Weight Loss
3 November 2023 న నవీకరించబడింది
హుర్రే! అభినందనలు. మీరు ఇటీవలే బిడ్డని ప్రసవించారు. కాబట్టి మీ నవజాత శిశువును చూసుకోవడం, ఇతర బాధ్యతలను నిర్వహించడం మధ్య మీకు చాలా బాధ్యతలు ఉంటాయి. అన్నింటికంటే, బరువు తగ్గడం ఆందోళన కలిగిస్తుంది. కొంతమంది మహిళలు గర్భధారణ తర్వాత వీలైనంత త్వరగా బరువు తగ్గాలని ఆశిస్తారు. అయితే ఇటీవలి పరిశోధనల ప్రకారం, గర్భధారణ సమయంలో, తర్వాత బరువులో మార్పు చాలా మంది మహిళలపై గణనీయమైన ఆరోగ్య పరిణామాలను కలిగిస్తుంది. స్త్రీలు ప్రసవానంతర బరువు తగ్గడాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఎందుకంటే ప్రసవించిన తర్వాత శరీరం శక్తిని తిరిగి పొందేందుకు సమయం పడుతుంది. ప్రసవం తర్వాత బరువు తగ్గడానికి చాలా సమయం పట్టవచ్చు. ప్రసవానంతర బరువు తగ్గడం దీర్ఘకాలిక బరువు పెరుగటాన్ని, ఊబకాయానికి గురి అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రసవం అయిన వెంటనే మీరు కోల్పోయే బరువు సాధారణమైనది. ప్రసవం తర్వాత వచ్చే వారం కూడా మీరు కొన్ని కిలోల బరువు తగ్గుతారు. బరువు తగ్గడం అనేది ఒక స్థిరమైన ప్రక్రియగా ఉండాలి.
గర్భధారణ సమయంలో, ఆరోగ్యకరమైన మహిళలు 25 నుండి 35 పౌండ్ల పరిధిలో బరువు పెరుగుతారు. తక్కువ బరువు గల స్త్రీలు, అధిక బరువు గల స్త్రీలు, బహుళ శిశువులను మోస్తున్న వారు వేర్వేరు బరువు పెరుగుదల సిఫార్సులు ఉంటాయి. మీ వైద్యుడు మీ స్వంత అవసరాల ఆధారంగా అదనపు సలహాలను కూడా ఇవ్వచ్చు. వివిధ అధ్యయనాల ప్రకారం, గర్భధారణ బరువు పెరుగడానికి శిశువు, మావి, ఉమ్మనీరు, రొమ్ము కణజాలం, రక్తం, అదనపు కొవ్వు కారణమవుతాయి. అదనపు కొవ్వు ప్రసవానికి, తల్లిపాలు ఇవ్వడానికి శక్తి నిల్వగా పనిచేస్తుంది. అయినప్పటికీ గర్భధారణ సమయంలో అధిక బరువు పెరగడాన్ని సాధారణంగా శిశువు బరువుగా సూచిస్తారు. గర్భిణీ స్త్రీలలో ఇది సాధారణం. పరిశోధన ప్రకారం, దాదాపు 50 శాతం మంది గర్భిణీ స్త్రీలు ప్రతిపాదించిన దానికంటే ఎక్కువ బరువు పెరుగుతారు. ప్రసవం తర్వాత అదనపు బరువు యొక్క ఫలితాలను కింద పేర్కొన్నాము:
ఇది సాధారణ ప్రసవం అయినా లేదా సి-సెక్షన్ అయినా, చాలా మంది మహిళలు ప్రసవం తర్వాత దాదాపు 13 పౌండ్ల బరువు కోల్పోతారు. చాలా బరువు శిశువు నుండి వస్తుంది. బిడ్డ బరువు 5 ½ నుండి 8 పౌండ్ల వరకు ఉండవచ్చు. మిగిలిన బరువు మావిని ప్రసవించడం, గర్భధారణ సమయంలో మీ బిడ్డ చుట్టూ ఉన్న అమ్నియోటిక్ ద్రవం కోల్పోవడం ద్వారా వస్తుంది. మీరు మిగిలిన ద్రవాలను ఫ్లష్ చేయడం వలన మీరు గర్భం దాల్చిన వారంలో ఇంకొన్ని కిలోల బరువు కోల్పోవచ్చు. మీకు గర్భం ద్వారా ఏర్పడిన కొవ్వు అంత త్వరగా తగ్గదు. ప్రసవించిన తర్వాత, మీరు మీ గర్భధారణకు ముందు బరువుకు దగ్గరగా ఉన్నప్పటికీ మీ శరీరం భిన్నంగా ఉంటుంది. మీ కడుపు ఎర్రబడినట్లు, భారీగా కనిపించవచ్చు. గర్భాశయం దాని గర్భధారణకు ముందు పరిమాణానికి తిరిగి తగ్గిపోవడానికి సుమారు 5 నుండి 6 వారాలు పడుతుంది.
గర్భధారణ సమయంలో సిఫార్సు చేయబడిన బరువు పెరిగిన చాలా మంది మహిళలు దానిని కోల్పోయి, ప్రసవించిన 6 నెలల నుండి 1 సంవత్సరంలోపు వారి పాత బరువుకు తిరిగి రావచ్చని నిపుణులు అంటున్నారు. కానీ ఇది కేవలం ఒక అంచనా.ప్రతి ఒక్కరి కాలక్రమం భిన్నంగా ఉంటుంది. వారిలో కొందరు గర్భధారణకు ముందు వారి బరువుకు తిరిగి రావడానికి 10 నెలల నుండి 2 సంవత్సరాల వరకు పట్టవచ్చు. మీరు మీ గర్భధారణకు మునుపటి బరువును చేరుకున్నప్పటికీ, మీ శరీరం మునుపటిలాగా కనిపించదు. కొంతమంది స్త్రీలకు మెత్తటి గుండ్రని పొట్ట ఉంటుంది, పిర్రలు వెడల్పుగా ఉండవచ్చు లేదా ప్రసవం తర్వాత రొమ్ములు చిన్నవిగా ఉండవచ్చు. ఇది అద్భుతమైన వరం కాబట్టి ఇవి మంచిదే. ఇవన్నీ మీ గర్భధారణ, ప్రసవం ద్వారా అనుభవించిన మార్పుల వల్ల ఏర్పడతాయి. వీటిని గుర్తించడం ఎంతో ముఖ్యం.
ప్రసవించిన తర్వాత చాలా మంది మహిళలు కోలుకోవడానికి సమయం కావాలి. ఇది ప్రతి స్త్రీకి భిన్నంగా ఉంటుంది. వారు త్వరగా బరువు తగ్గాలని ఆశించకూడదు, వారు ప్రసవానంతర పరీక్ష కోసం వెళ్ళే వరకు వేచి ఉండకూడదు. బరువు తగ్గడానికి ప్రయత్నించడం ప్రారంభించడానికి వైద్యులు సాధారణంగా ప్రసవించిన తర్వాత 12 వారాలు వేచి ఉండాలని సూచిస్తున్నారు. ప్రసవానంతర చెకప్ సమయంలో, ఒక వైద్యుడు తల్లి, బిడ్డ పుట్టినప్పటి నుండి ఎంత బాగా కోలుకుంటున్నారో పరిశీలిస్తారు. ఇన్ఫెక్షన్, రక్తం గడ్డకట్టడం లేదా ప్రసవానంతర మాంద్యానికి సంబంధించి ఏవైనా సూచనలను ఉన్నాయా అని వారు తనిఖీ చేస్తారు. బరువు తగ్గడానికి సాధారణంగా చాలా నెలలు పడుతుంది. కానీ సరైన ఆరోగ్యకరమైన ఆహారం, సాధారణ శారీరక శ్రమ ద్వారా ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చు.
సాధారణంగా, మహిళలు గర్భం దాల్చిన తర్వాత అనేక శారీరక మార్పులను ఎదుర్కొంటారు. వాటిలో ఇవి ఉండవచ్చు:
శరీరంలో మార్పులను అంగీకరించడం చాలా అవసరం. వాటిలో ఎక్కువ భాగం కాలక్రమేణా తగ్గుతాయి. కానీ శరీరంలో కొన్ని లక్షణాలు శాశ్వతంగా మారవచ్చు.
ప్రసవానంతరం బరువు తగ్గడానికి మీరు అనుసరించాల్సిన కొన్ని చిట్కాలు ఇవిగోండి:
ప్రసవించిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి, కోలుకోవడానికి మీకు కొంత సమయం ఇవ్వండి. ఒత్తిడి నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన, శ్రద్ధగల ఆహారం, తగినంత విశ్రాంతి, నిద్ర, హైడ్రేటెడ్‌గా ఉండటం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలి పద్ధతులను అనుసరించడం ద్వారా బరువు తగ్గడం క్రమంగా జరుగుతుంది. వాస్తవిక బరువు తగ్గించే లక్ష్యాలను సెట్ చేసుకోండి. గర్భం మన శరీరాలను మార్చినప్పటికీ, మాతృత్వం మన జీవితాలను మారుస్తుంది. మీరు జీవితంలో ఈ దశకు కొత్త అయినప్పటికీ, వీలైనప్పుడల్లా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుండి అవసరమైనప్పుడు సహాయం కోసం అడగండి.
ప్రసవించిన తర్వాత చనుబాలు ఇవ్వడం వల్ల బరువు తగ్గుతారు. ఎందుకంటే తల్లి పాలివ్వడానికి కేలరీలు అవసరం. మీ శరీరం 400 నుండి 500 కేలరీల వరకు ఖర్చు చేస్తుంది. ఇది నిల్వ చేసిన కొవ్వు, మీరు తీసుకునే ఆహారం నుండి పాలను ఉత్పత్తి చేస్తుంది. 3 నుండి 4 నెలల పాటు ప్రత్యేకంగా చనుబాలు ఇచ్చే స్త్రీలు, చనుబాలు ఇవ్వని లేదా ఫార్ములా ఫీడింగ్తో తల్లిపాలను కలిపిన స్త్రీల కంటే 3 పౌండ్ల వరకు కోల్పోయారని ఇటీవలి పరిశోధన పరిశీలించింది. తల్లిపాలు మీ ప్రసవానంతరం బొడ్డు, గర్భాశయాన్ని తగ్గించడానికి హార్మోన్ల విడుదలను కూడా సులభతరం చేస్తుంది. అయినప్పటికీ, చాలా మంది స్త్రీలు పాలను ఇస్తున్నప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువ తింటారు. ఇది చివరి 5 నుండి 7 పౌండ్ల శిశువు బరువును కోల్పోవడం కష్టతరం చేస్తుంది. చనుబాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు బరువు తగ్గాల్సిన అవసరం ఉన్నందున ఆకలితో ఉండకుండా ఉండండి. ఇది పాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఇది శిశువును జాగ్రత్తగా చూసుకోవడానికి కావలసిన శక్తి లేకుండా కూడా చేస్తుంది.
మ్యాగజైన్లు, చలనచిత్రాలు ఏమి చూపించినప్పటికీ, గర్భధారణ తర్వాత బరువు తగ్గడానికి సమయం పడుతుంది. 75 శాతం మంది మహిళలు గర్భధారణకు ముందు కంటే ప్రసవించిన 1 సంవత్సరం తర్వాత బరువు ఎక్కువ ఉన్నారని గతంలో ఒక అధ్యయనం నిర్ధారించింది. ఈ మహిళల్లో, 50 శాతం మంది 1 సంవత్సరం తర్వాత కనీసం 10 పౌండ్ల బరువు ఉన్నారు, 25 శాతం మంది 20 పౌండ్ల బరువు ఉన్నారు. గర్భధారణ సమయంలో మీరు ఎంత బరువు పెరిగారు అనే దాని బట్టి, రాబోయే 1 నుండి 2 సంవత్సరాలలో వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం ఉత్తమం. మీరు సంవత్సరానికి 10 పౌండ్ల వరకు బరువు కోల్పోతారు. అయితే మంచి ఆహార ప్రణాళిక, వ్యాయామంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గగలరు.
క్రాష్ డైట్లు అంటే తక్కువ కేలరీల ఆహారాలు తీసుకోవడం. ఇవి తక్కువ వ్యవధిలో బరువు తగ్గేలా చేస్తాయి. ప్రసవం తర్వాత కోలుకోవడానికి, మునుపటిలా ఉండటానికి మీ శరీరానికి మంచి పోషకాహారం అవసరం. ప్రత్యేకంగా మీరు చనుబాలు ఇస్తున్నట్లయితే, మీరు అధిక కేలరీలు తీసుకోవడం అవసరం. తక్కువ కేలరీలు ఉండే ఆహారం శరీరానికి అవసరమైన పోషకాలను అందకుండా చేస్తుంది. తద్వారా మీ శరీరం అలసిపోతుంది. రోజుకు సుమారు 500 కేలరీలు తక్కువ తీసుకోవడం వల్ల వారానికి 1 పౌండ్ బరువు తగ్గవచ్చు. ఇది తల్లిపాలు ఇచ్చే మహిళలకు సురక్షితం.
ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు మిమ్మల్ని ఎక్కువ సమయం పాటు ఆకలి లేకుండా ఉంచుతాయి. ఇది బరువు తగ్గడంలో తోడ్పడుతుంది, తక్కువ కేలరీలను తీసుకోవడంలో సహాయపడుతుంది. ప్రోటీన్‌ను జీర్ణం చేయడానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరం. ఒక ఆర్టికల్ ప్రకారం, ప్రోటీన్‌ను జీర్ణం చేయడానికి శరీరం 20-30% కేలరీలను ఉపయోగిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ముఖ్యంగా బొడ్డు ప్రాంతం చుట్టూ కొవ్వు తగ్గడానికి దోహదపడతాయి. ఫైబర్ శరీరం గుండా ప్రయాణిస్తున్నప్పుడు, అది నీటిని గ్రహిస్తుంది, ప్రేగు ఆరోగ్యాన్ని సులభతరం చేస్తుంది. ఫైబర్ అనేది కార్బోహైడ్రేట్. ఇది శరీరంలో సులభంగా విచ్ఛిన్నం కాదు. ఇది కేలరీలను కరిగిస్తుంది, బరువు తగ్గడాన్ని తోడ్పడుతుంది.
పరిశోధన ప్రకారం, ఏదైనా శారీరక శ్రమ, సమతుల్య ఆహారం ఆరోగ్యకరంగా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. వ్యాయామం చేయడం వల్ల కండరాలకు బదులుగా కొవ్వు తగ్గుతుంది. మీరు బరువు తగ్గడం ప్రారంభించినప్పుడు, తక్కువ తినండి, కొంచెం ఎక్కువ వ్యాయామం చేయండి. వేగంగా బరువు తగ్గడానికి మిమ్మల్ని మీరు ఒత్తిడి పెట్టుకోవచ్చు. అందులో తొందరపడకండి. స్ట్రోలర్‌లో శిశువుతో పార్క్ చుట్టూ ఒక నడకతో ప్రారంభించండి. ఇది మీరు మీ దినచర్యకు జోడించగల అద్భుతమైన వ్యాయామం. మీకు సాధారణ ప్రసవం అయినట్లయితే, ప్రసవం అయిన రెండు వారాల తర్వాత నడవడం వంటి తేలికపాటి వ్యాయామంతో మీరు ప్రారంభించవచ్చు. చివరికి, బలహీనపడిన పొత్తికడుపు, కటి కండరాలను పునర్నిర్మించడంలో సహాయపడటానికి మీరు మీ దినచర్యకు మరిన్ని ప్రసవానంతర వ్యాయామాలను జోడించవచ్చు. మీరు కాలక్రమేణా నెమ్మదిగా తీవ్రతను పెంచుకోవచ్చు. కానీ మీకు అసౌకరం అనిపిస్తే, వెంటనే దాన్ని ఆపాలి. మీరు సి-సెక్షన్ ద్వారా జన్మనిచ్చిన్నట్లయితే, ఏదైనా శారీరక శ్రమను తిరిగి ప్రారంభించడానికి వైద్యుడు కనీసం నాలుగు వారాలు వేచి ఉండమని సిఫార్సు చేయవచ్చు.
నిద్ర లేమి, నవజాత శిశువు సంరక్షణ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. నిద్ర దినచర్యలో మార్పులు ప్రసవానంతర బరువు తగ్గడాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. రాత్రి సమయంలో సగటున ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోవడం మహిళల్లో బరువు పెరగడానికి ముడిపడి ఉంది. నిరంతర నిద్ర లేమి ఆకలిని నియంత్రించే హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. ఇది అలసిపోయిన తల్లులు బాగా విశ్రాంతి తీసుకున్నప్పుడు కలిగే దానికంటే ఎక్కువ ఆకలిని కలిగిస్తుంది. కొత్తగా తల్లి అయిన వారికి, తగినంత నిద్ర పొందడం సవాలుగా ఉంటుంది. అయితే కుటుంబం లేదా స్నేహితుల నుండి సహాయం తీసుకోండి. మీ బిడ్డ ఆరోగ్యం ఎంత ముఖ్యమో మీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం.
మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, ఇది కీలకం. నీరు తాగడం ద్వారా మీకు సంపూర్ణ భావం కలుగుతుంది, మీ జీవక్రియను పెంచుతుంది. పాల ఉత్పత్తి ద్వారా కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం. ఒక అధ్యయనం ప్రకారం, మీరు తియ్యటి పానీయాల కంటే నీటిని ఎంచుకుంటే మీరు గరిష్ఠంగా 240 కేలరీలు ఆదా చేయవచ్చు.
ఒక అధ్యయనం ప్రకారం, మద్యం తీసుకోవడం వల్ల అవయవాల చుట్టూ ఎక్కువ కొవ్వు నిల్వ ఉంటుంది. దీనిని బెల్లీ ఫ్యాట్ అని కూడా పిలుస్తారు. పాలిచ్చే తల్లులు మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండటమే ఉత్తమం.
సరైన మోతాదులో తినడం ఎంత ముఖ్యమో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీ ఆహార మోతాదును నియంత్రించడంలో సహాయపడటానికి, ఆహార లేబుల్స్, సిఫార్సు చేసిన సర్వింగ్ పరిమాణాలపై శ్రద్ధ వహించండి. పరిమాణ నియంత్రణ కోసం, అతిగా తినకుండా ఉండేందుకు చిన్న ప్లేట్‌ను ఉపయోగించడానికి ప్రయత్నించండి.
మీరు తినే ఆహారం మీ శరీరంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ప్యాంట్రీ నుండి ఏదైనా తినడానికి బదులుగా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి. మీ మూడ్ మారినప్పుడల్లా తినడానికి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను సిద్ధంగా ఉంచుకోండి. కొన్నింటిలో వివిధ గింజలు, ఎండిన పండ్లు, గ్రీక్ యోగర్ట్, ముక్కలుగా చేసిన కూరగాయలు, పండ్లు, ఎయిర్ ఫ్రైయర్లో చేసిన పాప్‌కార్న్ ఉన్నాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, మిఠాయిలను ప్యాంట్రీకి దూరంగా ఉంచండి. ఇవన్నీ బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి.
కొత్తగా తల్లిదండ్రి కావడం సవాలుతో కూడుకున్నది, చాలా పనులు ఉంటాయి. ఆందోళన, నిద్ర లేమిని ఎదుర్కోవడం కష్టంగా అనిపించవచ్చు. 9 మంది మహిళల్లో 1 మహిళ ప్రసవానంతర డిప్రెషన్‌ను కూడా ఎదుర్కుంటున్నారని తాజా అధ్యయనం తేల్చింది. ప్రసవం తర్వాత ఆరోగ్యకరమైన బరువును సాధించడం చాలా అవసరం. అయినప్పటికీ, ఇది ఒత్తిడి, ఆందోళనను కలిగించకూడదు. మీరు నిరుత్సాహానికి గురైతే, ఒత్తిడికి లోనవుతున్నట్లయితే, సహాయం కోరడం మర్చిపోవద్దు. మీకు సహాయం చేయమని పొరుగువారిని, కొన్ని గంటల పాటు శిశువును చూసుకోవడానికి లేదా భోజనం సిద్ధం చేయమని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను అడగండి. సరైన సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి, నయం చేయడానికి మీ కోసం సమయం ఇవ్వండి.
ప్రసవం తర్వాత అదనపు బరువు మోయడం చాలా సాధారణం. బరువు తగ్గడానికి ప్లాన్ చేయడానికి సరైన సమయం అంటూ ఏదీ లేదు. మీ వైద్యుడి సలహా సహాయంతో మీరు సిద్ధంగా ఉన్నప్పుడు ఇది క్రమంగా ప్రారంభమవుతుంది. నయం కావడానికి మీకు సమయాన్ని కేటాయించండి, తిరిగి మునుపటిలా అవ్వండి. సరైన పోషకాహారం, సమతుల్య ఆహారం, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు తగ్గిన తర్వాత కూడా మీ శరీరం ఒకేలా ఉండకపోవచ్చు. దానికి అభినందించండి. మీరు అద్భుతమైన పని చేశారు. బరువు తగ్గడానికి ఉత్తమ మార్గం చనుబాలు ఇవ్వడం, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం. అదనపు బరువు పెరగడానికి తొమ్మిది నెలలు పట్టింది, కాబట్టి మీరే కొంత సమయాన్ని వెచ్చించండి. మీ బిడ్డతో విలువైన క్షణాలను ఆస్వాదించండి. మీరు ప్రసవం నుండి కోలుకున్న తర్వాత, చనుబాలు ఇచ్చిన తర్వాత, మీరు మీ శరీరాన్ని తిరిగి పొందడం గురించి ఆలోచించవచ్చు.
Yes
No
Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |