New Mom
31 July 2023 న నవీకరించబడింది
ఓ వైపు పిల్లల్ని చూసుకుంటూ, మరోవైపు కుటుంబాన్ని నడిపించడం అంటే తక్కువ సమయంలో ఎక్కువ బాధ్యతల్ని నిర్వర్తించడమే. ఇప్పటికే తల్లులుగా బాధ్యతల్ని మోస్తున్నవారికి కూడా ఇది కాస్త భారంగానే ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూల్‌గా ఉండేందుకు ఈ టైమ్ మేనేజ్‌మెంట్ టిప్స్ ఫాలో అవండి. సమయాన్ని చక్కగా నిర్వహించే తల్లిగా మీరు ఎలా ఉండొచ్చో తెలుసుకోండి
మీ మెదడులో రకరకాల పనుల గురించి ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. వాటన్నింటినీ క్రమబద్ధంగా, ఆర్గనైజ్డ్‌గా ఉంచడం అవసరం. అందుకే ప్రతీది రాసుకోవాలి.
ఇందుకోసం మీరు నోట్‌బుక్ ఉపయోగించవచ్చు లేదా డిజిటల్ పద్దతిలో నోట్ చేసుకోవచ్చు. టూ డు లిస్ట్ ప్రిపేర్ చేసేందుకు అనేక యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్‌లో టెంప్లేట్స్ కూడా ఉంటాయి. రోజు, వారం, నెల ఇలా వేర్వేరుగా మీ వివరాలను సార్ట్ చేసేందుకు ఈ టెంప్లేట్స్ ఉపయోగపడతాయి. ఒక పని పూర్తి కాగానే దాన్ని కొట్టేయడం మీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది.
కొత్తగా అమ్మ అయిన ప్రతి మహిళ గుర్తుంచుకోవాల్సిన టాప్ 5 విషయాలు
ఇతరులకు అప్పగించగలిగే పనులను తెలుసుకోగలిగితే మీకు చాలా సమయం ఆదా అవుతుంది. మీ భాగస్వామికి లేదా పనిమనిషికి ఈ పనులు అప్పగించవచ్చు:
ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు కాదు అని చెప్పడం మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఓ విషయం గుర్తుంచుకోండి. ప్రతీసారి సరే అని చెప్పుకుంటూ పోతే, ఆ పని సరిగ్గా జరగనప్పుడు వారు అసంతృప్తికి గురవుతారు. అందుకే మీ ప్రియారిటీస్ తెలుసుకొని కాదు అని చెప్పడం నేర్చుకోండి.
కాబోయే తల్లులకు టైమ్ మేనేజ్‌మెంట్ ఖచ్చితంగా ఓ సవాల్. కానీ అసాధ్యమేమీ కాదు. పాజిటీవ్ మైండ్‌సెట్‌తో, చేయాల్సిందే అనే వైఖరితో ప్రారంభించాలి. ఆ రోజులో మీరు తప్పనిసరిగా చేయాల్సిన పనులను లిస్ట్‌లో టాప్‌లో పెట్టుకొని పూర్తి చేయాలి. వాటి కోసం రోజంతా సమయాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీరు సరైన సమయం కేటాయిస్తేనే ముఖ్యమైన పనులు పూర్తి చేయగలరు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి. మీరు సంతోషకరమైన తల్లి కావడానికి, అనుకున్నది సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది.
Time management for new moms in telugu, new mom life styel in telugu, how to manage things as new mom in telugu, new mom jobs in telugu, plan everything as new mom in telugu.
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips
పసిబిడ్డతో ప్రయాణాలు: ముఖ్యమైన భద్రతా చిట్కాలు (Traveling with a Newborn: Important Safety Tips in Telugu)
మీ శిశువు ఆరోగ్యంగా ఉందని చెప్పే 8 సాధారణ గుర్తులు (8 Simple Signs That Shows Your Baby is Healthy in Telugu)
గర్భం దాల్చిన నాలుగో వారంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి అనుభూతి పొందుతారు? (What Does One Experience During Their Fourth Week Of Pregnancy in Telugu?)
ప్రెగ్నెన్సీ గ్లో నిజంగానే ఉంటుందా? (Is Pregnancy Glow a Real Thing in Telugu?)
అబార్షన్ నుండి మానసికంగా కోలుకోవడంలో మీకు సహాయపడే 8 దశలు (8 Steps to Help You Recover Emotionally from the Loss of Your Baby in Telugu)
మీ నవజాత శిశువును వారి తోబుట్టువులకు పరిచయం చేయడం (Introducing Your New Born to Older Siblings in Telugu)
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |