Skin Changes
3 November 2023 న నవీకరించబడింది
ప్రస్తుతం మీ చర్మం ఎదుర్కొంటున్న బాహ్య మరియు అంతర్గత వాతావరణం కారణంగా మీరు అనేక చర్మ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు . మీ చర్మం సహజంగా వృద్ధాప్యం పొందే ప్రక్రియ , హార్మోన్ల పరిస్థితులు లేదా బయటి వాతావరణం కారణంగా ఈ చర్మ సమస్యలు తలెత్తవచ్చు. అయితే, మీరు ఇకపై ఇలాంటి చర్మ సమస్యల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, టీ ట్రీ ఆయిల్ క్రీమ్ వంటి అద్భుతమైన ఉత్పత్తి మీ చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది!
మీరు మీ చర్మం పై మొండి జిడ్డు లోపాలను నిర్మూలించడానికి తప్పనిసరిగా వందల ఉత్పత్తులను ప్రయత్నించి విజయవంతమైన ఫలితాలను పొందలేక నిరుత్సాహపడి ఉంటారు. కఠినమైన చర్మ సంరక్షణ నియమాన్ని అనుసరించడం మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చేసినా కూడా, మీరు మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్, మొటిమలు, వైట్‌హెడ్స్ మరియు సమానంగా లేని స్కిన్ టోన్‌తో బాధపడుతూ ఉండవచ్చు. ఇది వివిధ కారణాల వల్ల జరుగుతుంది:
మీరు జిడ్డు చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలను నయం చేసే ఒక్క పరిష్కారం కోసం వెతుకుతున్నయితే, మీరు టీ-ట్రీ ఆయిల్‌ను కలిగి ఉన్న చర్మ సంరక్షణ ఉత్పత్తులను ప్రయత్నించండి. మెలలేయుకా ఆల్టర్నిఫోలియా అని పిలువబడే ఆస్ట్రేలియన్ మొక్క నుండి తీసుకోబడిన టీ-ట్రీ ఆయిల్ వివిధ ప్రయోజనాలను కలిగి ఉన్న ముఖ్యమైన నూనెలలో ఒకటి.
మనం టీ ట్రీ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు, అది మన రోజువారీ జీవితంలో ఉపయోగించే సాధారణ టీ ప్లాంట్ కాదని మనం తెలుసుకోవాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, పోషణ, ఉపశమనం కలిగించే, యాంటీ ఫంగల్, యాంటీ-మైక్రోబయల్ మరియు యాంటీ-అలెర్జీ లక్షణాల కారణంగా దీనిని తరచుగా 'నైట్ ఇన్ షైనింగ్ ఆర్మర్' అని పిలుస్తారు. టీ ట్రీ ఆయిల్ అన్ని చర్మ లోపాల చికిత్సలో సహాయపడే ఉత్తమమైన 5 మార్గాలు ఇక్కడ ఉన్నాయి:
మయిలో కేర్ టీ ట్రీ ఫేస్ వాష్ మొటిమల బారిన పడ్డ మీ చర్మంపై చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది . ఇది అన్నిరకాల బాక్టీరియా, వైరస్లు మరియు శిలీంధ్రాల పెరుగుదలను ఎదుర్కొని మొటిమలు మరియు ఇతర చర్మ సంబంధిత సమస్యల తొలగింపుకి సహాయపడుతుంది. ఇది మూసుకుపోయిన రంధ్రాల నుండి మురికిని తొలగించి మీ చర్మాన్ని పుష్టిగా చేయడం ద్వారా మరియు పునరుజ్జీవింపజేయడం ద్వారా చనిపోయిన అన్ని చర్మ కణాలను వదిలించుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీరు చేయాల్సిందల్లా రోజుకు రెండుసార్లు ఉదయం మరియు రాత్రి పడుకునే ముందు ఫేస్ వాష్‌ని ఉపయోగించడం. ఒకసారి ఫేస్ వాష్ ను వాడిన తర్వాత, మయిలో కేర్ విటమిన్ సి బ్రైటెనింగ్ మాయిశ్చరైజర్‌ను బాగా అప్లై చేయడం మరచిపోకండి. ఈ విధంగా, మీరు రాత్రంతా మీ చర్మం తనను తాను మరమ్మత్తు చేయడంలో సహాయపడవచ్చు.
ఇది విష పదార్థాలను తొలగించడంలో సహాయపడటంతో పాటు మీ చర్మంపై ఉన్న అన్ని మొటిమల గుర్తులను తొలగిస్తుంది. మీ చర్మం లోపల నుండి శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అది బయట దోషరహితంగా మెరుస్తుంది. టీ ట్రీ ఆయిల్ మీ చర్మం యొక్క సహజ నూనె సమతుల్యతను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. అందువలన, ఈ విధంగా మీ చర్మం ఎక్కువ కాలం పాటు మెరుస్తూ ఉంటుంది!
మీ ముఖాన్ని ఫేస్‌వాష్‌తో కడిగిన తర్వాత, మీరు మయిలో కేర్ టీ ట్రీ ఫేస్ క్రీమ్‌ను అప్లై చేయాలి. ఎందుకంటే ఇది వేప, టీ ట్రీ ఆయిల్, తులసి మరియు ఒకటి కంటే ఎక్కువ-పండ్ల పదార్దాలతో ప్రత్యేకంగా రూపొందించబడింది. అధిక సెబమ్ స్రావాన్ని నియంత్రించడం ద్వారా, టీ ట్రీ ఆయిల్ మీ కుమిలిపోయిన చర్మానికి ఉపశమనాన్ని, వైద్యం మరియు మరమ్మత్తు చేయడంలో సహాయపడుతుంది. కొన్నిసార్లు చర్మం యొక్క దురద అంతర్లీన ఆరోగ్య సమస్యలను కూడా సూచిస్తుంది. నివారణలను అనుసరించిన తర్వాత కూడా దురద తగ్గకపోతే, మీ చర్మవ్యాధి నిపుణుడితో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి ఇది సరైన సమయం కావచ్చు.
టీ ట్రీ ఆయిల్ యొక్క మంచితత్వం చర్మం పొడిబారడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది లోపల నుండి నీరు ఉండేలా చేసి చర్మపు మంటకు వీడ్కోలు చెప్పడంలో సహాయపడుతుంది. ఇది చర్మం యొక్క స్థితిస్థాపకతను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. చివరికి, ఇది కొత్త చర్మ కణాల అభివృద్ధికి సహాయపడుతుంది. టీ ట్రీ ఆయిల్ అనేది జిడ్డుగల చర్మ రకాలు ఉన్నవారికి సహాయపడే ఒక అద్భుత పదార్ధం. ఇది క్రిమిసంహారక ప్రక్రియలో అద్భుతంగా పని చేస్తుంది.
ఇది మీ సున్నితమైన చర్మంలోకి సౌమ్యంగా చొచ్చుకుపోయి లోపలి నుండి ఉపశమనం ఇవ్వడమే కాకుండా పోషణను కూడా అందిస్తుంది. ఈ ఉత్పత్తి యొక్క గొప్పతనం ఏంటంటే, ఇది మీ చర్మం తేమ, సూర్యకిరణాలు మరియు చల్లటి గాలులు వంటి విపరీతమైన వాతావరణ పరిస్థితులకు గురైన ప్రతిసారీ ఒక క్లెన్సర్‌గా ఉపయోగించబడి, తేమగా ఉండే ద్రావకం వలె పనిచేస్తుంది. మీరు మెట్రోపాలిటన్ నగరం యొక్క రద్దీ మరియు కాలుష్యాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడల్లా టీ ట్రీ ఆయిల్ రక్షణ కవచంగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఈ ఎప్పటికీ అంతం కాని మొటిమల సమస్య నుండి అప్రయత్నంగా బయటపడవచ్చు.
మీ మొటిమలను తగ్గించడంలో మీకు సహాయపడటానికే కాకుండా, వయస్సును చూపించే మచ్చలను కూడా తగ్గించడానికి టీ ట్రీ ఆయిల్‌ని ఉపయోగించవచ్చు. నిజానికి, టీ ట్రీ ఆయిల్ గీతలు లేదా ముడతలను తగ్గించే విషయంలో చాలా బాగా పనిచేస్తుంది. క్రమంగా వాడటం ద్వారా మీరు మీ చర్మాన్ని ఏ సమయంలోనైనా మచ్చలేని స్థితిలో కనుగొంటారు! మొటిమల కోసం టీ ట్రీ ఫేస్ క్రీమ్ వంటి ఉత్పత్తులు ఆస్ట్రింజెంట్‌గా మరియు క్రిమినాశక పదార్ధంగా పనిచేస్తాయి. కుంగిపోయిన లేదా వదులుగా ఉన్న చర్మానికి చికిత్స చేసేటప్పుడు ఈ లక్షణాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నిజానికి, మీరు టీ ట్రీ ఆయిల్‌తో కూడిన ఉత్పత్తులను ఎక్కువ కాలం పాటు ఉపయోగించడం చేసినప్పుడు, మీరు మీ చర్మాన్ని దృఢమైన స్థితిలో కనుగొంటారు!
మీరు రాత్రిపూట మీ ముఖంపై టీ ట్రీ ఆయిల్‌ను కూడా వదిలివేయవచ్చు. కాకపోతే టీ ట్రీ ఆయిల్ ను మీ చర్మంపై వదిలే ముందు జొజోబా లేదా బాదం నూనె వంటి కొన్ని క్యారియర్ ఆయిల్ తో కలిపామని నిర్ధారించుకోండి. ముడి టీ ట్రీ ఆయిల్ మీ చర్మాన్ని చికాకుపెడుతుంది, అందుకే దీన్ని క్యారియర్ ఆయిల్‌తో అప్లై చేయడం ఉపయోగకరంగా ఉంటుంది! మీరు ఉదయం మీ చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు! క్రమంగా వాడటం వలన మీరు ఖచ్చితంగా పెద్ద వ్యత్యాసాన్ని చూడగలరు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో మీరు ప్రయత్నించడానికి సురక్షితమైన టాప్ 10 బ్యూటీ ట్రీట్మెంట్స్
అవును! టీ ట్రీ ఆయిల్ వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. చర్మం యొక్క తేలికపాటి చర్మ వ్యాధిని అనుభవించవచ్చు. కొన్ని సందర్భాల్లో పొక్కులతో కూడిన దద్దుర్లు కూడా కనిపించవచ్చు. మీకు మొక్కలకు అలెర్జీ ఉన్నట్లయితే, టీ ట్రీ క్రీమ్‌ను అప్లై చేయడం వల్ల మీ చర్మంలోని కొన్ని ప్రాంతాలలో దురద మరియు మండటం మరింత ఎక్కువవుతాయి. మీరు ఈ ఉత్పత్తిని వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయించుకునేలా నిర్ధారించుకోండి. ఉత్పత్తిని ఉపయోగించిన తర్వాత మీరు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటే, వెంటనే మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతని సంప్రదించండి.
టీ ట్రీ ఆయిల్‌తో కూడిన ఉత్పత్తులు దీర్ఘకాలంలోఅనేక చర్మ సమస్యలను ఎదుర్కోవడంలో మీకు సహాయపడతాయి. అంతే కాకుండా, మీ మయిలో కేర్ టీ ట్రీ ఫేస్ క్రీమ్, అలాగే మయిలో కేర్ టీ ట్రీ ఫేస్ వాష్, మీ చర్మాన్ని ఖచ్చితంగా సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంచుతాయి. దీని వల్ల బాగా గుర్తించదగిన ఫలితాలు మీకు లభిస్తాయి! మీరు క్రమంగా మంచి చర్మ సంరక్షణ దినచర్యను పూర్తిగా అనుసరించడం చాలా అవసరం అని ఇంకోసారి గుర్తుపెట్టుకోవాలి.
Yes
No
Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |