Diet & Nutrition
3 November 2023 న నవీకరించబడింది
భారతీయ ఆయుర్వేదంలో ఉసిరికాయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది శతాబ్దాల నుంచి అనేక రకాలైన వ్యాధులకు నివారణగా వాడుతున్నారు. ఉసిరికాయను ఇండియన్ గూస్బెర్రీ అని కూడా అంటారు. ఉసిరి ఎన్నో రకాలైన పోషకాలతో ఉంటుంది. మానవుడి జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు పెరగడానికి కూడా సహకరిస్తుంది. అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలను మానవుడికి ఉసిరి అందిస్తుంది. ఇటీవల కాలంలో ఉసిరికాయకున్న లక్షణాల కారణంగా గర్భిణీ స్త్రీలలో చాలా ప్రాచుర్యం పొందింది. అయితే ఉసిరి గర్భిణీ స్త్రీలు వాడొచ్చా లేదా ఉసిరి తీసుకుంటే కలిగే లాభాలు, భద్రత లాంటి అంశాలను ఈ ఆర్టికల్‌లో చర్చిద్దాం.
ఉసిరి లేదా ఇండియన్ గూస్బెర్రీలను పురాతన ఆయుర్వేద మూలికగా గర్భధారణ సమయంలో సాధారణంగా వాడుతూనే ఉన్నారు. ఇది గర్భవతులు నిస్సందేహంగా వాడవచ్చు. ఉసిరి తినడం వల్ల వికారం, వాంతులు కాకుండా నివారిస్తుంది. జీర్ణ క్రియను పెంపొందిస్తుంది. అలాగే పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తుంది.
ఉసిరికాయ విటమిన్ సి గని అని చెప్పొచ్చు. ఇది ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. విటమిన్ సి మానవుడికి ఎంతో అవసరమైన శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఉసిరి మానవుల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా గుండె జబ్బుల నుంచి, ప్రాణాంతకమైన క్యాన్సర్ల నుంచి కాపాడుతుంది. ఉసిరి చర్మ సౌందర్యానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. గర్భవతులుగా ఉన్నప్పుడు ఉసిరికాయ వాడడం వల్ల దీంట్లో ఉండే పీచు పదార్థం మేలు చేస్తుంది. ఇందులో అనేక రకాల పోషకాలు, విటమిన్లు, విటమిన్ ఇ, పొటాషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటివి ఉంటాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో రాగి: ప్రయోజనాలు మరియు పోషక విలువలు
గర్భం దాల్చిన స్త్రీ ఉసిరికాయని వాడడం వల్ల కలిగే లాభాలు కొన్ని కింద వివరించాం.
ఉసిరికాయలు తాజావి, ఉడకబెట్టినవి లేదా ఎండబెట్టినవి ఎలాగైనా తినవచ్చు. గర్భం దాల్చిన స్త్రీ తన రెండో ట్రమిస్టర్‌లో ఉసిరికాయలు తినడం ఎంతో మంచిది. ఈ సమయంలో గర్భస్థ శిశువు అవయవాలు ఎదుగుతున్నప్పుడు ఉసిరికాయలను ఆహారంలో కూరలు, సూప్‌ల ద్వారా తినవచ్చు. అదేవిధంగా ఉసిరికాయలతో రుచికరమైన జామ్ లేదా చట్నీలు కూడా చేయొచ్చు. మీరు గర్భవతులైతే.. పోషకాలతో నిండిన ఆహారాన్ని తీసుకోవాలని అనుకుంటన్నట్టైతే పోషకాలు నిండుగా ఉన్న ఉసిరిని తినండి.
గర్భవతిగా ఉన్నప్పుడు ఉసిరికాయలను తినడం వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా వచ్చే మలబద్ధకం కడుపులో నొప్పి ఎదుర్కొనేందుకు ఉసిరికాయలను లేదా సప్లిమెంట్లను తీసుకునేటప్పుడు అధిక మొత్తంలో నీళ్లను తాగాలి. ఉసిరికాయలో సహజంగా ఉండే కొన్ని రసాయనాలు వాడుతున్న మందులతో సంఘర్షణ చెందుతాయి. కాబట్టి గర్భవతులు ఏవైనా మందులు వాడుతున్నట్లయితే వైద్యుల సలహా తీసుకొని మాత్రమే ఉసిరికాయల్ని తినాలి. గర్భవతులు ఉసిరికాయను మితంగా తినడం మంచిదే. అయినా ఉసిరిని తినడం వల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే ఉసిరికాయలు లేదా గూస్బెర్రీలను తినడం మానేయ్యాలి. వైద్యుల్ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
మీరు గర్భవతి అయితే.. సహజసిద్ధంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నట్టైతే ఉసిరికాయ సూచించదగ్గ ఆహారం. భారతీయ పురాతన వైద్యంలో ఉసిరికాయను ఎన్నో శతాబ్దాలుగా వాడుతున్నారు. ఉసిరిని ఇండియన్ సూపర్‌ఫుడ్ అని కూడా పిలుస్తారు. గర్భధారణ సమయంలో ఉసిరికాయను వాడటానికి కొన్ని విభిన్న మార్గాలు ఉన్నాయి. వాటిలో ఉసిరికాయలు తాజావి, ఉడకబెట్టినవి లేదా ఎండబెట్టినవి తినొచ్చు. ఉసిరికాయ సప్లిమెంట్లు ప్రస్తుతం క్యాప్సిల్స్, పొడి రూపంలో కూడా లభిస్తున్నాయి. వాటినీ వాడొచ్చు.
ఉసిరికాయల గురించి సాధారణంగా మాట్లాడుకున్నట్లయితే రోజుకి ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు ఉసిరి కాయలను గర్భవతులు తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అయినా గర్భిణీ స్త్రీలు ఏదైనా కొత్త సప్లిమెంట్లను వాడాలనుకుంటే వైద్యుల్ని సంప్రదించి మాత్రమే ప్రారంభించాలి.
ఉసిరికాయ పోషకాలతో నిండిన పండుగా చెప్పుకోవచ్చు. గర్భవతులు ఇవి తినొచ్చు. ఇది మార్నింగ్ సిక్నెస్ తగ్గించి, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచి, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. అదేవిధంగా గర్భవతులైన స్త్రీలకు అవసరమైన పోషకాలు, ప్రయోజనకరమైన విటమిన్లు, ఖనిజాలు ఉసిరికాయల్లో అధిక మొత్తంలో ఉంటాయి. అదనంగా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తీసుకున్న ఆహార పదార్థాల నుండి పోషకాలను గ్రహిస్తుంది. గర్భధారణ సమయంలో ఉసిరిని మితంగా తినవలసి ఉంటుంది. సాధారణంగా గర్భిణీ స్త్రీలు సిఫార్సు చేయబడిన మార్గదర్శకాలను అనుసరించి తగిన మోతాదులో తీసుకోవడం సురక్షితం.
గర్భధారణ సమయంలో ఏమి తినాలి, ఏం తినకూడదు అనే దాని గురించి తెలుసుకోవడానికి, ఇలాంటి మరిన్ని బ్లాగ్‌ల కోసం మైలో ఫ్యామిలీని సందర్శించండి.
References
1. Kapoor MP, Suzuki K, Derek T, Ozeki M, Okubo T. (2019). Clinical evaluation of Emblica Officinalis Gatertn (Amla) in healthy human subjects: Health benefits and safety results from a randomized, double-blind, crossover placebo-controlled study. Contemp Clin Trials Commun.
2. Upadya H, Prabhu S, Prasad A, Subramanian D, Gupta S, Goel A. (2019). A randomized, double blind, placebo controlled, multicenter clinical trial to assess the efficacy and safety of Emblica officinalis extract in patients with dyslipidemia. BMC Complement Altern Med.
Amla is safe during pregnancy in Telugu, What is the best time to eat amla during pregnancy in Telugu, What are the side effects of amla during pregnancy in Telugu, Amla In Pregnancy: Benefits, Safety & More in English, Amla In Pregnancy: Benefits, Safety & More in Hindi, Amla In Pregnancy: Benefits, Safety & More in Tamil, Amla In Pregnancy: Benefits, Safety & More in Bengali
Yes
No
Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |