Updated on 16 August 2023
తల్లి కావాలని ప్రయత్నిస్తున్న ఎవరికైనా, వంధ్యత్వం అవరోధంగా మారి వారిని కుంగదీయవచ్చు. మీ బిడ్డను కనే అవకాశాలను పెంచడానికి, మీ ఆహారంలో సప్లిమెంట్లను, ఇంకా మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రత్యేకంగా సంతానోత్పత్తి సప్లిమెంట్లను జోడించడం ఒక సరళమైన మరియు నాన్ ఇన్వాసివ్ మార్గం.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావం? దీని అర్థం ఏమిటి? మీరు వైద్యుడిని సంప్రదించాలా
అవి స్త్రీలు మరియు పురుషులలో సంతానోత్పత్తి స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడే సప్లిమెంట్లు లేదా వైద్య ఉత్పత్తులు. ఈ ఉత్పత్తులు పునరుత్పత్తి ప్రక్రియను మెరుగుపర్చడానికి సహాయపడేందుకు అమైనో ఆమ్లాలతో పాటు అవసరమైన విటమిన్లు మరియు మినరల్స్ ను కలిగి ఉంటాయి.
విటమిన్లు స్త్రీ ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ కింద చెప్పబడిన విధులు నిర్వహించేందుకు ముఖ్యమైనవి:
అండం నాణ్యత
•రుతుస్రావం
• ఓవ్యులేషన్ (అండోత్సర్గం)
• థైరాయిడ్ పనితీరు
• శక్తి ఉత్పత్తి
విటమిన్లు మరియు పోషకాలను తగినంతగా తీసుకోవడం మీ గర్భధారణ అవకాశాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు సంతానోత్పత్తి అవకాశాలను ప్రభావితం చేసే పాలిసిస్టిక్ ఓవేషన్ సిండ్రోమ్ లేదా PCOS వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది.
మీరు ఉపయోగించగల కొన్ని ప్రసిద్ధమైన సప్లిమెంట్ల గురించి ఇక్కడ చర్చిద్దాం.
1. కోయింజైమ్ Q10 (Coenzyme Q10)
స్త్రీ శరీరం ఈ ఎంజైమ్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే రక్తప్రవాహంలో ఈ ఎంజైమ్ మొత్తాన్ని పెంచడం వల్ల బిడ్డ పుట్టే అవకాశాలను మెరుగుపడతాయి. 2018 లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, కోయింజైమ్ Q10 ను సప్లిమెంట్ చెయ్యడం వల్ల ఇన్-విట్రో ఫర్టిలైజేషన్ (IVF) చేయించుకుంటున్న మహిళల్లో మెరుగైన అండాశయ ప్రతిస్పందనకు దారితీసింది.
2. N-ఎసిటైల్ సిస్టైన్ (N-acetyl cysteine)
ఇది ఎమినో ఆసిడ్ L-సిస్టైన్ యొక్క వేరియేషన్. ఇది అంతర్గత శరీర విధులను సరైన స్థాయిలో నిర్వహించడంలో పాటు కణాలు త్వరగా చనిపోకుండా నిరోధించడంలో చేసే కీలక పాత్ర కారణంగా ఇది ఒక ప్రసిద్ధ అనుబంధంగా పేరు పొందింది. N-ఎసిటైల్ సిస్టైన్ మహిళల్లో ఓవ్యులేషన్ సైకిల్ ని మెరుగుపరుస్తుంది మరియు PCOS చికిత్సకు కూడా సహాయపడుతుంది.
3. ఎసిటైల్ L-కార్నిటైన్ (ACL) (Acetyl L-carnitine (ACL))
ఇది సప్లిమెంట్ యొక్క ఒక రూపం, ఇది శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే సప్లిమెంట్. ఇది కొవ్వును శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది. మహిళల్లో సంతానోత్పత్తిని పెంచడానికి మరియు ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ACL శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది PCOSను మెరుగుపర్చడంతో పాటు, పీరియడ్ రాకపోవడం, పునరుత్పత్తి వ్యవస్థలో వయస్సు-సంబంధిత మార్పులను నెమ్మదించడంలో సాయం చేస్తుంది.
4. మెయైనోసిటాల్ (Myoinositol )
ఇది కూడా మానవ శరీరంలో సహజంగా కనిపిస్తుంది. ఇది బీన్స్ మరియు మొక్కజొన్న వంటి ఆహార పదార్థాలలో కూడా ఉంటుంది. PCOS ఉన్న మహిళల్లో గ్లూకోజ్ కణజాలం తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడానికి మరియు ఓవ్యులేషన్ ప్రక్రియను పునరుద్ధరించడానికి మెయైనోసిటాల్ పనిచేస్తుందని క్లినికల్ అధ్యయనాలు చూపిస్తున్నాయి. మెయైనోసిటాల్ ఓవ్యులేషన్ రేటును మెరుగుపరచడమే కాకుండా ఋతు చక్రాన్ని క్రమబద్దకరీంచేందుకు కూడా సాయం చేస్తుంది.
5. సెలీనియం (Selenium)
సెలీనియం లోపం స్త్రీలలో గర్భస్రావం అయ్యే అవకాశాలను అలాగే పురుషులలో వీర్యం నాణ్యత తగ్గించడమే కాకుండా దానికి చలనశీలతను కల్పిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థను నిర్వహించడానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజం. మహిళల అండాల చుట్టూ ఉండే ఫోలిక్యులర్ ద్రవం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది సహాయపడుతుందని 2019 అధ్యయనం చూపిస్తుంది. ఇది కాకుండా, ఇది జీవక్రియను మెరుగుపరచడంలో, థైరాయిడ్ గ్రంధి పెరుగుదల & అభివృద్ధిని నియంత్రించడంలో మరియు దాని సరైన పనితీరును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
సంతానోత్పత్తి సప్లిమెంట్లు మీరు తీసుకునే ఇతర మందులతో సంపర్కాన్ని పొందుతాయి. వాటి కొనసాగింపు మీ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. సప్లిమెంట్లను ప్రారంభించడానికి ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించి సమతుల్య పోషకాహారాన్ని తీసుకోవడం మంచిది.
fertility supplements in telugu, informations about fertility supplements in telugu, fertility supplements meaning in telugu, uses of fertility supplements in telugu, Before You Take Fertility Supplements to Get Pregnant in English, Before You Take Fertility Supplements to Get Pregnant in Hindi, Before You Take Fertility Supplements to Get Pregnant in Tamil, Before You Take Fertility Supplements to Get Pregnant in Bengali.
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips
Types of IVF, Their Benefits and Side Effects Everything You Need to Know..
Navel Displacement: The Ultimate Guide to Causes, Symptoms & Treatment
How to Sterilize Baby Bottles: The Ultimate Step-by-Step Tutorial
What to eat when trying to conceive
White Discharge After IUI: Is It Normal & When to See a Doctor
Diet & Exercises Your Wife Can Follow During Pregnancy
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |