hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • డెలివరీ తర్వాత వెన్నునొప్పి: కారణాలు, చికిత్స, ఉపశమనానికి చిట్కాలు arrow

In this Article

     డెలివరీ తర్వాత వెన్నునొప్పి: కారణాలు, చికిత్స, ఉపశమనానికి చిట్కాలు

    డెలివరీ తర్వాత వెన్నునొప్పి: కారణాలు, చికిత్స, ఉపశమనానికి చిట్కాలు

    Updated on 3 November 2023

    ఒక స్త్రీ ప్రసవం తర్వాత ఎదుర్కొనే చివరి విషయం వెన్నునొప్పి. దురదృష్టవశాత్తు చాలా మంది మహిళలకు ఇది వాస్తవం. వాస్తవానికి డెలివరీ తర్వాత 80% మంది మహిళలు ఏదో ఒక రూపంలో వెన్నునొప్పిని అనుభవిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, ఈ వెన్నునొప్పికి కారణమేమిటి? మరింత ముఖ్యంగా, అసౌకర్యాన్ని తగ్గించడానికి ఏమి చేయవచ్చు? ఈ బ్లాగ్ డెలివరీ తర్వాత వెన్నునొప్పికి కారణాలు, చికిత్సలను అన్వేషిస్తుంది. ఉపశమనం కోసం కొన్ని చిట్కాలను అందిస్తుంది.

    ప్రసవానంతర వెన్నునొప్పి అంటే ఏమిటి?

    ప్రసవానంతర వెన్నునొప్పి అనేది ప్రసవం తర్వాత జరిగే ఒక సాధారణ సంఘటన. ప్రసవ సమయంలో శారీరక శ్రమ, హార్మోన్ల మార్పులు మరియు మానసిక ఒత్తిడితో సహా అనేక కారణాలు ఈ నొప్పికి కారణంగా ఉన్నాయి. అదృష్టవశాత్తూ.. అసౌకర్యాన్ని తగ్గించడానికి మరియు ఉపశమనం పొందడానికి అనేక పనులు కూడా చేయవచ్చు. ప్రసవానంతర వెన్నునొప్పికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి ప్రసవ సమయంలో శారీరక శ్రమ. గర్భధారణ, డెలివరీ సమయంలో స్త్రీ శరీరం అనేక మార్పులకు గురవుతుంది. వారి వెన్నుముక చాలా ఒత్తిడికి లోనవుతుంది. ఇది కండరాల నొప్పులు, నొప్పులు, సాధారణ అలసటకు దారితీస్తుంది.

    ప్రసవానంతర వెన్నునొప్పికి కారణమేమిటి?

    గర్భధారణ సమయంలో దాదాపు అందరు మహిళలూ వెన్నునొప్పిని ఎదుర్కొంటారు. ఇది సాధారణంగా వారి అదనపు బరువు, వారి మారుతున్న గురుత్వాకర్షణ కేంద్రం, వారి కీళ్ళు, స్నాయువులను వదులు చేసే హార్మోన్ల వల్ల సంభవిస్తుంది. శుభవార్త ఏమిటంటే గర్భధారణ సంబంధిత వెన్నునొప్పి సాధారణంగా తాత్కాలికంగా ఉంటుంది.

    ప్రసవానంతర వెన్నునొప్పికి ఒక సాధారణ కారణం బలహీనమైన పొత్తికడుపు కండరాలు. పొత్తికడుపు కండరాలు వెన్నెముకకు మద్దతు ఇస్తాయి, కాబట్టి అవి బలహీనంగా ఉన్నప్పుడు, ఇది వెనుక క్రింది భాగంలో నొప్పికి దారితీస్తుంది. ఇది తరచుగా సరైన భంగిమ లేకపోవడం, చనుబాలు అలవాట్లతో ఇంకా పెరుగుతుంది. ప్రసవానంతర వెన్నునొప్పికి మరొక కారణం పెల్విక్ ఫ్లోర్ కండరాలు లేదా స్నాయువులకు గాయం కావడం. ఈ గాయాలు తరచుగా యోని డెలివరీ ఫలితంగా అవుతాయి. కానీ అవి సిజేరియన్ డెలివరీలు చేసిన మహిళల్లో కూడా సంభవించవచ్చు.

    నా ప్రసవానంతర వెన్నునొప్పి ఎంతకాలం ఉంటుంది?

    డెలివరీ తర్వాత కొన్ని రోజులు లేదా ఒక వారం వరకు కొంత నొప్పి మరియు అసౌకర్యం ఉండటం సాధారణం. చాలామంది స్త్రీలకు, నొప్పి దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొంతమంది స్త్రీలకు మాత్రం నొప్పి నెలల తరబడి ఉంటుంది. చాలా సందర్భాలలో.. ప్రసవానంతర వెన్నునొప్పి కొంత సమయం తర్వాత స్వీయ-సంరక్షణతో అదే వెళ్లిపోతుంది.

    డెలివరీ తర్వాత ప్రసవానంతర వెన్నునొప్పి కోసం వైద్యుడిని ఎప్పుడు చూడాలి

    ప్రసవం తర్వాత స్త్రీకి వెన్నునొప్పి ఉందంటే, వారొక్కరికే ఈ పరిస్థితి ఉందని అర్థం కాదు. వాస్తవానికి, అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్‌స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్‌ల ప్రకారం.. 70% మంది కొత్త తల్లులు ప్రసవానంతర కాలంలో కొంత వెన్నునొప్పిని అనుభవిస్తారు. సెల్ఫ్ కేర్ చర్యలు సహాయం చేయనట్లయితే లేదా ఎవరికైనా తీవ్రమైన నొప్పి ఉంటే, వారి వైద్యుడిని చూడటం ముఖ్యం. వారు మీ నొప్పికి ఇతర సంభావ్య కారణాలను తోసిపుచ్చవచ్చు. దానిని ఎలా ఉత్తమంగా చికిత్స చేయాలో మార్గనిర్దేశం చేయవచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: కొత్తగా అమ్మ అయిన ప్రతి మహిళ గుర్తుంచుకోవాల్సిన టాప్ 5 విషయాలు

    డెలివరీ తర్వాత ప్రసవానంతర వెన్నునొప్పికి చికిత్సలు

    ప్రసవానంతర వెన్నునొప్పికి చికిత్స చేయడంలో ప్రభావవంతంగా ఉండే అనేక విభిన్న చికిత్సలు ఉన్నాయి. అత్యంత సాధారణ మరియు ప్రభావవంతమైన చికిత్సలలో కొన్ని:

    1. ఐస్ లేదా హీట్ థెరపీ: ప్రభావిత ప్రాంతానికి ఐస్ లేదా వేడిని పూయడం వల్ల మంట, నొప్పి తగ్గుతుంది.

    2. మసాజ్: ప్రభావిత ప్రాంతంలో మసాజ్ చేయడం వల్ల బిగుతుగా ఉన్న కండరాలు వదులు చేసి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

    3. వ్యాయామం: వెన్ను, పొత్తికడుపు కండరాలను బలోపేతం చేసే సున్నితమైన వ్యాయామాలు వెన్నెముకకు మద్దతు ఇవ్వడానికి, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

    4. చిరోప్రాక్టిక్ కేర్: వెన్నెముకకు సర్దుబాట్లు నరాల మీద ఒత్తిడిని తగ్గించడానికి మరియు వెన్నెముక అమరికను మెరుగుపరచడానికి, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

    5. ఆక్యుపంక్చర్: శతాబ్దాల నాటి ఈ చికిత్సలో సన్నని సూదులను శరీరంపై నిర్దిష్ట బిందువులలో ఉంచడం ఉంటుంది. ఇది శరీరం ద్వారా శక్తి ప్రవాహాన్ని మెరుగుపరచడం ద్వారా వైద్యాన్ని ప్రేరేపిస్తుంది. నొప్పి నుండి ఉపశమనం ఇస్తుందని భావిస్తారు.

    ప్రసవానంతర వెన్నునొప్పి నుండి ఉపశమనం కోసం చిట్కాలు

    ప్రసవానంతర వెన్నునొప్పి నుండి ఉపశమనం కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి:

    1. వీలున్నప్పుడు విశ్రాంతి తీసుకోండి. ఒకరికి నవజాత శిశువు ఉన్నప్పుడు ఇలా చెయ్యమని చెప్పడం చాలా సులభం కానీ చెయ్యడం సునాయాసం కాదు. అయితే.. మీ శిశువు నిద్రపోతున్నప్పుడు నిద్రించడానికి ప్రయత్నించండి లేదా ఎవరైనా ఒక గంట పాటు శిశువును చూసేలా చేయండి. తద్వారా మీరు విశ్రాంతి తీసుకోవచ్చు.

    2. సహాయక దుస్తులు ధరించండి. సపోర్టివ్ బ్రా మరియు సౌకర్యవంతమైన బూట్లు మీ వీపుపై కొంత ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. మీరు తల్లిపాలు ఇస్తున్నట్లయితే.. మీకు పుష్కలంగా మద్దతునిచ్చే మంచి నర్సింగ్ బ్రాని కలిగి ఉండేలా చూసుకోండి.

    3. సున్నితమైన స్ట్రెచ్ లు లేదా యోగా భంగిమలను ప్రయత్నించండి. కొన్ని సాధారణ స్ట్రెచ్‌లు లేదా యోగా భంగిమలు మీ వెన్నుముక కండరాలపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఏదైనా కొత్త వ్యాయామ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మీ వైద్యుడిని లేదా మంత్రసానిని సంప్రదించండి.

    ముగింపు

    గర్భం మరియు ప్రసవం అద్భుతమైన అనుభవాలు. కానీ అవి ఒకరి శరీరాన్ని కూడా దెబ్బతీస్తాయి. డెలివరీ తర్వాత ఒక మహిళ వెన్నునొప్పితో బాధపడుతుంటే.. అది పూర్తిగా సాధారణమని తెలుసుకోండి. కొత్త తల్లులకు ఇది చాలా సాధారణ సమస్య, కానీ అసౌకర్యాన్ని తగ్గించడానికి ఒకరు చేయగల విషయాలు ఉన్నాయి. ఏ చికిత్సలు సరైనవి కావచ్చనే దాని గురించి డాక్టర్‌తో మాట్లాడండి. ఉపశమనం పొందేందుకు ఇక్కడ మీతో పంచుకున్న కొన్ని చిట్కాలను ప్రయత్నించండి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |