hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Contraceptive arrow
  •  ఫిమేల్ కండోమ్‌లు ఎలా పని చేస్తాయి? arrow

In this Article

     ఫిమేల్ కండోమ్‌లు ఎలా పని చేస్తాయి?

    Contraceptive

     ఫిమేల్ కండోమ్‌లు ఎలా పని చేస్తాయి?

    3 November 2023 న నవీకరించబడింది

    శృంగారంలో పాల్గొన్నప్పుడు గర్భనిరోధకాలను ఉపయోగించడం చాలా అవసరం. తద్వారా లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు (STI), అవాంఛిత గర్భాలను నివారించవచ్చు. గర్భనిరోధకాలపై అవగాహన పెరగడంతో, పురుషులకు వివిధ రకాల కండోమ్‌లు అందుబాటులోకి రావడమే కాకుండా, ఫిమేల్ కండోమ్‌లు కూడా ప్రవేశపెట్టబడ్డాయి. పురుషుల కండోమ్‌ల వినియోగం సాధారణమే, కానీ ఫిమేల్ కండోమ్‌ల గురించి చర్చించడం చాలా తక్కువ. కాబట్టి వాటి గురించి అవగాహన తక్కువ, కావాల్సిన సమాచారం కూడా అందుబాటులో లేదు. ఫిమేల్ కండోమ్‌లు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కానీ వారి జననేంద్రియ ప్రాంతాలను తాకడం ఇష్టం లేని మహిళలకు ఇది అసౌకర్యంగా ఉండవచ్చు. ఫిమేల్ కండోమ్‌లు నైట్రిల్ (కృత్రిమ లేటెక్స్-ఫ్రీ రబ్బర్)తో తయారు చేసిన పొడవైన ప్లాస్టిక్ పౌచ్‌లు. అవి యోని లోపలికి వెళ్లేంత పొడవు ఉంటాయి. కండోమ్ అంచులు వీర్యం, ఇతర ద్రవాలు శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. ఈ కథనంలో, ఫిమేల్ కండోమ్‌లు ఎలా పని చేస్తాయి, వాటి ప్రయోజనాలు మరియు వాటి ప్రభావాన్ని వివరిస్తాము.

    ఫిమేల్ కండోమ్‌లు ఎలా పని చేస్తాయి?

    పైన పేర్కొన్నట్లుగా, వెలుపలి కండోమ్ లైన్‌ల వద్ద ఆపడం ద్వారా వీర్యం అండాన్ని ఫలదీకరణ చేయకుండా ఫిమేల్ కండోమ్ నిరోధిస్తుంది. శృంగారంలో పాల్గొనే ముందు ఫిమేల్ కండోమ్‌ను యోనిలో పెట్టాలి. ఫిమేల్ కండోమ్‌లు 95% ప్రభావవంతంగా ఉంటాయి. అంటే 100 మందిలో 5 మంది మహిళలు కండోమ్‌లు వాడిన తర్వాత కూడా గర్భం దాల్చవచ్చు. కండోమ్‌లు ఉపయోగించని జంటలకు, గర్భం దాల్చే అవకాశం 100కి 21 శాతం ఉంటుంది. ఫిమేల్ కండోమ్‌లు అంటే ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయి అనేది మీకు అర్థమైందని భావిస్తున్నాము. ఇప్పుడు వాటిని శృంగారంలో పాల్గొనేటప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

    • ప్యాకెట్‌ను జాగ్రత్తగా తెరవండి, తీసేటప్పుడు కండోమ్‌ చిరిగిపోకుండా చూసుకోండి.
    • కండోమ్‌ను నిలువుగా ఉంచండి. యోనిలోకి చొప్పించే ముందు లేదా తర్వాత దానిలో మడతలు లేదా మెలికలు ఉండకూడదు.
    • కండోమ్‌ను మడిచి యోని లోపల పెట్టండి. బాహ్య జననాంగాలను కవర్ చేసేలా కండోమ్ యొక్క ఓపెన్ ఎండ్‌ను బయటకి ఉంచాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. లోపలి రింగ్ జఘన ఎముకకు లోపల ఉండాలి. అంతే!
    • మీరు లూబ్రికేషన్ కోసం నీటి ఆధారిత లూబ్రికెంట్‌లను ఉపయోగించవచ్చు.
    • శృంగారం తర్వాత లేదా పూర్తయిన తర్వాత నిలబడే ముందు మీ చేతితో బయటి రింగ్‌ను మూసి ఉంచాలని గుర్తుంచుకోండి. లేకపోతే మంచం లేదా కార్పెట్ మీద ద్రవం పడే అవకాశం ఉంటుంది.
    • బాత్రూమ్‌కు వెళ్లి, కండోమ్‌ను మెల్లగా బయటకు తీయండి. పురుషుల కండోమ్‌ల మాదిరిగానే వీటిని కూడా ఒకసారి మాత్రమే ఉపయోగించాలి.
    • ఉపయోగించిన కండోమ్‌ను ఎల్లప్పుడూ చెత్త బుట్టలో పారవేయండి. దానిని ఫ్లష్ చేయవద్దు, ఎందుకంటే ఇది పైపులో అడ్డుకోవచ్చు.

    ఫిమేల్ కండోమ్‌లను సమర్థవంతంగా ఉపయోగించడం కోసం కొన్ని చిట్కాలు.

    • పురుషుల మరియు ఆడవారి కండోమ్‌లను ఎప్పుడూ కలిపి ఉపయోగించవద్దు. ఎందుకంటే వాటి మధ్య ఘర్షణ కండోమ్‌లు చిరిగేలా చేయవచ్చు.
    • ప్యాకెట్‌ను చింపివేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దానికి మీ గోర్లు లేదా ఏదైనా నగల వల్ల రంధ్రాలు పడకుండా చూసుకోండి.
    • మెరుగైన పనితీరు కోసం ఎల్లప్పుడూ నీటి ఆధారిత లూబ్రికెంట్‌లను ఉపయోగించండి. పెట్రోలియం ఆధారిత లూబ్రికెంట్‌లను ఉపయోగించవద్దు.
    • శృంగారం చేసే సమయంలో కండోమ్ చిరిగిపోతే, బయటి రింగ్ యోని లోపలికి వెళ్లి, అది లోపల ఉండిపోతుంది. వెంటనే దాన్ని తీసివేసి కొత్తదాన్ని ఉపయోగించండి.
    • శృంగారం చేసే సమయంలో కండోమ్ చిరిగిపోతే, ముందు జాగ్రత్తగా గర్భనిరోధక మాత్రల కోసం మీ వైద్యుడిని లేదా ఫార్మసీని సంప్రదించండి.
    • మీరు శృంగారంలో పాల్గొన్న ప్రతిసారీ కొత్త కండోమ్‌ను ఉపయోగించండి.

    ఫిమేల్ కండోమ్‌ల ప్రయోజనాలు, మరియు నష్టాలు

    ఫిమేల్ కండోమ్‌లు ఎలా పనిచేస్తాయి అనేది మీకు అర్థమైందని భావిస్తున్నాము. ఇప్పుడు ఫిమేల్ కండోమ్‌లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు, మరియు నష్టాల గురించి తెలుసుకుందాం.

    ఫిమేల్ కండోమ్‌ల ప్రయోజనాలు

    • ఫిమేల్ కండోమ్‌లు STIలు, అవాంఛిత గర్భాల నుండి రక్షిస్తాయి.
    • దీన్ని ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. కాగా గర్భనిరోధక మాత్రలను క్రమం తప్పకుండా వాడటం వల్ల స్త్రీల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఉంటాయి.
    • దీన్ని ఋతుస్రావం, గర్భధారణ సమయంలో అలాగే ప్రసవానంతరం, గర్భస్రావం సమయంలో ఉపయోగించవచ్చు.
    • భాగస్వాములు శృంగారంలో పాల్గొనేటప్పుడు కండోమ్‌లను ఉపయోగించకూడదనుకుంటే, మహిళలకు ఇది సౌకర్యం, భద్రతను అందిస్తుంది.
    • ఇవి లేటెక్స్‌‌తో తయారు చేయబడవు, కాబట్టి వాటిని ఉపయోగించడం అసౌకర్యంగా ఉండదు.
    • శృంగారం తర్వాత దాన్ని వెంటనే తీసివేయాల్సిన అవసరం లేదు, కాబట్టి మీరు ఆ క్షణాన్ని ఆస్వాదించడం కొనసాగించవచ్చు.

    ఫిమేల్ కండోమ్‌ల ప్రతికూలతలు

    • శృంగారంలో పాల్గొనే సమయంలో ఏర్పడే ఘర్షణ శృంగారంలో పొందే ఆనందాన్ని తగ్గిస్తుంది. నీటి ఆధారిత లూబ్రికెంట్‌లను ఉపయోగించడం ద్వారా ఫిమేల్ కండోమ్‌ల మెరుగైన అనుభవాన్ని అందించడంలో సహాయపడుతుంది.
    • భాగస్వామి యొక్క జనాంగాలను తాకినప్పుడు, ఫిమేల్ కండోమ్‌లు విచిత్రమైన శబ్దాలు చేస్తాయి. నీటి ఆధారిత లూబ్రికెంట్‌లను ఉపయోగించి దీనిని తగ్గించవచ్చు.
    • కొన్నిసార్లు కండోమ్ అరిగిపోవడం లేదా చిరిగిపోవడం వల్ల యోనిలోకి ఎలాంటి ద్రవం ప్రవేశిస్తుందో మహిళకు తెలియకపోవచ్చు.
    • పురుషుల కండోమ్‌లతో పోలిస్తే ఫిమేల్ కండోమ్‌లు తక్షణమే అందుబాటులో ఉండవు మరియు ఖరీదైనవి.
    • ఫిమేల్ కండోమ్‌లు STI వ్యాపించే ప్రమాదాన్ని 100% తగ్గించవు, కానీ ఆ అవకాశాన్ని తగ్గిస్తాయి.

    ముగింపు

    అవాంఛిత గర్భాలను నివారించడంలో, STIలు వ్యాపించే ప్రమాదాన్ని తగ్గించడంలో ఫిమేల్ కండోమ్‌లు ప్రభావవంతంగా ఉంటాయి. ఫిమేల్ కండోమ్‌లు, అవి ఎలా పని చేస్తాయి, వాటి ప్రయోజనాలు, వాటిని సమర్థవంతంగా ఉపయోగించడం, వాటిని సరిగ్గా ఉపయోగించకపోతే కలిగే ప్రమాదం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. సురక్షితమైన శృంగారం కోసం వీటిని ఉపయోగించుకునేలా స్త్రీలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఇది మార్గం కల్పిస్తుంది. దీన్ని ఉపయోగించడం సులభం. భాగస్వాములు ఒత్తిడి లేకుండా మంచి అనుభూతిని ఆస్వాదించడానికి సహాయపడుతుంది.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |