈ కింది విధాలుగా నష్టం చేస్తుంది.
ఒక పరిస్థితి లేదా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఒత్తిడి మరియు ఆందోళన వంటి వాటిని నిర్దారించడం చాలా కష్టం అవుతుంది. మానసిక సమస్యలను ఎదుర్కొంటున్న స్త్రీలకు మద్దతునివ్వడం లేదా వారి గురించి జాగ్రత్తలు తీసుకునేందుకు వారిని ప్రోత్సహించడం వారి మెదడుపై మరియు వారు చేసే పనిపై ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపుతుందని గుర్తుంచుకోవాలి. అసాధారణ అలసట, తరచూ తప్పులు చేయడం, ఒంటరితనం, పనిని వాయిదావేయడం, అస్థిరమైన ప్రవర్తన వంటి లక్షణాలు కనిపించిన వారిపై ఓ కన్నేసి ఉంచడం ద్వారా వారి మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ఎమోషనల్ వెల్ బీయింగ్ అంటే ఏమిటి | దాని ప్రాముఖ్యత & లక్షణాలను అర్థం చేసుకోవడం
మహిళలు మరియు మానసిక ఆరోగ్యం అనేది ఎక్కువగా చర్చించిన ఆంశం. కానీ చాలా చోట్ల ఈ అంశానికి సరైన గుర్తింపు లేదు. మెజారిటీ మానసిక వ్యాధులు మరియు పరిస్థితులు పురుషులు మరియు స్త్రీలు ఇద్దరినీ ప్రభావితం చేయొచ్చు. కానీ మహిళల మానసిక ఆరోగ్య లక్షణాలు పురుషుల నుంచి భిన్నంగా ఉండవచ్చు. స్త్రీల మానసిక ఆరోగ్యం చెడిపోతే మనకు అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి.
రోగనిర్దారణ జరిగితే మహిళల మానసిక ఆరోగ్యానికి తప్పకుండా చికిత్స అందించబడుతుంది. ఎవరైతే మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారు వ్యక్తిగత చికిత్స లేదా గ్రూప్ థెరపీ తీసుకోవడం ద్వారా వారికి ఉపశమనం లభిస్తుంది. వారు మరింత స్ట్రాంగ్‌గా తయారవుతారు. ఇందుకోసం అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వ్యక్తులు తమకు బాగా సరిపోయే చికిత్సను ఎంచుకోవచ్చు. ప్రతి ఒక్కరికీ పనిచేసే చికిత్స లేదు. (ఒకే రకమైన చికిత్స అందరికీ)
అర్హత కలిగిన మానసిక వైద్యనిపుణుడు మహిళలు మరియు మానసిక ఆరోగ్యానికి చేసే చికిత్సను సైకోథెరపీ అని పిలుస్తారు. సైకోథెరపీ అనేది ఒక వ్యక్తి శ్రేయస్సు కొరకు అతడి ఆలోచనలు, భావోద్వేగాలు, చర్యలను ఎగ్జామిన్ చేస్తుంది. మానసిక వ్యాధిని నయం చేసేందుకు అత్యంత ప్రభావవంతమైన మార్గం సైకోథెరపీ మరియు మందులు. బిహేవియరల్ థెరపీ, సిస్టమాటిక్ డిసెన్సిటైజేషన్, డయలెక్టికల్ బిహేవియరల్ థెరపీ అనేవి కొన్ని ఉదాహరణలు.
మానసిక వ్యాధులను మందులతో పూర్తిగా నయం చేయలేం. ఇది లక్షణాలను మేనేజ్ చేయడంలో ఉపయోగకరంగా ఉండవచ్చు. కొన్ని సార్లు మందులు మరియు కౌన్సిలింగ్ సహాయంతో సులభంగా కోలుకోవచ్చు.
కేస్ మేనేజర్ సహాయంతో కేస్ మేనేజ్మెంట్ ప్లాన్లను ఒకే దగ్గరికి చేర్చవచ్చు. అంతేకాకుండా ఒక వ్యక్తి కోసం స్త్రీ మానసిక సేవలను ఒకే దగ్గరికి చేర్చవచ్చు. రీహబిలిటేషన్ను ప్రమోట్ చేసేందుకు అనేక మార్గాలను ప్లాన్ చేయొచ్చు. కేస్ మేనేజర్ సహాయంతో వాటిని ఆచరణలో పెట్టవచ్చు.
కొన్ని సార్లు ఒక వ్యక్తిని జాగ్రత్తగా పరిశీలించేందుకు మరియు రోగనిర్దారణ చేసేందుకు అవసరమైన మందులు సమయానికి ఇచ్చేందుకు ఆసుపత్రిలో చేర్చడం అవసరం.
సపోర్ట్ నెట్వర్క్ అనేది వైద్యం కొరకు ఒకరినొకరు ప్రోత్సహించుకునే వ్యక్తుల కలయిక. మద్దతు సమూహాలు(సపోర్ట్ గ్రూప్స్) నిపుణుల కంటే ఎక్కువగా ఒకే రకమైన పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులతో ఉంటాయి.
CAM లేదా కాంప్లిమెంటరీ మరియు ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేది మెయిన్ స్ట్రీమ్ మెడికల్ కేర్‌లో తరచూ ఉపయోగించని పద్ధతులను సూచిస్తుంది. మహిళల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు CAMని సంప్రదాయ వైద్య విధానాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
సెల్ఫ్ హెల్ప్ ప్లాన్ అనేది వివిధ రకాల చర్యలను ఆచరణలో పెట్టడం ద్వారా వారి అనారోగ్యాన్ని తగ్గించుకునేందుకు అనుమతిస్తుంది. వీటిలో రికవరీలను అడ్రస్ చేయడం, ట్రిగ్గర్లను మేనేజ్ చేయడం, లక్షణాలకు చికిత్స చేయడం వంటివి ఉంటాయి.
ఎవరైనా కానీ మానసిక ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నామని ఆందోళన చెందితే వెంటనే కుటుంబవైద్యుడితో మాట్లాడడం మంచిది. ఇది బెదిరించినట్లుగా ఉన్నా కానీ చాలా మంది తమకు మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చినపుడు వైద్యునితో మాట్లాడి సపోర్ట్ పొందారు. ఇది జీవితాలను మరియు మహిళల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిరూపించబడింది.
References
1. Malhotra S, Shah R. (2015). Women and mental health in India: An overview. Indian J Psychiatry.
2. Herrman H. (2016) Improving the mental health of women and girls: psychiatrists as partners for change. World Psychiatry.
Tags
What is Mental Health in Telugu, Mental Health effect on professional life in Telugu, What are warning signs in Telugu, Treatment of Mental Health in Telugu, What Helps in Improving Women's Mental Health in English, What Helps in Improving Women's Mental Health in Hindi, What Helps in Improving Women's Mental Health in Tamil, What Helps in Improving Women's Mental Health in Bengali
Yes
No
Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips
చిన్ననాటి రుగ్మతలు అనగానేమి? ఇవి ఎలా ఉంటాయి? వీటికి కారణాలు, చికిత్స ఏమిటి? | Childhood Disorders: Meaning, Symptoms & Treatment in Telugu
మెటర్నల్-ఫిటల్ మెడిసిన్ యొక్క ప్రాముఖ్యత? ప్రమాదకర గర్భాలకు ఈ టాబ్లెట్ ఎందుకు సూచించబడుతుంది |Importance of Maternal - Fetal Medicine in High Risk Pregnancies in Telugu
The Ultimate Guide to Consuming Turmeric Milk During Pregnancy
గర్భధారణ సమయంలో చెరకు రసం తీసుకోవడం: ప్రయోజనాలు, జాగ్రత్తలు | Sugarcane Juice in Pregnancy: Benefits & Precautions in Telugu
గర్భధారణ సమయంలో సీతాఫలం: ప్రయోజనాలు & నష్టాలు | Custard Apple During Pregnancy: Benefits & Risks in Telugu
గర్భధారణ సమయంలో చిలగడదుంప: ప్రయోజనాలు, ప్రమాదాలు & దుష్ప్రభావాలు | Benefits & Risks of Sweet Potato During Pregnancy in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |