Women Specific Issues
3 November 2023 న నవీకరించబడింది
చెమట అనేది మానవశరీరం యొక్క అతి ముఖ్యమైన విధుల్లో ఒకటి. ఇది శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేసేందుకు సహాయపడుతుంది. అదనంగా చెమట వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దానికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ వాసన మరియు తేమ అనేవి చెమట వల్ల వస్తాయి. ఇది ప్రజలను చికాకు పెడుతుంది. శరీరంలో చాలా భాగాలు చెమటను ఉత్పత్తి చేసినా కానీ.. వక్షోజాల చెమట అనేది మహిళలను ఎక్కువగా బాధిస్తుంది. ఈ ఆర్టికల్ వక్షోజాల చెమటకు గల కారణాలను మరియు దానిని ఎదుర్కొనే మార్గాలను గురించి వివరిస్తుంది.
వక్షోజాల కింద చెమట పట్టడాన్ని రొమ్ము చెమట అని అంటారు. సాధారణంగా వేడి మరియు తేమతో కూడిన వాతావరణంలో ఇది జరుగుతుంది. అలాగే వ్యాయామం, మరియు శారీరక కార్యకలాపాల వంటివి కూడా వక్షోజాల చెమటకు కారణం అవుతాయి. ఇతర శరీర భాగాలకు పట్టిన చెమట తరచుగా బట్టల ద్వారా గ్రహించబడుతుంది. లేదా గాలి తగలడం వల్ల ఇది తగ్గిపోతుంది. ఇది చర్మం పొడిగా ఉండేందుకు సహాయపడుతుంది. అయినప్పటికీ స్త్రీలు బ్రాను ధరిస్తారు. అది వక్షోజాలకు పట్టిన చెమటను బట్టలు పీల్చుకునేలా చేస్తుంది లేదా లోపలే చెమట ఎండిపోయేలా చేస్తుంది. అధిక తేమ అనేది అసౌకర్యంగా అనిపిస్తుంది. మరియు తరచూ దద్దుర్లు మరియు ఎరుపునకు దారి తీస్తుంది.
చెమట అనేది చాలా సాధారణ విషయం. మరియు ఇది చాలా అవసరం. ఉక్కపోతగా ఉన్నపుడు శరీరాన్ని చెమట చల్లబరుస్తుంది. వేడిగా ఉన్నపుడు చర్మం ఉపరితలం మీద చెమటను విడుదల చేయమని శరీరం మెదడుకు సంకేతాన్ని పంపుతుంది. తేమ అనేది ఆవిరైపోయిన తర్వాత శరీరం అనేది చల్లబడుతుంది. శరీర ఉష్ణోగ్రతను మెయింటేన్ చేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. తరచూ శరీరంలోని ఇతర భాగాల నుంచి చెమట ఆవిరైపోతుంది. కానీ.. వక్షోజాల వద్ద ఉన్న మడతలు మరియు చీలికల వల్ల అక్కడి చెమట ఆవిరి కాదు. అధికంగా ఉన్న తేమ ఎక్కడికీ వెళ్లదు. స్త్రీలను చెమటతో తడిచిన బ్రాలు వదిలేసేలా చేస్తుంది.
సాధారణంగా చెమట అనేది వాసన లేకుండా ఉంటుంది. అయితే ఇది చర్మం మీద ఉన్న బ్యాక్టీరియాతో కలిసి వాసనను కలిగిస్తుంది. అందువల్ల చెమట పట్టినపుడు ఎక్కువ ఉపరితల బ్యాక్టీరియా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ వాసన వస్తుంది. వీటిలో గజ్జలు, చంకలు, చనుమొనల చుట్టూ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి.
చెమట అనేది మానవ శరీరంలో సహజంగా వచ్చేది. దానిని ఆపడం కుదరదు. మనం ఉన్న గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లు ఒకసారి శరీరం గుర్తిస్తే చాలు చెమట రావడం ప్రారంభం అవుతుంది. అయితే జీవనశైలిలో కొన్ని రకాల మార్పుల వల్ల దుర్వాసన వచ్చే వక్షోజాల చెమటను ఆపొచ్చు.
తన రొమ్ముల కింద చెమటను ఎలా ఆపాలో తెలుసుకోవాలనుకే మహిళలకు ఈ కింది చిట్కాలు ఉపయోగపడతాయి.
స్కిన్ టైట్ దుస్తులు (శరీరానికి అతుక్కుని ఉండే దుస్తులు) లోపలికి గాలిని రానివ్వవు. మీ చర్మం మరియు బట్టల మధ్య చెమట అనేది ఉంటుంది. బయటి గాలి తాకి చెమట తగ్గి శరీరం డ్రైగా ఉండేలా మహిళలు వదులుగా ఉండే దుస్తులను ధరించేందుకు ప్రయత్నించాలి. అంతే కాకుండా వేసవిలో ప్యాడెడ్ బ్రాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి దుర్వాసనతో కూడిన చెమటతో తడిచిన బ్రాలుగా మారి మరింత చికాకు తెప్పిస్తాయి.
యాంటీపెర్సిపిరెంట్లు (చెమట నివారిణి) కేవలం చంకలలో ఏర్పడ్డ చెమటను ఎదుర్కొనేందుకు మాత్రమే కాకుండా వక్షోజాల చెమటను ఎదుర్కొనేందుకు కూడా బాగా ఉపయోగపడతాయి. అధిక చెమటను నివారించేందుకు దుర్వాసన రాకుండా ఉండేందుకు మహిళలు యాంటీపెర్సిపిరెంట్ (చెమట నివారిణి) ను వక్షోజాలు మరియు చీలిక కింద అప్లై చేయొచ్చు.
మేకప్‌ను రిమూవ్ చేసేందుకు వాడే కాటన్ ప్యాడ్లను బ్రాలో అదనపు పొరలు ఏర్పాటు చేసేందుకు కూడా ఉపయోగించవచ్చు. ఇది మొత్తం చెమటను పీల్చుకోవడంలో సహాయం చేస్తుంది. ఇది మీకు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తుంది. వక్షోజాల చెమట నుంచి రోజంతా రక్షణ పొందాలని చూస్తున్న మహిళలు బ్రా లోపల ప్యాంటీ లైనర్లను అతికించవచ్చు. ఇది చెమట మరకలు కనిపించకుండా వక్షోజాలు చెమట రహితంగా ఉండేలా చేస్తుంది.
వర్కౌట్ తర్వాత నేరుగా షాపింగ్ లేదా పనికి వెళ్లే మహిళలు ముందుగా బ్రా మార్చుకోవడం మంచిది. చెమట పట్టిన బ్రా మార్చుకుని కొత్తది ధరించడం వల్ల వక్షోజాలు తాజాగా మరియు దద్దుర్లు లేకుండా ఉంటాయి.
కొన్ని సార్లు సాధారణ నివారణలు ఉత్తమంగా పని చేస్తాయి. చెమట పట్టిన బ్రాలు ధరించిన స్త్రీలు పీల్చుకునే టాల్కమ్ పౌడర్ వేసుకోవడం వల్ల వారు అసౌకర్యంగా లేకుండా చేసుకోవచ్చు. టాల్క్‌లో ఉన్న కార్న్టార్చ్ అనేది వక్షోజాల చెమటను పీల్చుకోవడం మాత్రమే కాకుండా ఘర్షణను కూడా తగ్గిస్తుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడేందుకు గల అవకాశాలను తగ్గిస్తుంది.
దద్దుర్లు వచ్చే అవకాశాన్ని తగ్గించేందుకు స్కిన్ బారియర్ క్రీమ్స్ గొప్ప మార్గం. అధిక వక్షోజాల చెమటను ఎదుర్కొంటున్నమహిళలు వక్షోజాలు మరియు చీలిక కింద ఈ క్రీమ్స్‌ను అధిక మొత్తంలో అప్లై చేయవచ్చు. ఇవి చెమటను నిరోధించలేకపోయినా కానీ అధిక చెమట వల్ల వచ్చే దద్దుర్లు మరియు చికాకు లేకుండా చూస్తాయి.
ఆల్కహాల్ మరియు కెఫిన్ వంటి కొన్ని రకాల పదార్థాలు శరీరంలో ఎక్కువ చెమట ఉత్పత్తికి కారణం అవుతాయి. వక్షోజాల చెమట కారణంగా ఇబ్బంది పడే మహిళలు వారి రోజూవారి ఆహారం నుంచి పైన పేర్కొన్న పదార్థాలను తొలగించాలి.
చాలా సందర్భాలలో వక్షోజాల చెమటను పైన పేర్కొన్న పద్ధతులతో పరిష్కరించవచ్చు. చల్లటి వాతావరణంలో ఉన్న కానీ ఎక్కువ మొత్తంలో చెమట వస్తే అది అంతర్లీనంగా ఉన్న ఏదైనా సమస్యను సూచిస్తుంది. అటువంటి సందర్భాలలో చర్మవ్యాధి నిపుణుడు విషయాలను క్లియర్ చేయడంలో మరియు సందేహాలను తీర్చడంలో సహాయపడతాడు.
1. Baker LB. (2019). Physiology of sweat gland function: The roles of sweating and sweat composition in human health. Temperature (Austin).
2. An JK, Woo JJ, Hong YO. (2019). Malignant sweat gland tumor of breast arising in pre-existing benign tumor: A case report. World J Clin Cases.
Tags
What is breast sweat in Telugu, Boob sweating in Telugu, What causes my breasts smell like sweat in Telugu, How to control the boob sweat in Telugu, How to Survive Boob Sweat in English, How to Survive Boob Sweat in Hindi, How to Survive Boob Sweat in Tamil, How to Survive Boob Sweat in Bengali
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |