Pregnancy
3 November 2023 న నవీకరించబడింది
బిడ్డను కనడం అనేది సంతోషకరమైన సమయం. కానీ ఇది గొప్ప నిద్ర లేమి సమయం కూడా కావచ్చు. కొత్తగా తల్లులైన వారిలో చాలా మంది ప్రసవానంతర నిద్రలేమి అనేది చాలా మందికి ఉండే సమస్య. ఎవరైనా ఆడవాళ్ళు తగినంత విశ్రాంతి తీసుకోలేక ఇబ్బందిపడుతుంటే.. అటువంటి సమస్య వారిదొక్కరిదే కాదు. ఈ బ్లాగ్ పోస్ట్ ప్రసవానంతర నిద్రలేమి నుండి ఉపశమనం కోసం లక్షణాలు, చికిత్సలు, చిట్కాలను తెలియజేస్తుంది.
ప్రసవానంతర నిద్రలేమి అనేది ప్రసవం తర్వాత కొన్ని వారాలలో నెలలలో ఏర్పడే అనారోగ్యం. ఇది నిద్రలేమి, నిద్రపోవడానికి ఇబ్బందిగా ఉండటం, పగటిపూట అలసటగా ఉండటం, ఇంకా అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది.
సవానంతర నిద్రలేమికి అనేక కారణాలు ఉండవచ్చు. దీనివల్ల చికిత్స చేయడానికే ఇబ్బంది కలిగే పరిస్థితిని కలిగిస్తుంది. వాటిలోని అత్యంత సాధారణ కారణాలలో కొన్ని:
ప్రసవానంతర నిద్రలేమితో ఎవరైనా బాధపడుతున్నట్లయితే. దానికి కారణాలు, చికిత్సల గురించి డాక్టర్‌తో మాట్లాడటం చాలా ముఖ్యం.
కొత్తగా తల్లులైన వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత మొదటి కొన్ని వారాలలో కొద్దిపాటి నిద్రలేమి ఉండటం సర్వసాధారణం. కానీ కొందరికి ఇది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. ప్రసవానంతర నిద్రలేమి యొక్క కొన్ని లక్షణాలు, కొన్ని రకాల చికిత్సలు, ఉపశమన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
ప్రసవానంతర నిద్రలేమి యొక్క అత్యంత సాధారణ లక్షణం నిద్రపోవడానికి కష్టంగా ఉండటం. కొత్తగా పిల్లలు పుట్టినవారికి ఆందోళన, హార్మోన్ల మార్పులు, సాధారణ నిద్ర దినచర్యకు ఆటంకాలు కలగటం వంటి అనేక కారణాల వల్ల ఇది సంభవించవచ్చు. ఒక కొత్తగా తల్లిగా మారిన స్త్రీకి ఎలాగోలా నిద్రలోకి జారుకున్న తర్వాత, తరచుగా వారు రాత్రంతా మేల్కొంటారు. ఇది ఆకలి వల్ల కావచ్చు, రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించడం వల్ల కావచ్చు లేదా ఎక్కువసేపు నిద్రపోయే అలవాటు లేకపోవడం వల్ల కావచ్చు.
ప్రసవానంతర నిద్రలేమి ఉంటే.. ఆమెకు పగటిపూట కూడా అలసిపోయినట్లు అనిపించవచ్చు. దీనివల్ల పనులపై దృష్టి పెట్టడం లేదా శిశువుతో సంభాషించడం కష్టతరం అవుతుంది. ఉదయం మంచం నుండి లేవడానికి కూడా ఇబ్బంది పడవచ్చు లేదా దాని నుండి బయటపడటానికి పగటిపూట నిద్రపోవాలని అనిపించవచ్చు.
కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) అనేది ఒక రకమైన మానసిక చికిత్స. ఇది ఎవరిలోనైనా ప్రతికూల ఆలోచన, ప్రవర్తన విధానాలను మార్చడంలో సహాయపడుతుంది. CBT అనేది నిద్రలేమితో సహా అనేక మానసిక ఆరోగ్య పరిస్థితులకు సమర్థవంతమైన చికిత్స.
ప్రసవానంతర నిద్రలేమి కోసం తెరపిస్ట్ CBT చేసే సమయంలో.. నిద్రపోకుండా చేసే ఆలోచనలు, ప్రవర్తనలను గుర్తించి, మార్చడంలో సహాయం చేస్తాడు. CBT యొక్క లక్ష్యం ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను అలవాటు చేయడం, నిద్ర నాణ్యతను మెరుగుపరచడం.
CBTలో సాధారణంగా నిద్ర, విశ్రాంతి తీసుకొనేలా శిక్షణ, అభిజ్ఞా పునర్నిర్మాణం గురించిన విద్య ఉంటాయి. స్లీప్ ఎడ్యుకేషన్‌లో నిద్ర వల్ల కలిగే లాభాలు, సరైన నిద్ర అలవాట్ల యొక్క ప్రాముఖ్యత, సాధారణ నిద్ర సమస్యల గురించిన సమాచారం ఉండవచ్చు. రిలాక్సేషన్ శిక్షణలో కండరాలకు విశ్రాంతినివ్వడం లేదా శ్వాస నియంత్రణ వంటి పద్ధతులు ఉండవచ్చు.
ప్రసవానంతర నిద్రలేమి నుండి ఉపశమనం కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి:
1. నిద్రకు ఒక షెడ్యూల్ అలవాటు చేసుకోండి. వారాంతాల్లో కూడా ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకుని, మేల్కొనడానికి ప్రయత్నించండి. ఈ అలవాటు శరీరానికి సహజంగా నిద్రపోవడం మేల్కొనడం సరిగ్గా అలవాటయ్యేలా సహాయపడుతుంది.
2. నిద్రకు ప్రశాంతమైన దినచర్యను తయారు చేసుకోండి. నిద్రించడానికి కొన్ని నిమిషాల ముందు, విశ్రాంతి కోసం వ్యాయామాలు చేయడం, విశ్రాంతి తీసుకోవడం లేదా పుస్తకాన్ని చదవడం మీ మనస్సును నిద్రకు సిద్ధం చేయడంలో సహాయపడుతుంది.
3. పడుకునే ముందు స్క్రీన్ చూడటం తగ్గించండి. నిద్రపోయే సమయాల్లో ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం మానుకోండి. ఎందుకంటే అవి విడుదల చేసే నీలి కాంతి సహజ సిర్కాడియన్ రిథమ్‌కు అంతరాయం కలిగించి నిద్రపోవడం కష్టతరం చేస్తుంది.
4. పగటిపూట వ్యాయామం చేయండి. ఒత్తిడి స్థాయిలను తగ్గించడం, మెరుగైన ఆరోగ్యాన్ని అందించడం ద్వారా నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. నిద్రవేళ దగ్గర పడుతున్నప్పుడు వ్యాయామం చేయడం మానుకోండి. ఎందుకంటే దీనివల్ల వ్యతిరేక ప్రభావం ఉంటుంది.
5. సప్లిమెంట్ తీసుకోవడం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటికీ తగినంత విశ్రాంతి తీసుకోవడానికి ఇబ్బందిపడుతుంటే.. మెలటోనిన్ వంటి సహజ సప్లిమెంట్ తీసుకోవడం గురించి వారి డాక్టర్‌తో మాట్లాడటం రాత్రిపూట నిద్రరావడానికి సహాయపడుతుంది.
ఈ కథనాన్ని చదివిన తర్వాత, ప్రసవానంతర నిద్రలేమికి సంబంధించిన లక్షణాలు, చికిత్సలు, ఉపశమనాలకు సంబంధించిన చిట్కాల గురించి మీకు తెలిసి ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత మీరు నిద్రలేమితో పోరాడుతుంటే.. మీరొక్కరే ఈ సమస్యతో బాధపడటం లేదని, వీటిలో కొన్ని విషయాలు సహాయపడతాయని తెలుసుకోండి. మీరు ఏమి చేయచ్చో డాక్టర్‌తో మాట్లాడాలని నిర్ధారించుకోండి, మీకు ఏది పనిచేస్తుందో చూడటానికి ఈ కథనంలోని కొన్ని చిట్కాలను ప్రయత్నించండి.
కొత్తగా తల్లులైనవారు, పసిపిల్లలకు సంబంధించిన మరిన్ని విద్యా మార్గదర్శకాల కోసం మైలో ఫ్యామిలీని సందర్శించండి.
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |