hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Care for Baby arrow
  • బేబీ వైప్స్ ని ఎలా వాడాలి, ఇది ఎందుకు ముఖ్యం (How to Use Baby Wipes and Why is it Important in Telugu)? arrow

In this Article

    బేబీ వైప్స్ ని ఎలా వాడాలి, ఇది ఎందుకు ముఖ్యం (How to Use Baby Wipes and Why is it Important in Telugu)?

    Care for Baby

    బేబీ వైప్స్ ని ఎలా వాడాలి, ఇది ఎందుకు ముఖ్యం (How to Use Baby Wipes and Why is it Important in Telugu)?

    3 November 2023 న నవీకరించబడింది

    బిడ్డను కనటంతోనే ఎన్నో బాధ్యతలను తలెత్తుకుంటారు తల్లిదండ్రులు. బిడ్డ కోసం నమ్మకమైన, నాణ్యమైన ఉత్పత్తులను ఎంచుకోవటం చాలా కీలకమైన పని. నిత్యం వాడేందుకు సురక్షితమైన బేబీ వైప్స్ ను ఎంచుకోవటం చాలా అవసరం. ఎంతోమంది తల్లిదండ్రుల దైనందిన జీవితంలో నవజాత శిశువుకు బేబీ వైప్స్ వాడటం అనేది ఒక ముఖ్య భాగం అయిపోయింది. ఈ వాడకం రానురాను పెరుగుతూ వచ్చింది, తల్లిదండ్రులకు, బిడ్డలకు కూడా సౌకర్యాన్ని, సంరక్షణను పెంచుతూ వచ్చింది. బేబీ వైప్స్ ను ఎలా ఉపయోగించాలో, అవి సురక్షితమో కాదో ఈ వ్యాసంలో చర్చించుకుందాము.

    బేబీ వైప్స్ అంటే ఏమిటి (What are Baby Wipes in Telugu)?

    నవజాత బేబీ వైప్స్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాము. బట్ట లాంటి లేదా టిష్యూ లాంటి పదార్థంతో తయారుచేయబడి, చిన్న లేదా మధ్యమ పరిమాణంలో, తడిగా ఉండి, మడత పెట్టబడి, విడివిడిగా సౌకర్యవంతంగా అమర్చబడినవాటినే బేబీ వైప్స్ అంటారు. నవజాత శిశువుల వైప్స్ ను తరచు శుభ్రత కోసం ఉపయోగిస్తారు. వైప్స్ లో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి కానీ, వాడబడ్డ రసాయనాలను బట్టి అవి వేరువేరు ఉపయోగాలను అయ్యుండవచ్చు. ఉదాహరణకు ఆఫీసులో శుభ్రం చేయటానికి, వైద్యరంగంలో వాడటానికి వాడే వైప్స్ చర్మ పరిశుభ్రతకు పనికిరావు.

    తడి వైప్స్ లో తొంభై శాతం వరకు పాలీఎస్టర్ లేదా పాలీప్రొపిలీన్ పురులతో తయారుచేయబడి ఉంటాయి. వినియోగాన్ని బట్టి, వాటిని సాధారణంగా నీటితో గానీ, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ వంటి ద్రవాలతో గానీ తడుపుతారు. స్పర్శ, ఘ్రాణ లక్షణాలను మెరుగుపరచటానికి ఆ పదార్థాన్ని కండీషనర్లతోను, లోషన్లతోను, సుగంధ ద్రవ్యాలతోను ట్రీట్ చేస్తారు. ప్యాకేజీలో బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మక్రిములు పెరగకుండా మిథైల్ ఐసో థైఎజోలినోన్ వంటి సంరక్షణకారులను వాడతారు. తడి వైప్స్ ను మడతపెట్టి, అరచేతి పరిమాణం గల ప్యాకేజ్ లో సర్దుతారు.

    మీరు బేబీ వైప్స్ ఎందుకు వాడాలి (Why Should You Use Baby Wipes in Telugu)?

    బిడ్డకు డైపర్ వేసే ప్రాంతం చుట్టూ ఉన్న చర్మానికి తరచు తడి, మలమూత్రాలు తగులుతూ ఉంటాయి. ఆ ప్రాంతంలో చర్మానికి ఇతర ప్రదేశాల కంటే ఎక్కువ ముడతలు ఉండటం వల్ల, శుభ్రం చేయటం కష్టతరమైన విషయం. ఈ ప్రధాన కారణం వల్లనే ఎక్కువమంది పిల్లలకు డైపర్ ర్యాష్ (డైపర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒరుసుకుపోవటం) ఎదురవుతూ ఉంటుంది.

    డైపర్ ర్యాష్ ను నివారించటానికి, చికిత్స చేయటానికి తరచు ఆ ప్రాంతంలోని చర్మానికి అంటి ఉన్న మలమూత్రాల ఎంజైములు పూర్తిగా పోయేలా శుభ్రం చేయటం, డైపర్ మారుస్తూ ఉండటం, శానిటైజ్ చేయటం అవసరం. డైపర్ మార్చిన ప్రతిసారీ చుట్టూ ఉన్న చర్మాన్ని శుద్ధిపరచటం చాలా కీలకం. ఈ పనిని శ్రమ తెలియకుండా, త్వరగా చేయటానికి తడి వైప్స్ ఉపయోగపడతాయి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: మీ బిడ్డకు ఎలాంటి బేబీ మసాజ్ ఆయిల్ ఉత్తమం?

    నవజాత శిశువు చర్మానికి బేబీ వైప్స్ సురక్షితమేనా (Are Baby Wipes Safe to New Born Baby Skin in Telugu)?

    నవజాత శిశువుల చర్మం సున్నితంగా ఉండటం వల్ల ఏ ఉత్పత్తి పడితే దానిని వాడకూడదు. మృదువైన చర్మరక్షాకర ఉత్పత్తులు అవసరం. సుగంధభరిత వాసన ఉండకుండా, ఆల్కహాల్ లేదా ఇతర హానికర పదార్థాలతో కలిసినవి కానంతవరకు, బిడ్డ సున్నితమైన చర్మానికి బేబీ వైప్స్ ను ఉపయోగించవచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: శిశువులలో పొడి చర్మం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి?

    పరిశుభ్రత విషయంలో బేబీ వైప్స్ ఎలా సహకరిస్తాయి (How Baby Wipes Helps you in Cleaning in Telugu)?

    బిడ్డను జాగ్రత్తగా చూసుకోవటం అంటే వారి పరిశుభ్రతను కూడా చూసుకోవటం. డైపర్ వేసినంత మాత్రాన మీ బిడ్డకు సంతృప్తి ఉండదు. డైపర్ మార్చిన ప్రతిసారీ బిడ్డ చర్మం ఉరుసుకుపోవటానికి, పొడారిపోవటానికి ఆస్కారం ఉంటుంది. కనుక సరైన రీతిలో శుభ్రపరచకపోతే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కలిగే ప్రమాదం ఉంది.

    తరచూ చంటిబిడ్డకు స్నానం చేయించటం సరైన పరిష్కారం కాదు. ఏ సమయంలో అయినా చేతిలో బేబీ వైప్స్ ను అందుబాటులో ఉంచుకోవటం వల్ల శుభ్రం చేయటం సౌకర్యవంతం అవుతుంది. శీతాకాలంలో, చలి వాతావరణంలో అస్తమానం బిడ్డను సబ్బుతో రుద్ది, స్నానాలు చేయిస్తే, వారి సున్నితమైన చర్మం పొడారిపోతుంది. ముఖ్యంగా టీకాలు వేయించినప్పుడు, ఒంట్లో బాగాలేని సమయంలోను వైప్స్ తో శుభ్రం చేసే విధానం సులభతరమైనది, వేగవంతమైనది కూడా.

    సురక్షితంగా బేబీ వైప్స్ ను వాడటం ఎలా (How to Use Baby Wipes Safely in Telugu)?

    ఎన్నో ప్రసిద్ధమైన బేబీ వైప్స్ కు సన్నగా పరిమళం ఉంటుంది. కానీ నవజాత శిశువులకు అవి సరిపడుతున్నాయని రూఢీగా తెలిస్తే తప్ప సుగంధ పరిమళాలు వెదజల్లే వైప్స్ వాడటం అంత శ్రేయస్కరం కాదు. పరిమళాలు లేని వైప్స్ ను ఎంచుకోవటం మంచిది. ఉదాహరణకు నీటితో తడిసి ఉన్న వైప్స్ కు కృత్రిమ పరిమళం ఉండదు కనుక నవజాత శిశువులకు ఇవి వాడటం మంచిది. దురద వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా నీటి వైప్స్ సురక్షితం, సుపరిశుభ్రం.

    ఒక న్యాపీ మార్చటానికి ఎన్ని వైప్స్ అవసరం అవుతాయి (How many Wipes Required to Change a Daiper in Telugu)?

    ఒక రోజుకు ఒక నవజాత శిశువుకు దాదాపు 30 వైప్స్ అవసరం అవుతాయి. డైపర్ మార్చినప్పుడల్లా పడకకు వాడిన పక్కను కూడా వైప్ తో శుభ్రం చేసే అలవాటు ఉన్నా, ప్రతిసారీ ఎక్కువ సంఖ్యలో వైప్స్ ను వాడే అలవాటు ఉన్నా వైప్స్ ఎక్కువ అవసరం అవుతాయి. దాదాపు ఒక నవజాత శిశువుకు ఒక రోజుకు పది సార్లైనా డైపర్ ను మార్చవలసి వస్తుంది. ఒక్కోసారీ ఒకటి నుండి ఐదు వరకు వైప్స్ అవసరం అవ్వచ్చు. మీరు న్యాపీ మార్చినప్పుడు ఒకటి , ఆ తరువాత శుభ్రం చేయడానికి మరి కొన్ని వైప్స్ వాడాల్సి వస్తుంది.

    ప్యాక్ తెరిచిన తర్వాత వైప్స్ ని తాజాగా ఉంచటం ఎలా (How to Keep Wipes Fresh Even After Opening the Pack in Telugu)?

    సాధారణంగా బేబీ వైప్స్ తయారైన దగ్గర నుండి 2-3 ఏళ్ళ లోపు వాటిని వినియోగించుకోవాలని బేబీ వైప్స్ తయారీ సంస్థలు చెబుతుంటాయి. ఆ సమయం దాటితే అవి అంత ప్రభావవంతంగా పనిచేయవని అంటారు. ప్యాక్ ను తెరవకపోయినప్పటికీ, వైప్స్ కి ఉన్న తడి ఆరిపోవటమే కాక, శుభ్రపరచే శక్తి కూడా క్షీణిస్తుంది. ఎండ, వేడి తగలకుండా, చల్లగా, పొడిగా ఉన్న ప్రదేశంలో వైప్స్ ని ఉంచటం వల్ల అవి ఎక్కువ కాలం పదిలంగా ఉంటాయి. ఆరిపోకుండా, పాడవ్వకుండా ఉంచటానికి, తెరచి ఉన్న వైప్స్ ప్యాకెట్ ను వాడిన వెంటనే మళ్లీ జాగ్రత్తగా మూసేస్తూ ఉండాలి. బేబీ వైప్స్ ఉపయోగాల ప్రాముఖ్యత గురించి మీకు అర్థమయ్యింది కనుక, మీరు మీ బిడ్డ సంరక్షణను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. బేబీ వైప్స్ విషయంలో అలా మీరు తెలివైన, సురక్షితమైన నిర్ణయాలు తీసుకోవటంలో సహకరించే ఒక బ్రాండ్ Mylo Family. మరింత సమాచారం కోసం వారి వెబ్సైట్ ను సందర్శించండి.

    How to use baby wipes and why its important In Telugu, What are baby wipes In Telugu, Why Should You Use Baby Wipes In Telugu, Is Baby Wipes Suitable for Newborn Skin In Telugu, How Many Wipes Do You Need to Change a Nappy In Telugu, How to use baby wipes and why its important In English, How to use baby wipes and why its important In Hindi, How to use baby wipes and why its important In Tamil, How to use baby wipes and why its important In Bengali.

    Gentle Baby Wipes with Lid - Pack of 3

    98% Pure Water | Dermatologically Tested

    ₹ 236

    4.5

    (11185)

    56216 Users bought

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Articles

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |