hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • కెమికల్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి? (What is Chemical Pregnancy in Telugu?) arrow

In this Article

    కెమికల్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి? (What is Chemical Pregnancy in Telugu?)

    కెమికల్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి? (What is Chemical Pregnancy in Telugu?)

    Updated on 3 November 2023

    కెమికల్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది ఒక పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్, ఇది క్లినికల్ ప్రెగ్నెన్సీకి విరుద్ధంగా కెమికల్స్‎ని ఉపయోగిస్తుంది. దీనిలో డాక్టర్ అల్ట్రాసౌండ్ ద్వారా మీ శిశువు ఎదుగుదలను చూడవచ్చు. గతంలోని మహిళలు తమకు కెమికల్ ప్రెగ్నెన్సీ ఉందని తెలుసుకునే అవకాశం తక్కువగా ఉండేది. ఆధునిక ప్రెగ్రెన్సీ టెస్టులు చాలా సున్నితమైనవి. అవి తప్పిన పీరియడ్‌కు మూడు లేదా నాలుగు రోజుల ముందు ప్రెగ్నెన్సీని గుర్తిస్తాయి. అన్ని ప్రెగ్నెన్సీల్లో సగానికి పైగా గర్భస్రావం సంభవిస్తుంటుంది. వీటిలో ఎక్కువ భాగం కెమికల్ ప్రెగ్నెన్సీలు. ఏదేమైనా మహిళలకు ఉన్న కెమికల్ ప్రెగ్నెన్సీల నిజమైన సంఖ్యను తెలుసుకోవడం కష్టం. ఈ ప్రెగ్నెన్సీల్లో చాలా వరకు స్త్రీకి లక్షణాలు కనిపించకముందే లేదా ఆమె రుతుస్రావం(పీరియడ్‌) అవ్వకముందే అవి ముగిసిపోతాయి. కెమికల్‌ ప్రెగ్నెన్సీ ఉన్నా చాలా మంది మహిళలకు దాని గురించి తెలియదు. ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలలో గర్భస్రావం బాధాకరంగా ఉంటుంది. ఇది మీకు సంభవిస్తే కోలుకోవడానికి, నష్టాన్ని ఎదుర్కోవటానికి అవసరమైన సహాయాన్ని పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి.

    కెమికల్ ప్రెగ్నెన్సీలకు కారణాలు ఏమిటి? (Causes of Chemical Pregnancy in Telugu?)

    ‌ఒక కెమికల్ ప్రెగ్నెన్సీలో పిండం HCG (హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్)ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పెరగడానికి అవసరమైన హార్మోన్. ప్రెగ్నెన్సీని గుర్తించడానికి వైద్యులు ఈ హార్మోన్‌ను ప్రెగ్నెన్సీ టెస్టులను ఉపయోగిస్తారు. పిండం ఎదుగుదల ఆగిపోయినప్పుడు HCGని ఉత్పత్తి చేయడం ఆగిపోతుంది. కెమికల్ ప్రెగ్నెన్సీ సమయంలో పిండం ఎదుగుదల ఎందుకు ఆగిపోతుందో ఎవరికీ అర్థం కాదు. జన్యుపర లేదా డీఎన్‌ఏ ‎సమస్య కారణంగా పిండం అభివృద్ధి చెందడం ఆగిపోతుంది. పిండం గర్భాశయ లైనింగ్‎లో ఇంప్లాంట్(అభివృద్ధి) చెందకపోవచ్చు. దీని వల్ల మీ HCG స్థాయిలు పడిపోతాయి. ప్రెగ్నెన్సీ టెస్టుల్లో నెగిటివ్ చూపిస్తుంది.

    కెమికల్ ప్రెగ్నెన్సీ యొక్క లక్షణాలు ఏమిటి? (Symptoms of Chemical Pregnancy in Telugu?)

    • మీ పీరియడ్ సాధారణం కంటే ఒక వారం ఆలస్యంగా ఉంటుంది.
    • పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ తరువాత, మీ పీరియడ్స్ ప్రారంభం అవుతాయి.
    • ప్రెగ్నెన్సీ టెస్ట్ కొన్ని వారాల పాటు పాజిటివ్‎గా ఉంటుంది. తరువాత నెగిటివ్‎గా ఉంటుంది.
    • మీ పీరియడ్ ఎక్కువ కాలం ఉంటుంది. రుతుస్రావం తిమ్మిరి సాధారణం కంటే తీవ్రంగా ఉంటుంది.
    • మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంటుంది కానీ ముందస్తు ప్రెగ్నెన్సీ లక్షణాలు ఉండవు.

    కెమికల్ ప్రెగ్నెన్సీ తర్వాత పీరియడ్‎ని ఎప్పుడు ఆశించవచ్చు? (When to Expect Period After Chemical Pregnancy in Telugu?)

    ఒకవేళ మీకు కెమికల్ ప్రెగ్నెన్సీ ఉన్నట్లయితే.. మీ పీరియడ్ సాధారణంగా ప్రెగ్నెన్సీ కోల్పోయిన 4 నుంచి 6 వారాల తరువాత ప్రారంభమవుతుంది.

    కెమికల్ ప్రెగ్నెన్సీకి ఎలాంటి చికిత్స ఉంటుంది? (What is Treatment for Chemical Pregnancy in Telugu?)

    కెమికల్ ప్రెగ్నెన్సీ అంటే మీరు ఎప్పటికీ గర్భం ధరించలేరని లేదా ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వలేరని అర్థం కాదు. గర్భస్రావానికి చికిత్స లేనప్పటికీ, గర్భం దాల్చడంలో మీకు సహాయపడే మార్గాలు ఉన్నాయి. మీకు అనేక కెమికల్ ప్రెగ్నెన్సీలు ఉంటే, సమస్యను గుర్తించేందుకు మీ డాక్టర్ పరీక్షలు చేయవచ్చు. మీ డాక్టర్ అంతర్లీనంగా ఉన్న సమస్యను నయం చేయగలిగితే, మీరు మరొక కెమికల్ ప్రెగ్నెన్సీ కలగకుండా నివారించవచ్చు. చికిత్స చేయని ఇన్‎ఫెక్షన్ వల్ల గర్భస్రావం జరిగితే.. ఉదాహరణకు ఇన్‎ఫెక్షన్‌ను తొలగించడానికి యాంటీ బయోటిక్స్ తీసుకోవడం వల్ల గర్భం ధరించే, ఆరోగ్యకరమైన డెలివరీ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. గర్భాశయ సమస్యల వల్ల నష్టం సంభవిస్తే.. ఆరోగ్యకరమైన గర్భధారణ కోసం మీకు సర్జరీ అవసరం కావచ్చు. శరీరంలో ప్రెగ్నెన్సీ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపించే ఏకైక పరిస్థితి కెమికల్ ప్రెగ్నెన్సీ మాత్రమే కాదని మీరు తెలుసుకోవాలి. అండం గర్భాశయం వెలుపల అమర్చినప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా అధిక HCG స్థాయిలకు దారితీస్తుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఒక కెమికల్ ప్రెగ్నెన్సీ లాగా కనిపించవచ్చు. కాబట్టి మీ డాక్టర్ దాని కోసం టెస్టులు చేయించమని అడగవచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ - లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ & దానిని ఎలా గుర్తించాలి?

    కెమికల్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎంతకాలం రక్తస్రావం అవుతుంది? (How Long It Can Be Bleeding After Chemical Pregnancy in Telugu?)

    గర్భం దాల్చిన పది నుంచి పద్నాలుగు రోజుల తర్వాత, రాబోయే పీరియడ్ సమయంలో తేలికపాటి యోని రక్తస్రావం జరగవచ్చు. గర్భాశయ గోడలో ఫలదీకరణ అండం ఇంప్లాంటేషన్ రక్తస్రావానికి కారణమవుతుంది.

    కెమికల్ ప్రెగ్నెన్సీని ఎలా నివారించాలి? (How to Avoid Chemical Pregnancy in Telugu?)

    • ఒత్తిడిని మేనేజ్ చేయండి
    • ఆరోగ్యకర విధానంలో బరువు పెరగండి
    • ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి
    • రోజూ ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ లను తీసుకోవాలి
    • ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం
    • థైరాయిడ్ సమస్యలు, రక్తానికి సంబంధించిన వ్యాధులు, మధుమేహం వంటి ఇప్పటికే ఉన్న వైద్య పరిస్థితుల నిర్వహణ, నియంత్రించడం
    • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం

    కెమికల్ ప్రెగ్నెన్సీ తరువాత మీరు ఏ విధంగా కోలుకుంటారు? (How Will You Recover After Chemical Pregnancy in Telugu?)

    గర్భస్రావం మీకు, మీ పార్ట్‎నర్‎కి కష్టంగా ఉండవచ్చు. మీరు చాలా కాలం నుంచి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించినట్లయితే లేదా IVF చేయించుకున్నట్లయితే ప్రారంభంలోనే ప్రెగ్నెన్సీ నష్టపోవడం తీవ్రంగా బాధ కల్గించవచ్చు. ఈ సమయంలో ఎమోషన్ సపోర్ట్ ఎంతో అవసరం. ఇది జరిగిన తరువాత చాలా రోజులపాటు మీకు తిమ్మిరి మరియు రక్తస్రావం ఉండవచ్చు. మీ భావోద్వేగాలు మామూలు స్థితికి రావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. స్నేహితులు, కుటు౦బ సభ్యులు, అలాగే మీ ఆధ్యాత్మిక సలహాదారు, ఈ సమయంలో మీకు సహాయం చేయవచ్చు. నష్టం మిమ్మల్ని మరీ కుంగదీస్తే మీరు డాక్టర్‎ని సంప్రదించండి. నష్టం నుంచి కోలుకోవడానికి మీకు మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం అవసరం కావచ్చు.

    IVF తర్వాత కెమికల్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి? (What is the Chemical Pregnancy After IVF in Telugu?)

    IVF, ఇతర సంతానోత్పత్తి చికిత్సల తరువాత కెమికల్ ప్రెగ్నెన్సీ సాధారణం. వీర్యం IVFతో అండాన్ని ఫలదీకరణం చేస్తుంది. ఫెర్టిలిటీ క్లినిక్ మీ పిండాన్ని ఇంప్లాంట్ చేస్తుంది. పిండం ఇంప్లాంట్ తరువాత HCGని ఉత్పత్తి చేస్తుంది. ఇది పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్‌ని జనరేట్ చేస్తుంది. కానీ పిండం పెరగదు. ప్రతి 4 IVF ప్రెగ్నెన్సీల్లో ఒకటి కెమికల్ ప్రెగ్నెన్సీ. IVF ప్రక్రియ జరిగిన 2 వారాల తరువాత డాక్టర్లు ప్రెగ్నెన్సీ టెస్టులు చేయడం వల్ల ఈ అధిక సంఖ్యకు కారణంగా ఉండవచ్చు.

    కెమికల్ ప్రెగ్నెన్సీ తరువాత ఎంత కాలం తరువాత మీరు మళ్లీ బిడ్డ కోసం ప్రయత్నించవచ్చు? (When Can you Try for Baby After Chemical Pregnancy in Telugu?)

    చాలా మంది ప్రారంభ ప్రెగ్నెన్సీ కోల్పోయిన తర్వాత వెంటనే మరొక ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తుంటారు. కెమికల్ ప్రెగ్నెన్సీ అయ్యాక రెండు వారాల తరువాత మీరు అండోత్సర్గము చేయవచ్చు. ప్రెగ్నెంట్ కావచ్చు.

    కెమికల్ ప్రెగ్నెన్సీ అంటే వంధ్యత్వం అవుతుందా? (Does Chemical Pregnancy Means Infertility?)

    కెమికల్ ప్రెగ్నెన్సీలు 50-75% నష్టాలను కలిగిస్తాయి. అయినప్పటికీ అవి వంధ్యత్వాన్ని సూచించవు. చాలా మంది డాక్టర్లు కెమికల్ ప్రెగ్నెన్సీలను పాజిటివ్ ఇండికేటర్లుగా చూస్తారు. భవిష్యత్తులో మీరు గర్భవతి కావచ్చనే సానుకూల సూచికలుగా చూస్తారు. తప్పుడు పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎల్లప్పుడూ కెమికల్ ప్రెగ్నెన్సీని సూచించదని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. అనేక కారణాల వల్ల తప్పుడు పాజిటివ్ రిపోర్టులు వస్తుంటాయి. కెమికల్ ప్రెగ్నెన్సీలు క్రోమోజోమ్ అసాధారణతలు లేదా విఫలమైన IVF నుంచి ఉద్భవిస్తాయి. పని చేయడం, వ్యాయామం చేయడం, లైంగిక సంపర్కం చేయడం లేదా గర్భనిరోధకాన్ని ఉపయోగించడం ప్రెగ్నెన్సీ లాస్‎ని ప్రేరేపించదు. మీరు అడ్వాన్సుడ్‌ మెటర్నల్ ఏజ్(సుమారు 35ఏళ్లు దాటినవారు)లో ఉంటే.. థైరాయిడ్ వ్యాధి కలిగి ఉంటే.. లేదా గడ్డకట్టే రుగ్మత(క్లాటింగ్‌ డిజార్డర్) ఉంటే.. మీకు ముందస్తు గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది.

    ముగింపు (Conclusion)

    ఈ పోస్ట్ కెమికల్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి? దానికి కారణమేమిటి? ఇతర సంబంధిత సమాచారాన్ని కవర్ చేస్తుంది. కెమికల్ ప్రెగ్నెన్సీ అంటే మీ శరీరం హెల్దీ ప్రెగ్నెన్సీని కలిగి ఉండదని కాదు. ముందస్తు గర్భస్రావానికి గల కారణాలను మీరు తెలుసుకున్నట్లయితే సరైన చికిత్సను పొందవచ్చు. మీ డాక్టర్‎ని సంప్రదించండి. మీ ఆప్షన్లను పరిశీలించండి. మీ డాక్టర్ కౌన్సిలింగ్ లేదా సపోర్ట్ గ్రూప్స్‎ని రెకమండ్ చేయవచ్చు. గర్భస్రావం తరువాత మీకు భావోద్వేగాల పరంగా సహాయం అవసరమైతే ఇవి సహాయపడతాయి.

    Tags:

    Chemical pregnancy in telugu, Meaning of chemical pregnancy in telugu, difference between pregnancy and chemical pregnancy in telugu, symptoms of chemical pregnancy in telugu, treatment for chemical pregnancy in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |