Updated on 3 November 2023
పిల్లల కోసం చాలా దుస్తులు కొని వాటిని అరుదుగా ఉపయోగించడం లేదా అస్సలు ఉపయోగించని వారిని మనం చూస్తూనే ఉంటాం. చాలావరకు మనం కూడా అలాంటి తప్పులే చేస్తుంటాం. మీ బిడ్డకు, నవజాత శిశువుకు లేదా ఇంకా పుట్టనివారికి షాపింగ్ చేయడం అంత సులువైన విషయమేమీ కాదు. ఉత్సాహంతో, అయోమయంతో మనం అనేక తప్పులు చేస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ మేం వివరించే చెక్‌లిస్ట్‌తో మీరు చక్కగా షాపింగ్ చేయొచ్చు. మీ విలువైన డబ్బును చాలావరకు ఆదా చేయొచ్చు.
ఇంటికి నవజాత శిశువు రాగానే చేయాల్సినవి చాలా ఉంటాయి. మీ శిశువుకు కావాల్సినవన్నీ సేకరించడం, కొనడం కష్టం. అందుకే నవజాత శిశువుకు సంబంధించిన చెక్‌లిస్ట్ చూస్తే వారికి ఎప్పుడెప్పుడు ఏమేం అవసరమో తెలిసిపోతుంది. ఈ లిస్ట్‌లో నర్సరీ, దుస్తులు, ఫీడింగ్, డైపరింగ్, స్నానం సమయంలో కావాల్సినవన్నీ ఉంటాయి.
1. క్రిబ్, క్రిబ్ మ్యాట్రెస్: నవజాత శిశువులకు అవసరమైన వాటిలో క్రిబ్ టాప్‌లో ఉంటుంది. మీ బిడ్డ నిద్రపోవడానికి మంచి క్రిబ్ అవసరం. ఎందుకంటే మొదట్లో నవజాత శిశువులు రోజులో సుమారు 16 గంటలు లేదా అంతకన్నా ఎక్కువ నిద్రపోతుంటారు. క్రిబ్ ఖరీదు కాస్త ఎక్కువగా ఉంటుంది. మంచి స్టైల్, కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ ఉన్న క్రిబ్ తీసుకుంటే మీరు చాలా ఏళ్లు వాడుకోవచ్చు. పిల్లలు కాస్త పెద్దైన తర్వాత కూడా క్రిబ్‌లోనే పడుకోవచ్చు. కొత్త క్రిబ్ తీసుకోవడమే మంచిది. ఎందుకంటే అన్ని రకాల సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించినవి ఉంటాయి. క్రిబ్ ఒక్కటే కాదు, దృఢమైన మ్యాట్రెస్ తీసుకోవడం కూడా అవసరం. ఎందుకంటే మీ నవజాత శిశువు నిద్రపోవడానికి ఇదే సురక్షితమైన చోటు.
2. బెడ్డింగ్: వాటర్‌ప్రూఫ్ మ్యాట్రెస్ కవర్, ఫిట్టెడ్ షీట్స్‌తో క్రిబ్ మ్యాట్రెస్‌ని చక్కగా తీర్చిదిద్దొచ్చు. క్రిబ్ నిండుగా ఉండకుండా జాగ్రత్తపడండి. ఎందుకంటే మీ శిశువుకు ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది ఎదురవొచ్చు. సడెన్ ఇన్‌ఫాంట్ డెత్ సిండ్రోమ్ రిస్క్‌ను తగ్గించవచ్చు.
3. నైట్ లైట్: రాత్రి సమయంలో మధ్యమధ్యలో మీరు నిద్రలేస్తూ పిల్లలకు పాలు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లల నిద్రకు భంగం కలగకుండా నైట్ లైట్ ఉండేలా చూసుకోండి. బ్రైట్ లైట్ అవసరం లేకుండా మీరు గదిలో తిరగడానికి వీలుండేలా లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలు పెద్దయ్యాక కూడా ఇదే లైటింగ్ అలవాటవుతుంది.
4. దుస్తుల స్టోరేజ్: మీ నవజాత శిశువు దుస్తుల్ని ఒకే చోట పెట్టడానికి స్థలం కావాలి. ఛేంజింగ్ టేబుల్స్‌లో వచ్చే డ్రాయర్స్, షెల్ఫులు సరిపోకపోవచ్చు. అందుకే బాస్కెట్స్, టబ్స్, స్టోరేజ్ బాక్సుల్లో ఏదైనా తీసుకొని దుస్తుల్ని అందులో స్టోర్ చేయొచ్చు.
5. రాకింగ్ చైర్: కాంఫీ చైర్ అంటే సౌకర్యంగా ఉండే కుర్చీని తీసుకోవాలి. పిల్లలకు పాలు ఇవ్వడం, బెడ్‌టైమ్ స్టోరీ చెప్పడం లాంటివాటికి ఇది ఉపయోగపడుతుంది. రాత్రి సమయంలో పిల్లలకు పాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీరు ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం ఉండదు. ఇక ఆ ఛైర్‌లో ఉండే రాకింగ్ మోషన్‌తో మీరు, మీ శిశువు సేదతీరవచ్చు.
6. ప్యాసిఫయర్: పిల్లలు తమను తాము శాంతపర్చుకోవడం కోసం ప్యాసిఫయర్‌ను పీల్చాలనుకుంటారు. వీటిని కొన్ని తీసుకోవచ్చు. ప్యాసిఫయర్స్‌లో వేర్వేరు సైజ్‌లు ఉంటాయి. మీ నవజాత శిశువుకు ప్యాసిఫయర్ తీసుకోవాలనుకుంటే తయారీ గైడ్‌లైన్స్ ఓసారి చదివి సెలెక్ట్ చేయాలి.
7. టాయ్ బాస్కెట్: శిశువు కోసం ఎన్నో టాయ్స్ కొంటూ ఉంటాం. కానీ అవి ఎక్కడెక్కడో పడిపోతుంటాయి. వాటన్నింటినీ ఓ బాస్కెట్‌లో భద్రపరిస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు, కావాల్సిన టాయ్స్ బయటకు తీసుకోవచ్చు. మీ ఇంట్లో షెల్ఫులు ఎక్కువగా ఉంటే టాయ్స్‌ని అక్కడే భద్రపర్చవచ్చు.
8. బేబీ స్వింగ్: ఊయల ఊగుతుంటే మీ పిల్లలు ప్రశాంతంగా ఉంటారు. బౌన్సర్‌లా కాకుండా, మీ శిశువు ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేకుండా ఊయల ఊగుతూ ఉంటుంది. ఊపడం లేదా వైబ్రేషన్ సెట్టింగ్ ఉపయోగించవచ్చు. మీ నవజాత శిశువు ఎత్తు, బరువు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఊయల సెలెక్ట్ చేయాలి. ఇలాంటి ఊయలకు పైన కొన్ని టాయ్స్ ఉంటాయి. మ్యూజిక్ లేదా సౌండ్ వస్తుంటాయి.
9. బేబీ బౌన్సర్: బౌన్సర్ కూడా ఊయలలా ఊగుతూ ఉంటుంది. అయితే ఇందుకోసం మీ శిశువు కాళ్లు కదిలించాల్సి ఉంటుంది. పిల్లలు సురక్షితంగా ఆడుకోవడానికి, ఆనందించడానికి బౌన్సర్ ఉపయోగపడుతుంది. బౌన్సర్‌లో కూడా బరువుకు సంబంధించి పరిమితులు ఉంటాయి. బౌన్సర్ కొనేప్పుడు కూడా ఈ అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి.
10. పోర్టబుల్ ప్లే యార్డ్: మీ నవజాత శిశువు సురక్షితంగా, ఒకచోట ఆడుకోవడానికి, నిద్రపోవడానికి పోర్టబుల్ ప్లే యార్డ్ ఉపయోగపడుతుంది. దీన్ని మీరు ఇంట్లో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.
11. టాయ్స్: పిల్లలకు వారి వయస్సుకు కావాల్సిన టాయ్స్ అందుబాటులో ఉంటాయి. మెత్తగా ఉండేవి, శబ్దం వచ్చేవి, ముందుకు లాగేవి... ఇలా అనేక ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో కొన్నింటిని తీసుకోవచ్చు. అనేక ఫీచర్స్‌తో లభించే ఈ టాయ్స్ మీ పిల్లల ఎదుగుదలకు కూడా ఉపయోగపడతాయి.
12. ప్లేమ్యాట్: పిల్లలకు టమ్మీ టైమ్‌తో అనేక ప్రయోజనాలు ఉంటాయి. సన్నగా, మెత్తగా ఉండే ప్లేమ్యాట్ తీసుకొని, దానిపై కొన్ని నిమిషాలపాటు ఎంజాయ్ చేసే అవకాశం వారికి ఇవ్వండి.
13. బర్ప్ క్లోత్స్: పిల్లలకు బర్పింగ్ చేసినప్పుడు, నోట్లోంచి ఏదైనా ఉమ్మేసినప్పుడు దుస్తులు పాడవకుండా బర్ప్ క్లోత్స్ ఉపయోగపడతాయి. ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి సులువుగా మేనేజ్ చేయొచ్చు.
14. నర్సింగ్ కవర్: పిల్లలకు తల్లిపాలు ఇచ్చేప్పుడు నర్సింగ్ కవర్ ఉపయోగపడుతుంది. దీన్ని తల్లి తన మెడచుట్టూ కట్టుకోవచ్చు. అయితే బ్లాంకెట్‌ను కూడా ఇలాగే వాడుకోవచ్చు అనుకుంటారు కానీ, మెడచుట్టూ జారిపోకుండా కట్టుకునే వీలుండదు.
15. రిసీవింగ్ బ్లాంకెట్: రిసీవింగ్ బ్లాంకెట్స్ సన్నగా, జతలుగా వస్తాయి. వీటిని నర్సింగ్ కవర్స్, బర్పింగ్ క్లోత్స్‌లా ఉపయోగించవచ్చు. మీ శిశువును గట్టిగా చుట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
16. నర్సింగ్ పిల్లోస్: పిల్లలకు మరింత సౌకర్యాన్ని అందించడానికి, U ఆకారంలో ఉండే మెత్తటి పిల్లోస్ తీసుకోవచ్చు. మీ చేతులు కాకుండా మీ పిల్లలకు ఎక్కడైనా విశ్రాంతి ఇవ్వడానికి ఇవి ఉపయోగపడతాయి.
17. బిబ్స్: పాలు తాగించేప్పుడు, బేబీ ఫుడ్ తినిపించేప్పుడు మీ పిల్లల దుస్తులు పాడుకాకుండా బిబ్స్ రక్షణగా నిలుస్తాయి.
18. బాటిల్స్, నిప్పల్స్: నవజాత శిశువు చెక్‌లిస్ట్‌లో బేబీ బాటిల్స్ తప్పనిసరిగా ఉండాలి. మీరు తల్లి పాలు ఇస్తున్నా లేదా ఫార్ములా ఫీడ్ ఇస్తున్నా ఇవి కావాల్సిందే. ఇవి చాలా వెరైటీల్లో వస్తాయి. గ్లాస్, లేదా ప్లాస్టిక్ ఆప్షన్స్‌లో ఉపయోగించవచ్చు. బాటిల్ కొనేముందు నిప్పల్ షేప్, సైజ్ పరిశీలించాలి.
19. బ్రెస్ట్ పంప్: అవసరం అయినప్పుడు మీరు మ్యాన్యువల్ పంప్ లేదా ఎలక్ట్రిక్ పంప్ ఉపయోగించవచ్చు. రెండు రొమ్ముల్ని ఒకేసారి పంప్ చేసేవి కూడా ఉంటాయి.
20. ఫార్ములా: మార్కెట్లో అనేక బ్రాండ్ల ఫార్ములా లభిస్తుంది. ఇవి వాడే ముందు పిల్లల డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి.
21. మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్: రొమ్ము పాలను స్టోర్ చేయడానికి ఈ బ్యాగ్స్ ఉపయోగపడతాయి. ఇవన్నీ ఒకేసారి వాడి పారేసేవి. పాలను స్టోర్ చేయడానికి బాటిల్స్ వాడకుండా ఈ బ్యాగ్స్ వాడుకోవచ్చు.
22. బాటిల్ బ్రష్: బాటిల్ లోపల పూర్తిగా శుభ్రం చేయడానికి బాటిల్ బ్రష్ ఉపయోగపడుతుంది.
23. బాటిల్ స్టెరిలైజర్: బాటిల్స్, నిప్పల్స్‌ని శుభ్రంగా ఉంచడానికి, మీరు స్టెరిలైజర్ వాడుకోవచ్చు.
24. ఛేంజింగ్ టేబుల్: పిల్లల డైపర్ మార్చడానికి మీకు సురక్షితమైన స్థలం కావాలి. ఈ టేబుల్‌లో డ్రాయర్స్, షెల్ఫులు ఉంటాయి. డైపర్స్, వైప్స్, వాడాల్సిన దుస్తులన్నీ వీటిలో స్టోర్ చేసుకుంటే అందుబాటులో ఉంటాయి. బకిల్ ఉన్న ఛేంజింగ్ టేబుల్ తీసుకుంటే మీ పిల్లలు అటూఇటూ తిరగకుండా, దొర్లకుండా, జాగ్రత్త పడవచ్చు.
25. ఛేంజింగ్ ప్యాడ్: ఛేంజింగ్ ప్యాడ్స్ మీ పిల్లలకు సౌకర్యంగా ఉంటాయి. ఛేంజింగ్ టేబుల్‌ను శుభ్రంగా ఉంచుతాయి.
26. డైపర్స్: పిల్లలకు చాలా డైపర్స్ అవసరం. వారానికి 59 డైపర్స్ వాడతారని అంచనా. ఈ లెక్కను దృష్టిలో పెట్టుకొని నెలకు కావాల్సిన డైపర్స్ ఒకేసారి తీసుకుంటే చవకగా కొనొచ్చు. అలాగని ఎక్కువ డైపర్స్ కొంటే సైజ్ సరిపోకపోవచ్చు. అందుకే సైజ్ దృష్టిలో పెట్టుకొని డైపర్స్ కొనాలి.
27. వైప్స్: మీ శిశువు డైపర్ ఏరియాను శుభ్రం చేయడానికి వైప్స్ అవసరం. అనేక బ్రాండ్స్, అనేక వెరైటీల్లో వైప్స్ తయారు చేస్తుంటాయి. వాటిలో మీకు నచ్చినవి సెలెక్ట్ చేయొచ్చు.
28. వాష్‌క్లోత్స్: మీ పిల్లల డైపర్ ఏరియాను శుభ్రం చేయడానికి వాష్‌క్లోత్ ఉపయోగించవచ్చు. వెచ్చని నీళ్లల్లో వాష్‌క్లోత్ ముంచి వాడుకోవచ్చు. పిల్లల స్నానం సమయంలో కూడా వాష్‌క్లోత్ వాడుకోవచ్చు.
29. డైపర్ ర్యాష్ క్రీమ్: డైపర్స్ ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి పిల్లలకు డైపర్ ర్యాషెస్ రావడం మామూలే. మంచి క్రీమ్ కోసం వైద్యుల సలహా తీసుకోవచ్చు.
30. స్వాడిల్ బ్లాంకెట్: మొదటికొన్ని వారాలపాటు మీ శిశువును గట్టిగా చుట్టి ఎత్తుకోవాల్సి ఉంటుంది. అందుకోసం స్వాడిల్ బ్లాంకెట్ ఉపయోగపడుతుంది. ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సులువుగా వాడుకునేది ఎంచుకోవాలి.
31. పైజామా లేదా స్లీపింగ్ సాక్స్: మీ నవజాత శిశువు ఎక్కువ సమయం నిద్రపోతుంటారు కాబట్టి, వారికి స్లీప్‌వేర్ తప్పకుండా అవసరం. స్లీపింగ్ సాక్స్, పైజామా లాంటి స్లీప్‌వేర్ తీసుకోవచ్చు.
32. వన్‌పీస్ వన్సీస్: వన్‌పీస్ వన్సీస్‌లో పలు రకాలు ఉంటాయి. డైపర్ సులువుగా మార్చడానికి వీలుగా ఉండేవి తీసుకోవాలి. వాతావరణాన్ని బట్టి లాంగ్ స్లీవ్ లేదా షార్ట్ స్లీవ్ ఎంచుకోవచ్చు.
33. లెగ్గింగ్స్ లేదా స్ట్రెచీ ప్యాంట్స్: పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు లెగ్గింగ్స్ లేదా స్టెచీ ప్యాంట్స్ చాలా ఉపయోగపడతాయి.
34. స్వెటర్ లేదా జాకెట్: పిల్లల్ని వెచ్చగా ఉంచేందుకు స్వెటర్ లేదా జాకెట్ అవసరం. పుల్‌ఓవర్ స్వెటర్స్‌తో పోలిస్తే కార్డిగన్స్, జాకెట్స్‌ని వేయడం, విప్పడం చాలా సులువు.
35. సాక్స్ లేదా బూటీస్: మీ శిశువుకు సాక్స్, బూటీస్ చాలావరకు అవసరం ఉంటాయి.
36. కట్టడానికి వీలుగా ఉండే హ్యాట్ లేదా క్యాప్: వాతావరణం చల్లగా ఉన్నట్టైతే మీ నవజాత శిశువును వెచ్చగా ఉంచడానికి హ్యాట్ లేదా క్యాప్ అవసరం.
37. స్నోసూట్: ఇక చలికాలంలో స్నోసూట్ కూడా అవసరమే. మిటెన్స్‌తో ఉన్న స్నోసూట్స్ కూడా ఉంటాయి.
38. మిటెన్స్: మీ పిల్లల చేతుల్ని వెచ్చగా ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయి.
నవజాత శిశువు కోసం షాపింగ్ చేయడం తల్లిదండ్రులకు ఆనందకరమైన అనుభవం. కాబట్టి షాపింగ్‌ను మరింత ఎంజాయ్ చేసేందుకు ప్రయత్నించండి. మీ పిల్లలకు దుస్తులు, కావాల్సిన ఇతర వస్తువుల్ని కొనేప్పుడు కొన్ని అంశాలు గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడు షాపింగ్ చేయాలనుకున్నా, అవసరమైన వస్తువుల జాబితా గురించి తెలుసుకోండి. ఇవి కాకుండా ఖరీదైన ఇతర వస్తువులు కొనడం మీ ఇష్టం. మీకు పెద్దగా అవసరంలేనివి కొనకుండా ఉండొచ్చు. లేదా మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల దగ్గర ఉంటే అరువుగా తీసుకోవచ్చు.
Tags:
Shopping for baby in telugu, baby shopping in telugu, baby essentials shopping in telugu, baby shopping check list in telugu, baby needs in telugu.
Yes
No
Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips
গর্ভাবস্থায় আলুবোখরা: উপকারিতা ও ঝুঁকি | Prunes During Pregnancy: Benefits & Risks in Bengali
গর্ভাবস্থায় হিং | ঝুঁকি, সুবিধা এবং অন্যান্য চিকিৎসা | Hing During Pregnancy | Risks, Benefits & Other Treatments in Bengali
স্তনের উপর সাদা দাগ: লক্ষণ, কারণ এবং চিকিৎসা | White Spots on Nipple: Causes, Symptoms, and Treatments in Bengali
গর্ভাবস্থায় পোহা: উপকারিতা, ধরণ এবং রেসিপি | Poha During Pregnancy: Benefits, Types & Recipes in Bengali
গর্ভাবস্থায় মাছ: উপকারিতা এবং ঝুঁকি | Fish In Pregnancy: Benefits and Risks in Bengali
গর্ভাবস্থায় রেড ওয়াইন: পার্শ্ব প্রতিক্রিয়া এবং নির্দেশিকা | Red Wine During Pregnancy: Side Effects & Guidelines in Bengali
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |