Baby Care
3 November 2023 న నవీకరించబడింది
బిడ్డను మోయడం అంత తేలికైన పని కాదు. వారు ఒక స్థాయి తర్వాత బరువు ఎక్కువైనట్లు అనిపిస్తారు. ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పనుల విషయంలో. అందుకే.. ఇలాంటి సమయంలో శిశువును ధరించే ఉత్పత్తులు బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి వ్యవహారం చాలా కాలంగా ఆచరణలో ఉంది ఇంకా వివిధ సంస్కృతుల వారు తమ శిశువులను విధినిర్వహణలో ఉన్నప్పుడు, ప్రయాణాలలో ఇంకా మరెన్నో పనులు చేసుకునేటప్పుడు వీటిని ఉపయోగిస్తున్నారు.
"బేబీ వేరింగ్" అనే పదానికి కేవలం బేబీ క్యారియర్ సహాయంతో బిడ్డను మోయడం అని అర్థం. ఈ క్యారియర్‌ను వివిధ రకాల పదార్థాలతో తయారు చేయవచ్చు. ఇందులో సాంప్రదాయ పద్ధతిలో వస్త్రాన్ని వాడుతారు. ఈ రోజుల్లో.. తల్లిదండ్రులు రింగ్ స్లింగ్‌లు ఇంకా బ్యాక్‌ప్యాక్‌లతో సహా అనేక రకాలు డిజైన్‌లలో ఉన్న బేబీ క్యారియర్‌లను చూడవచ్చు.
తల్లిదండ్రులు తమ నవజాత శిశువుకి కూడా బేబీ వేర్ ఐటెమ్‌ను వాడటం మొదలుపెట్టవచ్చు. వాస్తవానికి, నవజాత శిశువులు తక్కువ బరువుతో సున్నితంగా ఉంటారు కాబట్టి కొన్ని చేయవలసిన ఇంకా చేయకూడని పనులున్నాయి. అయితే.. బేబీ వేర్‌ను ఉపయోగించడం వల్ల తల్లీ-బిడ్డలిద్దరికీ అనేక విధాలుగా ఇంకా సుధీర్ఘకాల ప్రయోజనం చేకూరుతుంది.
బేబీ వేరింగ్ తనదైన ప్రయోజనాలను కలిగి ఉంది ఇంకా అనుభవజ్ఞులైన తల్లిదండ్రులతో వీటి ప్రయోజానాలను తెలుసుకోవచ్చు. కొందరు ఈ విషయంలో సైన్స్ మద్దత్తు తీసుకొంటే, మరికొందరు తీసుకోరు. అయినప్పటికీ.. పెద్ద సంఖ్యలో ప్రజలు వాటిని ప్రయోజనకారిగా భావిస్తారు. అందువల్ల, సంవత్సరాలుగా వాటిని విరివిగా ఉపయోగిస్తున్నారు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: బేబీ స్లీపింగ్ బ్యాగులలో శిశువులకి గాఢమైన నిద్ర పడుతుందా?
బేబీ వేరింగ్ ఉత్పత్తులు సరైన సైజువి అయితే, చక్కగా నప్పినట్లయితే, వాటిని ఉపయోగించినపుడు ఖచ్చితంగా సురక్షితంగా ఉండే మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ TICKS పద్ధతిని అనుసరించాలి:
తల్లిదండ్రులు ఆన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్‌లో వివిధ రకాలైన బేబీ క్యారియర్లను కనుగొనవచ్చు. వాటిల్లో ప్రముఖమైనవి కొన్ని:
బేబీ వేరింగ్ వల్ల తల్లికి శిశువుతో ప్రత్యేక బంధాన్ని ఏర్పరడటానికి ఇంకా తన బిడ్డకు దగ్గరగా మసలుకొనేందుకు సహాయపడుతుంది. ఇది బిడ్డకు పాలుపట్టే ప్రక్రియను సులభతరం చేసేలా సహాయపడుతుంది. అంతేకాకుండా, ఒక తల్లి తన బిడ్డ అవసరాలకు తగినవిధంగా ప్రతిస్పందించడంలో, ఇంకా బిడ్డలు మాటలు నేర్చడంలో దోహదం చేస్తుంది. ఇది బిడ్డకు ఒత్తిడిని తగ్గించి సంతోషంగా ఉండటానికి సహాయపడుతుంది.
భద్రత ఇంకా సౌకర్యాన్ని సరిచూసుకొనేందుకు కుటుంబంలో ఎవరినైనా లేదా అనుభవజ్ఞులైన సిబ్బంది సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఒకసారి ఇది విజయవంతమైతే, శిశువును మోసుకెళ్లడం ఎంతో సంతోషకరమైన అనుభవంగా మారుతుంది. గుర్తుంచుకోవలసిన రెండు ముఖ్యమైన టిప్స్ ఏవంటే:
కొత్తగా తల్లైనా లేదా అనుభవజ్ఞురాలు అయినా సరే, ఈ బేబీ వేరింగ్ తప్పనిసరిగా వారి పనిని సులభతరం చేస్తుంది ఇంకా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఒక మంచి పెట్టుబడి అవుతుంది. తల్లిదండ్రులు ఖచ్చితంగా ఒకసారి దీనిని ప్రయత్నించాలి.
Yes
No
Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |