Updated on 3 November 2023
మీరు గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్నారా? లేదా మీరు గర్భధారణ కారణంగా కలిగే అవకాశం ఉన్న కొన్ని లక్షణాలను అనుభూతి చెందారా? సరే, మీరు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఆర్టికల్ గర్భధారణ ఇంప్లాంటేషన్ డిశ్చార్జ్‌కు సంబంధించిన కొన్ని సంకేతాలు మరియు లక్షణాలను తెలుసుకోవడంలో మీకు సహాయం చేస్తుంది. మీరు ఏ లక్షణాలనూ కలిగి లేకపోతే, అటువంటి సందర్భంలో మీరు గర్భవతి కానట్లు అర్థం కాదని తెలుసుకోవడం చాలా అవసరం. చాలా మంది మహిళలు సాధారణంగా ఇంటి వద్ద గర్భ నిర్ధారణ పరీక్ష చేసుకొని, సానుకూల (పాజిటివ్) ఫలితం వచ్చే వరకు వారు ఎటువంటి గర్భధారణ లక్షణాలను కలిగి ఉండరు. వాస్తవానికి వివిధ ఇంప్లాంటేషన్ లక్షణాలను అనుభవించే మహిళలకు కూడా ఇది వర్తిస్తుంది. స్త్రీలందరికీ ఇంప్లాంటేషన్ సంబంధిత రక్తస్రావం జరగకపోవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: పీరియడ్స్ దాటిపోవడానికి ముందే తెలిసే ప్రెగ్నెన్సీ లక్షణాలు ఏమిటి?
ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది నేడు చాలా సాధారణ పరిస్థితి. వాస్తవానికి ఈ రకమైన రక్తస్రావం సాధారణ రుతుస్రావంతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ జరిగే సమయంలో, మీరు శానిటరీ ప్యాడ్‌లను ఖచ్చితంగా వాడాల్సిన అవసరం లేదు. మరకలు పడకుండా ఉండటానికి ప్యాంటీ లైనర్‌లను ఉపయోగించవచ్చు. మీరు ఎదుర్కొంటున్న సంకేతాలు మరియు లక్షణాలు సాధారణమైనవని నిర్ధారించుకోవడానికి, మీరు మీ గైనకాలజిస్ట్‌తో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఎక్కువ రక్తస్రావం కూడా గర్భస్రావం లేదా శరీరంలోని తీవ్ర ఆరోగ్య పరిస్థితిని సూచిస్తుంది.
గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న స్త్రీలు తమ శరీరాలపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు మరియు వారి శరీరంలో జరిగే ప్రతి మార్పుపై చాలా శ్రద్ధ వహిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో సానుకూల ఫలితాన్ని పొందిన తర్వాత, మీకు ప్రారంభ గర్భధారణ లక్షణాలు కనిపిస్తాయి. స్త్రీలందరూ ఈ లక్షణాలను అనుభవించరు. గర్భధారణ ఇంప్లాంటేషన్‌తో సంబంధం ఉన్న కొన్ని లక్షణాలు కింద పేర్కొనబడ్డాయి:
ప్రస్తుతం మీ ప్రధాన ప్రశ్న బహుశా - ఇంప్లాంటేషన్ రక్తస్రావం ఎప్పుడు జరుగుతుంది? గుడ్ల ఫలదీకరణ జరిగిన తర్వాత, మీకు లేత గోధుమరంగు లేదా గులాబీ రంగు మరక 3-4 రోజుల వరకు కనిపించవచ్చు, దీనిని ఇంప్లాంటేషన్ రక్తస్రావం అంటారు. చాలామంది మహిళలు దీనిని గర్భస్రావానికి చిహ్నంగా పొరబడతారు, కానీ ఇది ఎరుపు రంగు రుతుస్రావం నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్యాంటీ లైనర్ మిమ్మల్ని కాపాడుతుంది మరియు శానిటరీ ప్యాడ్‌ల వాడాల్సిన అవసరం ఉండదు. ఈ దశలో టాంపూన్‌లను ఉపయోగించడం మానుకోండి.
మీ హార్మోన్లలో మార్పులు తేలికపాటి కండరాల నొప్పికి దారి తీస్తాయి, కానీ ఇది రుతుస్రావ సమయంలో కలిగే నొప్పికి భిన్నంగా ఉంటుంది. మీ వీపు కింది భాగంలో మరియు పొత్తికడుపులో పదే పదే నొప్పి కలగవచ్చు. నొప్పి చాలా విపరీతంగా లేదా తీవ్రంగా ఉంటే, మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. తీవ్రమైన నొప్పి ఇతర అంతర్లీన సమస్యలను కూడా సూచిస్తుంది.
ఇంప్లాంటేషన్ తర్వాత, మీ హార్మోన్లలో మార్పులు మీ రొమ్ములను వాచేలా మరియు సున్నితంగా చేస్తాయి. మీ HCG, ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ హార్మోన్లలో మార్పులు జరుగుతాయి కాబట్టి మీ రొమ్ములు చాలా సున్నితంగా మారతాయి. ఇది మెలనోసైట్‌లను (చనుమొన కణాలు) ప్రభావితం చేస్తుంది మరియు చనుమొనల చుట్టూ ఉన్న భాగాన్ని నల్లగా చేస్తుంది.
మీరు చురుకుగా గర్భవతి కావడానికి ప్రయత్నిస్తుంటే, ఉదయం మీ కళ్ళు తెరిచిన తర్వాత, మీ మంచం నుండి కిందికి దిగకముందే, మీ శరీర ఉష్ణోగ్రతను మీరు పర్యవేక్షిస్తారు. అండోత్సర్గం జరిగే సమయంలో అధిక ప్రొజెస్టెరాన్ స్థాయిల కారణంగా BBT పెరుగుతుంది మరియు ఇంప్లాంటేషన్ సమయంలో, శరీర ఉష్ణోగ్రత 98.6 కంటే తక్కువగా ఉండి, అకస్మాత్తుగా పెరుగుతుంది.
కటి ప్రాంతం చుట్టూ రక్తం పెరుగుతుంది. ఇది మీ మూత్రాశయంపై ఒత్తిడిని కలిగించడం వల్ల, మీరు తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది. అయితే మీ సగటు రుతుక్రమంలో కూడా తరచుగా మూత్ర విసర్జన జరగవచ్చు. అందువల్ల రుతుస్రావం మరియు ఇంప్లాంటేషన్ రక్తస్రావం మధ్య తికమక పడకుండా చూసుకోండి.
హార్మోన్ల పెరుగుదల కారణంగా మీరు నిర్దిష్ట ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడవచ్చు, అలాగే మీరు సాధారణంగా తినని కొన్ని నిర్దిష్ట ఆహార పదార్థాల పట్ల తీవ్రమైన విరక్తి కూడా కలగవచ్చు. అంతేకాకుండా, మీ ఆకలిలో అపారమైన మార్పు ఉంటుంది. మీరు కడుపు నిండా భోజనం చేసిన వెంటనే కూడా ఆకలితో ఉన్నారనే భావన మీకు కలగవచ్చు. అవి కాకుండా మీకు అసాధారణమైన ఆహారాలు లేదా తినదగని వస్తువులపై కూడా కోరికలు కలగవచ్చు. అయినా సరే, మీ శరీర పరిస్థితి గురించి తెలుసుకొని, కోరికలకు లొంగకుండా చూసుకోండి. మీ కోరికలను అదుపులో ఉంచుకోవడానికి మీరు రోజుకు నాలుగు సార్లు భోజనం చేయవచ్చు. అంతేకాకుండా, గర్భధారణ సమయంలో పాటించే ఆహార నియమాలను అనుసరించడం చాలా సహాయపడుతుంది.
ఇంప్లాంటేషన్ సమయంలో, మీ హార్మోన్లలో జరిగే క్రియాశీలక మార్పుల కారణంగా హాట్ ఫ్లాష్ లు సంభవించవచ్చు. ఎక్కువ కారం ఉండే ఆహారాన్ని, అలాగే ఇతర తినదగిన పదార్థాలను పరిమితం చేయడం ద్వారా ఈ సమస్య నుండి మీరు ఉపశమనం పొందవచ్చు. నిజానికి ఈ దశలో మీరు తినే వాటి గురించి మీరు చాలా శ్రద్ధ వహించాలి. కొన్నిసార్లు ధూమపానం కూడా హాట్ ఫ్లాష్ లను కలిగిస్తుంది. అందువల్ల మీకు అప్పుడప్పుడు ధూమపానం చేసే అలవాటు ఉంటే, మీ గర్భధారణ దశలో పూర్తిగా ధూమపానం మానివేయాలి. మెదడుకు సంబంధించిన వివిధ థెరపీలను ప్రాక్టీస్ ద్వారా హాట్ ఫ్లాష్ లకు చెందిన పలు సమస్యల నుండి ఉపశమనం పొందడంలో కూడా చాలా సహాయకరంగా ఉంటుంది.
మీ హార్మోన్లలో మార్పుల కారణంగా గర్భాశయ శ్లేష్మం యొక్క ప్రవాహం పెరుగుతుంది.
మీ హార్మోన్లలో మార్పుల కారణంగా మీరు మీ మూడ్ స్వింగ్స్‌లో వేగవంతమైన మార్పులను ఎదుర్కొంటారు. ఇది ఏ స్థాయిలో ఉంటుందంటే, ఒక క్షణంలో ఏడవటం మరియు మరుసటి నిమిషంలో హఠాత్తుగా ఉల్లాసంగా అనిపించడం జరుగుతుంది. ఈ దశలో మీ భాగస్వామి లేదా కుటుంబం నుండి మద్దతు కోరడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాకుండా, మీరు మీ జీవిత భాగస్వామితో రొమాంటిక్ డేట్‌లకు వెళ్లడాన్ని కూడా పరిగణించవచ్చు. ఇది మీ మూడ్‌ని మెరుగుపరచడంతో పాటు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే ఉల్లాసవంతమైన మూడ్ కూడా మీ మానసిక స్థితిపై అనేక సానుకూల ప్రభావాలను చూపుతుంది.
ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరగడం వల్ల మీ పొట్ట బుడగ లాగా ఉబ్బుతుంది. అయితే, కడుపు నొప్పితో పాటు ఉబ్బరం ఉంటే, మీరు డాక్టర్ ని సంప్రదించడం చాలా ముఖ్యం.
మీరు మొదటి కొన్ని వారాలలో మార్నింగ్ సిక్ నెస్, అజీర్ణం మరియు మలబద్ధక సమస్యలను ఎదుర్కుంటారు. HCG మరియు ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరగడం వల్ల, వాసనకు సంబంధించిన మీ ఇంద్రియాలు కూడా ఎక్కువగా ప్రభావితమవుతాయి. పెరుగుతున్న హార్మోన్లు మిమ్మల్ని రోజంతా అశాంతికి గురి చేస్తాయి మరియు కొంచెం తల నొప్పిని కలిగిస్తాయి.
పైన పేర్కొన్న అన్ని సంకేతాలు మరియు లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటే, ఎవరైనా తమ ఇంప్లాంటేషన్ స్పాటింగ్‌ను సులభంగా నిర్ధారించవచ్చు. మీరు గర్భవతి అయ్యారో లేదో నిర్ధారించుకోవడానికి ఇంట్లోనే గర్భధారణ పరీక్ష చేసుకోండి. అంతే కాకుండా, మీరు మరింత తెలుసుకోవడానికి మీ గైనకాలజిస్ట్‌ను కూడా సంప్రదించవచ్చు. మీరు గర్భం దాల్చారని ధృవీకరించబడినట్లయితే, మీరు కనీసం నెలకు రెండు సార్లు మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
Tags
Pregnancy implantation in telugu, Symptoms of implantation in telugu, Implantation bleeding in telugu, implantation causes in telugu, Food cravings during implantation in telugu, urination in telugu.
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips
গর্ভাবস্থায় আলুবোখরা: উপকারিতা ও ঝুঁকি | Prunes During Pregnancy: Benefits & Risks in Bengali
গর্ভাবস্থায় হিং | ঝুঁকি, সুবিধা এবং অন্যান্য চিকিৎসা | Hing During Pregnancy | Risks, Benefits & Other Treatments in Bengali
স্তনের উপর সাদা দাগ: লক্ষণ, কারণ এবং চিকিৎসা | White Spots on Nipple: Causes, Symptoms, and Treatments in Bengali
গর্ভাবস্থায় পোহা: উপকারিতা, ধরণ এবং রেসিপি | Poha During Pregnancy: Benefits, Types & Recipes in Bengali
গর্ভাবস্থায় মাছ: উপকারিতা এবং ঝুঁকি | Fish In Pregnancy: Benefits and Risks in Bengali
গর্ভাবস্থায় রেড ওয়াইন: পার্শ্ব প্রতিক্রিয়া এবং নির্দেশিকা | Red Wine During Pregnancy: Side Effects & Guidelines in Bengali
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |