Baby Care
14 August 2023 న నవీకరించబడింది
మీ బిడ్డ జీవితంలో మొదటి కొన్నిరోజులు 100% ఇంట్లోనే గడుస్తాయి. మీరు ఒకవేళ హాస్పిటల్లో ప్రసవించినట్లయితే, ఆస్పత్రి నుంచి ఇంటికి చేరే కొంత సమయమే మీ బేబీ బయట గడిపే సమయం అవుతుంది. మొదటి కొన్ని రోజులు/వారాలు అప్పుడే తల్లిగా మారిన మహిళకి మానసికంగా అలాగే శారీరకంగా ప్రసవం నుండి కోలుకోవడానికి, అప్పుడే పుట్టిన తన బిడ్డతో బంధాన్ని పెంచుకోవడానికి సరిపోతుంది. అవికాక అదనంగా, పాలు ఇస్తూ, డైపర్లు మారుస్తూ, మీ అందాల పసిపాపని నిద్రపుచ్చుతూ, వాటన్నిటి మధ్యలో కాస్త మీరు కూడా పడుకోవడానికి ప్రయత్నిస్తూ గడుపుతారు.
ఈ పైవన్నీ చేశాక & జీవితం మళ్లీ కొంచెం స్థిరంగా ఒక గాడిలో పడ్డాక, మొత్తం సమయం ఒకేచోట ఉండటం వలన మీకు విసుగులాంటిది వస్తుంది, కొత్తదనాన్ని కోరుకుంటారు, కాస్త బయటకి వెళ్లి ప్రశాంతంగా గడపాలని ఆశిస్తారు. మరి మీ బేబీ కూడా మీతో పాటు రావాలని అలాగే మీ పాప/బాబుతో మరింత నాణ్యమైన సమయం గడపాలని కోరుకోవటం సహజమే.
మీకు ఇది కూడా నచ్చుతుంది: పసిపిల్లలతో ట్రిప్ కి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా
ఎక్కడకి వెళ్ళాలనుకుంటున్నారో ముందుగానే వివరంగా ప్లాన్ చేసుకోండి. పగటిపూట నిర్దిష్ట సమయాల్లో వెళ్లటం మీ బిడ్డకి సరైనది అలాగే పొద్దున్నే బేబీతోపాటు వెళ్తే మాల్స్, కిరాణా స్టోరులు వంటి స్థలాలలో రద్దీకి దూరంగా ఉండవచ్చు. ఈ అనవసర రద్దీ వలన, హాయిగా జరగాల్సిన మీ సరదా ఔటింగ్ పీడకలగా మారగలదు. అందుకని వీటికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. మీ బిడ్డని మాల్ లేదా కిరాణా వస్తువుల షాపింగ్ వంటి రద్దీ ప్రదేశాలకు తీసుకెళ్లే ముందు కనీసం రెండు నెలలైనా ఆగమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. కొందరు డాక్టర్లు ఈ ఆగే సమయాన్ని 40 రోజులు అంటే, మరికొందరు 3 నెలలని సూచిస్తారు.
బయటకి తీసుకెళ్లే మొదటి కొన్నిసార్లు మీ పాపాయిని వాతావరణం ఆహ్లాదంగా ఉన్న చోట్లకు, మరీ రద్దీగా ఉండని ప్రాంతాలకు తీసుకెళ్తే మంచిది. అప్పుడే పుట్టిన బిడ్డ యొక్క రోగనిరోధక వ్యవస్థ పెద్దవాళ్ల రోగనిరోధక శక్తి అంత బలంగా ఉండదు. కాబట్టి ఎవరైనా ఒంట్లో బాలేనట్లు కనిపిస్తే, వారితో మాటలు కలపకుండా దూరంగా ఉండటమే మంచిది. ఫ్యాషన్ కన్నా సౌకర్యం ముఖ్యం అనేది సహజంగా మనస్సులో ఉంచుకోవాలి, ముఖ్యంగా బేబీని మొదట్లో బయటకి తీసుకెళ్లేటప్పుడు వచ్చే సమస్యలతో డీల్ చేస్తున్నప్పుడు ఇది కూడా ఒక సమస్యగా మారకూడదు. మీ బిడ్డ ఇన్‌స్టాగ్రామ్ లో అందంగా కన్పించటం కన్నా బట్టల్లో సౌకర్యంగా ఉండటం చాలా ముఖ్యం.
కావల్సిన వాటిని మీరు బయట ఉండే సమయాన్ని బట్టి ప్యాక్ చేసుకోండి, ఉదాహరణకు ఒకవేళ మీరు ఇంటి నుండి కేవలం రెండు గంటలు మాత్రమే బయటకి వెళ్తుంటే, మీరు 2 లేదా మరిన్ని డైపర్లు, బేబీ వైప్స్, చేతి శానిటైజర్, మార్చడానికి పూర్తి బట్టల సెట్, ఒక తువ్వాలు వంటివి మీతో పాటు తీసుకెళ్లడానికి ప్యాక్ చేసుకోవాలి. ఆనందంగా ఎంజాయ్ చేయడాన్ని మర్చిపోవద్దు. ఇంత ప్లాన్ చేసి ఒకవేళ మీరు మీ బిడ్డతో నాణ్యమైన సమయం గడపలేకపోతే, మీతో మీరు కూడా ఆనందించలేకపోతే ఎంత ప్లాన్ చేసినా ప్యాకింగ్ చేసినా ఆ సరదా యాత్రలు సంతోషదాయకంగా ఉండవు.
outing with baby in telugu, is it safe to take a newborn out in telugu, tips for taking out a newborn baby in telugu, Trying to figure out what it is the best time to take your newborn for an outing: Read this In English, Trying to figure out what it is the best time to take your newborn for an outing: Read this In Hindi, Trying to figure out what it is the best time to take your newborn for an outing: Read this In Tamil, Trying to figure out what it is the best time to take your newborn for an outing: Read this In Bengali
Yes
No
Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips
పేటర్నిటీ లీవ్ : నియమాలు, హక్కులు మరియు ప్రయోజనాలకు అంతిమ మార్గదర్శి (Paternity Leave: The Ultimate Guide to Rules, Rights and Benefits in Telugu)
కొత్త తల్లిదండ్రులకు ఉపయోగపడే పసిపిల్లల సంరక్షణ టిప్స్ 10 (10 Useful Baby Care Tips for New Parents in Telugu)
చేతి వేళ్లతో ఇంట్లోనే ప్రెగ్నెన్సీ చెక్ చేసుకోవడం ఎలా (How to Do Pregnancy Test with Fingers in Telugu)?
పసిపిల్లలతో ట్రిప్ కి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా (Travelling Suggestions That You Can Keep in Mind While Traveling with Kids in Telugu)?
బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్: మీరు తెలుసుకోవలసినది (Baby Brain Development: What You Should Know in Telugu)
(అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) OCD లక్షణాలు ((Obsessive Compulsive Disorder) OCD Symptoms in Telugu)
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |