Best Sleeping Positions
3 November 2023 న నవీకరించబడింది
గర్భవతిగా ఉన్నప్పుడు, తమ బిడ్డను రక్షించుకునేందుకు, వారికి సౌకర్యవంతంగా ఉంచడం కోసం తల్లి ప్రాధాన్యం ఇస్తుంది. తల్లి ప్రేమ చాలా గొప్పది, కడుపులోపల ఉన్నా తన బిడ్డను సురక్షితంగా ఉంచడంలో ఆమెను ఎవ్వరూ సాటిరారు. కానీ, మొదటి త్రైమాసికం అంటే మొదటి మూడు నెలలు పిండానికి చాలా కష్టకాలం అని మీకు తెలుసా? ఈ సమయంలో గర్భస్రావం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే నిద్రలో ఉన్నప్పుడు కూడా తల్లి బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి. 8-వారాల గర్భిణిగా మీరు ఉన్నప్పుడు గర్భస్రావాన్ని నివారించి, మంచి నిద్రను పట్టేందుకు సరైన స్లీపింగ్ పొజిషన్ గురించి తప్పనిసరిగా తెలుసుకోండి.
మీకు ఏదైనా భంగిమలో నిద్రించే అలవాటు ఉంటే, మీ శిశువు ఆరోగ్యం కోసం మీరు రాబోయే రెండు నెలల కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. 8 వారాల గర్భిణులు నిద్రపోయే స్థితిని సరిగ్గా పాటించకపోతే, అభివృద్ధి చెందుతున్న శిశువుతోపాటు, మీపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది.
కడుపు నేలవైపు ఉండేలా పడుకున్నప్పుడు, పేగులు, రొమ్ములు కుదించుకుపోతాయి. ఇది ఆ ప్రాంతంలో రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. రొమ్ములలో, ఇది నొప్పి, భారాన్ని కలిగిస్తుంది. ఇది మార్నింగ్ సిక్నెస్కు కూడా దారితీయొచ్చు. ఉబ్బరం, కడుపు నొప్పిని కూడా కలిగిస్తుంది.
వెన్నుమీద పడుకోవడం కూడా గొప్ప ఆలోచన కాకపోవచ్చు. మీరు మీ వెన్నుపై పడుకున్నప్పుడు, పేగులు కిందికి నెట్టబడతాయి. మీ లోపల పిండం కూడా ఉండటంతో, ఇది కడుపు లోపల ఒత్తిడిని మరింత పెంచుతుంది. కడుపులో రక్త ప్రవాహాన్ని తగ్గిస్తూ కడుపు, వీపు, తుంటికి మద్దతునిచ్చే విధంగా పడుకునే స్థానమే ఉత్తమంగా ఉంటుంది.
అత్యంత అనుకూలమైన నిద్ర స్థానం మీ ఎడమ వైపున పడుకోవడం. ఇది మీ పొత్తికడుపులో రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. మీ గుండెపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. అదే సమయంలో మీ మూత్రపిండాలు, కాలేయంపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.ఇది ఈ అవయవాల ఆరోగ్యకరమైన పనితీరులో సహాయపడుతుంది. ఎడమ వైపు పడుకోవడం వల్ల మీ బిడ్డకు రక్తాన్ని సరఫరా చేయడానికి ప్రధానంగా బాధ్యత వహించే నాళాలపై తక్కువ ఒత్తిడి ఉంటుంది.
మీరు ఒక వైపు నిద్రించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, కొంత కాలానికి అది మీకు కొంత అసౌకర్యంగా మారవచ్చు. ఎందుకంటే మీ శరీరం వివిధ మార్గాల్లో నిద్రపోయేలా ట్యూన్ చేయబడి ఉంటుంది. మీరు మీ వెన్ను, తుంటి ప్రాంతంలో నొప్పి, అసౌకర్యం కూడా కలగొచ్చు. అయితే, ఆ సౌకర్యానికి లొంగిపోయి మీ నిద్ర స్థానాన్ని మార్చుకోకూడదు. ఎడమ వైపు మాత్రమే నిద్రను కొనసాగించాలి. మీ గర్భం తరువాతి దశలలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: కొన్ని రకాల పనులకు దూరంగా ఉండటం నుండి నిర్దిష్ట భోజనాన్ని వదులుకోవడం వరకు ప్రెగ్నెన్సీ సమయంలో చేయదగిన మరియు చేయకూడని పనుల పెద్ద జాబితా
ఇంట్లో సులభంగా దొరకే వివిధ కుషన్లు, దిండ్ల సహాయంతో చిన్న అసౌకర్యాన్ని సులభంగా సరిదిద్దవచ్చు. మీరు మీ దిండ్లను ఎలా అమర్చుకుంటారు అనేది మీలో తలెత్తే సమస్యలపై ఆధారపడి ఉంటుంది.
ఇది ప్రధానంగా కడుపులోని ఆసిడ్ పదార్థం ఆహార పైపుకు తిరిగి రావడం లేదా సింపుల్‌గా చెప్పాలంటే, పైకి ప్రయాణించడం వల్ల సంభవిస్తుంది. ఇక్కడ మనం చేయవలసిందల్లా అది అక్కడికి తిరిగి ప్రయాణించే మార్గం లేకుండా చెయ్యడం. మీ ఛాతీ ప్రాంతం కింద కుషన్లను ఉంచడం వల్ల మీ పొట్టను పైకి లేపొచ్చు. ఇది మీ లక్ష్యాన్ని సాధించడంలో మీకు సహాయపడుతుంది.
చాలా మంది గర్భిణులు దిగువ వెనుక భాగంలో నొప్పి గురించి ఫిర్యాదు చేస్తారు. అటువంటి పరిస్థితిలో తుంటి భాగాన్ని కొద్దిగా ఎలివేట్ చేయడం ద్వారా దీనిని సరిచేయవచ్చు. ఈ ఎలివేషన్ కండరాలను రిలాక్స్ చెయ్యడంలో సహాయపడుతుంది, నొప్పిని తగ్గిస్తుంది.
కడుపు పెరగడం ప్రారంభించినప్పుడు, అది బరువుగా అనిపించవచ్చు. ఈ సందర్భంలో దాన్ని మీ శరీరంలోని మిగిలిన వాటి స్థాయికి తీసుకురావడం చాలా ముఖ్యం. మీరు మీ పొట్ట కింద ఒక సన్నని దిండును ఉంచడం ద్వారా అలా చేయవచ్చు.
అదనపు బరువును మోయడంతో కాళ్లు బలహీనంగా అవుతాయి. అలసిపోతాయి. అందువల్ల, మీరు నిద్రపోతున్నప్పుడు వాటికి నయం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇవ్వడం అవసరం. మీ కాళ్ల మధ్య ఒక దిండు ఉంచడం మీకు సహాయం చేస్తుంది.
మాతృత్వం అనేది చాలా మంది మహిళలు పంచుకునే అద్భుతమైన అనుభవం. అయితే, ఇది చాలా మందిని భయపెట్టే కాలం కూడా. గర్భిణుల ఆహారం, నిద్ర విధానంతో సహా తన మొత్తం జీవనశైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు, మీరు 8 వారాల గర్భిణి నిద్రించే స్థానాలను అర్థం చేసుకుని ఉంటారు. తల్లి, బిడ్డ ఆరోగ్యం మెరుగుపడేందుకు, దీనిని తప్పనిసరిగా పాటించాలి. చివరగా, గర్భధారణ కాలాన్ని ఆనందించండి. ఎందుకంటే మీరు ప్రపంచానికి ఒక ఉత్తమ వ్యక్తిని అందించబోతున్నారు.
Yes
No
Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |