Pregnancy
3 November 2023 న నవీకరించబడింది
9 వారాల ప్రెగ్నెన్సీలో బ్రౌన్ డిశ్చార్జ్ మిమ్మల్ని కలవరపెట్టే అవకాశం ఉంది. అయితే ప్రెగ్నెన్సీ ప్రారంభంలో యోని స్రావాలు చాలా సందర్భాల్లో సహజంగానే జరుగుతుంటాయి. అందువల్ల వేరే ఇతర లక్షణాలు ఉంటే తప్ప ఆందోళనకు కారణం కాకూడదు. లైట్ గా రంగు లేదా బ్రౌన్ రంగు (గోధుమ రంగు) డిశ్చార్జ్ అనేక విషయాలను తెలియజేస్తుంది. ప్రతి నలుగురిలో ఒకరు గర్భిణి ఏదో ఒక దశలో దీన్ని చూస్తారు. బ్రౌన్ డిశ్చార్జికి కారణాలు తెలుసుకోవడానికి దాని నుంచి ఏం ఊహించవచ్చో చదవండి.
యోని స్రావాలు ఒక సాధారణ విషయం మరియు ఇది స్త్రీ సాధారణ లక్షణం. తెల్లటి యోని స్రావాలు లేదా ల్యుకోరియా అనేది సహజమైన అంశం. అయినాకూడా, ప్రెగ్నెన్సీ సమయంలో బ్రౌన్ డిశ్చార్జ్ కాస్త భయం కలిగిస్తుంది. ఎందుకంటే బ్రౌన్ రంగు రక్తం రంగుతో పోల్చవచ్చు. చాలామంది మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా మందమైన స్రావాలను అనుభవిస్తారు. చాలా సందర్భాల్లో, 9 వారాల సమయంలో బ్రౌన్ డిశ్చార్జ్ అంటే పాత రక్తంతో కూడిన సాధారణ యోని స్రావం అని చెప్పొచ్చు. అసలు రక్తస్రావం ముందుగా జరిగిందని, తర్వాత డిశ్చార్జ్ అవుతున్నదని ఇది తెలియజేస్తుంది. ఇది గర్భాశయం లేదా యోని నుంచి విడుదల కావచ్చు. యోని నుంచి వచ్చే బ్రౌన్ డిశ్చార్జి చాలా సాధారణం మరియు ఆందోళన చెందాల్సిన పనిలేదు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: తొమ్మిది వారాలకు బిడ్డ పరిమాణం సరిగ్గా ఉందా?
ప్రెగ్నెన్సీ ప్రారంభంలో 9 వారాల గర్భిణిలో తెల్లటి స్రావాలు కనిపించడం అసాధారణమేమీ కాదు. గర్భాశయం పాత రక్తాన్ని విడుదల చేస్తుంటే అప్పుడప్పుడు బ్రౌన్ రంగు స్రావాలు కనిపిస్తాయి. గర్భధారణ ప్రారంభంలో బ్రౌన్ యోని స్రావాలకు ఇంప్లాంటేషన్ రక్తస్రావం మరింత సాధారణమైన కారణం. ప్రెగ్నెన్సీ సమయంలో గర్భాశయంలోని లైనింగ్‌కు పిండం అతికిన కొన్ని వారాల తర్వాత ఇది కనిపించవచ్చు. కాబోయే తల్లి ప్రెగ్నెన్సీ సమయంలో తన శరీరంలో జరిగే అనేక మార్పులకు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. హార్మోన్ల పెరుగుదల వల్ల గర్భాశయం మరియు జననేంద్రియాలకు రక్త ప్రవాహం పెరుగుతుంది. ఇది ఈ అవయవాలు మరింత సున్నితంగా మారడానికి కారణమవుతుంది. దీంతో చిన్న చిరాకు కలిగినా గాయమైనా బ్రౌన్ డిశ్చార్జికి కారణమవుతుంది. నొప్పి మరియు దుర్వాసన వంటి ఇతర లక్షణాలు ఉంటే క్షుణ్ణమైన చెకప్ కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.
9 వారాల గర్భిణీ స్రావాలు ఆందోళన కలిగించకూడదు. స్రావాల పరిమాణం మరియు వాసన చూడటం మంచిది. బ్రౌన్ డిశ్చార్జ్‌తో కింది లక్షణాలు ఉన్నట్లయితే వైద్యుడిని సందర్శించడం మంచిది:
● అసౌకర్యంగా అనిపించడం- ఇన్ఫెక్షన్ వల్ల అసౌకర్యం, భరించరాని వాసన, నొప్పి మరియు తిమ్మిరి రావొచ్చు.
● డిశ్చార్జ్ రకం- పెద్ద మొత్తంలో డిశ్చార్జ్ జరిగితే శానిటరీ నాప్కిన్ అవసరం.
● జ్వరం- బ్రౌన్ డిశ్చార్జ్‌తో పాటు జ్వరం వస్తే ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది
● నీటి వంటి ద్రవాలతో స్రావాలు- నడుము కింది భాగం లేదా పొత్తికడుపులో నొప్పి ఉండటంతో పాటు ముద్దల వంటి పదార్థాలు తాజా ఎర్రటి రక్తంతో కూడిన నీటి వంటి బ్రౌన్ కలర్ నీటి వంటి స్రావాలు జరిగితే గర్భస్రావం యొక్క సంకేతం కావొచ్చు.
● భరించరాని నొప్పి- మైకం, కళ్లు తిరగడం, భుజం నొప్పి మరియు తేలికపాటి తలనొప్పితో పాటు పింక్ రంగు బ్రౌన్ డిశ్చార్జ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల కావచ్చు
నొప్పి వంటి లక్షణాలు ఉంటే స్వీయ పర్యవేక్షణ అవసరం. బ్రౌన్ డిశ్చార్జ్ తక్కువగా ఉండి, 2 లేదా 3 రోజుల పాటు కొనసాగినా, చెకప్ కోసం వెళ్లినప్పుడు డాక్టర్‌తో చర్చించడం చాలా ముఖ్యం. 9 వారాల ప్రెగ్నెంట్ డిశ్చార్జికి గల కారణాన్ని తెలుసుకోవడానికి డాక్టర్ అల్ట్రాసౌండ్ మరియు రక్త పరీక్షలు సిఫారసు చేయొచ్చు. 9 వారాల ప్రెగ్నెంట్ కి బ్రౌన్ డిశ్చార్జ్ వచ్చినా, రాకపోయినా ఆమె తప్పనిసరిగా జననేంద్రియ భాగాలకు చిరాకు కలగకుండా చూసుకోవాలి. లోదుస్తులను ఉతకడానికి తేలికపాటి సబ్బు ఉపయోగించడం లేదా జననేంద్రియ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవడానికి సబ్బు అతి వాడకం తగ్గించడమనేది జననేంద్రియ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ లేదా చికాకు నివారించడానికి కొన్ని దశలుగా చెప్పుకోవచ్చు. పగటిపూట తరచుగా జననేంద్రియ ప్రాంతాన్ని కడగడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే సహజ బ్యాక్టీరియా నశిస్తుంది.
Brown discharge during pregnancy in telugu, What is brown discharge in telugu, Brown discharge during 9 weeks of pregnancy in telugu, Causes of brown discharge during pregnancy in telugu
Brown Discharge at 9 Weeks Pregnant in English, Brown Discharge at 9 Weeks Pregnant in Hindi, Brown Discharge at 9 Weeks Pregnant in Bengali, Brown Discharge at 9 Weeks Pregnant in Tamil
Yes
No
Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |