hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • రొమ్ము నొప్పికి కారణాలు: ఆడవాళ్ళకు రొమ్ము నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోండి arrow

In this Article

    రొమ్ము నొప్పికి కారణాలు: ఆడవాళ్ళకు రొమ్ము నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోండి

    Breast Changes

    రొమ్ము నొప్పికి కారణాలు: ఆడవాళ్ళకు రొమ్ము నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోండి

    3 November 2023 న నవీకరించబడింది

    ఆడవాళ్ళకు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో రొమ్ము నొప్పి రావచ్చు. అటువంటి సమస్యకు చికిత్స చేయడం సులువే అయినప్పటికీ, రొమ్ములలో నొప్పి కొన్నిసార్లు లోపల ఉన్న సమస్యను సూచిస్తుంది! నిజానికి, ఈ సమస్య మరింత తీవ్రమైన సమస్యని సూచిస్తుంది! మీకు రొమ్ములో నొప్పి రావడానికి గల కొన్ని కారణాలు ఈ క్రింద ఉన్నాయి!

    స్త్రీలు రొమ్ము నొప్పిని అనుభవించడానికి కొన్ని కారణాలు

    1. హార్మోన్ల అసమతుల్యత:

    కొన్నిసార్లు, హార్మోన్ల అసమతుల్యత వల్ల ఛాతీలో నొప్పి వస్తుంది. నిజానికి, ఎక్కువగా ఆడవాళ్ళకు రొమ్ము నొప్పి రావడానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి. మీ పీరియడ్స్ రావడానికి కొన్ని రోజుల ముందు మీకు ఛాతీ నొప్పి ఉండవచ్చు. అయితే.. పీరియడ్స్ మొదలైన తర్వాత, నొప్పి తగ్గుతుంది. పీరియడ్స్ ముందు మీ ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలలో పెరుగుదల కారణంగా ఇటువంటి పరిస్థితి ఉంటుంది. అందువలన, రొమ్ములు ఉబ్బి, నొప్పి వస్తుంటాయి. ప్రెగ్నెన్సీలోని మొదటి మూడు నెలలలో రొమ్ములు చాలా కాలం పాటు నొప్పిగా ఉండవచ్చు. అలాగే, రొమ్ములలో నొప్పి రావడం చాలా సాధారణం, దీనిగురించి భయపడనవసరం లేదు. మీరు తక్కువ కొవ్వు ఉన్న ఆహారాన్ని తినడం, కెఫిన్ కలిగిన పానీయాలను కొన్నాళ్ళపాటు మానేయడం, అలాగే ఉప్పగా ఉండే ఆహారాన్ని తగ్గించడం ద్వారా మీ ఛాతీలో నొప్పిని తగ్గించవచ్చు. అంతే కాకుండా.. అవసరమైతే మందులు తీసుకోవడం గురించి కూడా ఆలోచించవచ్చు. మందులు ఏవీ పని చేయకపోతే, మామోగ్రామ్ చేయించుకోవడానికి ఇది సరైన సమయం కావచ్చు!

    మీకు ఇది కూడా నచ్చుతుంది: రొమ్ముల్లో ఫైబ్రో అడేనోమా : అర్థం, లక్షణాలు & కారణాలు

    2. రొమ్ములకు గాయం అవడం:

    ప్రమాదవశాత్తు మీ రొమ్ములకు ఏదైనా గాయమై ఉండవచ్చు. అందుకే మీకు రొమ్ము నొప్పిని ఎదుర్కొంటున్నారు. మీరు గాయం తర్వాత వెంటనే నొప్పిగా ఉంటే, చాలా రోజుల పాటు కొనసాగితే, మీరు వీలైనంత త్వరగా డాక్టర్‌ని సంప్రదించవచ్చు. అయినప్పటికీ.. ప్రత్యేకించి మీకు గడ్డకట్టడం, వాపు, ఎరుపు లేదా తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలు ఉంటే మీకు డాక్టర్‌తో అపాయింట్‌మెంట్ తప్పనిసరి.

    3. సరిగా సపోర్ట్ చేయని బ్రా:

    మీ బ్రా మీకు సరిగ్గా సరిపోకపోతే, అది మీ ఛాతీ గోడలపై ప్రభావం చూపుతుంది. మీ ఛాతీ గోడ విస్తరించినట్లు లేదా దానికి మద్దతు లేనట్లుగా అనిపించవచ్చు. అందువల్ల, రొమ్ములపై పుండ్లు పడడం లేదా తేలికపాటి నొప్పి రావచ్చు. మీ ఛాతీ గోడ నుండి బయటకు నొప్పి రావచ్చు. దీనివల్ల చాలా అలసట, నొప్పి వస్తుంది. ముఖ్యంగా వ్యాయామం చేసేటప్పుడు తగిన బ్రాను ఎంచుకోవడం వల్ల, రొమ్ములలో పుండ్లు పడకుండా చూసుకోవచ్చు. చాలా మంది ఆడవాళ్ళు సాధారణంగా తమ వర్కవుట్ సెషన్‌లలో పుండ్లు పడడం వంటి సమస్యలు రాకుండా నివారించడానికి స్పోర్ట్స్ బ్రాను ఎంచుకుంటారు. మీరు మీ రొమ్ములకు సరిగ్గా సరిపోయే, సౌకర్యవంతంగా ఉండే బ్రా తీసుకోవచ్చు.

    4. తల్లిపాలు ఇవ్వడం:

    కొన్నిసార్లు, బిడ్డకు పాలివ్వడం వల్ల కూడా రొమ్ములలో నొప్పి రావచ్చు. అంతేకాకుండా, పిల్లలు సరిగా పట్టుకోలేకపోతే కూడా చనుమొనలలో నొప్పి వస్తుంది. మీరు తల్లిపాలు ఇస్తున్నప్పుడు ఏదైనా నొప్పి వస్తే, తల్లిపాల సలహాదారుని సంప్రదించడం మంచిది. ఈ విధంగా మీరు రొమ్ము నొప్పి సమస్యను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా మీ బిడ్డకు పాలిచ్చేటప్పుడు. కొన్నిసార్లు, చనుమొనల చుట్టూ చర్మం పగిలి ఉండటం వల్ల కూడా బిడ్డ పట్టుకున్నప్పుడు నొప్పి వస్తుంది. ఈ రోజుల్లో చనుమొనలు పొడిబారడాన్ని నివారించడంలో సహాయపడే ఎన్నో మందులు ఉన్నాయి. అయినప్పటికీ.. ఛాతీ ప్రాంతం నుండి నొప్పి వస్తున్నట్లు మీకు అనిపిస్తే, డాక్టర్‌ని సంప్రదించడానికి ఇది సరైన సమయం కావచ్చు.

    5. బ్రెస్ట్ ఇన్ఫెక్షన్:

    రొమ్ములలో ఇన్ఫెక్షన్‌ని మాస్టిటిస్ అని కూడా అంటారు. దీనివల్ల రొమ్ములలో తీవ్రమైన నొప్పి వస్తుంది. వాస్తవానికి, రొమ్ములలో ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరం, ఇంకా మరికొన్ని లక్షణాలు కూడా ఉండవచ్చు. మాస్టిటిస్ వల్ల ఒక రొమ్ము లేదా రెండు రొమ్ముల పైన ప్రభావం పడవచ్చు. కొన్ని లక్షణాలలో తీవ్రమైన నొప్పి, వాపు అలాగే ఇన్ఫెక్షన్ ఉన్న రొమ్ము ఎర్రగా అవుతుంది. మీకు అలాంటి సమస్య ఉంటే వెంటనే మీ డాక్టర్‌ని సంప్రదించవచ్చు. మాస్టిటిస్‌కు సంబంధించిన లక్షణాలు, సమస్యలను మీరు నిర్లక్ష్యం చేయకపోవడం చాలా ముఖ్యం. అందువల్ల.. ఈ పరిస్థితి అనేక ఇతర సమస్యలను తీసుకురావచ్చు, ముఖ్యంగా దీర్ఘకాలంలో. అటువంటి పరిస్థితులలో అటువంటి సమస్యను ముందుగానే గుర్తించడం ఉత్తమ పరిష్కారంగా మారుతుంది. అందువల్ల, ఏదైనా లోపల ఉన్న సమస్యను ముందుగానే గుర్తించడానికి ప్రతి ఆరు నెలలకోసారి రొమ్ము పరీక్ష చేయాలని నిర్ధారించుకోండి!

    6. మందుల సైడ్-ఎఫెక్ట్స్:

    రొమ్ము నొప్పికి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ కూడా కారణం కావచ్చు, ప్రత్యేకించి మీరు ప్రస్తుతం కొన్ని మందులు తీసుకుంటుంటే. రొమ్ము నొప్పికి కారణమయ్యే కొన్ని మందులలో ఆక్సిమెథోన్, క్లోర్‌ప్రోమాజైన్, గర్భనిరోధక మాత్రలు, ఎక్కువ మూత్రవిసర్జన కావడం కోసం ఉపయోగించే మందులు వంటివి ఉన్నాయి. అంతే కాకుండా, డిజిటాలిస్, మీథైల్‌డోపా కూడా ఆడవాళ్ళలో రొమ్ము నొప్పికి కారణం కావచ్చు.

    7. బ్రెస్ట్ ఇంప్లాంట్లు:

    బ్రెస్ట్ ఇంప్లాంట్లు పెట్టించుకున్న తర్వాత వచ్చే అత్యంత సాధారణ సమస్యలలో ఒకటి పుండ్లు పడడం, రొమ్ము నొప్పి. కొన్నిసార్లు, స్కార్ టిష్యూస్ ఇంప్లాంట్‌లను చాలా గట్టిగా చుట్టుకుంటాయి. దీనివల్ల తీవ్రమైన నొప్పి, బాధ ఉంటాయి. అంతేకాకుండా, అటువంటి నొప్పి వస్తే ఇంప్లాంట్ చీలినట్లు కూడా అనుకోవచ్చు. దాన్ని సెలైన్‌తో చేసినా సిలికాన్‌తో చేసినా కూడా వీలైనంత త్వరగా మీ డాక్టర్‌ని సంప్రదించడం మంచిది!

    8. రొమ్ము క్యాన్సర్:

    ఇది అనుకోకుండానైనా, హఠాత్తుగానైనా రావచ్చు. రొమ్ము క్యాన్సర్ గురించి మరొక వాస్తవం ఏమిటంటే ఇది‌ ఏ వయస్సులో ఉన్న ఆడవాళ్ళకైనా రావచ్చు. కొన్ని లక్షణాలలో ఛాతీ రంగు మారడం ‌లేదా ఎర్రగా అవడం, రొమ్ములలో వాపు, పుండ్లు పడడం, అలాగే చర్మం పాడవడం వంటివి కూడా ఉండవచ్చు. విపరీతమైన నొప్పి ఉంటే క్యాన్సర్ ఒక భయంకరమైన పుండుగా అభివృద్ధి చెందిందని కూడా అనుకోవచ్చు.

    మీరు డాక్టర్‌ని ఎప్పుడు కలవాలి?

    మహిళల్లో రొమ్ము నొప్పి కొన్నిసార్లు చిన్న సమస్యే అయినా, దానిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మీకు క్రమం తప్పకుండా భరించలేని నొప్పిని వస్తుంటే మీ డాక్టర్‌‌‌‌‌‌తో మీకున్న భయాలన్నింటి గురించి మాట్లాడవచ్చు. అటువంటి పరిస్థితులను నివారించడానికి మీ రొమ్ములను క్రమం తప్పకుండా పరీక్ష చేయిండం మంచిది. ఏవైనా గడ్డలు ఏర్పడినట్లు ముందుగానే గుర్తించడానికి మీరు మీ రొమ్ములను స్వయంగా కూడా పరీక్షించుకోవచ్చు.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sarada Ayyala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |