Weight Loss
3 November 2023 న నవీకరించబడింది
చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో 25-35 పౌండ్లు (11.5-16 కిలోలు) పెరుగుతారు. కాకపోతే కొంతమంది తల్లులు గర్భధారణకు ముందు ఉండే బరువు మరియు అనంతరం ఆహారపు అలవాట్ల కారణంగా గర్భధారణ సమయంలో కొందరు ఎక్కువ లేదా మరికొందరు తక్కువ పెరుగుతారు. సి-సెక్షన్ కావచ్చు లేదా సాధారణ డెలివరీ కావచ్చు. ప్రసవానంతరం బరువును కోల్పోయే ముందు తల్లులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. సి-సెక్షన్ తర్వాత ప్రసవానంతర బరువు తగ్గడం అనేది మార్గదర్శకత్వంతో మాత్రమే సులభంగా మరియు ప్రభావవంతంగా ఉంటుంది. బరువు తగ్గడానికి ప్రసవానంతర ఆహార ప్రణాళిక అనేది తల్లికి సి-సెక్షన్ తర్వాత ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
అయితే సంక్లిష్టతలను నివారించడానికి ప్రసవానంతర బరువు తగ్గే ప్రక్రియను 6 నుంచి 8 వారాల సి-సెక్షన్ తర్వాత ప్రారంభించడం మంచిది. ప్రసవానంతర బరువు తగ్గించే చిట్కాలు మరియు ఆహార ప్రణాళికల గురించి తెలుసుకోవడానికి ఈ బ్లాగును చదవండి.
తల్లులకు శుభవార్త : క్రమం తప్పకుండా బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం బిడ్డకు అవసరమైన పోషణను అందించడమే కాకుండా తల్లి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇది అద్భుతం కదా? కేవలం తల్లిపాలు ఇవ్వడం ద్వారా ఆమె రోజూ 500 కేలరీలు తగ్గగలదు.
ప్రసవానంతరం బరువు తగ్గడానికి ఆహార ప్రణాళికతో పాటు వ్యాయామ దినచర్య ప్రభావవంతమైన కలయిక. మీ వ్యాయామ దినచర్యలో సున్నితమైన వ్యాయామం మరియు యోగాసనాలను చేర్చండి. అయితే సి-సెక్షన్ ప్రారంభ వారాల్లో తీవ్రమైన వ్యాయామం జోలికి వెళ్లకండి. ఎందుకంటే అది పొత్తి కడుపుపై ఒత్తిడిని కలిగిస్తుంది.
తన ప్లేట్‌లో ఉన్నదంతా ఖాళీ చేయడం మానవ ధోరణి. దానికి బదులు శరీరం పోషకాలు, ద్రవాన్ని గ్రహించడంలో సహాయపడటానికి చిన్న భాగాలుగా తినండి. ఇది మీ ప్రసవానంతర బరువు తగ్గే ప్రక్రియలో సహాయపడుతుంది. మూడు సార్లు తినే భోజనాన్ని ఐదు నుంచి ఆరు పూర్తి పోషకాహారం నిండిన చిన్న భాగాలుగా విభజించండి.
తల్లులైన కొత్తలో అందరూ తరచుగా తమ పిల్లలతో 24/7 బిజీగా ఉంటారు. ఇది కొన్నిసార్లు వారికి నిద్రను దూరం చేస్తుంది. కానీ నిద్ర లేమి ఒత్తిడి మరియు బలహీనమైన జీవక్రియతో ముడిపడి ఉంటుంది.ఇది అతిగా తినడం మరియు త్రాగడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ప్రసవానంతర బరువు తగ్గించే ప్రక్రియకు ఆటంకం కలిగించవచ్చు.
శుభవార్త ఏమిటంటే.. కొత్త తల్లులు తమ అదనపు బరువును తగ్గించుకోవడానికి వారికి డైట్ చార్ట్ అవసరం లేదు. వారు చేయవలసిందల్లా వారి ప్రసవానంతర బరువు తగ్గించే ప్రయాణంలో వారి రెగ్యులర్ డైట్ ప్రభావవంతంగా ఉండటానికి కొన్ని విషయాలను చేర్చడం లేదా తీసేయడం.
1. తృణధాన్యాలు: సి-సెక్షన్ తర్వాత తినడానికి అవసరమైన పోషకాలు మరియు విటమిన్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాలు తృణధాన్యాలు. ఇది శక్తి స్థాయిలను మరియు తల్లి పాల సరఫరాను పెంచుతుంది. గోధుమలు మరియు మిల్లెట్లు, బ్రౌన్ రైస్ మరియు వోట్స్ వంటి తృణధాన్యాలు అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం కోసం మంచి ఎంపికలు.
2. పాల ఉత్పత్తులు: స్కిమ్డ్ మిల్క్, తక్కువ కొవ్వు ఉన్న పెరుగు మరియు జున్ను వంటి పాల ఉత్పత్తులు తల్లికి అవసరమైన మొత్తంలో ప్రోటీన్, కాల్షియం మరియు విటమిన్లు B మరియు D ని అందిస్తాయి. అంతేకాకుండా, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు తల్లి ఎముకలు మరియు దంతాలను బలపరుస్తాయి. అలాగే తల్లి పాల ద్వారా తన బిడ్డ ఎదుగుదలను కూడా ప్రేరేపిస్తాయి.
3. పండ్లు మరియు కూరగాయలు: రసం ఉన్న పండ్లు మరియు ఆకు కూరలు కొత్త తల్లుల తల్లిపాలు ప్రసవానంతర బరువు తగ్గించే ఆహారంలో భాగంగా ఉండాలి. ఎందుకంటే అవి విటమిన్లు, ఇనుము మరియు కాల్షియం వంటి పోషకాలను అందిస్తాయి. అలాగే ప్రసవానంతర బరువు తగ్గడాన్ని ప్రేరేపిస్తాయి.
4. భారతీయ మసాలా దినుసులు: బరువు తగ్గడానికి ప్రసవానంతర ఆహార ప్రణాళికలో భారతీయ మసాలా దినుసులు చేర్చాలి. ఇవి జీవక్రియను మెరుగుపరచడం మరియు శరీర కొవ్వును త్వరగా కరిగించడంలో సహాయపడటం వంటి ఆరోగ్యకరమైన లక్షణాలతో ఉంటాయి. వాము, జీలకర్ర (జీరా), పసుపు మరియు ఇంగువ (హింగ్) ఈ సుగంధ ద్రవ్యాల జాబితాలో ఉంటాయి.
5. ఫైబర్స్: కొత్త తల్లులు మలబద్ధకానికి గురవుతారు. ఇది సి-సెక్షన్ కోతలను ప్రభావితం చేస్తుంది. మలబద్ధకంతో మిగులు పదార్థంలో కొత్త తల్లులకు సహాయపడే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బెర్రీలు, నారింజ, బేరి, ఆపిల్, కివీస్, మామిడి మరియు ప్రూనే వంటి ఫైబర్ అధికంగా ఉండే పండ్లను మీ భోజనంలో చేర్చండి. మరియు బరువు తగ్గడానికి మీ ప్రసవానంతర ఆహార ప్రణాళికలో బీట్‌రూట్, కాలీఫ్లవర్, క్యారెట్, బెల్ పెప్పర్స్ మరియు పచ్చి బఠానీలు వంటి కూరగాయలను కూడా చేర్చండి.
6. పానీయాలు: తక్కువ కొవ్వు పాలు, కొబ్బరి నీరు, హెర్బల్ టీలు మరియు మజ్జిగ వంటి ద్రవాలను తాగడం వల్ల కొత్త తల్లులకు మలబద్ధకం విషయంలో సహాయపడతాయి. అదనంగా, ఈ ద్రవాలు శస్త్రచికిత్స అనంతర రికవరీ మరియు ప్రసవానంతర బరువు తగ్గడాన్ని కూడా సులభతరం చేస్తాయి.
1. ఆల్కహాల్ మరియు ధూమపానం: మద్యం తాగడం మరియు సిగరెట్లు తాగడం వల్ల తల్లి పాల సరఫరాపై ప్రభావం చూపుతుంది మరియు తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది.
2. షుగర్ ఫుడ్స్: షుగర్ ఉన్న ఫుడ్స్ లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ప్రసవానంతర బరువు తగ్గించే ప్రక్రియలో మీకు ఇబ్బంది కలుగుతుంది. బదులుగా మీరు బరువు పెరిగేలా చేస్తుంది. చక్కెర ఆహారాన్ని రసం ఉన్న పండ్లు మరియు డ్రై ఫ్రూట్‌లతో భర్తీ చేయండి.
3. జంక్ లేదా ఫ్రైడ్ ఫుడ్ : సి-సెక్షన్ తర్వాత, కొత్త తల్లులకు పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. జంక్ మరియు ఫ్రైడ్ ఫుడ్లు అధిక కేలరీలు, కొవ్వు మరియు ఉప్పును కలిగి ఉంటాయి. ఇవి మీ ప్రసవానంతర బరువు తగ్గించే ప్రక్రియను ప్రభావితం చేస్తాయి.
4. కార్బొనేటెడ్ డ్రింక్స్: కార్బోనేటేడ్ డ్రింక్స్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాఫీ ఎక్కువగా తాగడం మానుకోండి. వీటిని తీసుకోవడం వల్ల తల్లి ఆరోగ్యం మరియు ఆమె బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుంది.
ప్రసవానంతర బరువు పెరగడం సాధారణం. ఈ విషయం లో సిగ్గు పడాల్సిన అవసరం ఏమి లేదు. ప్రసవానంతర బరువు తగ్గించే చిట్కాలు మరియు ఆహార ప్రణాళికలను అనుసరించడం ద్వారా, కొత్త తల్లులు తమ "కొవ్వుతో నిండిన వారి పొట్టని చదునైన ఫిట్ గా ఉన్న కడుపు గా మార్చుకోవచ్చు. కాకపోతే, ఓపిక పట్టండి. మరియు బరువు తగ్గడానికి తొందరపడకండి. ఎందుకంటే సి-సెక్షన్ తర్వాత శరీరం కోలుకోవడానికి సమయం కావాలి.
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |