hamburgerIcon

Orders

login

Profile

STORE
Profile
Skin Care
Skin Brightening
Anti Ageing
Skin Hydration
Acne and Blemishes
Dry and Dull Skin
Dark Circles
Skin Care Super Saver Combos
Hair Care
Hairfall
Dry and Damaged Hair
Hair Growth
Super Saver Combos
Preg & Moms
Boost Breast Milk Supply
Breast Pump
Fertility
Stretch Marks Care
Maternity Wear
Maternity Gear
Baby Care
Diapers & WipesBaby DiapersCloth DiapersBest Baby Wet Wipes in IndiaSuper Saver Combos
Baby WellnessDiaper Rash Mosquito Repellent Anti-ColicSuper Saver Combo
Baby CareSkinHairBath & BodySuper Saver Combos
Feeding & LactationFeeding BottleBoost Breast Milk SupplySipperBreast PumpTeethers & NibblersGrooved NippleNursing PadsSuper Saver Combos
Baby ClothingBaby Detergent & Cleanser in IndiaBaby TowelCap, Mittens & BootiesSocksWrappersWinter Clothing
Baby GearCarriersStrollersDiaper BagBathtubs and Potty Seat Carry NestDry SheetBaby Pillow
Diapers
Baby Diapers
Cloth Diapers
Best Baby Wet Wipes in India
Super Saver Combos
More
Bath & BodyBody MoistureBrighteningTan Removal
FertilityFertility For Her
HygieneUTI and Infection
WeightWeight ManagementDigestive HealthSuper Saver Combos
Daily WellnessDigestive Health
This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow

  • Parenting Tips arrow

  • స్టే ఎట్ హోమ్ పేరెంట్ గా ఉండడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? arrow

In this Article

    స్టే ఎట్ హోమ్ పేరెంట్ గా ఉండడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి?

    Parenting Tips

    స్టే ఎట్ హోమ్ పేరెంట్ గా ఉండడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి?

    3 November 2023 న నవీకరించబడింది

    తల్లిదండ్రులు తేల్చుకోవాల్సిన విషయం ఏమిటంటే.. వారు ఆఫీసు నుంచి వర్క్ చేసేందుకు ఇష్టపడతారా లేదా ఇంట్లోనే పని చేసే తల్లిదండ్రులలా ఉండేందుకు ఇష్టపడతారా.. ఈ నిర్ణయం తీసుకోవడం కొంత భయానకంగానే ఉంటుంది. మీ గోల్స్, ఆబ్జెక్టివ్స్, పేరెంటింగ్ ఫిలాసఫీ మరియు రీసోర్సెస్ వంటివి మీరు స్టేఎట్ హోం పేరెంట్​గా ఉన్నపుడు సహాయం చేస్తాయి. అయితే ఇక్కడ పరిగణించాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. మీరు మీ పిల్లల డెవలప్​మెంట్ మరియు ఎర్లీ ఎడ్యుకేషన్​ను పర్యవేక్షిస్తున్నట్లయితే మీ ఫ్యామిలీ డైనమిక్స్ నుంచి మీ ఆదాయం, ఫ్రీ టైమ్, సామాజిక పరిస్థితులు అన్నీ మారుతాయి. ఈ రోజు తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో ఒకటి… పిల్లలను మరియు పనిని ఎలా మేనేజ్ చేయాలనేది వనరులతో ఇంట్లోనే స్టే ఎట్ హోమ్ పేరెంట్​గా ఉండడం ఒక ఆప్షన్. అయితే ఇది ప్రతి ఒక్కరూ పొందగలిగే అవకాశం కాదు. ఒంటరిగా ఉండే తల్లిదండ్రులకు మరియు ఇద్దరి ఆదాయాలపై ఆధారపడే జంటలకు ఈ విధానం అవలంబించడం కష్టంగా ఉండవచ్చు. కొంత మందికి ఇది మంచి ఎంపికగా ఉండవచ్చు.

    ఇంట్లోనే ఉండే పేరెంట్​గా మారడం అనేది అనేక రకాల పరిస్థితులకు దారి తీస్తుంది. కొంత మంది తల్లిదండ్రులు ఎల్లప్పుడూ దాని గురించి కలలు కంటూ ఉండవచ్చు. కొంత మంది తమ పిల్లలు పుట్టిన ప్రారంభ సంవత్సరాలలో వారితో ఎక్కువ సమయం గడిపేందుకు తమ కెరియర్​ను స్టాప్ చేయాలని అనుకోవచ్చు. పెరుగుతున్న పిల్లల సంరక్షణ ఖర్చుల కంటే ఒక పేరెంట్ ఇంట్లో ఉండడం వలన ఎక్కువ ఆదాయం కోల్పోతున్నామని కొంత మంది నమ్ముతారు. కొన్ని సందర్భాలలో లేఆఫ్స్, పాఠశాల మూసివేతలు మరియు ఇతర సమస్యలు ఈ రోల్​లో ఉండేలా కొంత మంది తల్లిదండ్రులను ఫోర్స్ చేయొచ్చు. మీరు స్టేఎట్ హోం పేరెంట్స్​గా ఎందుకు ఉందామని అనుకుంటున్నారు. ఎలా అనుకుంటున్నారనే దానితో సంబంధం లేకుండా సంభవించే మేజర్ పరివర్తన డిసీషన్ ఇది. ఇది ప్రయోజనాలు మరియు సవాళ్లను సమ వాటాలో తీసుకువస్తుంది.

    ఇంట్లో ఉండే తల్లిదండ్రులు ఎంత కామన్​గా ఉంటారు?

    పరిశోధనల ప్రకారం.. ఐదుగురు తల్లిదండ్రులలో ఒక జంట ఇంటి వద్ద ఉండే తల్లిదండ్రులుగా ఉంటున్నారు. చాలా మంది తల్లిదండ్రులు ఇంటి బయట పని చేస్తారు. అలా చేయడం అనేది వారి వ్యక్తిగత ప్రాధాన్యత లేదా వారి ఆర్థిక కారణంగా కావొచ్చు. ఇటీవలి సంవత్సరాలలో చాలా మంది తండ్రులు ఇంట్లోనే ఉండడాన్ని ఎంచుకుంటున్నారని కొన్ని అధ్యయనాలలో తేలింది. అదే సమయంలో ఇంట్లో ఉండే తల్లుల సంఖ్య స్థిరంగా ఉంది. పరిశోధనల ప్రకారం ఇంట్లో ఉండే తండ్రుల సంఖ్య 10 నుంచి 17 శాతానికి పెరిగిందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

    కరోనా మహమ్మారి స్టేఎట్ హోం తండ్రుల ఆలోచనా విధానాన్ని మార్చింది. ఒక సర్వే ప్రకారం.. 20 శాతం మంది తల్లులు ఆరోగ్య సమస్యల కారణంగా లేదా పిల్లల సంరక్షణను మేనేజ్ చేసేందుకు స్వచ్ఛందంగా పనిని విడిచి పెడుతున్నారు. మరో 23 శాతం మంది రిలీజ్ చేయబడ్డారు లేదా వారి పని గంటలను తగ్గించుకున్నారు. దీర్ఘకాలికంగా ఇంట్లోనే ఉండే తల్లిదండ్రుల సంఖ్యను ఈ సంఖ్యలు ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడం చాలా కష్టం. అయితే ప్రస్తుత ఇంపాక్ట్​ను మనం విస్మరించలేం.

    ఇంట్లోనే ఉండే తల్లిదండ్రులుగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

    రోజంతా మీ పిల్లలతో ఉండడం మరియు వారి అవసరాలను తీర్చడం మీకు ఎక్కడలేని సంతృప్తిని కలిగిస్తుంది. వారు ఆరోగ్యంగా పెరిగినపుడు మీకు గర్వంగా ఫీల్ అవుతారు. స్టే-ఎట్-హోమ్ పేరెంట్స్ ప్రయోజనాలలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి.

    1. మీకు అనువైన షెడ్యూల్ ఉంటుంది: స్టే ఎట్ హోం పేరెంట్స్​గా ఉండేందుకు గల గొప్ప కారణం ఏమిటంటే.. వారికి స్థిరమైన దినచర్య ఉంటుంది. మీ రోజువారీ జీవితం ఫ్లెక్సీబుల్​గా ఉండడం వలన ప్రతీది మీకు చాలా సులభంగా అనిపిస్తుంది. అయితే మీ బిడ్డకు ఆరోగ్యం బాగా లేకపోయినపుడు… లేదా మీరు కఠినమైన రోజులను కూడా అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు మీరు నిర్దిష్ట ప్రణాళికలను మార్చుకోవాల్సి వస్తుంది. పంచెస్​తో(ఎటువంటి చెడును దగ్గరికి రాకుండా ఉంచడం) రోల్ చేయడం మరియు ప్రస్తుతానికి ఏది మంచిదో అది చేయడం అవసరం. మీరు ఇంట్లోనే మీ పిల్లలతో కలిసి ఉన్నపుడు డాక్టర్ అపాయింట్​మెంట్​లను మరియు యాక్టివిటీలను ప్లాన్ చేయడం ఎంతో సులభమైనది(కేక్ వాక్). అంతే కాకుండా చెకప్ కోసం మీ బిడ్డను ఎప్పుడు తీసుకెళ్లాలో అని మీ భాగస్వామితో ఎటువంటి చెకింగ్స్ ఉండవు.

    2. మీ పిల్లల జీవితంలోని ముఖ్య ఘట్టాలను కోల్పోరు: మీరు స్టే ఎట్ హోం పేరెంట్​గా ఉండడం వల్ల మీ పిల్లల జీవితంలో జరిగే ముఖ్యవిషయాలను కోల్పోకుండా ఉంటారు. మీరు స్టే ఎట్ హోం పేరెంట్​గా ఉండేందుకు ఇది బెస్ట్ థింగ్. మీ పిల్లలు వారి మొదటి అడుగును వేసినపుడు, లేదా మొదటి సారిగా మాట్లాడినపుడు, మొదటి సారిగా మనస్ఫూర్తిగా నవ్వినపుడు మీరు అక్కడే పక్కనే ఉంటారు. వారి జీవితంలో అన్ని విషయాలను గుర్తుంచుకోని చేయడం వారికి కూడా బాగా ఉంటుంది.

    3. మీ పిల్లవాడు మీ అటెన్షన్ లో ఉంటాడు: : మీరు ఇంటి చుట్టూ పని చేయాల్సినా కానీ లేదా మీ కోసం సమయం కేటాయించుకోవాల్సి వచ్చినపుడు కానీ మీ పిల్లవాడు ప్రతి రోజు పూర్తి శ్రద్ధను కొనసాగిస్తాడు. మీరు ఎల్లప్పుడూ మీరు చేస్తున్న పనిని ఆపేసి మీ బిడ్డకు మీ అవసరం ఉంటే వారి వద్దకు వెళ్లవచ్చు. డేకేర్​ (పిల్లలను సంరక్షణ చూసుకునేది) తో పోలిస్తే మీ పిల్లలపై మీరు కురిపిస్తున్న ప్రేమ అంతులేనిదని చెప్పవనరం లేదు. అంతే కాకుండా మీరు మీ పిల్లలతో బంధం ఏర్పరచుకోవడానికి మీకు అనేక అవకాశాలు వస్తాయి.

    4. ఇలా ఉండడం వలన డబ్బులు మరింత ఆదా అవుతాయి: మీరు పిల్లలతో కలిసి ఒకరి ఆదాయం మీదే స్టే ఎట్ హోం పేరెంట్​గా ఉండడం వలన మరింత ఖర్చు తగ్గుతుంది. ఇది మరింత సరసమైనదిగా ఉంటుంది. లేదా మీరు కూర్చుని మీ పిల్లలను చూసుకున్నా పూర్తి సమయం పని చేసి పిల్లలను చూసుకోవడానికి డేకేర్​కు చెల్లించడం కంటే మెరుగైనదే. మీరు డేకేర్​లో ఖర్చు చేయకుండా పిల్లలను ఇంట్లోనే ఉంచడం ద్వారా అనేక ఇతర విషయాల మీద కూడా డబ్బును ఆదా చేస్తారు. ఉదాహరణకు మీరు ప్రతి రోజు పనికి వెళ్లాల్సిన అవసరం లేనపుడు మీరు గ్యాస్​పై డబ్బును ఆదా చేసుకోవచ్చు. అంతే కాకుండా మీరు ఇంట్లోనే భోజనం చేయడం ద్వారా మరింత ఎక్కువగా ఆదా చేసుకోవచ్చు.

    5. మీరు ఒత్తిడికి దూరంగా ఉంటారు: అధిక ఒత్తిడితో కూడుకున్న గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లేదా మీరు ఇంట్లోనే ఉండే తల్లిదండ్రులుగా ఉన్నపుడు ఒత్తిడితో కూడుకున్న లేదా నాటకీయ వ్యక్తులతో పని చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ స్టే ఎట్ హోం పేరెంట్ అంటే ప్రతి రోజు పార్క్​లో వాక్ చేసినంత ఈజీగా ఉంటుదనకుంటే పొరపాటే.. కొన్ని నిద్రలేని రాత్రులు కూడా ఉంటాయి. అయినప్పటికీ చెడు రోజుల కంటే మంచి రోజులే ఎక్కువగా ఉంటాయి.

    6. ఇది మీ కెరీర్​కు ముగింపు కాదు: మీలో చాలా మంది మీ ఉద్యోగాన్ని వదిలేయడం గురించి ఆందోళన చెందుతారు. మరియు మీ కెరియర్​లో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు మీరు పెట్టిన ఎఫర్ట్ ఇక ముగిసిందని భావిస్తారు. అయితే ఈ వ్యత్యాసం చాలా ఎక్కువ రోజులు ఉంటుందని భావించకండి. మీ పిల్లల ప్రీస్కూల్ వయసు వచ్చే వరకు లేదా వారు వారు 4 నుంచి 6 సంవత్సరాల పిల్లలు అయ్యే వరకు మీరు వారితో ఇంట్లోనే ఉండవచ్చు. మీరు సంవత్సరాల పాటు స్టే ఎట్ హోం పేరెంట్​గా ఉండడం వలన మీరు సంపాదించుకున్న జ్ఞానం, మీ పేరు ప్రఖ్యాతులకు ఎటువంటి ఢోకా ఉండదు. మీకు అవసరమైనపుడు మీరు ఎప్పుడైనా సరే పాత స్థానానికి తిరిగి రావొచ్చు.

    7. ఇది ఎంతో సంతోషకరమైనది : స్టే ఎట్ హోమ్ పేరెంట్స్​గా ఉండేందుకు గల ప్రధాన కారణాలలో ఒకటి.. ఇది ఎంతో సంతషకంగా ఉంటుంది. మీ బిడ్డ అన్ని విషయాలలో సంరక్షణ పొందుతున్నాడని తెలుసుకోవడం మీ మనసుకు ఎంతో సంతోషాన్నిస్తుంది. మీరు వారికి అవసరమైనవన్నీ అందిచగలరు మరియు వారి ఎదుగుదలను చూడగలరు. మీరు పిల్లల సంరక్షణతో పాటుగా ఇంటిని కూడా చూసుకుంటారు. కానీ ప్రతి ఇంటి పనిని చేయడం మీ బాధ్యత కాదు. కొన్ని విషయాలలో మీ భాగస్వామి సహాయం చేయాల్సి రావొచ్చు. అన్నింటికంటే మరీ ముఖ్యంగా ఆరోగ్యకరమైన భోజనం మీద దృష్టి పెట్టడం ఎంతో విలువైన బహుమతిగా అనిపించొచ్చు.

    8. మీరు వారి మొదటి గురువుగా ఉండవచ్చు : స్టేఎట్ హోం పేరెంట్​గా ఉండడం వలన కలిగే మరొక ముఖ్య ప్రయోజనం ఏమిటంటే.. మీరు మీ పిల్లాడికి మొదటి గురువుగా ఉండవచ్చు. మీరు వారికి కౌంటింగ్ (ఒకటి రెండ్లు) మరియు ఆల్ఫాబెట్స్ (ఏబీసీలు) వంటివి నేర్పడం మాత్రమే కాకుండా విలువలు మరియు ఇతర జీవన విధానాలు కూడా నేర్పించే అవకాశం ఉంటుంది.

    9. మీరు మీ బిడ్డను క్రమశిక్షణలో పెట్టవచ్చు : మీరు మీ బిడ్డకు క్రమశిక్షణ నేర్పేటపుడు స్థిరత్వం అనేది చాలా ముఖ్యం. ప్రత్యేకించి మీరు మీ పిల్లలతో ఉంటే.. ప్రతిరోజు మీ నియమాల ప్రకారం మీ బిడ్డ ప్రవరిస్తున్నాడా లేదా అనేది చూసుకోవచ్చు. మీరు మీ క్రమశిక్షణలో స్థిరంగా ఉంటే మీ పిల్లవాడు కడా మీ రూల్స్​ మరియు బౌండరీస్​ను అలవరుచుకునేందుకు మొగ్గు చూపుతాడు.

    10. గజిబిజిగా ఉండే మార్నింగ్స్ ఉండవు : మీ ఉదయం ప్రశాంతంగా ఉంటుంది. స్టేఎట్ హోమ్ పేరెంట్​గా ఉండేందుకు ఇది మరొక కారణం. ఉదాహరణకు చాలా మంది తమ పిల్లలను డే కేర్ కోసం సిద్ధం చేసేటపుడు తమ ఉదయం ఎంత గజిబిజిగా ఉందో ఫిర్యాదు చేస్తారు. మీరు ఇంట్లోనే ఉండే తల్లిదండ్రులుగా ఉన్నపుడు ఇటువంటి సమస్యలు ఉండవు. అయితే ప్రతి రోజు ఉదయం ప్రశాంతంగా ఉండదు.

    11. మీ పిల్లవాడు డెవలప్ అయ్యేందుకు దినచర్యను క్రియేట్ చేయడం సులభం: ఇంట్లో ఉండడం వలన కలిగే మరొక గొప్ప ప్రయోజనం ఏమిటంటే మీరు వారి కోసం గొప్ప దిన చర్యను క్రియేట్ చేయొచ్చు. ముఖ్యంగా చిన్న వయసులో చాలా మంది పిల్లలు రొటీన్​నే ఎక్కువగా ఇష్టపడుతూ దానిమీదే ఎక్కువగా ఆధారపడతారు. మీరు మీ పిల్లలతో ఇంట్లోనే ఉండడం వలన వారంలో చాలా రోజులు మీ పిల్లలు వారు ఏమనుకుంటున్నారో దానికి కట్టుబడి ఉంటారు.

    12. మీ పిల్లవాడు ప్రతి రోజు ఎలా ఉంటాడో మీకు బాగా తెలుస్తుంది : ఈ రోజుల్లో ప్రతి విషయం పిల్లల మీద గెలిచేందుకు చూస్తోందన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియా పిల్లలను ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. మీ పిల్లవాడు దేనికి ప్రభావితం అవుతున్నాడో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వారు చూసే షోలు, మరియు సినిమాలు వారి వయసుకి తగినట్లు ఉండేలా చూడండి. అంతే కాకుండా మీరు రోజంతా టెలివిజన్ లేదా కంప్యూటర్ స్ర్కీన్ చూడనవసరం లేని పనులను పొందుతారు.

    స్టేఎట్ హోం పేరెంట్​గా ఉండడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

    ఇంట్లో ఉండే తల్లిదండ్రులుగా ఉండడం చాలా కష్టం. కానీ కొంత మంది ఇది ఈజీ అని అనుకుంటారు. రోజంతా పిల్లలు చేసే అల్లరిని తట్టుకోవాల్సి ఉంటుంది. స్టే-ఎట్-హోం పేరెంట్స్​కు ఉండే ప్రతికూలతలు ఏంటో ఓ లుక్ వేయండి.

    1. గుర్తింపును కోల్పోయామన్న బాధ: మీ ఏకైక ఉద్యోగం పిల్లలను చూసుకోవడం మాత్రమే అని మరింకేమీ లేదని మీరు అనేక సార్లు భావించవచ్చు. మరీ ముఖ్యంగా కుటుంబానికి మీరు అందించే సహకారం గుర్తించబడదు. మీ ఇంట్లోనే ఉండడం ద్వారా విశ్రాంతి తీసుకుంటున్నారని మీ కుటుంబసభ్యులు మరియు మీ పార్ట్​నర్ భావించవచ్చు.

    2. మీరు ఒంటరితనం అనుభవించవచ్చు : ప్రసవం తర్వాత కొన్ని రోజుల వరకు మీరు నిరుత్సాహంగా ఉండవచ్చు. బయటకు వచ్చేందుకు మరియు పరిసరాలను గమనించేందుకు లేదా బయటి వ్యక్తులతో మాట్లాడేందుకు సమయం కూడా లేనందున మీకు మీరు ఒంటరిగా భావించవచ్చు.

    3. జీవితం బోరింగ్​గా మారుతుంది: రోజులు మొత్తం ఒకేలా ఉండడంతో కొన్ని సార్లు మీకు బోరింగ్​గా అనిపించవచ్చు.మీ జీవితం మరీ మెకానికల్​గా ఉందని మీకు అనిపించవచ్చు. అంతే కాకుండా కొన్ని సార్లు తరచూ చేసే ఇంటి పనులు కూడా మార్పు లేకుండా (ఒకేలా) ఉండవచ్చు.

    4. శారీరకంగా అలసిపోయామని అనిపించవచ్చు : మీకు సపోర్ట్ సిస్టమ్​ ఉన్నప్పటికి కూడా.. పిల్లల సంరక్షణ గురించి పట్టించుకోవడం వల్ల అలసిపోయినట్లు మీది మీకే అనిపించవచ్చు. రోజు గడిచే సరికి మీరు పూర్తిగా డ్రైయిన్ (ఖాళీ అయ్యారనే భావన) అయ్యారనే భావన కలగొచ్చు. అప్పుడు మీరు శారీరకంగా మరియు మానసికంగా కూడా ఎంతో అలసిపోవచ్చు. అప్పుడు మీరు కోరుకునేది కేవలం నిద్ర మాత్రమే.

    5. మీకు ఎంత మాత్రం 'మీ-టైం' (చేయాలనుకున్నది చేయకపోవడానికి సమయం లేకపోవడం) లేకపోవడం: సాధారణంగా అందరూ నమ్మే దానికి విరుద్ధంగా ఇంట్లో ఉండే తల్లిదండ్రులు వారి గురించి వారు ఖర్చులు చేసుకోవడానికి కూడా సమయం ఉండదు. మీ రోజు పిల్లలలో మరియు ఇంటి పనులతో ప్రారంభం అయి… దానితోనే ముగుస్తుంది. మీకు ఎటువంటి పర్సనల్ స్పేస్ లేనందున మీ ఆ పనుల్లో చిక్కుకుపోయినట్లుగా అనిపించవచ్చు.

    6. అభిరుచుల కోసం మీకు సమయం ఉండదు: మీకు ఎటువంటి కెరీర్ లేకపోయినా ఒక అభిరుచిని చేపట్టడం లేదా నిర్మాణాత్మకంగా ఏదైనా చేయడం కోసం మీకు ఎటువంటి శక్తి మరియు సమయం ఉండదు.

    7. మీరు మీ భాగస్వామిపై ఆర్థికంగా ఆధారపడాల్సిన అవసరం రావొచ్చు: ఇంట్లోనే ఉండే తల్లిదండ్రులుగా ఉండడం వల్ల మీరు ప్రతి ఖర్చు కోసం మీ భాగస్వామిపై ఆధారపడాల్సిన అవసరం రావొచ్చు. మీరు మీ ఖర్చులన్నింటినీ ఒక్కరి ఆదాయం మీదే నిర్వహించాల్సి రావొచ్చు.

    8. మీరు ఉద్యోగాన్నిమిస్ అవ్వొచ్చు: మీరు ఇంతకుముందు వర్క్ చేయడం వల్ల మీ జీవనశైలిలో వచ్చిన మార్పు వల్ల మీరు నిరుత్సాహ పడవచ్చు. మీరు ఆఫీసుకి తిరిగి రావడం, జీతాన్ని పొందడం, సహోద్యోగులతో ఇంటరాక్ట్ అవడం వంటి వాటిని కోల్పోవచ్చు.

    9. నేర్చుకునే సమయం లేదని మీకు అనిపించవచ్చు: ఇతరులతో పోల్చుకుంటే మీరు వెనకబడి ఉన్నారని మరియు పనిని తిరిగి ప్రారంభించిన తర్వాత కూడా వారి కంటే తక్కువగా అప్​డేట్ అవుతున్నట్లు మీకు అనిపించవచ్చు.

    10. మీ భాగస్వామితో విభేదాలు ఏర్పడవచ్చు: మీరు రోజంతా ఏమి చేస్తున్నారో, ఎంత పని చేస్తున్నారనే విషయం మీ భాగస్వామికి తెలియకపోవచ్చు. కాబట్టి అది వారికి తేలికగా అనిపించవచ్చు. కానీ నిజం మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. మీ మధ్య అవగాహన లేకపోవడం వల్ల వివాదాలు తలెత్తవచ్చు.

    11. ఎటువంటి డౌన్​టైం (ఏదైనా పని ప్రారంభించడం కోసం కావాల్సిన సమయం) లేకపోవడం: ఇది 24/7 జాబ్. అందువల్ల మీకు ఎటువంటి విరామాలు, వెకేషన్స్, లేదా సెలవులు లభించే అవకాశం లేదు. అంతే కాకుండా ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా నిద్రలేవడం, సినిమాలకు పోవడం, రెస్టారెంట్లకు పోవడం వంటి ఎటువంటి లగ్జరీలు ఉండవు.

    స్టేఎట్ హోమ్ పేరెంట్​గా విజయం సాధించడానికి చిట్కాలు

    1. సరిగ్గా ప్లాన్ చేయండి : ఏ పనిని ఎప్పుడు చేయాలో ముందే లిస్ట్ చేసి పెట్టుకోవడం వల్ల మీరు పనుల మధ్య రెస్ట్ తీసుకోవచ్చు. మీ టైంను సక్రమంగా ఉపయోగించుకునేందుకు కార్యకలాపాలు, ఇంటిపనులు, మీ పిల్లల దినచర్యలను ముందే ప్రిపేర్ చేయండి. అలాగే ఆకస్మిక పరిస్థితులకు కూడా కొంత సమయం కేటాయించండి. రోజూవారీ జీవితంలో ఇది మీ పిల్లలకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని క్రమబద్ధంగా ఉంచుతుంది. మీ సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.

    2. ఇతర స్టే ఎట్ హోమ్ పేరెంట్స్​తో కనెక్ట్ అవండి : మీలానే ఉంటున్న ఇతర తల్లిదండ్రులతో మీరు సంభాషించినపుడు ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకుంటారు. అంతే కాకుండా మీరు వారి నుంచి మద్దతు కూడా పొందుతారు. అంతే కాకుండా మీ ఇరు కుటుంబాల్లో ఉన్న పిల్లలు ఒకరితో ఒకరు ఆడుకుంటారు. ఇది మీ పేరెంటింగ్ స్కిల్స్​ను ఇంప్రూవ్ చేసుకునేందుకు, అంతే కాకుండా మీ పిల్లలు సామాజిక బాధ్యతలు నేర్చుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

    3. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్​గా ఉండేందుకు ప్రయత్నించకండి: అన్ని ఎవరూ పరిపూర్ణులు కానప్పటికీ, మనల్ని మనం మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంటుంది. బెస్ట్ పేరెంట్​గా ఉన్నందుకు పొంగిపోకుండా మీ పిల్లలకు మీరు చేయాల్సిందంతా చేయండి. పర్ఫెక్ట్​గా ఉండడం కంటే మంచిగా ఉండడం ముఖ్యం. ఇది పరిపూర్ణమైనది అనే మితిమీరిన ఒత్తిడిని తగ్గించడంలో, మీ బిడ్డ ఎటువంటి ఒత్తిడి లేకుండా మీ ముందు పర్ఫామ్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.

    4. కుటుంబం మరియు స్నేహితుల నుంచి సహాయం పొందండి: కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల నుంచి సాయం కోరడంలో ఎటువంటి తప్పు లేదు. మీకు మీరు కొంచెం విశ్రాంతి ఇచ్చుకుని ఎవరైనా చేసే సాయాన్ని స్వీకరించండి. మీకు కొద్దిగా 'మీ-టైం ' కూడా అవసరం కాబట్టి సినిమాలు లేదా స్పాకు వెళ్లండి. లేదా మీ స్నేహితులతో సమావేశం ఏర్పాటు చేయండి. చిన్న పాటి విరామాలు తీసుకోవడం వలన మీరు రిఫ్రెష్ కావడానికి మరియు తిరిగి శక్తిని పొందవచ్చు. కాబట్టి ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీ నుంచి దూరంగా ఉండేందుకు పిల్లలను అలవాటు అయ్యేందుకు కూడా ఇది సహాయపడుతుంది.

    5. బేబీ సిట్టర్​ను నియమించుకోండి : మీ వద్ద బడ్జెట్ (డబ్బులు) ఉంటే మీరు బేబీ సిటర్​ను నియమించుకుని మీ శిశువు, మరియు మీ కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవచ్చు. ఇతరులతో సోషలైజ్ చేయడం ద్వారా ఇది పిల్లాడికి ప్రయోజనం చేకూరుస్తుంది. వారు మీ నుంచి దూరంగా ఉండడం అలవాటు చేసుకుంటారు.

    6. హాబీ క్లాసెస్​లో చేరండి: మీ దినచర్యను ప్రిపేర్ చేస్తున్నపుడు మీ హాబీల కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించండి. మీ థియేటర్, కుకింగ్, డ్యాన్స్ వంటి వివిధ రకాల కోర్సుల్లో లేదా ఇతర యాక్టివిటీల్లో పాల్గొనవచ్చు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు మీరు ఏదో ఒకదానిని తీసుకోండి. ఇది మీ మనస్సును యాక్టివ్​గా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మీ ఆత్మగౌరవాన్ని కూడా పెంచుతుంది.

    7. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి : మీకు జీతం రానపుడు మీరు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. ఇతరులను చూసుకుని మీ ఉద్యోగాన్ని తక్కువగా అంచనా వేయకండి. మీరు ప్రపంచంలోనే ఉత్తమమైన ఉద్యోగం చేస్తున్నారని అనుకోండి. తల్లిదండ్రులుగా ఉండడం అమూల్యమైనది. ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి. మీరు ఏదైనా పనిని బాగా చేసినపుడు మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి. పేరెంటింగ్ జర్నీని ఫన్​గా మరియు రివార్డింగ్​గా మార్చడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.

    స్టేఎట్ హోమ్ పేరెంట్​గా ఉంటూ డబ్బు సంపాదించడం ఎలా?

    మీరు మీ ఆర్థిక విషయాలలో ఎటువంటి రాజీ పడకుండా స్టేఎట్ హోమ్ పేరెంట్​గా కొనసాగేందుకు కొన్ని రకాల చిట్కాలు ఉన్నాయి.

    • మనీ మేనేజ్​మెంట్​లో మంచిగా ఉండండి
    • మీరు పన్నులు మరియు సుంకాలపై ఆదా చేసుకోవచ్చు.
    • డే కేర్ ఖర్చుల నుంచి మీరు తప్పించుకోవచ్చు.
    • మీరు డైపర్లు, ఫార్ములా (డబ్బా పాలు) వంటివి తగ్గించుకోవచ్చు.
    • మీరు ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారాన్ని వండుకోవచ్చు.
    • రవాణా మరియు ఇందన ఖర్చులను తగ్గించవచ్చు.
    • పార్ట్ టైమ్ జాబ్ లేదా స్వయం ఉపాధిని గుర్తించండి

    స్టేఎట్ హోమ్ పేరెంట్స్​కు ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా?

    అదృష్టవశాత్తు ఇంట్లో ఉండి చేసుకునే వివిధ ఫ్రీలాన్స్, మరియు పార్ట్ టైమ్ జాబ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇంట్లో ఉండి చేసేందుకు పనులు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఇంటి నుంచి సులభంగా చేసేందుకు పనిని కనుగొనేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. మీరు వివిధ కెరీర్ సైట్లలో కూడా పార్ట్ టైమ్ జాబ్స్ వెతుక్కోవచ్చు. అక్కడ ఏం మెన్షన్ చేశారు? మీకు ఎందులో నైపుణ్యం ఉంది. వర్క్ అవర్స్ ఏమిటనే విషయాన్ని క్షుణ్ణంగా పరీక్షించాలి. స్కూల్ మరియు ఆన్​లైన్ ట్యూటరింగ్, ఎడిటింగ్ మరియు కంటెంట్ రైటింగ్, వెబ్​సైట్ డెవలప్​మెంట్, డిజైనింగ్ వంటివి స్టేఎట్ హోం పేరెంట్స్ చేసే జాబ్స్ ఉన్నాయి.

    కొన్ని సార్లు మీరు ఇంటి వద్ద నుంచే చేసే ఉద్యోగాలు మరియు పార్ట్ టైమ్ ఉద్యోగాలు కూడా మిమ్మల్ని వర్క్​ అవర్స్ సెట్ చేసుకునేందుకు అనుమతిస్తాయి. స్టే ఎట్ హోం పేరెంట్స్​కు ఇది అనువుగా ఉంటుంది. అయినప్పటికీ బర్న్​అవుట్​(పని ఒత్తిడి)ని నివారించేటపుడు మిమ్మల్ని మరియు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడంలో సహాయపడే ప్రణాళిక మరియు పనిభారాన్ని గుర్తించేందుకు మీరు సమయం వెచ్చిస్తున్నారని నిర్దారించుకోండి. మీరు పార్ట్​టైమ్ ఉద్యోగం చేయాలని అనుకుంటే.. అది మీకు ఇష్టమైన పని అయితే.. మీ పార్ట్​నర్​తో తప్పనిసరిగా చర్చించండి. మరియు స్నేహితులు మరియు కుటుంబసభ్యుల నుంచి సహాయం అడగండి. అలా చేయడం వల్ల మీరు సపోర్టెడ్​గా భావిస్తారు.

    చివరగా..

    ఇంట్లోనే ఉండే తల్లిదండ్రులుగా ఉండేందుకు చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసినదానికంటే ఎక్కువ సమయం దీనికి కేటాయించాలి. కొన్ని కొన్ని సార్లు ఈ రోల్ నిస్వార్దంగా కూడా అనిపిస్తుంది. కాబట్టి మీ కోసం సమయాన్ని కేటాయించడం చాలా అవసరం. సమయం కేటాయించకపోతే మీరు పగతో ద్వేషం పెంచుకుని బాధపడకండి. అంతే కాకుండా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునేందుకు ఇంట్లోనే ఉండే తల్లిదండ్రులు ఎటూ పోకుండా ఇంట్లోనే ఉండవచ్చు. ఇది ఫుల్ టైమ్ రెస్పాన్సబులిటీ, ఎటువంటి టైమింగ్స్ ఉండవు. సెలవు రోజులు, పదవీ విరమణ లాంటివి కూడా ఉండవు. ఇంట్లోనే ఉండే తల్లిదండ్రులుగా మారాలని నిర్ణయించుకునే ముందు అందులోని లాభనష్టాలను గురించి మీరు తెలుసుకోవడం చాలా అవసరం.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sarada Ayyala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on TOI
    Mylo featured on inc42
    Mylo featured on Business Standard
    Mylo featured on YourStory
    Mylo featured on ANI
    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo
    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.