hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • గర్భాశయ పరిపక్వత (సర్వికల్ రైపెనింగ్): విషయం, పద్ధతులు, లాభాలు & అపాయాలు (Cervical Ripening: Concept, Methods, Benefits & Threats in Telugu) arrow

In this Article

    గర్భాశయ పరిపక్వత (సర్వికల్ రైపెనింగ్): విషయం, పద్ధతులు, లాభాలు & అపాయాలు (Cervical Ripening: Concept, Methods, Benefits & Threats in Telugu)

    గర్భాశయ పరిపక్వత (సర్వికల్ రైపెనింగ్): విషయం, పద్ధతులు, లాభాలు & అపాయాలు (Cervical Ripening: Concept, Methods, Benefits & Threats in Telugu)

    Updated on 3 November 2023

    మీరు గర్భధారణ కాలంలో చివరి దశకి చేరుకునేటప్పటికి, మీ గర్భాశయం మెత్తబడటం మొదలై, మీ బిడ్డ బయటకి రావటానికి తయరవుతూ ఉంటుంది. ప్రసవ సమయంలో బిడ్డ బయటకి రావటానికి గర్భాశయం తెరుచుకోబడటం (ఓపెన్ సర్విక్స్) అవసరం. అయితే.. చాలా కేసులలో గర్భాశయ పరిపక్వత అనుకున్నట్టు జరగదు. అదృష్టవశాత్తూ, ఈ ప్రక్రియని కొనసాగించడంలో సహాయపడడానికి మీరు కొన్ని పనులు చేయవచ్చు.

    గర్భాశయ పరిపక్వత (సర్వికల్ రైపెనింగ్) అంటే ఏమిటి (What is Cervical Ripening in Telugu)?

    గర్భాశయ పరిపక్వత అనేది ప్రసవం మొదలవడానికి ముందు గర్భాశయం ద్వారాన్ని మెత్తగా చేసి తెరుచుకునేలా చేసే ప్రక్రియ. ప్రెగ్నెన్సీలో ఎక్కువ భాగం గర్భాశయం లోపల బిడ్డని స్థిరంగా ఉంచడానికి మూసుకొని, గట్టిగా ఉంటుంది. కానీ, పురిటి సమయంలో బిడ్డ బయటకి వెళ్లడానికి వీలుగా గర్భాశయ ద్వారం తెరుచుకునే సర్వికల్ డైలేషన్ ప్రక్రియ జరుగుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో గర్భాశయం ఇలా మెత్తబడడాన్ని ఎఫస్మెంట్ అంటారు. చాలామంది మహిళల్లో గర్భాశయ పరిపక్వత సహజంగానే జరుగుతుంది. కానీ కొంతమంది స్త్రీలలో గర్భాశయం పరిపక్వత చెందడానికి బయట నుండి సహాయం అవసరం. ఈ సాయాన్ని మందులు లేదా శస్త్ర చికిత్స పద్ధతులు లేదా కొన్ని పరికరాల ద్వారా చేస్తారు.

    గర్భాశయ పరిపక్వత ఎవరికి అవసరం (Who Requires Cervical Ripening in Telugu)?

    ప్రసవం బయట నుండి ప్రేరేపించాల్సిన వారికి సాధారణంగా గర్భాశయ పరిపక్వత లేదా సర్వికల్ రైపెనింగ్ అవసరపడుతుంది. పురిటి నొప్పులని మొదలుపెట్టడానికి ఈ కృత్రిమ ప్రేరణ లేదా ఇండక్షన్ అక్కడి కండరాల సంకోచ వ్యాకోచాలని ప్రేరేపిస్తుంది. ఈ కింది స్థితులలో మీకు సర్వికల్ రైపెనింగ్ అవసరపడవచ్చు:

    • ఒకవేళ ప్రెగ్నెన్సీ సమయానికి మించి ప్రసవం జరగకుండా ఉంటే ఇది అవసరమవుతుంది(41 వారాల కన్నా ఎక్కువగా ఉంటే).
    • మీకు లేదా మీ పుట్టబోయే బిడ్డకి ప్రీక్లాంప్సియా, ఎదుగుదల తక్కువగా ఉండటం లేదా గర్భ సమయంలో వచ్చే మధుమేహం వచ్చే రిస్కులు ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా ఇది అవసరం అవుతుంది.

    నాకు గర్భాశయ పరిపక్వత అవసరమని మా డాక్టరుకి ఎలా తెలుస్తుంది (How does my doctor know if I need cervical ripening in Telugu)?

    డాక్టరు మీ గర్భాశయ పరిపక్వత ఎంత స్థాయిలో ఉందో చెక్ చేయడానికి బిషప్ స్కోర్ అని పిలవబడే కొలమానాన్ని ఉపయోగిస్తారు. డాక్టరు మీ గర్భాశయాన్ని పరీక్షించి మీ బిషప్ స్కోర్ ఎంతో లెక్కిస్తారు. ఆయన మీ గర్భాశయాన్ని దాని స్థానం, ఎంత సన్నబడింది, ఎంత మెత్తబడింది, ఎంత తెరుచుకుంది అనే వాటి కోసం పరీక్షిస్తారు. బిషప్ స్కోర్ 6 కంటే తక్కువగా ఉంటే మీ గర్భాశయం కావలసినంత పరిపక్వత చెందలేదని అర్థం. అదే విధంగా ఒక 8 వరకు స్కోర్ ఉంటే మీ శరీరం ప్రసవం కోసం తయారుగా ఉందని ఇంక మీకు గర్భాశయాన్ని పక్వం చేయడం అవసరం లేకపోవచ్చని అర్థం.

    ప్రసవ సమయంలో గర్భాశయ పరిపక్వత ఎప్పుడు జరుగుతుంది (When does cervical ripening occur during labour in Telugu) ?

    మామూలుగా అయితే ప్రసవం మొదలయ్యే ముందు గర్భాశయం సహజంగానే పరిపక్వం చెందుతుంది. ప్రసవం యొక్క మొదటి దశలో గర్భాశయం ముఖద్వారం తెరుచుకుని, విస్తరిస్తూ సన్నబడుతుంది. రెండవ దశలో ఇది పూర్తిగా 10 సెంటీమీటర్ల వరకూ విస్తరించి తెరుచుకుంటుంది.

    గర్భాశయాన్ని పరిపక్వం చేసే ప్రక్రియని ఎలా చేస్తారు (How is cervical ripening carried out in Telugu)?

    సర్విక్స్ రైపనింగ్ లేదా గర్భాశయాన్ని చాలా పద్ధతులలో పరిపక్వం చేస్తారు. అవేంటంటే:

    • మందులు లేకుండా చేసే పద్ధతులు
    • మందులు
    • భౌతికంగా పొరని తొలగించటం
    • ప్రత్యేక పరికరాలు

    గర్భాశయాన్ని సహజంగా పరిపక్వం చెందించటం సాధ్యమేనా (Is it possible to naturally ripen the cervix in Telugu) ?

    బిడ్డ పుట్టేముందు మీ గర్భాశయం పరిపక్వతకి సహజంగా రావడానికి ప్రాచీన కాలం నుండి కొన్ని పద్ధతులు ఉపయోగించబడుతున్నాయి. అయితే మీరు వాటిని ప్రయత్నించే ముందు మీ డాక్టర్‌ని ఒకసారి కనుక్కోండి. మందులు అవసరంలేని ఈ నాన్- ఫార్మకోలాజికల్ పద్ధతులు శరీరంలో హార్మోన్లను విడుదల చేయడం ద్వారా గర్భాశయ పరిపక్వతని సాధిస్తాయి. ఇంట్లోనే సహజంగా గర్భాశయం మెత్తబడి తెరుచుకునేలా ఎలా చేయడం అని ఆలోచిస్తున్నట్లయితే ఈ కింది వాటిని ప్రయత్నించి చూడండి:

    • స్తనాలని ప్రేరేపించడం
    • ఆక్యుపంచర్
    • మూలికా సప్లిమెంట్లు
    • ఆముదం నూనె
    • ఎనిమాలు
    • సెక్స్
    • వేడి నీటి స్నానం
    • TENS థెరపీ (ట్రాన్స్ క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్)

    మందులు ఎలా గర్భాశయాన్ని పరిపక్వం చెందేలా చేస్తాయి (How can medicine cause the cervix to ripen in Telugu) ?

    మీ గర్భాశయ పరిపక్వతని ప్రోత్సహించడానికి మీ డాక్టరు కృత్రిమ ప్రోస్టాగ్లాండిన్లని ఇవ్వవచ్చు. ఈ ప్రకృతిలో సహజంగా ఉండే రసాయన పదార్థాలు, శరీరంలో హార్మోన్-లాంటి లక్షణాలను అందిస్తాయి. మీ డాక్టరు ప్రోస్టాగ్లాండిన్లని మందుల రూపంలో జెల్ లేదా పెసరీ రూపంలో కూడా ఇవ్వవచ్చు. జెల్ రాసిన నాళికలాంటి కేథెటర్ను గర్భాశయ ముఖ ద్వారం వద్ద పూయడానికి పంపించవచ్చు. గర్భాశయ పరిపక్వతని సాధించి అది తెరుచుకునేలా చేయడానికిఈ మందుని చాలాసార్లు అక్కడ పూయాల్సి రావచ్చు.

    గర్భాశయ పరిపక్వత కోసం వాడే ఇతర మందులు (Other medications for cervical ripening include):

    • మిఫెప్రిస్టోన్
    • ఆక్సిటోసిన్
    • డినోప్రోస్టోన్
    • మిసోప్రోస్టోల్

    పరికరాల వలన గర్భాశయం ఎలా పరిపక్వం చెందుతుంది (How do gadgets cause the cervix to ripen in Telugu)?

    గర్భాశయ ద్వారం దగ్గర ఒత్తిడి కలిగించి దాన్ని వెడల్పుగా తెరుచుకునేలా చేయడానికి డైలేటర్లు అనే పరికరాలని ఉపయోగిస్తారు. ఈ పరికరం వలన శరీరం కూడా సహజంగా ప్రోస్టాగ్లాండిన్లని స్రవించి ఈ ప్రక్రియ కొనసాగేలా చేస్తుంది. గర్భాశయ ద్వారం దగ్గరకి గాలితో కూడిన బెలూన్లను చొప్పించి, తర్వాత వాటిని స్టెరైల్ నీరు లేదా సెలైన్ నీరుతో నింపి ఈ పద్ధతిని అమలుపరచవచ్చు.

    శస్త్రచికిత్స ఎలా గర్భాశయ పరిపక్వతకి కారణమవుతుంది (How does surgery cause the cervix to ripen in Telugu)?

    గర్భాశయ పరిపక్వత కోసం కొన్ని శస్త్రచికిత్సలని కూడా సిఫారసు చేయవచ్చు. వాటిల్లో కొన్ని:

    ఆమ్నియోటమీ (Amniotomy):

    ఈ ఆపరేషన్లో ప్రోస్టాగ్లాండిన్లు సహజంగా విడుదలయ్యేలా సాయం చేయడానికి ఆమ్నియోటిక్ స్కాన్‌కు చీలిక పెట్టడం జరుగుతుంది.

    పొరలకి చీలిక పెట్టడం (Stripping the membranes):

    ప్రోస్టాగ్లాండ్లిన్లని విడుదలచేయడంలో సాయపడే ఉమ్మనీరు తిత్తి (ఆమ్నియోటిక్ సాక్) అలాగే గర్భాశయం మధ్యలో ఉన్న పొరలని వేరుచేయడానికి లేదా కదిలేలా చేయడానికి డాక్టరు గ్లవ్స్ వేసుకున్న వేలుని లోపలపెట్టి ప్రేరేపిస్తారు.

    గర్భాశయ పరిపక్వతకి (సర్వికల్ రైపెనింగ్) సంబంధించిన రిస్కులు ఏమిటి (What are the risks associated with cervical ripening in Telugu)?

    గర్భాశయ పరిపక్వతకి సంబంధించిన వివిధ పద్ధతులు ఒక్కోటి వాటికి సంబంధించిన రిస్కులతో ఉంటాయి. సర్వికల్ రైపెనింగ్ కోసం తీసుకునే మందుల వలన వచ్చే ప్రమాదాలు:

    • జ్వరం
    • డయేరియా
    • వికారం మరియు వాంతులు
    • మరీ ఎక్కువగా కాంట్రాక్షన్లు (గర్భాశయ కండరాల సంకోచాలు)

    గర్భాశయ పరిపక్వతకి సంబంధించిన ఆపరేషన్లతో ఉండే ప్రమాద భయాలు (Risks associated with surgery for cervical ripening may include in Telugu):

    • పిండం యొక్క గుండె కొట్టుకునే వేగం తగ్గటం
    • రక్తస్రావం
    • పిండదశలోనే బిడ్డ మరణించటం లేదా గాయం అవటం
    • బొడ్డుతాడు దాని స్థానం నుండి పక్కకి జరగటం (ప్రోలాప్స్) లేదా కుదించబడటం
    • పిండం లేదా తల్లికి ఇన్ఫెక్షన్ రావటం

    గర్భాశయ పరిపక్వత యొక్క అసలైన లాభాలు ఏమిటి (What exactly are the benefits of cervical ripening in Telugu)?

    గర్భాశయ పరిపక్వతకి సంబంధించిన మొట్టమొదటి లాభం ఏంటంటే అది ప్రసవం మొదలవటానికి సాయపడుతుంది. అలాగే మీ ప్రసవకాలం నడిచే సమయాన్ని తగ్గించడంలో కూడా సాయపడుతుంది.

    గర్భాశయ పరిపక్వత వలన దీర్ఘకాలిక ప్రభావాలు ఏముంటాయి (What long-term effects can cervical ripening have) ?

    చాలామటుకు కేసులలో.. గర్భాశయ పరిపక్వత కారణంగా గర్భాశయంపై దీర్ఘకాలిక ప్రభావాలు ఏమీ ఉండవు. మీకు అసలు ఈ సర్వికల్ రైపెనింగ్ అవసరమయ్యే కారణం కూడా సి-సెక్షన్ ప్రసవం అయ్యే రిస్కుని పెంచుతుంది. అలాగ మీ పుట్టబోయే బిడ్డకి, మీకు కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.

    నేను నా డాక్టరు వద్ద అపాయింట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి (When should I make an appointment with my doctor)?

    మీరు గర్భాశయ పరిపక్వత లేదా ప్రసవాన్ని ప్రేరేపించడం గురించి ఏదైనా చర్చించాలనుకుంటే మీ డాక్టరుతో మాట్లాడండి. నొప్పులు, వాంతులు, వికారం, రక్తస్రావం, లేదా గర్భాశయ సంకోచాల వంటి అకాల ప్రసవానికి సంబంధించిన ఏవైనా లక్షణాలని గమనిస్తే తప్పనిసరిగా డాక్టరుని సంప్రదించాలి.

    Tags:

    What is Cervical Ripening in telugu, causes of Cervical Ripening in telugu, Benefits of Cervical Ripening in telugu, Cervical Ripening: Concept, Methods, Benefits & Threats in English, Cervical Ripening: Concept, Methods, Benefits & Threats in Hindi, Cervical Ripening: Concept, Methods, Benefits & Threats in Tamil, Cervical Ripening: Concept, Methods, Benefits & Threats in Bengali.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |