Twins & Triplets
25 July 2023 న నవీకరించబడింది
అప్పుడే పుట్టిన పసిబిడ్డ సంరక్షణ చాలా పెద్ద పని. అదే మరొక బిడ్డ కూడా చేరితే, పెంచడం దాదాపు అసాధ్యంగా అనిపించవచ్చు. కానీ ఇంతకుముందు మీకు తెలియని విషయాలను గుర్తించగలిగితే.. మీ మానసిక ప్రశాంతను కాపాడుకుంటూ కవల పిల్లల్ని విజయవంతంగా చూసుకోవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నన్సీలో కవలలు పుట్టే అవకాశాలను ఏ అంశాలు పెంచుతాయి?
మీ కవల పిల్లల కునుకు ఇంకా నిద్ర సమయాలని ఏకం చేయటం అత్యవసరం. లేకపోతే మీరు ఎప్పుడు చూసినా పాలు పడుతూనే ఉండాల్సి వస్తుంది. ఒక బిడ్డ పడుకున్నప్పుడు మరొక బిడ్డ ఆకలితో సిద్ధంగా ఉంటుంది.
ఒకసారి మీ పాపాయిలకు రాత్రంతా పడుకొనే అలవాటు వచ్చేశాక, ఒకరినొకరు రాత్రి నిద్ర లేపకుండా ఉండాలని ఇద్దరినీ వేర్వేరు చోట్ల పడుకోబెట్టాలని మీకు అనిపించవచ్చు. కానీ ఇద్దరూ మరొకరి ఏడుపుకి అలవాటు పడేలా ఒకచోటనే పడుకోబెట్టవచ్చు. ఈ విధంగా, వారు పూర్తిగా నిశ్శబ్దంపై ఆధారపడకుండా ఎలాంటి పరిస్థితులలోనైనా నిద్రపోవటం నేర్చుకుంటారు.
కవల పిల్లలు ఉన్నంత మాత్రాన మీరు ఏ వస్తువునైనా రెండుగా తీసుకురానక్కర్లేదు. మీకు మీ బిడ్డలకి ఏం ఇష్టముంటాయో అప్పుడే తెలీదు. అందుకని వివిధ వస్తువుల కాంబినేషన్లు ప్రయత్నించవచ్చు. కానీ ఉయ్యాలలు, కారు సీట్లు లేదా ఇతర పసిపిల్లల అత్యవసర వస్తువులు అవన్నీ రెండుగా కొనితీరాలి.
కవల పిల్లలను చూసుకోవడం అంటే చాలా పనులతో కూడి ఉంటుంది. మీరు సాయం కోసం ఎవరినైనా అంటే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరినైనా ఎప్పుడు సాధ్యమైతే అప్పుడు పిలవవచ్చు. మీరు పాపాయిలను చూసుకుంటున్నప్పుడు మీ స్నేహితుడిని వంట చేయనివ్వండి లేదా మీరు కిరాణా సరుకులు తెస్తున్నప్పుడు మీ స్నేహితురాలిని పిల్లలను చూసుకోమనండి.
మీకు కవల పిల్లలు ఉంటే, మొదటి నెలల్లో జిప్పరు ఉన్న బట్టలని ఎంచుకుంటే వారిని తయారుచేయడం చాలా సులభం. పని త్వరగా అవుతుంది. ఇద్దరు పిల్లలను ఒకేసారి పెంచేటప్పుడు ప్రతి సెకెండ్ విలువైనది కాబట్టి ఈ విధంగా బట్టలను వెతుక్కునే సమయం, శ్రమ తగ్గుతుంది.
మీరు ఒకవేళ తల్లిపాలు ఇవ్వాలని నిర్ణయించుకుంటే, మీ కవల పిల్లలకి వంతులవారీగా ఒక్కో స్తనంతో పాలుపడితే, ఇద్దరికీ సమాన మొత్తాల్లో పాలు అందించేలా చూడవచ్చు.
గుర్తుంచుకోండి.. మీ కవల పిల్లలు ఎంత సారూప్యతను కలిగి ఉంటారో అంత భిన్నంగా కూడా ఉంటారు. మీ పిల్లల మధ్య తేడాలను పోల్చకుండా ఎల్లప్పుడూ ప్రోత్సహించండి. ప్రతి బిడ్డకు తన సొంత బలాలు, బలహీనతలు ఉంటాయి. కవల పిల్లలు కూడా దానికి అతీతం కాదు. ఎప్పుడూ ‘నీ అన్నయ్య సరిగ్గా ప్రవర్తిస్తున్నాడు, నీకేమైంది?’ అనవద్దు.
Twins facts in telugu, Unknown facts about twins in telugu, Raising new born twins in telugu, Tips to raise new born twins in telugu.
Yes
No
Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips
ప్రసూతి ప్రయోజనానికి ఎవరు అర్హులు? (Who Is Eligible For Maternity Benefit in Telugu?)
మీరు ప్రయత్నించవలసిన ఉత్తమ 30+ బేబీ బంప్ ఫోటోషూట్ ఐడియాస్ (Best 30+ Baby Bump Photoshoot Ideas You Should Try in Telugu)
రెండవ గర్భధారణ ఫోటోషూట్ కోసం మంచి ఐడియాలు (Endearing Ideas for Second Pregnancy Photoshoot in Telugu)
బేబీ బట్టలు ఉతికేటప్పుడు మీరు తప్పక పాటించాల్సినవి & చేయకూడనివి! (Do’s & Don’ts You Must Follow While Washing Baby Clothes in Telugu)
పసి పిల్లల బట్టలు గాలిలో ఆరబెట్టడం ఎంత వరకు సురక్షితం? (How Safe Is It to Air Dry Baby Clothes in Telugu?)
పిండం హృదయ స్పందన అదృశ్యమై మళ్లీ కనిపించవచ్చా? (Can Fetal Heartbeat Disappear and Reappear in Telugu)
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |