Baby Care
21 June 2023 న నవీకరించబడింది
మీరు క్లాత్ డైపర్‌లను మొదటిసారి ఉపయోగించడం గురించి ఆలోచిస్తున్నట్లయితే, అందుబాటులో ఉన్న విభిన్న ఉత్పత్తులు, స్టైల్స్ మరియు దృక్కోణాల మధ్య వెతుక్కోవడం/ సెలెక్ట్ చేస్కోవడం మీకు చాలా ఇబ్బందిగా అనిపించవచ్చు. డైపర్లు, కొత్తగా తల్లైన వారికి మరియు వారి శిశువులకు కోసమే తయారుచేయబడినవి అని నిరూపించబడినప్పటికీ, అవి అనేక ప్రతికూలతలతో వస్తాయి. డైపర్లను ఉపయోగించడంలో వచ్చే అతి సాధారణ ఇబ్బంది/ప్రతికూలత తడి మరియు దద్దుర్లు ఏర్పడటం. మనం ఇప్పుడు, డైపర్ దద్దుర్లు యొక్క అతి సాధారణ కారణాలలో కొన్నింటిని చూద్దాం.
మీరు మీ బిడ్డకు డైపర్ మార్చిన ప్రతిసారీ శుభ్రం చేయడం చాలా అవసరం. క్లాత్ డైపర్‌ను తొడిగే ముందు, మలం లేనప్పుడు కూడా బిడ్డను తడి వైప్ తో తుడిచి, గాలికి ఆరబెట్టండి లేదా పొడిగా ఉంచండి. సరిగ్గా శుభ్రం చేయలేకపోవడం లేదా తక్కువ పరిశుభ్రత విధానాలు వలన, చాలా సందర్భాలలో మూత్రం మరియు మలం యొక్క అవశేషాలు అక్కడ మిగలడానికి కారణమవుతాయి. ఫలితంగా శిశువులలో దద్దుర్లు ఏర్పడతాయి. పట్టించుకోకపోయిన్నట్లైతే, పేలవమైన పరిశుభ్రత అలవాటు వల్ల శిశువులలో వైద్యం అవసరమైయ్యే కొన్ని వ్యాధులకు దారితీయవచ్చు.
శిశువులలో దద్దుర్లు రావడానికి చాలా సాధారణ కారణాలలో ఇదీ ఒకటి. అయినప్పటికీ ప్రజలు డైపర్‌లపై ఎక్కువ దృష్టి పెడతారు కానీ వైప్‌లను ఉపయోగించడంలో మాత్రం విఫలమవుతారు. డిస్పోజబుల్ (ఒకసారి మాత్రమే వాడి పడేసేవి) వైప్స్‌లో మీ శిశువు చర్మానికి సున్నితంగా ఉండే రసాయనాలు, సువాసనలు మరియు మాయిశ్చరైజ్‌లు భారీ మొత్తంలో ఉంటాయి.
చాలామంది శిశువు చర్మం నుండి ఎక్కువసేపు తేమను దూరంగా ఉంచే డిస్పోజబుల్ డైపర్‌లను ఉపయోగిస్తారు. మీ శిశువును ఎక్కువసేపు తడిగా ఉంచడం లేదా తడిగా ఉన్న డైపర్‌లో ఉంచడం వల్ల దద్దుర్లు వస్తాయి. మీ పిల్లలకి, మీరు ప్రతి రెండు గంటలకొకసారి డైపర్లను మార్చాలి. మీరు క్లాత్ డైపర్‌లను తరచుగా మార్చవలసి ఉన్నప్పటికీ, అవి డిస్పోజబుల్ డైపర్‌ల కంటే మెరుగ్గా ఉంటాయి. ఎందుకో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా తల్లులు ఇంట్లో క్లాత్ డైపర్‌లను జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టం. అయినప్పటికీ, ఆధునిక క్లాత్ డైపర్‌లు వివిధ రకాలుగా మరియు పరిమాణాలలో వచ్చినందున వాటిని ఉపయోగించడం ఇప్పుడు సులభం. ఈరోజు మీరు చూసే చాలా క్లాత్ డైపర్‌లు సులువుగా ఫిట్ అవుతాయి మరియు ఉపయోగించడానికీ, కడగడానికీ సులభంగా ఉంటాయి.
పిల్లలలో క్లాత్ డైపర్‌లను ఉపయోగించడం వల్ల వేగంగా తేమను తెలియజేస్తాయి. నేడు క్లాత్ డైపర్‌లు సాధారణమైన వాటిలాగా పేలవమైన డిజైన్‌లలో లేవు. అంతేకాకుండా, అవి డిస్పోజబుల్ డైపర్లు కంటే తక్కువగా లీక్ అవుతాయి.
1955 నుండి చూసినట్లయితే డిస్పోజబుల్ డైపర్‌ల వాడకం డైపర్ దద్దుర్లు 7% నుండి 78%కి పెరిగాయి. రసాయనాలు, అల్ట్రా-అబ్సర్బెంట్ జెల్స్ మరియు డిస్పోజబుల్ డైపర్‌లలో అమ్మోనియా ఏర్పడటం దద్దుర్లు ఏర్పడటానికి ముఖ్యమైన కారణాలు. మరోవైపు, క్లాత్ డైపర్లలో వేరే ఏ పదార్థాలు గానీ శోషక జెల్లు గానీ ఉండవు.
తల్లిపాలు తాగే శిశువుల మలం నీటిలో కరుగగలిగేది. అయితే, క్లాత్ డైపర్లలో మలం యొక్క అవశేషాలు ఉంటాయి. అందువల్ల, వాటిని తరచుగా కడగాలి. మీ బిడ్డ ఇంకా శిశువుగా ఉన్నప్పుడు, మీరు వాషింగ్ మెషీన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.
మీరు సహజంగా తయారు చేసిన క్లాత్ డైపర్ ఉత్పత్తులను ఉపయోగించండి. క్లాత్ డైపర్‌లు శిశువులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి, ఎందుకంటే వాటిలో ఎటువంటి రసాయనాలు ఉండవు. ఉపయోగించడం మరియు కడగడం సులభతరం చేస్తూ ఉతకగలిగే మరియు సర్దుబాటు చేయగల ఇన్‌సర్ట్‌లతో రీయూజబుల్ క్లాత్ డైపర్‌ల యొక్క ఖచ్చితమైన కలయిక కోసం మయిలో ఎసెన్షియల్స్ హ్యాపీ బమ్స్ కాంబోను చెక్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా, ఉత్తమమైన నాణ్యమైన ఉత్పత్తులను ఉపయోగించడానికి ప్రయత్నించండి మరియు మీ శిశువు యొక్క సున్నితమైన చర్మంపై అన్ని రకాల దద్దుర్లు నివారించడానికి నివారణ చర్యలను పాటించండి.
Yes
No
Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips
యాపిల్ సిడార్ వెనిగర్ వాడకం వల్ల కలిగే దిమ్మతిరిగే ప్రయోజనాలు.. ఓ సారి చూడండి!
టకీకార్డియాలో వివిధ రకాలు, లక్షణాలు, కారణాలు
ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్
ఆపిల్ సిడార్ వెనిగర్ బరువు తగ్గడంలో సహాయపడుతుందా? ఇందులో వాస్తవం ఎంత?
స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే ఏమిటి? దీని వలన కలిగే లాభాలేమిటి?
PCOS టీ మీ పీరియడ్స్‌ను నియంత్రించడంలో సహాయపడుతుందా?
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |