hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • రక్తహీనత (ఎనిమియా) అంటే ఏమిటి – లక్షణాలు, కారణాలు & చికిత్సలు arrow

In this Article

    రక్తహీనత (ఎనిమియా) అంటే ఏమిటి – లక్షణాలు, కారణాలు & చికిత్సలు

    Pregnancy

    రక్తహీనత (ఎనిమియా) అంటే ఏమిటి – లక్షణాలు, కారణాలు & చికిత్సలు

    3 November 2023 న నవీకరించబడింది

    ఒక వ్యక్తికి చాలా తక్కువ సంఖ్యలో ఎర్ర రక్తకణాలు ఉంటే రక్తహీనత వస్తుంది. మనం మనుగడ సాగించేందుకు ఎర్రరక్తకణాలు ఎంతో ముఖ్యమైనవి. ఇవి మన శరీరంలో ఎన్నో క్లిష్టమైన పనులు చేస్తాయి. ఎర్రరక్తకణాలే ఆక్సిజన్​ను కణజాలాలకు తీసుకువెళ్తాయి. ఎర్రరక్తకణాలు తగ్గడం వల్ల రక్తహీనత వస్తుంది. తద్వారా అలసట, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, చర్మం పాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వివిధ రకాల వ్యాధులు, ఆహార లోపాలు, జన్యుపరమైన రుగ్మతల వల్ల కూడా ఇది సంభవించవచ్చు. రక్తహీనతకు చికిత్స చేయకుండా వదిలేస్తే.. అలసట, రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తి చివరకు మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. రక్తహీనత లక్షణాలు మెరుగ్గా గుర్తించడంలో సహాయపడే అన్ని అంశాలను పాఠకుల కోసం మేము ఈ కథనంలో అందజేశాం. ఆరోగ్యకరమైన రక్తాన్ని మెయింటేన్ చేసేందుకు ఇది మీకు సహాయపడుతుంది. రక్తహీనత అనేది ప్రాణాంతకంగా మారకుండా నివారించేందుకు లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా అవసరం.

    రక్తహీనతలో రకాలు

    • ఐరన్ లోపంతో రక్తహీనత అనేది రక్తహీనత రకాల్లో సర్వసాధారణమైనది. శరీరం సక్రమంగా పని చేయడానికి తగినంత మోతాదులో ఐరన్ లేకపోవడం వల్ల ఇది సంభవిస్తుంది. మనం తినే ఆహారంలో ఐరన్ తక్కువగా ఉండడం వల్ల ఐరన్ లోపంతో రక్తహీనత ఏర్పడుతుంది. తద్వారా కాలేయం లేదా పేగులను దెబ్బతీసే వ్యాధి పరిస్థితులు ఏర్పడవచ్చు.
    • విటమిన్ B12 లోపం వల్ల రక్తహీనత శరీరంలో తగినంత విటమిన్ B12 లేనపుడు ఏర్పడే రక్తహీనత అత్యంత అరుదుగా ఏర్పడే రక్తహీనత. సగటు ఎర్రరక్తకణాల ఉత్పత్తి, జీవక్రియను నిర్వహించేందుకు విటమిన్ B12 అవసరం. తగినంత విటమిన్ B12ను గ్రహించకుండా పేగులను నిరోధించే వివిధ క్యాన్సర్ చికిత్సల వల్ల సంభవించవచ్చు.
    • ఎర్రరక్తకణాల (RBC) డైస్జెనిసిస్ అనేది ఒక రకంగా ఎర్రరక్తకణాలను (red blood cells) ప్రభావితం చేసే రక్తహీనత. డైస్జెనిసిస్ అంటే.. అసాధారణ కణాలు RBCల సాధారణ పనులకు ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి.
    • సికెల్ సెల్ ఎనిమియా వారసత్వంగా వస్తుంది. ఇది ప్రాణాంతకం. లోపం ఉన్న హీమోగ్లోబిన్ వల్ల సికెల్ సెల్ ఎనిమియా గుండ్రంగా ఉన్న ఎర్రరక్తకణాలను చంద్రవంక(కొడవలి) ఆకారంలోకి మారుస్తుంది. ఇది రక్తం గడ్డ కట్టేందుకు దారితీస్తుంది.
    • ఇన్ఫ్లమేషన్ (వాపు) రక్తహీనత అనేది HIV/AIDS, క్యాన్సర్, రుమటాయిడ్ అర్థరైటిస్, క్రోన్ వ్యాధులు మరియు కిడ్నీ వ్యాధుల కారణంగా ఏర్పడే దద్దుర్ల కారణంగా ఏర్పడుతుంది.
    • హెమోలిటిక్ రక్తహీనత ఇది వారసత్వంగా వస్తుంది లేదా అభివృద్ధి చెందుతుంది. ఈ పరిస్థితిలో ఎముక మజ్జ అనేది కొత్త రక్తకణాలను వేగంగా ఉత్పత్తి చేయదు. ఉన్న రక్తకణాలు వేగంగా నాశనం అవుతాయి. సాధారణంగా విస్తృత స్థాయి రక్తవ్యాధుల వలన ఇది జరుగుతుంది.
    • ఎముక మజ్జ వ్యాధుల కారణంగా రక్తహీనత మైలోఫైబ్రోసిస్ మరియు లుకేమియా వంటి పరిస్థితుల కారణంగా ఈ రక్తహీనత సంభవిస్తుంది. ఈ పరిస్థితులు ఎముక మజ్జలో ఎర్రరక్తకణాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. తద్వారా రక్తహీనత సంభవిస్తుంది.
    • ఫోలేట్(ఒక రకమైన విటమిన్) లోపం వల్ల రక్తహీనత, పేరులో సూచించిన విధంగా ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల ఇది వస్తుంది. ఇతర రక్తహీనత వలే ఇది సంక్లిష్టమైనది కాదు. ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవడం, లేదా ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే బ్రోకలీ, మొలకెత్తిన బృస్సెల్ మొలకలు తీసుకోవడం ద్వారా ఫోలేట్ లోపాన్ని తగ్గించుకోవచ్చు.

    రక్తహీనత యొక్క ముఖ్యమైన లక్షణాలు

    రక్తహీనత లక్షణాలను మరియు సంకేతాలను అర్థం చేసుకోవడం దానిని ఎదుర్కోవడంలో మొదటి అడుగు. ఒక వ్యక్తి రక్తహీనత తీవ్రమైన లక్షణాలను గుర్తించడంలో విఫలం అయితే.. అంతే కాకుండా వైద్య సహాయం కూడా తీసుకోకపోతే.. ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. రక్తహీనత యొక్క సాధారణ లక్షణాలు కింది విధంగా ఉన్నాయి.

    1. మైకం
    2. బలహీనత
    3. దృష్టి లోపం
    4. మసక దృష్టి
    5. తొందరగా అలసిపోవడం
    6. పాలిపోయిన చర్మం

    రక్తహీనత అనేది వైరస్ బారినపడడం ద్వారా, లేదా ఏదైనా శస్త్ర చికిత్స, అనారోగ్యం ద్వారా సంభవించవచ్చు. తక్కువ ఎర్రరక్తకణాలను కలిగి ఉండడమే రక్తహీనత. ఎవరైనా తమ శరీరంలోని ఐరన్ స్థాయిల గురించి ఆందోళన చెందుతూ ఉంటే.. లేదా పైన పేర్కొన్న ఏవైనా లక్షణాలను కలిగి ఉంటే వారు వెంటనే వైద్యుడితో మాట్లాడడం మంచిది. మీ ఐరన్ స్థాయిలను పెంచుకోవడం కోసం మరియు రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించేందుకు వైద్యుడు మీకు సలహాలు ఇస్తాడు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో ఖర్జూరాలు: ప్రయోజనాలు & డేట్స్

    రక్తహీనత కారణాలు

    రక్తహీనత సంభవించేందుకు అనేక అంశాలున్నాయి:

    1. శరీరంలో ఐరన్ లేకపోవడం
    2. శరీరంలో కాపర్ లేకపోవడం
    3. ఎముక మజ్జను ప్రభావితం చేసే కణతి లేదా ఇన్ఫెక్షన్
    4. తలసేమియా అనే రక్త రుగ్మత

    రక్తహీనత సంభవించేందుకు అనేక ఇతర కారణాలు ఉంటాయని అర్థం చేసుకోవడం అవసరం.

    మన శరీరంలో ఎర్రరక్తకణాల పాత్ర

    ఎర్రరక్త కణాలు అనేవి మానవ శరీరానికి జీవనాధరమైనవి. ఇవి మన శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్​ను సప్లై (సరఫరా) చేస్తాయి. అంతే కాకుండా మనం ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. ఎర్ర రక్తకణాలు అనేవి ఎముక మజ్జలో తయారవుతాయి. ఇవి శరీరంలోని అన్ని భాగాలకు పంపిణీ కాక ముందు (డిస్ట్రిబ్యూట్) కాలేయంలో నిల్వ చేయబడతాయి. రక్తహీనత వాటిని ప్రభావితం చేస్తుంది. ఎర్రరక్తకణాల పాత్రను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

    రక్తహీనతను ఎలా నివారించవచ్చు?

    రక్తహీనతను నివారించేందుకు అనేక మార్గాలున్నాయి. సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, అతిగా మద్యం తీసుకోకుండా ఉండడం అనేవి వీటిల్లో చాలా ముఖ్యమైనవి. ఐరన్ అనేది పుష్కలంగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఐరన్ అనేది మాంసం, పౌల్ట్రీ, గుడ్లు మొదలయిన వాటిల్లో లభిస్తుంది. తృణ ధాన్యాలు, పాల ఉత్పత్తుల వంటి వాటిల్లో కూడా లభిస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉంటే డైట్ తినడంతో పాటుగా, ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా కూడా.. ఐరన్ మోతాదును పెంచుకోవచ్చు. ఒక వ్యక్తికి తరచూ రక్తస్రావం జరుగుతుంటే ఆ వ్యక్తి రక్తమార్పిడి చేసుకోవాలని డాక్టర్ సిఫారసు చేయొచ్చు.

    చివరగా..

    మానవ శరీరం తగినన్ని ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయనపుడు రక్తహీనత ఏర్పడుతుంది. దీని ఫలితంగా అలసట, తేలికపాటి తలనొప్పి, శక్తి లేకపోవడం వంటి వాటిని అనుభవించొచ్చు. రక్తహీనతను చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే గుండె జబ్బులైన స్ట్రోక్, మరియు మరణం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. రక్తహీనత చికిత్స అనేది రోగి నిర్ధారణ రకం (ఎటువంటి ఎనిమియా సోకింది) మరియు ఇతర పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అధిక రుతుస్రావం మరియు గర్భం అనేది ఐరన్ లోపం కారణంగా రక్తహీనతకు దారి తీస్తాయి. కాబట్టి రక్తహీనత సమస్యతో బాధపడే మహిళలు ఐరన్ వాడకాన్ని పెంచాలి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |