hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • తొమ్మిది వారాలకు బిడ్డ పరిమాణం సరిగ్గా ఉందా? (What's the Ideal Size of a 9 Weeks Pregnant Belly in Telugu?) arrow

In this Article

    తొమ్మిది వారాలకు బిడ్డ  పరిమాణం సరిగ్గా ఉందా? (What's the Ideal Size of a 9 Weeks Pregnant Belly in Telugu?)

    తొమ్మిది వారాలకు బిడ్డ పరిమాణం సరిగ్గా ఉందా? (What's the Ideal Size of a 9 Weeks Pregnant Belly in Telugu?)

    Updated on 3 November 2023

    తొమ్మిది వారాల గర్భంతో ఉన్నప్పుడు బిడ్డ త్వరలోనే పిండంగా మారుతుంది. బిడ్డ ఇప్పటి వరకు అండం. ఇది పిండంగా మారడం అనేది, అది వేగంగా పెరుగుతోందని ,అభివృద్ధి చెందుతోందని సూచిస్తుంది. మొదటి ట్రిమ్ స్టర్ త్వరగా ముగుస్తుంది. బిడ్డ రోజరోజుకు అసలైన చిన్నారిలా కనిపిస్తుంది. 9 వారాల బిడ్డ పరిమాణం ద్రాక్ష సైజులో ఉంటుంది. దీని పరిమాణం సుమారు 1.7 సెం.మీ పొడవు ఉంటుంది.

    గర్భం ధరించిన తొమ్మిది వారాలు: పిండం అభివృద్ధి (9 Weeks of Pregnancy : Foetal Development in Telugu)

    9 వారాల గర్భవతి కడుపులో చాలా జరుగుతాయి! అల్ట్రాసౌండ్ తో బిడ్డ లింగం గురించి చెప్పడం అప్పటికి వీలు కాదు. ఈ వారంలో పునరుత్పత్తి వ్యవస్థ అభివృద్ధి ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో ఇతర కణజాలాలు అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. బిడ్డ గుండెలోని ఛాంబర్ విభజనను పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం ఎక్కువగా కొట్టుకుంటుంది. కండరాలు అభివృద్ధి చెందడం ప్రారంభించినందున 9 వారాల పిండం ఇప్పుడు తన అవయవాలను కదిలించగలదు. తొమ్మిది వారాల గర్భవతిగా ఉన్నప్పుడు, బిడ్డ పెద్ద కనురెప్పలు, చిన్న ముక్కు వంటి మరింత కచ్చితమైన ముఖ లక్షణాలు కనిపిస్తాయి. బిడ్డ చెవులు కూడా మరింత స్పష్టంగా కనిపిస్తాయి. చిగుళ్ళు, రుచి చూసే గుణం కూడా బిడ్డ నోటి లోపల అభివృద్ధి చెందుతాయి. కాళ్లు, చేతులు కూడా పొడవు పెరుగుతాయి. బిడ్డ వేళ్లు ఇప్పుడు కొనల వద్ద పొడవుగా, వెడల్పుగా ఉంటాయి. తర్వాత వేలిముద్రలు అభివృద్ధి చెందుతాయి. బిడ్డ ఇప్పటికే కదులుతున్నప్పటికీ, గర్భధారణ తరువాతి కొద్ది రోజుల వరకు నిజంగా ఆ కదలికలను అనుభూతి చెందలేరు.

    ప్రెగ్నెన్సీ 9వ వారంలో, మీ శరీరం (At 9 Weeks of Pregnancy, Your Body)

    ప్రెగ్నెన్సీలో మూడో నెలకు చాలా రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. మొదట కడుపు లోపల ప్లాసెంటా అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. ఈ ప్లాసెంటా పిండానికి పూర్తిగా అభివృద్ధి చెందిన తరువాత అవసరమైన పోషకాలను సరఫరా చేయడానికి బాధ్యత వహిస్తుంది. గర్భాశయంలోనే అన్ని మార్పులు జరుగుతున్నాయని మీరు అనుకోవచ్చు. కానీ హార్మోన్లు శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో, జీవక్రియ మార్పులు కూడా సంభవిస్తాయి. తక్కువ రక్తపోటు, రక్తంలో చక్కెర ఈ మార్పులలో వంటివి ఉంటాయి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: 9వ వారం గర్భం సమయంలో ఏమి తినకూడదు.

    9 వారాల ప్రెగ్నెంట్ బేబీ బంప్ (9 Weeks Pregnancy Baby Bump in Telugu)

    ఈ వారంలో గర్భవతి కావడానికి ముందు ఎలా ఉండే వారో అలాంటి రూపాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ప్రెగ్నెన్సీ 9 వ వారంలో తల్లి కొంత బరువు పెరుగుతారు. దీని వల్ల బిగుతైన దుస్తులు ధరించడం అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మీరు 9 వారాల ప్రెగ్నెంట్ బంప్ కలిగి లేదా కొన్ని సందర్భాల్లో ఎలాంటి బంప్ లేకుండా కూడా ఉండవచ్చు. కానీ నిస్సందేహంగా మీ పొత్తికడుపు కింద దృఢంగా ఉన్నట్లుగా అనుభూతి చెందవచ్చు. ఇది పెరుగుతున్న గర్భాశయం. ఇది త్వరలోనే ఎదుగుతున్న బిడ్డకు వసతి కల్పించడానికి విస్తరిస్తుంది. మీ ప్రెగ్నెన్సీ ప్రారంభంలో కొంత బరువు తగ్గడానికి దారితీసే మార్నింగ్ సిక్ నెస్ ఉన్నప్పటికీ మీరు ఇంకా బరువు పెరుగుతారని గుర్తుంచుకోండి. మార్నింగ్ సిక్ నెస్ కొనసాగితే, బరువు తగ్గుతూ ఉండవచ్చు. మరీ బరువు తగ్గనంత వరకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ మార్పుల గురించి డాక్టర్ తో మాట్లాడితే సహాయంగా ఉంటుంది.

    9 వారాల గర్భం సంకేతాలు (Symptoms of 9 Week Pregnancy in Telugu)

    తొమ్మిది వారాల ప్రెగ్నెన్సీ సమయంలో లక్షణాలు గతంలో చూసిన లక్షాణాలను పోలి ఉంటాయి. అయినప్పటికీ తొమ్మిది వారాల ప్రెగ్నెంట్‎గా ఉన్నప్పుడు, ఈ కింది లక్షణాలలో కొన్నింటిని అనుభవించవచ్చు:

    • ఈ సమయంలో తల్లి చాలా అలసటను అనుభవించవచ్చు. బిడ్డ ఎదుగుదలకు సపోర్ట్‌ చేయడానికి శరీరం చాలా శక్తిని కూడగడుతోంది. దీని వల్ల ప్రతిరోజు చురుకుగా మంచం దిగడం కూడా కష్టంగా మారుతుంది.
    • బ్రెస్ట్‌ ఉబ్బినట్లు, పగిలిపోతున్నట్లు అనిపించవచ్చు. గర్భం ధరించిన 9వ వారం నాటికి, హార్మోన్లు బ్రెస్ట్‌ను పెద్దవిగా, మరింత బాధాకరంగా మారుస్తాయి.
    • హార్మోన్ల హెచ్చుతగ్గులు, మూత్రాశయంపై అదనపు ఒత్తిడి కారణంగా తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి రావడంతో మీరు తరచుగా టాయిలెట్‎కు వెళ్లాల్సిన అవసరం ఉన్నట్లుగా అనిపించవచ్చు.
    • ప్రొజెస్టెరాన్ జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. దీని ఫలితంగా ఉబ్బరం లేదా అజీర్తి కలుగుతుంది.
    • మొదటి ట్రిమ్‎స్టర్‎లో గుండెల్లో మంట ఉండటం కూడా సాధారణం.
    • ముక్కు మూసుకుపోవడం: హార్మోన్లు ఎక్కువ శ్లేష్మం ఉత్పత్తి చేయడానికి కారణమవుతాయని తెలుసుకోవడం ఆశ్చర్యం కలిగించవచ్చు. దీని వల్ల ముక్కు మూసుకోవడం, ముక్కు కారడం జరగవచ్చు.
    • తలనొప్పి అనేది ఈ సమయంలో క్రమం తప్పకుండా సంభవిస్తుంది. ఇది హార్మోన్ల మార్పుల వల్ల కలిగే మరో అవాంఛనీయమైన దుష్పరిణామం.

    తొమ్మిది వారాల ప్రెగ్నెన్సీ సమయంలో అల్ట్రాసౌండ్ అవసరమా? (Does Ultrasound Necessary During 9 Weeks of Pregnancy in Telugu?)

    ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఎక్కువ ప్రమాదం లేకపోతే 8, 12 వారాల ప్రాంతంలో డాక్టర్ మీ మొదటి అల్ట్రాసౌండ్ ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అందువల్ల మొదటి ట్రిమ్‎స్టర్ అల్ట్రాసౌండ్ ప్రస్తుతం జరగవచ్చు. ఎక్టోపిక్ కాకుండా గర్భాశయ గర్భధారణను కలిగి ఉన్నారని నిర్ధారించుకోగలరు- ఇది ట్రాన్స్‎వెజైనల్లీ చేసే అవకాశం ఉంది. అల్ట్రాసౌండ్ మానిటర్‎లో, 9 వారాల ప్రెగ్నెన్సీ బిడ్డ సైజ్ బఠానీ లాగా కనిపించే అవకాశం ఉంది మరియు మీరు హృదయ స్పందనను వినవచ్చు. పుట్టబోయే బిడ్డ బాహ్య జననేంద్రియాలు ఇప్పటికే పెరుగుతున్నప్పటికీ, లింగాన్ని బహిర్గతం చేయడానికి అల్ట్రాసౌండ్ ఇంకా చాలా సమయం ఉంది. అయితే అధిక-ప్రమాదకర గర్భధారణను కలిగి ఉంటే, మరీ ముఖ్యంగా అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ ఉన్న సందర్భాల్లో డాక్టర్ మొదటి ట్రిమ్‎స్టర్ స్క్రీనింగ్‎కు సూచించవచ్చు. మొదటి ట్రిమ్‎స్టర్ స్క్రీనింగ్ సమయంలో అల్ట్రాసౌండ్, రక్త పరీక్షలను కలిపి పొందడం వల్ల ట్రిసోమి 21 వంటి జన్యు పరమైన రుగ్మతల అధిక ప్రమాదాన్ని నివారించవచ్చు. మొదటి ట్రిమ్‎స్టర్‎లో పుట్టబోయే బిడ్డ లింగాన్ని తెలుసుకోవచ్చు, అయితే ఇది పరీక్ష ప్రధాన లక్ష్యం కాకూడదు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: 9 వారాల గర్భధారణలో అల్ట్రాసౌండ్: ఏమి ఊహించాలి మరియు చెడు శకునాలు ఏంటి

    ముగింపు (Conclusion)

    9 వారాల సమయంలో బిడ్డ పరిమాణం సుమారు 1.7 సెం.మీ పొడవు ఉంటుంది. బిడ్డ గుండె అభివృద్ధి చెందుతుంది. 9 వారాల ప్రెగ్నెంట్ సమయంలో బంప్ ఉండకపోవచ్చు, అల్ట్రాసౌండ్ అవసరం అవుతుంది. హోం టెస్ట్ కూడా నిర్వహించవచ్చు.

    Tags:

    9 Weeks Pregnant baby bump in telugu, 9 Weeks Pregnancy symptoms in telugu, 9 Weeks Pregnancy ultrasound report in telugu, Ultrasound requirement during 9 week pregnancy in telugu, 9 Weeks Pregnant baby bump size in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |