Stem Cell Banking
5 December 2023 న నవీకరించబడింది
ఇటీవలి రోజుల్లో స్టెమ్ సెల్ థెరపీ అనేది బాగా అభివృద్ధి చెందింది. ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా స్టెమ్ సెల్స్ బ్యాంక్స్ స్థాపన అనేది స్టెమ్ సెల్ ప్రీజర్వ్ చేసేందుకు, వాటిని కాలుష్యం నుంచి పరిరక్షించేందుకు ఉద్దేశించబడింది. అంతే కాకుండా భవిష్యత్‌లో చేసే చికిత్సల కోసం కూడా వీటిని ప్రిజర్వ్ చేస్తారు. స్టెమ్ సెల్ ప్రీజర్వేషన్ సెక్టార్ అనేది వేగంగా వృద్ధి చెందుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా చాలా ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కేంద్రాలు, ప్రైవేటు కంపెనీలు వివిధ రకాల దాతల నుంచి మూలకణాలు తీసుకుని భద్రపరుస్తున్నాయి. భవిష్యత్‌లో స్టెమ్ సెల్ థెరపీ కోసం ప్రజలకు స్టెమ్ సెల్స్ అందుబాటులో ఉంటున్నాయి. .
మానవ శరీరంలో స్టెమ్ సెల్స్ అనే ప్రత్యేక కణాలు ఉంటాయి. పిండాలు(చిన్నపిల్లలు), పెద్దవారు ఇద్దరూ తమ శరీరాల్లో స్టెమ్ సెల్స్‌ను కలిగి ఉంటారు. స్టెమ్ సెల్స్‌ను వాటి స్వీయ పునరుద్ధరణ(సెల్ఫ్ రెన్యూవల్), మల్టీ డైరెక్షనల్ భేదం వలన యూనివర్సల్ సెల్స్ లేదా సీడ్ సెల్స్ అని కూడా పిలుస్తారు. పరిశోధనల కోసం మూలకణాలను కలెక్ట్ చేయడం, సిద్ధం చేయడం, నిల్వచేయడం వలన ఇది లైఫ్ బ్యాంక్‌గా కూడా పరిగణించబడుతుంది. బయోలాజికల్ మెటీరియల్స్ సేకరణ మరియు వాడకం చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఏదేమైనప్పటికీ మూలకణాలతో ఇటీవల జరిపిన పరిశోధనలు వాటి మీద దృష్టి పడేలా చేశాయి. ఫలితంగా చికిత్స, థెరపీ కోసం పనికొచ్చే మూలకణాల అవసరం పెరిగింది.
స్టెమ్ సెల్ సంరక్షణను స్టెమ్ సెల్ నిల్వ లేదా స్టెమ్ సెల్ బ్యాంక్ అని పిలుస్తారు. ఈ పద్ధతిలో మానవ శరీరం నుంచి స్టెమ్ సెల్స్‌ను బయటకు తీసి భవిష్యత్ ఉపయోగాల కోసం వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తారు. స్టెమ్ సెల్ బ్యాంక్స్‌లో తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. స్టెమ్ సెల్స్ బయోలాజికల్ ప్రాపర్టీస్‌ను ఇవి కాపాడుతాయి. కాలుష్యం బారిన పడి అవి పాడుకాకుండా స్టెమ్ సెల్ బ్యాంక్స్ కాపాడుతాయి. స్టెమ్ సెల్స్‌ను ఎక్కువ రోజులు భద్రపరిచేందుకు అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పాటిస్తారు. చిన్నారి పుట్టినపుడు బొడ్డు తాడు నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్‌ను భద్రపరచడం వల్ల ఆ బిడ్డకే కాకుండా భవిష్యత్‌లో కుటుంబసభ్యులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.
మూలకణాల రకాలకు బట్టి వాటిని ఈ కింది విధాలుగా వర్గీకరించవచ్చు. అవి..
ఈ కణాలు ఒకే రకమైన కణాలను అభివృద్ధి చేసుకోగలవు. వాటి రకం ఉన్న కణాలనే డెవలప్ చేస్తాయి. అవి తమను తాము పునరుద్ధరించుకోగలవు కాబట్టి వాటిని ఒక విధమైన మూకలకణాలుగా పరిగణిస్తారు.
ఈ కణాలు వివిధ రకాల కణాలుగా విభజించబడతాయి. ఉదాహరణకు చూస్తే.. అడల్ట్ లింఫోయిడ్ లేదా మైలోయిడ్ మూలకణాలు ఉన్నాయి.
ఈ సెల్స్ దగ్గరి సంబంధం ఉన్న కణాల కుటుంబంగా విభజించబడతాయి. ఉదాహరణకు హెమటోపోటిక్ స్టెమ్ సెల్స్ అనేవి తెల్లరక్తకణాలు, ఎర్రరక్తకణాలు, రక్తఫలకికలు (ప్లేట్లెట్స్)లో, లింఫోయిడ్ స్టెమ్ సెల్స్ మరియు మజిల్ స్టెమ్ సెల్స్‌లా అభివృద్ధి చెందుతాయి.
అన్ని రకాల కణాలను వేరుచేయగల సామర్థ్యం ఉన్న సెల్స్‌ను టోటిపోటెంట్ స్టెమ్ సెల్స్ అని పిలుస్తారు. ఉదాహరణకు: జైగోట్ అని పిలువబడే అండం ఫలదీకరణ సమయంలో విభజించబడ్డ ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ ఎటువంటి కణంలోనైనా అభివృద్ధి చెందుతాయి.
ఈ సెల్స్ ఎటువంటి సెల్స్గానైనా మారుతాయి. ఎర్లీ ఎంబ్రియో నుంచి ఏర్పడ్డ సెల్స్ ప్లాసెంటాలో ఉన్న కణాలు మినహా ప్లురిపోటెంట్ సెల్స్‌గా పరిగణించబడతాయి. ఉదాహరణకు చెప్పుకుంటే.. ఎర్లీ స్టేజ్ ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ భేదం నుంచి ఉత్పత్తి అయిన సెల్స్ మీసోడెర్మ్, ఎక్టోడెర్మ్, మరియు ఎండోడెర్మ్ సూక్ష్మక్రిమి లేయర్లుగా డెవలప్ అవుతాయి.
పిండంలో ఉండే మూలకణాలు పూరిపోటెంట్ మూలకణాలు. అవి శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల మూలకణాలుగా విభజించబడతాయి. ప్రారంభ దశలో ఉన్న పిండాన్ని బ్లాస్టోసిస్ట్ అని పిలుస్తారు. బ్లాసోసిస్ట్ యొక్క లోపల ఉన్న కణాల ద్రవ్యరాశి అనేది పిండకణాలను ఏర్పరుస్తుంది. స్టెమ్ సెల్ ప్రీజర్వేషన్ ప్రయోజనాలు సైట్స్ మధ్య కణాల కదలికలను, భద్రత మరియు నాణ్యత పరీక్షలను పూర్తి చేసేందుకు అనుమతిస్తాయి.
స్టెమ్ సెల్ ప్రీజర్వేషన్ (సంరక్షణ) వల్ల కలిగే కొన్ని రకాల ప్రయోజనాలు
బొడ్డు తాడు రక్తం అనేది స్టెమ్ సెల్స్ ఎక్కువగా ఉండే సోర్స్. ఈ స్టెమ్ సెల్స్ వలన బ్లడ్ క్యాన్సర్, జన్యుపరమైన వ్యాధులు, రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా లేక వచ్చేటటువంటి 80 రకాల ప్రాణాంతక వ్యాధులకు చికిత్స చేసి ప్రాణాలను రక్షించవచ్చు. ఎముక మజ్జ మార్పిడికి (బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్) ఇది ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగించబడుతుంది. ఎందుకంటే ఇది కీమోథెరపీ తర్వాత రోగనిరోధక శక్తిని తిరిగి నిర్మించగలదు.
మీ శరీరం గాయపడినపుడు ఏవైనా సెల్స్ పాడయిపోయినపుడు వాటికి చికిత్స చేసేందుకు మరియు పునఃనిర్మించేందుకు మిమ్మల్ని స్టెమ్ సెల్స్ అనుమతిస్తాయి. ఇవి కేవలం మీకు మాత్రమే కాకుండా మీ కుటుంబసభ్యులకు కూడా ఉపయోగపడతాయి.
మీ మూలకణాలు మీ తోబుట్టువులకు సరిగ్గా సరిపోయేందుకు 25శాతం అవకాశం ఉంది. కార్డ్ బ్లడ్ ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా ఖచ్చితమైన పోలికను ప్రతిసారి కలిగి ఉండాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన స్టెమ్ సెల్స్ సంఖ్యను బట్టి తక్కువగా మ్యాచ్ అయినా కానీ యాక్సెప్ట్ చేస్తారు.
సైన్స్ ప్రతిరోజూ పురోగమిస్తోంది. ప్రతిరోజు అనేక క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి(చేపడుతున్నారు). బొడ్డు తాడు రక్తం మరియు తాడు కణజాలాల స్టెమ్ సెల్స్ బ్లడ్ రుగ్మతలు, అంతే కాకుండా మానసిక రుగ్మతలైన ఆటిజం, స్ట్రోక్, సెరిబ్రల్ ప్లాసీ, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజూరీ వంటి పరిస్థితుల కోసం క్లినికల్ ట్రయల్స్‌లో ఉపయోగించబడుతున్నాయి.
బొడ్డుతాడు ద్వారా సేకరించిన మూలకణాలు యంగ్‌గా, యాక్టివ్‌గా ఉంటాయి కాబట్టి.. ఎముకమజ్జ ద్వారా సేకరించిన స్టెమ్ సెల్స్‌తో పోల్చితే అవి వేగంగా వేరుచేయగలవు. బొడ్డుతాడు స్టెమ్ సెల్స్ కూడా " ఇమ్యునాజికల్లీ నెయివ్"(ప్రతిఘటించే శక్తి లేకపోవడం)గా ఉంటాయి. ఎందుకంటే అవి ఇన్ఫెక్షన్ల వంటి బయటి రోగనిరోధక ప్రేరణకు గురికావు. తోబుట్టువుల మధ్య కూడా మార్పిడి సంబంధిత సమస్యలను కలిగించే అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయి.
మీ శిశువు పుట్టగానే స్టెమ్ సెల్స్ స్టోర్ చేయడం వలన భవిష్యత్‌లో ఎప్పుడు అవసరమైనా తిరిగి వాడుకోవచ్చు. వీటిని పుట్టగానే సేకరించి భద్రపరుస్తారు. మీరు ఎముకమజ్జ మార్పిడి కోసం ప్రయత్నిస్తే దాత కోసం చూడాల్సిన అవసరం లేదు. ఎముక మజ్జ మార్పిడి దాత కోసం చూడాల్సిన అవసరం లక్షమందిలో ఒకరికి ఉంటుంది.
స్టెమ్ సెల్స్ ప్రత్యేకంగా తయారు చేసిన క్రయో-ప్రీజర్వేషన్ బ్యాగులలో ప్యాక్ చేయబడతాయి. వీటిని విడివిడిగా అల్యూమినియం ప్రొటెక్టివ్ కేస్లలో చుట్టి ఉంచుతారు. ఇలా చేసిన స్టెమ్ సెల్స్‌కు ప్రతి ప్యాక్‌కు ఒక యూనిక్ కోడ్‌ను కేటాయించి క్రయోప్రిజర్వేషన్ ట్యాంకులలో భద్రపరుస్తారు. ఇలా ప్రంచస్థాయి ప్రమాణాలతో 23సంవత్సరాల పాటు స్టోర్ చేసిన తర్వాత స్టెమ్ సెల్స్ ఉపయోగించడం మంచిది.
మీరు తరచూ వేర్వేరు స్థలాలకు మారుతుంటే.. మీరు ఉంటున్న ఏరియాకు దగ్గరకి మీ స్టెమ్ సెల్స్ మార్చమని స్టెమ్ సెల్ బ్యాంకుకు చెప్పొచ్చు. ఈ స్టెమ్ సెల్స్ ప్రోజెన్ (చల్లటి ప్రదేశాలలో స్టోర్ చేయడం) స్టేట్‌లో ఉంటుంది కనుక ప్రపంచంలోని ఎక్కడికైనా తరలించేందుకు వీలుంటుంది. అయితే వాటిని వేరే బ్యాంకులో స్టోర్ చేసేందుకు తరలింపు ఖర్చులను మాత్రం మీరే భరించాల్సి ఉంటుంది.
స్టెమ్ సెల్స్ అనేవి అత్యంత ఆసక్తిని కలిగించే విషయాలలో ఒకటి. స్టెమ్ సెల్స్‌పై పరిశోధనలు ప్రతి రోజు వేగంగా పెరుగుతున్నాయి. ఒకానొక సమయంలో నయం చేయలేని చాలా రకాల వ్యాధులకు నేడు స్టెమ్ సెల్స్ ద్వారా చికిత్స సాధ్యం అవుతుంది. స్టెమ్ సెల్స్ ద్వారా ఆరోగ్యకరమైన కొత్త కణజాలాలను క్రియేట్ చేయొచ్చు. ఆ సెల్స్ ఎన్నో రకాల రుగ్మతలకు చికిత్స చేయడంలో సహాయపడుతున్నాయి. స్టోర్ చేయబడిన లేదా ప్రీజర్వ్ చేయబడిన స్టెమ్ సెల్స్ ద్వారా నయం చేయగల కొన్ని రకాల వ్యాధులు:
నిల్వ చేసిన లేదా ప్రీజర్వ్ చేసిన స్టెమ్ సెల్స్‌ను ఉపయోగించి కణజాలాలను, అవయవాలను పునరుత్పత్తి చేయొచ్చు. అవయవాలు ఫెయిల్ అయిన సందర్భాల్లో డిమాండ్‌ను బట్టి అవయవాలను ఉత్పత్తి చేయడం, దానం చేయడం, మార్పిడి చేయడం వంటివి చేయొచ్చు.
ప్యాంక్రియాట్రిక్ కణాలు అనేవి సరిగ్గా పని చేయనపుడు టైప్ 1 డయాబెటిస్ వస్తుంది. దీని కారణంగా శరీరం చాలా తక్కువ మొత్తంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రీజర్వ్ చేసిన స్టెమ్ సెల్స్‌ను ఉపయోగించి.. టైప్ 1 డయాబెటిస్తో బాధపడే రోగులలో ప్యాంక్రియాట్రిక్ కణాలను మార్పిడి చేయొచ్చు. ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వలన ఎవరి రోగనిరోధక శక్తయితే క్షీణిస్తుందో వారిలో ప్రీజర్వ్ చేసిన స్టెమ్ సెల్స్‌తో ఆ కణాలను భర్తీ చేసి వారి సమస్యను పరిష్కరించవచ్చు.
గుండె సంబంధిత వ్యాధులు ప్రధానంగా రక్తనాళాల్లో సమస్యలు ఉత్పన్నం అయినపుడు వస్తాయి. కొంత మంది పరిశోధకులు స్టెమ్ సెల్స్ ఉపయోగించి కొత్త రక్తనాళాలను ఉత్పత్తి చేశారు. ఇవి చూసేందుకు మరియు పనితీరు పరంగా కూడా సహజ(ఒరిజినల్) రక్తనాళాల వలే ఉంటాయి. వివిధ రకాల కణజాలాలు బ్యాంకు నుంచి వచ్చిన స్టెమ్ సెల్స్ ద్వారా రిపేర్ చేయబడతాయి. లేదా రీజెనరేట్ (పునరుత్పత్తి) చేయబడతాయి. వాస్కులర్ మరియు కార్డియోవాస్కులర్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తాయి.
బొడ్డుతాడు రక్తం మరియు ప్లాసెంటాలో హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్ని ఇతర రక్తకణాలుగా విభజించబడతాయి. ఇది లుకేమియా, సికెల్‌సెల్ ఎనిమియా, ఇతర రకాల రోగనిరోధక వ్యాధులకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.
గాయాల తర్వాత నాడీసంబంధిత రుగ్మతలు చాలా వస్తాయి. అటువంటి రుగ్మతలు ఉంటే స్టెమ్ సెల్స్‌తో చికిత్స చేయొచ్చు. పార్కిన్సన్(మెదడుకు వచ్చే ఒక రకమైన రుగ్మత) రుగ్మత మెదడు కణాలు దెబ్బతినడం వల్ల కండరాల కదలికలను నియంత్రిస్తుంది. మెదడులో దెబ్బతిన్న కణజాలానికి చికిత్స చేసేందుకు స్టెమ్ సెల్స్‌ను ఉపయోగించవచ్చు. ఈ న్యూ బ్రెయిన్ సెల్స్ అనియంత్రిత కండరాల కదలికలను నియంత్రించగలవు.
మానవులకు వచ్చే వ్యాధులను క్యూర్ చేసేందుకు స్టెమ్ సెల్స్ అనేవి చాలా ముఖ్యం. అందుకోసమే స్టెమ్ సెల్స్‌ను రక్షించాల్సిన అవసరం ఉంది. స్టెమ్ సెల్స్ సంరక్షణకు యూనివర్సల్ పద్ధతి (సార్వత్రిక పద్ధతి) అంటూ ఏమీ లేదు. మెసెన్చైమల్ మరియు ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్‌ను సంరక్షించేందుకు హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్స్ ప్రీజర్వ్ చేసేందుకు వాడిన ప్రొటోకాల్స్‌ను తిరిగి పొందడం చాలా కష్టం అవుతుంది. ప్రతి కణానికి ప్రత్యేక శాస్త్రం ఉందని ఇవి రుజువు చేస్తాయి. వాటిని ప్రిజర్వ్ చేసే టెక్నిక్స్ తప్పనిసరిగా వాటి మీదే ఆధారపడి ఉండాల్సి ఉంటుంది.
కణాలను ప్రిజర్వ్ చేసేందుకు చాలా విధానాలు ఉన్నాయి. కానీ సైన్స్ అనేది కొత్త విధానాలను కనుక్కోవాలి లేదా పాత వాటిని సవరించాలి. సరైన విధంగా ప్రీజర్వ్ చేయకపోవడం, వేడిచేయకపోవడం, నిల్వచేయకపోవడం వంటివి జరిగినపుడు ప్రొటోకాల్‌లోని ప్రతి ఎలమెంట్ సెల్స్‌ను డ్యామేజ్ చేస్తుంది. ప్రీజర్వేషన్ సమయంలో ప్రతీది ఎంత జాగ్రత్తగా చేయాలో వ్యక్తులకు శిక్షణ ఇవ్వాలి. ప్రస్తుతం కణాలను ప్రీజర్వ్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ప్రస్తుతం కణాలను సజీవంగా తీసుకునేందుకు ఎంతో శ్రమ మరియు అనే మెషీన్ల మీద ఆధారపడాల్సి రావొచ్చు. మనకు అందుబాటులో లేని పరికరాలు కూడా అవసరం కావొచ్చు. ఇది తప్పనిసరిగా మొదట పరిగణించాల్సిన విషయం. వారి నైతికతకు భద్రతకు భరోసా ఇవ్వడానికి వైద్య మరియు శాస్త్రీయ ఇంప్రూవ్‌మెంట్స్‌ను జాగ్రత్తగా పరిగణలోనికి తీసుకోవాలి.
స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ద్వారా అధిక నాణ్యత ఉన్న స్టెమ్ సెల్స్‌ను పొందడం సవాలుతో కూడుకున్న పని. ఆరోగ్యకరమైన ఎటువంటి వ్యాధి లేకుండా ఉన్న కణజాలం నుంచి మాత్రమే స్టెమ్ సెల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. స్టెమ్ సెల్స్ ద్వారా తిరిగి శక్తిని పొందేందుకు వాటిని సరిగ్గా ప్రాసెస్ చేయడం అవసరం. స్టెమ్ సెల్స్ అవసరం ఉన్న వ్యక్తులకు స్టెమ్ సెల్ బ్యాంక్స్ అందుబాటులో ఉండేలా చూడడం మరొక సవాలు. కొన్ని ప్రైవేటు స్టెమ్ సెల్ బ్యాంక్స్ ఖర్చుతో కూడుకున్నవి కాగా, మరికొన్ని ప్రభుత్వ స్టెమ్ సెల్ బ్యాంక్స్ అందరి డిమాండ్లను నెరవేర్చే సామర్థ్యాన్ని కలిగి ఉండకపోవచ్చు.
స్టెమ్ సెల్ ప్రీజర్వేషన్ చార్జ్ అనేది మీరు ఎంచుకునే బ్యాంకుని బట్టి, ప్లాన్‌ను బట్టి ఉంటుంది. స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అనేది గణనీయమైన (ఎక్కువగా ఉండే) పెట్టుబడి అయినప్పటికీ కొన్ని ప్రైవేటు కంపెనీలు మీకు వివిధ రకాల పేమెంట్ ప్లాన్లు మరియు ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాయి. వీటి వల్ల ఈ పెట్టుబడి మరింత సులభం అవుతుంది. మీరు మీ కోసం ప్రత్యేకమైన ప్యాకేజీని ఎంచుకోవడానికి ప్రయోజనాలు మరియు ఖర్చులను అంచనా వేయడం సరైన విధంగా ఉంటుంది.
మన దేశంలో స్టెమ్ సెల్ ప్రీజర్వేషన్ ఖర్చులు అనేవి ఒక నగరం నుంచి మరొక నగరానికి వేరుగా ఉంటాయి. ఈ ఖర్చులు వివిధ కారకాలను బట్టి ప్రభావితం అవుతాయి. వివిధ బ్యాంకులు మరియు సంస్థల ఖర్చులలో తేడాలు ఉంటాయి. ఏ రకంగా ప్రీజర్వ్ చేస్తారు. ఎలా సేకరిస్తారనే విషయం మీద కూడా ఖర్చు ఆధారపడి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియను నిర్వహించే నిపుణుల ఆంశం కూడా ప్రీజర్వేషన్ ఖర్చులను ప్రభావితం చేసే మరో ఆంశం.
మన దేశంలో స్టెమ్ సెల్ బ్యాంకులు ప్రధానంగా ఇలా ఉన్నాయి..
ఈ బ్యాంకులను సాధారణంగా ఫ్యామిలీ బ్యాంక్స్ అని పిలుస్తారు. ఇక్కడ తల్లిదండ్రులు వారి పిల్లల బొడ్డు తాడు రక్తాన్ని భవిష్యత్ అవసరాల కోసం ఇక్కడ భద్రపరుస్తారు. ఇక్కడ స్టెమ్ సెల్స్‌ను పిల్లలు లేదా తోబుట్టువుల వంటి కుటుంబసభ్యులు ఉపయోగించవచ్చు.
ఈ స్టెమ్ సెల్ బ్యాంకులు ప్రజల సహకారంతో పని చేస్తాయి. ఈ బ్యాంకులలో తల్లిదండ్రులు శిశువు బొడ్డుతాడు రక్తాన్ని డొనేట్ చేస్తారు. ఎవరికైతే అవసరం ఉంటుందో వారు ఇప్పటికే ప్రభుత్వ స్టెమ్ సెల్ బ్యాంకులలో భద్రపరిచిన స్టెమ్ సెల్స్‌ను వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. నిల్వ చేయబడిన ఈ స్టెమ్ సెల్స్ పరిశోధనల కోసం కూడా ఉపయోగించబడతాయి. తల్లిదండ్రులు కూడా స్టెమ్ సెల్స్‌ను డొనేట్ చేసేందుకు అర్హత కలిగి ఉండాలి. వారికి కూడా కొన్ని అర్హత ప్రమాణాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ బ్యాంకుల డేటాబేస్(మొత్తం వివరాలు) డాక్టర్లకు అందుబాటులో ఉంటుంది. వారికి అవసరం వచ్చినపుడు వారు ఉపయోగించుకోవచ్చు. చికిత్సకు అవసరమైన సందర్భంలో ఉపయోగించుకుంటారు.
ఈ రకమైన స్టెమ్ సెల్ బ్యాంక్స్ ప్రభుత్వ మరియు ప్రైవేటు స్టెమ్ సెల్ బ్యాంకుల ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ పద్ధతిలో బొడ్డు తాడు నుంచి విడదీసిన స్టెమ్ సెల్స్ కమ్యూనిటీ పూల్‌కు యాడ్ చేయబడతాయి. వైద్య పరంగా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినపుడు స్టోర్ చేసిన అన్ని రకాల స్టెమ్ సెల్స్‌ను యాక్సెస్ చేసేందుకు కమ్యూనిటీ బ్యాంక్ మెంబర్స్‌కు అనుమతి ఉంటుంది. ఈ విధానం చాలా ప్రత్యేకమైనది. మన భారతదేశంలో ఈ విధానమే ఉపయోగించబడుతుంది.
స్టెమ్ సెల్ పరిశోధన యొక్క భవిష్యత్ అవసరాల కోసం స్టెమ్ సెల్స్ ప్రీజర్వేషన్ చాలా ముఖ్యం. మనకు సులభంగా లభించే టాప్ నాచ్ బయోస్పెసిమెన్ (రీసెర్చి కోసం ఉపయోగపడేవి) డిమాండ్‌ను ఇవి పెంచుతాయి. స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రతి రోజు ఎంతో పురోగతిని సాధిస్తూనే ఉంది. వివిధ రకాల వ్యాధులకు స్టెమ్ సెల్స్ ద్వారా ఇప్పటికే విజయవంతంగా చికిత్స చేశారు. భవిష్యత్‌లో మందులు, చికిత్స విషయంలో స్టెమ్ సెల్స్ ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని అంచనా వేస్తున్నారు. 80 కంటే ఎక్కువ ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో స్టెమ్ సెల్ ప్రీసర్వేషన్ ఉపయోగపడుతుంది. అయినా కానీ స్టెమ్ సెల్స్‌ను ప్రీజర్వ్ చేసుకోవాలా? వద్దా? అనేది వ్యక్తి ఇష్టం.
Stem cell banking in telugu, what is stem cell preservation in telugu?, benefits of stem cell preservation in telugu, issues in stem cell preservation in telugu, why should we preserve stem cells in telugu.
What Are The Benefits Of Stem Cell Preservation in English, What Are The Benefits Of Stem Cell Preservation in Tamil, What Are The Benefits Of Stem Cell Preservation in Bengali
Yes
No
Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips
శిశువుల్లో మొటిమలు: కారణాలు & లక్షణాలు | Baby Acne : Causes and Symptoms in Telegu
మీ చిన్నారితో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీ బిడ్డతో ఆనందించే సెలవుల కోసం 5 అత్యంత ఉపయోగకరమైన టిప్స్|Planning a Trip with Your Little One? Here are 5 Extremely Useful Tips for an Enjoyable Holiday with Your Baby in Telegu
బేబీ గర్ల్ బెల్లీ Vs బేబీ బాయ్ బెల్లీ: మీ పొట్ట ఆకారం లేదా పరిమాణం మీరు అబ్బాయిని కలిగి ఉన్నారని చెప్పగలరా? | Baby Girl Belly Vs Baby Boy Belly in Telugu
మీ చిన్నారులకు పాటీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చేయాల్సినవి, చేయకూడనివి ( Do’s and don’ts when Potty Training Your Newborn in Telugu?)
శిశువు మొదటి దంతాలు: తల్లిదండ్రులు తెలుసుకోవలసిన 5 వాస్తవాలు (Baby’s First Tooth: 5 Facts Parents Should Know in Telugu)
ర్మల్ డెలివరీ లేదా సిజేరియన్ డెలివరీలలో ఏది మంచిది? ఎందుకు మంచిది? | Which Is Better Normal Or Cesarean in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |