hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Care for Baby arrow
  • మీ బేబీ కోసం ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేయాలి? ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? arrow

In this Article

    మీ బేబీ కోసం ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేయాలి? ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

    Care for Baby

    మీ బేబీ కోసం ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేయాలి? ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

    3 November 2023 న నవీకరించబడింది

    తినడం, నిద్రపోవడం, మూత్రవిసర్జన, మలవిసర్జన. నవజాత శిశువు జీవితంలో ఒక రోజంతా ఇలాంటి వాటితో నిండి ఉంటుంది. వారు ఓ స్టేజికి ఎదిగే వరకు వారి జీవితంలో ప్రతిరోజు ఇవే ఉంటాయి. అయితే.. ఈ పనులలో కూడా తల్లి పాత్ర ఎంతో కీలకమైనది. మీరు మొదటిసారి తల్లిదండ్రులు అయినట్లయితే, మీ పిల్లలకు ఆహారం ఇవ్వడం గురించి కొన్ని సందేహాలు కలుగుతాయి. మీ బిడ్డకు ఎన్ని ఔన్సుల పాలు ఇవ్వాలి? ఎందుకు వారు ఎప్పుడూ ఆకలితో ఉన్నట్లు కనిపిస్తారు? మీ శిశువు ఎప్పుడు ఘన పదార్థాలను తినడం ప్రారంభించవచ్చు?

    ఇంట్లో పెద్దవాళ్ళు ఎన్ని చెప్పినా, సమాధానం దొరకని ప్రశ్నలు చాలా ఉంటాయి మరియు మీ చిన్నప్పటి నుండి వాటికి సమాధానాలు మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు శిశువులు, ఫార్ములా పాలు ఇచ్చినా కూడా వారు కోరుకున్నప్పుడు ఆహారం ఇవ్వాలని (ఫీడ్ చేయడం- పాలివ్వడం) మరియు పిల్లలు ఘనమైన ఆహారాన్ని తినడం ప్రారంభించేందుకు 4 నుండి 6 నెలల వయస్సు వచ్చే వరకు వేచి ఉండాలని సూచించబడింది.

    మీ పిల్లల వయస్సు ప్రకారం వారి ఆహార ప్రణాళిక చేయడం:

    నవజాత శిశువుగా, మీ శిశువు యొక్క కడుపు ఒక పాలరాయి పరిమాణంలో ఉంటుంది. శిశువు కడుపు ఒకేసారి ఒకటి మరియు రెండు టేబుల్ స్పూన్‌ల ద్రవాలను మాత్రమే తీసుకోగలదు. మీ బిడ్డ వయస్సు పెరిగే కొద్దీ, పొట్ట పరిమాణం పెరిగి కుదించబడుతుంది. పాలు ఇస్తున్నప్పుడు, మీ బిడ్డ ఎంత పాలు తీసుకుంటుందో చెప్పడం చాలా కష్టం. ఈ విషయంలో బాటిల్‌తో పాలు ఇవ్వడం ద్వారా కొలవడానికి చాలా సులభం అవుతుంది. ఈ కొలత వల్ల చాలా విషయాలు తెలుస్తాయి.

    శిశువుకు సుమారుగా ఎంత తరచుగా పాలు ఇవ్వాలి?

    తల్లిపాలు తాగే నవజాత శిశువులు బాటిల్‌తో తాగేవారి కంటే ఎక్కువ పాలు తీసుకుంటారు. అయితే ఇది అందరి విషయంలో నిజం కాకపోవచ్చు. చనుబాలు, ఫార్ములా పాలు కంటే త్వరగా జీర్ణమవుతాయి మరియు జీర్ణ నాళం నుండి వెళ్లిపోతాయి మరియు ఫార్ములా పాలు జీర్ణవ్యవస్థను విడిచిపెట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది. మీరు క్రమబద్ధమైన ఆహార ప్రణాళికను ఎలా ఏర్పాటు చేస్తారు, ఉదాహరణకు, 5-నెలల వయస్సు గల శిశువుకు ఘనమైన ఆహారం ఇచ్చేందుకు ప్రణాళిక ఏమిటి?

    ప్రారంభంలో, ప్రతి తల్లిదండ్రుల కల వారి బిడ్డ కోసం సరైన ప్రణాళికను కలిగి ఉండటం. ఉదాహరణకు వారికి మరియు వారి పిల్లలకు తగినట్లు ఉండే 1 లేదా 2-నెలల శిశువు ఆహార ప్రణాళిక. మీ పిల్లల కడుపు పెరిగినప్పుడు, ఆహారం అందించే ప్రణాళిక అభివృద్ధి చెందుతుంది మరియు వారు ఒకేసారి ఎక్కువ రొమ్ము పాలు లేదా ఫార్ములా పాలు తీసుకోవచ్చు. ఇలా రెండు మరియు నాలుగు నెలల వయస్సు మధ్య జరగవచ్చు.

    ప్రస్తుతం చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ శిశువు యొక్క ఆకలి సంకేతాలను తెలుసుకోవడం, కింద పేర్కొనబడినటువంటివి:

    • చనుమొన కోసం మీ రొమ్ములను వెతకడం
    • పిడికిలితో కొట్టడం, పెదవిని చప్పరించడం మరియు వేగంగా (మీ బిడ్డకు పాలు ఇవ్వడానికి, తనకి ఆకలి వేసేంత వరకు వేచి ఉండకండి) పెరిగే ఇతర ప్రవర్తనలు అన్నీ ఉదాహరణలు.
    • కొన్ని నెలల వయస్సు వచ్చిన తర్వాత మీకు మరియు మీ పిల్లల కోసం తగినట్లు ఉండే నిద్ర/ఆహార దినచర్యను మీరు ఏర్పాటు చేసుకోవచ్చు, ఉదాహరణకు, 1-నెలల శిశువు ఆహారం మరియు నిద్ర ప్రణాళిక.

    మీ బిడ్డకు ఘన ఆహారాన్ని ఇవ్వడం ఎలా ప్రారంభించాలి:

    సాధారణంగా 4 నుండి 6 నెలల వయస్సు గల శిశువు ఘన పదార్థాలను తినడం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటుంది.

    • తలను బాగా నియంత్రించగలరు.
    • మీరు తినే వాటిపై ఆసక్తి చూపుతారు
    • కనీసం 13 పౌండ్ల బరువు ఉన్నారని అనుకోండి

    ఘన ఆహారాన్ని ప్రారంభించడానికి ఉత్తమ మార్గం ఏమిటి?

    AAP ప్రకారం, మీరు ఏ క్రమంలో ఆహారాన్ని తినిపించడం మొదలు పెడతారు అనేది ఇకపై పెద్ద విషయం కాదు. 3 నుండి 5 రోజుల పాటు ఒకే ఆహారాన్ని ఇవ్వడం మాత్రమే గైడ్ లైన్. అలెర్జీకి కారణమయ్యే ఖచ్చితమైన ఆహారాన్ని మీరు గుర్తించగలగాలి. మీ బిడ్డ వయస్సు పెరిగే కొద్దీ గుజ్జుగా చేసిన శిశు ఆహారం నుండి మంచి ఆకృతితో (అరటి పండు గుజ్జు, గిలకొట్టిన గుడ్డు లేదా బాగా ఉడికించి, ముక్కలు చేసిన పాస్తా) కూడిన ఆహారాలకు మార్చండి

    మీరు మీ బిడ్డ ఆహారాన్ని సిద్ధం చేయాలనుకుంటే, ఆ వంటకంలో చక్కెర లేదా ఉప్పును జోడించకండి. అంతే కాకుండా ఈ సమయంలో మీ శిశువు గొంతులో అడ్డు పడే అవకాశం ఉన్న ఏ ఆహారాన్ని ఇవ్వకండి. పాప్‌కార్న్ లేదా నట్స్ వంటి ఆహారాలు, అలాగే యాపిల్స్ వంటి తాజా పండ్లు మరియు కూరగాయలు, అవి మెత్తగా అవ్వడానికి ఉడకబెట్టాలి లేదా పచ్చి మాంసం (ఇందులో హాట్ డాగ్‌లు కూడా ఉన్నాయి) అయితే చాలా చిన్న ముక్కలు చేయాలి.

    మీరు 1 ఏడాది వయసు రావడానికి ముందు డైలూట్ (పలుచబర్చిన) పీనట్ బటర్‌ను తినిపించాలని అనుకుంటే మీ డాక్టర్ ని సంప్రదించండి. మీ శిశువుకు ఏడాది వయస్సు వచ్చే సరికి వారికి వివిధ రకాల ఆహారాలు అందుబాటులో ఉండాలి. అలాగే భోజనం తినే ప్రతిసారీ దాదాపు 4 ఔన్సుల ఘనమైన ఆహారాన్ని ఇవ్వాలి. సాధారణంగా పిల్లలకు ఆరవ నెలలో అన్న ప్రాసన చేసి ఆ తరువాత ఘన పదార్ధాలను ఆహారంగా ఇవ్వడం అలవాటు చేస్తారు. పిల్లలకు తల్లి పాలు లేదా ఫార్ములా పాలు అందించడానికి సిద్ధంగా ఉండండి. సగటున 8 నెలల శిశువు ప్రతిరోజు 30 ఔన్సుల నీరు తాగుతుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: అన్నప్రాశన అంటే ఏమిటి? పిల్లలకు అన్నప్రాశన ఎప్పుడు చేయాలి?

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |