Weight Loss
29 November 2023 న నవీకరించబడింది
ప్రసవానంతరం బరువు పెరగడం అనేది తల్లులలో కలిగే ప్రధాన ఆందోళన. ప్రసవం స్త్రీ శరీరంలో చాలా మార్పులను తెస్తుంది. తల్లులు ప్రసవానంతర బరువు తగ్గడానికి ప్రయత్నించే ముందు వారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. చాలా మంది యువ తల్లులు దీని గురించి సలహా తీసుకోరు.
మైలో మీ ప్రసవానంతర బరువును ఆరోగ్యవంతంగా తగ్గించడంలో సహాయపడే కొన్ని చిట్కాలను మీకు అందించడానికి ఇక్కడ ఉంది.
ప్రసవానంతర బరువు నిలుపుదల అన్నది ఊబకాయం మరియు తీవ్రమైన ఆరోగ్య పరిణామాలతో ముడిపడి ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రసవ సమయంలో, అమ్నియోటిక్ ద్రవం మరియు ప్లాసెంటా శరీరాన్ని విడిచిపెడతాయి, ఇది కొంత బరువు తగ్గడానికి కారణమవుతుంది. కొత్త తల్లులు 6-12 నెలలలోపు గర్భధారణకు ముందు ఉన్న వారి బరువుకు తిరిగి వెళ్ళవచ్చు. ప్రసవం అయిన తొలి నెలలలో ఆకస్మిక బరువు తగ్గడం వల్ల కోలుకోవడం ఆలస్యం అవుతుంది. కొత్త తల్లులు ప్రసవానంతర బరువు గురించి 6 వారాల తర్వాత క్రమంగా తమ శరీరాలను పరీక్షించుకోవచ్చు.
కొత్త తల్లులు ముఖ్యంగా తల్లిపాలు ఇస్తున్నప్పుడు తప్పనిసరిగా తమ క్యాలరీల తీసుకోవడం పెంచుకోవాలి. చాలా త్వరగా కేలరీలను తీసుకోవడం తగ్గించడం చనుబాలివ్వడం అనే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. కొత్త తల్లులు వారి శరీరం నయం అవుతున్నప్పుడు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి. పాలిచ్చే తల్లులు వారి ప్రసవానికి ముందు కాలం నుండి రోజుకు 500-600 కేలరీలు తీసుకోవాలి. కూరగాయలు, గుడ్లు మరియు తక్కువ కొవ్వు ఉన్న మాంసం వంటి ఆరోగ్యకరమైన ఆహారాల ద్వారా ఈ అదనపు కేలరీలను పొందడం తెలివైన ఎంపిక.
ప్రసవానంతర బరువు తగ్గించే చిట్కాలు (POSTPARTUM WEIGHT LOSS TIPS IN TELEGU)
ఈ ప్రసవానంతర బరువు తగ్గించే చిట్కాలు మీకు కొన్ని మంచి ఆలోచనలు అందిస్తాయి.
1. మీ బిడ్డకు పాలివ్వండి. మీ బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల మీరు బరువు తగ్గవచ్చునని వెల్లడైన అధ్యయనాలు చూపిస్తున్నాయి. 3 నెలల మీరు మీ బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం మీరు 12 నెలల ప్రసవానంతరం బరువును 2.7% వరకు కోల్పోవడానికి సహాయపడుతుంది. ఆదర్శవంతంగా, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP) ప్రకారం, 6 నెలల వరకు ప్రత్యేకంగా తల్లిపాలు ఇవ్వడం మంచిది.
2. ఇది అదనంగా శిశువు మరియు తల్లి ఇద్దరికీ వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
3. తల్లిపాలను గురించి మరింత తెలుసుకోవడానికి.
4. బరువు తగ్గడానికి సమయం పడుతుంది. అత్యధిక బరువు తగ్గడం ప్రసవానంతరం 3 నెలల తర్వాత జరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాకపోతే, తమ పిల్లలకు ప్రత్యేకంగా తల్లిపాలు ఇచ్చే తల్లుడు నిష్క్రియంగా ఉంటారు మరియు అధిక కేలరీలను వినియోగిస్తారు. ఇది మొదటి 6 నెలలు ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఈ పద్దతిని మార్చడానికి ముందు శిశువు 2 పౌండ్ల బరువును పొందే వరకు వేచి ఉండటం ఉత్తమం.
5. శిశువు పోషకాహార ప్రయోజనాలను పొందడంలో సహాయపడేటప్పుడు శరీరాన్ని నయం చేయడం ప్రధాన లక్ష్యం.
6. వ్యాయామం చెయ్యండి. ACOG ప్రకారం, ప్రసవానంతరం ప్రతిరోజూ 30 నిమిషాల వ్యాయామం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రోజుకు మూడు సార్లు 10 నిమిషాలు నడక కూడా కావచ్చు. మీరు ఎప్పుడు వ్యాయామం చేయడం ప్రారంభించవచ్చు అనేది మీరు ఏ రకమైన డెలివరీ చేసుకున్నారు అనేదాన్ని బట్టి ఉంటుంది. మీరు వ్యాయామం ఎప్పుడు ప్రారంభించడం సురక్షితమో తెలుసుకోవడానికి మీ గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి.
7. గర్భధారణ తర్వాత వ్యాయామం గురించి మరింత తెలుసుకోండి.
8. మీ శరీరం గురించి వాస్తవికంగా ఉండండి. గర్భధారణకు ముందు ఆకృతికి తిరిగి రావడం చాలా మంది మహిళలకు సాధ్యం కాకపోవచ్చు. గర్భం శాశ్వత మార్పులకు కారణం కావచ్చు. మీకు పెద్ద తుంటి మరియు జారిపోయిన పొట్ట ఉండవచ్చు. శరీర ఆకృతి కంటే ఆరోగ్య ప్రయోజనాలపై దృష్టి పెట్టండి. వ్యాయామం అతిగా చేయవద్దు. వారానికి 1-2lb కోల్పోవడం మంచిది. వేగంగా బరువు తగ్గడం మీ శరీరానికి మంచిది కాదు అన్న విషయం గుర్తుంచుకోండి.
1. భోజనం మానేయకండి. మీ శరీరాన్ని ముందులా పూర్తిగా తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు సురక్షితంగా బరువు తగ్గడం ప్రారంభించడం చాలా ముఖ్యం. కేలరీల లోటు బరువు తగ్గడానికి కీలకంగా పరిగణించబడుతుంది. మీ పోషకాహారం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. రోజుకు 5-6 చిన్న భోజనాలు తినండి. చాలా మంది కొత్త తల్లులు పిల్లలను చూసుకునేటప్పుడు బాగా తినడం మరచిపోతారు. సరిపడని నిద్రతో భోజనం మానేయడం వల్ల శరీరం అలసటకు గురై శక్తిని హరించివేస్తుంది. CDC ప్రకారం, తల్లి పాలు ఇచ్చే మహిళలకు 450-500 అదనపు కేలరీలు అవసరం. మీరు ఇద్దరి కోసం తింటున్నారని గుర్తుంచుకోండి.
2. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. అధిక ప్రాసెస్ చేయబడిన ఆహారాల్లో కేలరీలు ఎక్కువగా ఉంటూ అవసరమైన పోషకాలను కలిగి ఉండవు. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం పెరుగుదల ప్రసవానంతర బరువు తగ్గకపోవడానికి కారణమవుతుందని 2011లో ఒక అధ్యయనం పేర్కొంది.
ఈ క్రింది వాటిని నివారించండి:
o ఫాస్ట్ ఫుడ్
o మైక్రోవేవ్ చేసిన పదార్థాలు
o రెడీ-టు-ఈట్ ఫుడ్స్
o పొటాటో చిప్స్
o సోడా
o కోక్ వంటి తీపి పానీయాలు
3. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. తక్కువ కొవ్వు ఉన్న మాంసం, సోయా మరియు గుడ్లు ప్రోటీన్ యొక్క గొప్ప వనరులు. ఇది కేలరీల తీసుకోవడం తగ్గిస్తుంది మరియు బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ప్రొటీన్లను జీర్ణం చేసేందుకు శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అందువల్ల, ఇది ప్రోటీన్లను జీర్ణం చేయడానికి ఎక్కువ కేలరీలను ఉపయోగిస్తుంది.
4. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. ఇది ప్రేగు ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఫైబర్ అనేది మొక్కల ప్రోటీన్, ఇది తేలికగా జీర్ణం కాదు, అలాగే పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది.
5. సీఫుడ్ అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు ప్రోటీన్ల యొక్క అద్భుతమైన మూలం. తినే ముందు సీఫుడ్ యొక్క రకం మరియు ఎంత మొత్తం తీసుకుంటాం అన్న విషయం గురించి జాగ్రత్త తీసుకోవాలి. కొన్నిసార్లు చేపల మాంసంలో పాదరసం పేరుకుపోయి శిశువుకు హాని కలిగించవచ్చు.
గర్భధారణ సమయంలో సురక్షితమైన సీఫుడ్ రకంపై మరిన్ని సిఫార్సుల కోసం FDA మార్గదర్శకాలను చూడండి.
6. పాలు ఇచ్చే సమయంలో కెఫిన్ కలిగిన పానీయాలను నివారించండి ఎందుకంటే ఇది తల్లి నుండి శిశువుకు వ్యాపిస్తుంది.
7. మిమ్మల్ని మీరు బాగా హైడ్రేట్ గా ఉంచుకోండి. తల్లులందరికీ ప్రసవానంతర బరువు తగ్గించే చిట్కాలలో ఇది చాలా ముఖ్యమైనది.
ప్రసవానంతర ఆహార సిఫార్సులపై సమాచారం కోసం, CDC మార్గదర్శకాలను చూడండి.
"అందరికి ఒకే మంత్రం పనిచేస్తుంది " అనేది కాదు ఇక్కడి విధానం.అందుకే, కొత్త తల్లులు బరువు తగ్గడానికి ప్రసవానంతర ఆహార ప్రణాళిక కోసం తప్పనిసరిగా వారి వైద్యులను సంప్రదించాలి.
ఈ ప్రసవానంతర బరువు తగ్గించే చిట్కాలు ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు అడుగులు వేయడానికి అవసరమైన సమాచారాన్నంతా మీకు అందిస్తాయి.
మీరు మీ శరీరంలో ఏవైనా అనుకోని ప్రభావాలు లేదా మార్పులను గమనించినట్లయితే, దయచేసి వాటిని మీ వైద్యుడికి నివేదించండి.
మైలో లో మేము కొత్త తల్లులకు ఆరోగ్యకరమైన ముందస్తు మరియు ప్రసవానంతర సమాచారాన్ని అందించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము. మీరు దీన్ని ఒంటరిగా చేయవలసిన అవసరం లేదు.
Is It Necessary To Ask Your Gynecologist Before Taking Up A Postpartum Weight Loss Plan in English, Is It Necessary To Ask Your Gynecologist Before Taking Up A Postpartum Weight Loss Plan in Tamil, Is It Necessary To Ask Your Gynecologist Before Taking Up A Postpartum Weight Loss Plan in Bengali
Yes
No
Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips
డైపర్ సైజు మరియు బరువుల చార్ట్ గైడ్ | Diaper Size and Weight Chart Guide in Telegu
మెలితిరిగిన చనుమొనలు- ఒక పరిశీలన|Inverted Nipples: Causes, Treatment and More in Telegu
గైనకాలజీలో లాపరోస్కోపీ|Laparoscopy In Gynaecology in Telegu
పసిపిల్లలకు డైపర్లు వాడే విధానం – పిల్లలకు డైపర్లను ఎంత తరచుగా మారుస్తూ ఉండాలి? DIAPER ETIQUETTES FOR BABIES- HOW OFTEN SHOULD YOU CHANGE THE BABY'S DISPOSABLE DIAPER in TELEGU
చనుమొన డిశ్చార్జ్‌కి సంభావ్య కారణాలు: కాన్సర్ కలిగించేవి - కాన్సర్ కానివి (Reasons for Nipple Discharge - Cancer & Non Cancer in Telugu)
మీ 6 నెలల పసిబిడ్డకి ఎంత మొత్తంలో & ఎంత తరచుగా ఘన పదార్థాలు ఆహారంగా పెట్టవచ్చు?|How Much & How Often Should You Feed Solids to Your 6-Month-Old in Telegu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |