hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Conception arrow
  • ఇరెగ్యులర్‌ పీరియడ్స్‎తో ఎప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలి? (When Should You Take A Pregnancy Test With Irregular Periods in Telugu?) arrow

In this Article

    ఇరెగ్యులర్‌ పీరియడ్స్‎తో  ఎప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలి? (When Should You Take A Pregnancy Test With Irregular Periods in Telugu?)

    Conception

    ఇరెగ్యులర్‌ పీరియడ్స్‎తో ఎప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలి? (When Should You Take A Pregnancy Test With Irregular Periods in Telugu?)

    3 November 2023 న నవీకరించబడింది

    తాము గర్భంతో ఉన్నట్లు తెలుసుకోవడం స్త్రీలకు ఒక థ్రిల్లింగ్ అనుభవం. ఇది ఆనందాన్ని, ఉత్తేజాన్ని తెస్తుంది. గర్భం దాల్చినట్లు గుర్తించేందుకు అతి సాధారణ సూచన ఇరెగ్యులర్‌ పీరియడ్స్‌. ఇరెగ్యులర్‌ పీరియడ్స్‌ హార్మోన్‌ల అసమతుల్యత కారణంగా కూడా రావచ్చు. ఇరెగ్యులర్‌ పీరియడ్స్‌ ఎలాంటి కారణాలతో వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ప్రగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలనే దాని గురించి తెలుసుకోవడం ముఖ్యం. పీరియడ్స్ అనేవి స్త్రీలు రజస్వల (మనార్కీ) అయినప్పటి నుంచి పీరియడ్స్‌ ఆగిపోయే దశ(మోనోపాజ్) వరకు ప్రతి నెలా వస్తాయి. గర్భదారణకు శరీరం సిద్ధంగా ఉందనే తెలిపే సూచనగా ప్రతి నెలా పీరియడ్స్‌ వస్తాయి. చాలా మంది మహిళలకు 28 రోజుల గ్యాప్‌తో పీరియడ్స్‌ వస్తుంటాయి. ఈ కాలాన్ని రుతుచక్రం అంటారు. వీరిలో సాధారణంగా 24 నుంచి 38 రోజుల మధ్య పీరియడ్స్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ పీరియడ్స్‌ 24 రోజుల కంటే తక్కువ లేదా 38 రోజుల కంటే ఎక్కువ దూరంలో వస్తుంటే.. పీరియడ్స్‌ కాల వ్యవధి మారుతుంటే ఇరెగ్యులర్‌ పీరియడ్స్‌గా గుర్తించాలి.

    ఇరెగ్యులర్‌ పీరియడ్స్‌ వస్తున్నప్పుడు, ప్రెగ్నెన్సీగా ఎలా అనుమానించాలనే అంశాలను తెలుసుకోండి..

    • ఇరెగ్యులర్‌ పీరియడ్స్‎కు కారణాలు
    • ఇరెగ్యులర్‌ పీరియడ్స్‎తో ప్రెగ్నెన్సీని ఎలా ప్లాన్ చేయాలి
    • ఇరెగ్యులర్‌ పీరియడ్స్‎తో ప్రెగ్నెన్సీని ఎలా చెక్ చేయాలి
    • ఇరెగ్యులర్‌ పీరియడ్స్‎తో ప్రెగ్నెన్సీ టెస్ట్‎ని ఎప్పుడు చేయించుకోవాలి
    • ఇరెగ్యులర్‌ పీరియడ్స్‎తో ప్రెగ్నెన్సీ నిర్ధారణ
    • ఇరెగ్యులర్‌ పీరియడ్స్‎ సమయంలో ప్రెగ్నెన్సీ నిర్ధారణకు డాక్టర్‎ని ఎప్పుడు సంప్రదించాలి
    • ఇరెగ్యులర్‌ పీరియడ్స్‎తో ప్రెగ్నెన్సీ గడువు తేదీని ఎలా తెలుసుకోవాలి
    • చికిత్స

    ఇరెగ్యులర్‌ పీరియడ్స్‎కి కారణాలు (Causes of Irregular Periods in Telugu)

    ఇరెగ్యులర్‌ పీరియడ్స్‌కి గర్భదారణ ఒకటే కారణం కాదు. ఇరెగ్యులర్‌ పీరియడ్స్‌కు ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. ఇరెగ్యులర్‌ పీరియడ్స్ ప్రెగ్నెన్సీలో ఆలస్యానికి కారణం కావచ్చు, ఎందుకంటే అండం విడుదలయ్యే సమయం మారవచ్చు. ఇరెగ్యులర్‌ పీరియడ్స్‎కి కొన్ని సాధారణ కారణాలు:

    కౌమారదశ, పెరిమెనోపాజ్ సమయంలో ఇరెగ్యులర్‌ పీరియడ్స్‌ సాధారణంగా వస్తాయి.

    • నియంత్రణలో ఉండని మధుమేహం
    • ఒత్తిడి
    • ఆహారపు అలవాట్లు
    • కొన్ని రకాల ఔషధాలు
    • పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్
    • కఠినమైన వ్యాయామాలు
    • నిద్ర వేళల్లో మార్పు
    • బిడ్డకు పాలు ఇవ్వడం
    • సాధారణ అస్వస్థతలు

    ఇరెగ్యులర్‌ పీరియడ్స్‎ వస్తున్నా ప్రెగ్నెన్సీ పొందడం ఎలా? (How to Plan Pregnancy with Irregular Periods in Telugu?)

    మహిళలో అండం విడుదలయ్యే సమయంలో సంభోగం చేసినప్పుడు ప్రెగ్నెంట్ అవుతుంది. ఇరెగ్యులర్‌ పీరియడ్స్ విషయంలో, అండం విడుదలయ్యే కాలాన్ని నిర్ణయించడం ఇబ్బందికరం. కానీ శుభవార్త ఏంటంటే.. వీర్యం స్త్రీ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఐదు రోజుల షెల్ఫ్ జీవితాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇరెగ్యులర్‌ పీరియడ్స్‎ సమయంలో కూడా గర్భం పొందడానికి అవకాశాలు పెరగాలంటే.. నెల పొడవునా క్రమం తప్పకుండా సెక్స్ చేయడం ద్వారా గర్భం దాల్చే అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. ప్రతి 2 లేదా 3 రోజులకు ఒకసారి సంభోగం చేసినప్పుడు, వీర్యం అండాన్ని మిస్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

    క్రమరహిత పీరియడ్స్‎తో ప్రెగ్నెన్సీని ఏవిధంగా చెక్ చేయాలి? (How to Check Pregnancy with Irregular Periods in Telugu?)

    క్రమం తప్పకుండా పీరియడ్స్‌ వస్తున్న సమయంలో.. అకస్మాత్తుగా పీరియడ్స్‌ రాకపోతే గర్భం దాల్చినట్లు భావించవచ్చు. అయితే సాధారణంగా ఇరెగ్యులర్‌ పీరియడ్ప్‌ వచ్చే వారిలో సమస్య ఎదురవుతుంది. ఇరెగ్యులర్‌ పీరియడ్‌, గర్భం దాల్చిన కారణంగా పీరియడ్స్‌ ఆగాయా? అనే అంశంలో స్పష్టత కొరవడుతుంది. ఇరెగ్యుల్‌ పీరియడ్స్‌ సహా ప్రెగ్నెన్సీ సందర్భాల్లో ఇతర సంకేతాలు కూడా ఉన్నాయి. వాటిపై కూగా అవగాహన అవసరం.

    1. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ లేదా స్పాటింగ్ (Implantation Bleeding or Spotting)

    ఫలదీకరణం చెందిన గుడ్డు ఇంప్లాంటేషన్, ఫలదీకరణం జరిగిన 1 లేదా 2 వారాల తరువాత జరుగుతుంది. ఇది లైట్ పీరియడ్ అని తప్పుగా భావించవచ్చు. ఇక్కడ కనిపించే వ్యత్సాసాల ఇవే..

    • ఇంప్లాంటేషన్ బ్లీడింగ్‎లో ఎలాంటి క్లాట్స్ ఉండవు
    • ఇది చాలా లైట్
    • పీరియడ్స్ సమయంలో రక్తస్రావంగా ఎర్రగా ఉంటే, ఇది గులాబీ లేదా గోధుమ రంగులో ఉంటుంది.
    • ఇది 1 నుంచి 3 రోజులు మాత్రమే ఉంటుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ మరియు మీ పీరియడ్స్ మధ్య తేడాను కనుగొనడం ఎలా ?

    2. వికారం లేదా మార్నింగ్ సిక్ నెస్ (Nausea or Morning Sickness)

    హార్మోన్ల మార్పుల ఫలితంగా ఉదయం పూట రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీని వల్ల వికారం కలుగుతుంది. వాంతులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లేదా వాంతులు ఉండకపోవచ్చు. సాధారణంగా ఉదయం పూట ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. రోజులోని ఏ సమయంలోనైనా గర్భిణికి వికారం కలగవచ్చు.

    3. అలసట (Fatigue)

    ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరగడం వల్ల శరీరం మార్పులకు లోనవుతుంది. శరీరం ఫలదీకరణం చెందిన అండం కోసం తనను తాను సిద్ధం చేసుకుంటుంది. ఆ మార్పులు గర్భిణీ స్త్రీలను శారీరకంగా ప్రభావితం చేస్తాయి.

    4. తరచుగా మూత్రవిసర్జన (Frequent Urination)

    ఈ లక్షణం ప్రెగ్నెన్సీ కాలం అంతటా ఉంటుంది.

    5. మూడ్ స్వింగ్స్ (Mood Swings)

    6. బ్రెస్ట్‌ పరిమాణంలో మార్పు (Changes in Breast)

    7. తలనొప్పి (Headache)

    8. వెన్నునొప్పి (Back pain)

    9. కొన్ని ఆహార పదార్థాలపై కోరిక, విరక్తి (Food Cravings and Food Aversion)

    ఇరెగ్యులర్‌ పీరియడ్స్‌ సమయంలో ఎప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్‎ చేయించుకోవాలి? (When to do Pregnancy Test During Irregular Periods?)

    గర్భం దాల్చిన అనుమానం ఉన్నా.. ఇరెగ్యులర్‌ పీరియడ్స్‌ వస్తున్నా.. చివరిసారి పీరియడ్ వచ్చినప్పటి నుంచి 36 రోజులు పూర్తయ్యాయా? లేదా చివరిసారిగా సంభోగించిన సమయం నుంచి 4 వారాలు అయ్యాయా? లేదా లెక్కించాలి. ఈ సమయంలో గర్భం దాలిస్తే మూత్ర పరీక్షలో hCG స్థాయిలు గుర్తించేంత ఎక్కువగా ఉంటాయి.

    ఇరెగ్యులర్‌ పీరియడ్స్‎తో గర్భధారణ నిర్ధారణ (Pregnancy Positive with Irregular Periods)

    రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న మహిళల్లో హోం ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లు సాధారణంగా కచ్చితమైన ఫలితాలు అందిస్తాయి. ఇరెగ్యులర్‌ పీరియడ్స్ ఉన్న మహిళలో ఆమె ప్రెగ్నెన్సీ సంకేతాలను అనుభవిస్తే లేదా ఆమె బహిష్టు ఊహించిన దానికంటే ఆలస్యంగా వస్తే, పరిస్థితి భిన్నంగా ఉంటుంది. చివరి సంభోగం తరువాత 28 రోజుల ముందుగానే ఈ కిట్ ప్రెగ్నెన్సీని గుర్తిస్తుంది. ఎందుకంటే ఇది మూత్రంలో hCG స్థాయిలను గుర్తిస్తుంది. ఇది గర్భం ధరించిన వెంటనే పెరగడం ప్రారంభిస్తుంది. ఒకవేళ పరీక్షలో నెగిటివ్ వచ్చినట్లయితే మరియు ప్రెగ్నెన్సీ సంకేతాలు మరియు లక్షణాలు కొనసాగినట్లయితే, కొన్ని రోజుల తరువాత టెస్ట్ ను రిపీట్ చేయాలి. టెస్ట్ లో ఇంకా నెగిటివ్ వస్తే, మీరు డాక్టర్‎ని సంప్రదించాలి.

    క్రమరహిత పీరియడ్స్‎తో ప్రెగ్నెన్సీ కోసం డాక్టర్‎ని ఎప్పుడు సందర్శించాలి? (When to meet Doctor with Irregular Periods)

    ప్రెగ్నెన్సీ లక్షణాలు కలిగి ఉండి మరియు అసాధారణంగా ఆలస్యమైన పీరియడ్ తర్వాత కూడా మీ హోం ప్రెగ్నెన్సీ టెస్ట్‎లో నెగిటివ్ వస్తే, మీరు ప్రెగ్నెన్సీ కోసం డాక్టర్ ని సందర్శించాలి. ప్రెగ్నెన్సీని నిర్ధారించడానికి డాక్టర్ కింద పేర్కొన్న టెస్టులను నిర్వహిస్తారు:

    • కటి పరీక్ష (పెల్విక్ ఎగ్జామినేషన్)
    • ప్రయోగశాలలో మూత్ర పరీక్ష
    • రక్త పరీక్షలు
    • అల్ట్రాసౌండ్ స్కాన్
    • హృదయ స్పందన రేటు
    • బరువు
    • రక్తపోటు
    • 24 గంటల మూత్ర విశ్లేషణ
    • పాప్ స్మియర్

    క్రమరహిత పీరియడ్స్‎తో ప్రెగ్నెన్సీ గడువు తేదీని ఎలా తెలుసుకోవాలి? (How to Know Due Date with Irregular Pregnancy?)

    క్రమరహిత పీరియడ్స్‎తో ప్రెగ్నెన్సీ విషయంలో, LMP ఉపయోగించి డెలివరీ యొక్క గడువు తేదీని తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే చివరిగా అయిన పీరియడ్. అటువంటి పరిస్థితులలో అల్ట్రాసౌండ్ కీలక పాత్ర పోషిస్తుంది. గర్భం ధరించిన 6 వారాల తరువాత ఏ సమయంలోనైనా అల్ట్రాసౌండ్ స్కాన్ చేయవచ్చు. ఇది పిండం యొక్క అభివృద్ధిని అధ్యయనం చేస్తుంది మరియు ప్రెగ్నెన్సీ వయస్సును లెక్కించడంలో సహాయపడుతుంది. డెలివరీ యొక్క ఖచ్చితమైన గడువు తేదీని తెలుసుకోవడానికి ఇది మరింత సహాయపడుతుంది.

    చికిత్స (Treatment)

    క్రమరహిత పీరియడ్స్ ఉన్న మహిళలో ప్రెగ్నెన్సీ నిర్ధారించబడినట్లయితే, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న మహిళ విషయంలో మాదిరిగానే సాధారణ ప్రోటోకాల్ పాటించబడుతుంది.

    కానీ ప్రెగ్నెన్సీ నిర్ధారించబడనట్లయితే, ఆలస్యమైన పీరియడ్స్ మరియు ఇతర ప్రెగ్నెన్సీ సంకేతాలకు దారితీసే అంతర్లీన కారణాలకు ఆమె చికిత్స పొందుతుంది. వీటిలో ఇవి ఉండవచ్చు-

    • అండాశయ లోపం మరియు PCOS విషయంలో సైక్లిక్ హార్మోనల్ ట్రీట్మెంట్
    • పీరియడ్స్‎ను రెగ్యులరైజ్ చేయడానికి నోటి ద్వారా తీసుకునే నిరోధకాలను ఉపయోగిస్తారు.
    • డయాబెటిస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కారణమైతే వాటికి చికిత్స.
    • ఒత్తిడికి చికిత్స.
    • నిద్ర సరళి (స్లీప్ పాటర్న్)ని క్రమబద్ధీకరించడం.
    • తినే రుగ్మత (ఈటింగ్ డిజాడర్)లపై శ్రద్ధ వహించడం మరియు చికిత్స చేయడం
    • పాలిచ్చే తల్లికి పాలిచ్చిన తరువాత క్రమం తప్పకుండా పీరియడ్స్ వస్తాయి.

    సమ్మరీ

    ఇరెగ్యులర్‌ పీరియడ్స్ ఊహించలేనవి. అందువల్ల లైంగికంగా చురుకైన మహిళ గర్భవతి కాదా అనే గందరగోళానికి గురిచేస్తుంది. లక్షణాలను నిశితంగా గమనించడం మరియు సకాలంలో వైద్యులను సంప్రదించడం ఆమె ప్రయాణాన్ని సజావుగా చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి మీకు క్రమరహిత పీరియడ్స్ ఉన్నప్పటికీ, అసాధారణంగా ఆలస్యమైన పీరియడ్ ఉండి, కొన్ని ఇతర ప్రెగ్నెన్సీ లక్షణాలను అనుభవించినట్లయితే, గర్భవతిగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్‎ను చేయవచ్చు.

    Pregnancy Positive result in Telugu, Irregular periods in telugu, Irregular periods, Is pregnancy possible with irregular periods in telugu, Irregular periods pregnancy postive result in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |