వికారంగా ఉండటం ప్రెగ్నెన్సీలో పరమ సాధారణమైన లక్షణం. దాదాపు 70 శాతం మంది గర్భిణీ స్త్రీలలో ఈ లక్షణం కనిపిస్తుంది. ప్రెగ్నెన్సీలో వికారం, వాంతులు సాధారణంగా 6 వారాల తర్వాత మొదలై చాలా వారాలపాటు లేదా నెలలపాటు ఉంటుంది. ప్రెగ్నెన్సీలో వాంతులు నాలుగో నెల నుండి ఏడో నెల లోపులో తగ్గిపోతాయి. అయితే, కొంతమంది ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీలో వికారం ప్రెగ్నెన్సీ ఉన్నన్నాళ్ళూ ఉంటుంది. దీనిని మార్నింగ్ సిక్‌నెస్ అంటారు గానీ ఇది రోజు మొత్తంలో ఎప్పుడైనా ఉంటుంది. మార్నింగ్ సిక్‌నెస్ చాలా సాధారణమైన లక్షణం. కానీ కొందరు ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ మొత్తంలో అసలు వాంతులే ఉండవు.
మార్నింగ్ సిక్‌నెస్ తీవ్రమైనదా? (Is Morning Sickness Serious?)
కొంతమందికి ప్రెగ్నెన్సీలో విపరీతమైన వికారం ఉండవచ్చు. ఈ మార్నింగ్ సిక్‌నెస్ రోజూ కొంతసేపు ఉండి, ఒక రోజులో రెండు మూడు వాంతులు అవ్వవచ్చు. కొంతమందిలో ఇది చాలా తీవ్రంగా ఉండి ప్రతిరోజూ చాలా సేపు దీనితో ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. ప్రెగ్నెన్సీలో ఆడవాళ్ళకు ఎక్కువగా వాంతులు అవడాన్ని హైపెరెమెసిస్ గ్రావిడారం అంటారు.
మార్నింగ్ సిక్‌నెస్ పెరగడానికి దారితీసే పరిస్థితులేంటి? (Causes of Morning Sickness in Telugu?)
ప్రెగ్నెన్సీ మొదట్లో ఉండే వికారానికి కారణాలు పూర్తిగా తెలియవు. అది బ్లడ్ షుగర్ తగ్గడం వల్ల, లేదా ప్రెగ్నెన్సీలో పెరిగే ఈస్ట్రోజన్ లేదా హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్ (హెచ్‌సీజీ) హార్మోన్ల పెరుగుదల వల్ల కూడా కావచ్చు. ఎక్కువగా అలసిపోవటం, ఒత్తిడికి గురవ్వడం, కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం కూడా ఈ పరిస్థితిని మరింతగా దిగజారుస్తాయి.
తీవ్రమైన మార్నింగ్ సిక్‌నెస్‌కి కారణాలు (Reasons for Severe Morning Sickness in Telugu?)
తీవ్రమైన మార్నింగ్ సిక్‌నెస్‌తో బాధపడే ఆడవాళ్ళలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి.
- రోజులో మూడు అంతకంటే ఎక్కువసార్లు వాంతులవడం.
- ఐదు పౌండ్ల కంటే ఎక్కువ బరువు తగ్గడం
- డీహైడ్రేషన్ ఉంటుంది. డీహైడ్రేషన్ ఉంటే మూత్రం చాలా తక్కువగా వస్తుంది లేదా అసలు రాదు. నిలుచున్నప్పుడు కళ్ళు తిరగడం, మూత్రం ముదురు రంగులో రావడం.
- తీవ్రమైన డీహైడ్రేషన్ ఉన్న ఆడవాళ్ళు తరచుగా ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకోవలసి వస్తుంది. దానివల్ల శరీరంలో తేమ పెరుగుతుంది. సరైన మందులు తీసుకోవడం వల్ల వికారం తగ్గుతుంది.
ప్రెగ్నెన్సీలో రాత్రిపూట వికారం కలగడానికి కారణాలు ఏమిటి? (Reason Behind Nausea During Night in Pregnancy?)
ప్రెగ్నెన్సీలో రాత్రిపూట వచ్చే వికారం వల్ల నిద్ర చెడిపోతుంది. ఆ గర్భిణీ స్త్రీకి మళ్ళీ నిద్ర పట్టడం కష్టమవుతుంది. ప్రెగ్నెన్సీలో ఈవెనింగ్ సిక్‌నెస్‌కి సరైన కారణాలేవీ తెలియవు. అయితే, ఈ ఇబ్బందికి దారితీసే కొన్ని కారణాలు ఇవీ:
- సున్నితమైన జీర్ణ వాహిక
- ప్రెగ్నెన్సీలో హార్మోన్ స్థాయిలు పెరగడం
- వాసనలు గ్రహించే శక్తి పెరగడం, వాసనలు భరించలేకపోవడం
మీకు ఇది కూడా నచ్చుతుంది: స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత అంటే ఏమిటి? దీన్ని ఎలా నయం చేయాలి?
గర్భం దాల్చిన ఆడవారిలో రాత్రిపూట వికారం ఎన్నాళ్ళపాటు ఉంటుంది? (How Long Does Nausea at Nights Lasts in Pregnant Women?)
ప్రెగ్నెన్సీలో వికారం, వాంతులు 14 నుండి 20 వారాల నాటికి తగ్గిపోతుంది. అయితే కొంతమంది ఆడవాళ్ళకు ప్రెగ్నెన్సీ ఉన్నన్నాళ్ళూ వికారం ఉండవచ్చు. దీని గురించి డాక్టర్‌ను కలవడం మంచిది. వారు ప్రెగ్నెన్సీలో వచ్చే ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి అవసరమయ్యే మందులు ఇవ్వవచ్చు. మూడో త్రైమాసికంలో వాంతులు ఉంటే, మార్నింగ్ సిక్‌నెస్ రాకుండా చేయడానికి డాక్టర్‌ను కలవడం చాలా ముఖ్యం. లేదంటే దానివల్ల పోషకాహార లోపం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి.
మూడో త్రైమాసికంలో వికారం ఉంటుందా? (Does Nausea Excists in Third Trimester?)
ఆరు నెలల తర్వాత వికారం ఉందంటే, ఆ స్త్రీకి జీర్ణాశయంలో ఏవైనా సమస్యలు ఉన్నాయని అర్థం. జీర్ణాశయంపై ఒత్తిడి పెరిగే కొద్దీ జీర్ణక్రియ సన్నగిల్లుతుంది. ఆ గర్భిణీ స్త్రీకి త్రేనుపులు, గ్యాస్, అజీర్ణం, గుండెల్లో మంట వంటివి ఉంటాయి. మూడో త్రైమాసికంలో వికారం వల్ల ఆగకుండా వాంతులవడం, ఆకలి ఉండకపోవడం లాంటివి ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఉంటే ఆ స్త్రీ తీవ్రమైన మార్నింగ్ సిక్‌నెస్‌తో బాధపడుతోందని అర్థం.
ప్రెగ్నెన్సీలో వికారాన్ని పెంచే ఆహార పదార్థాలు (Foods That Increases Nausea in Telugu?)
కొన్ని రకాల ఆహార పదార్థాలు ఆడవారిలో ప్రెగ్నెన్సీలో వికారాన్ని పెంచుతాయి. అవి:
- మసాలాలతో కూడిన ఘాటైన ఆహారం
- వేడిగా ఉన్న పదార్థాలు
- అతి తీపి
- నూనె/ వేపుడు పదార్థాలు
- గర్భిణులకు వికారం తెప్పించే ఘాటైన వాసనలు గల పదార్థాలు.
వికారాన్ని తగ్గించాలంటే ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి? (What Foods Need to Take To Reduce Nausea in Telugu?)
ప్రెగ్నెన్సీలో వికారం తగ్గించగలిగే ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- అల్లం టీ
- దోసకాయలు, బీరకాయలు వంటి ఎక్కువ నీరున్న కూరగాయలు
- నిమ్మకాయ రసంతో చేసిన టీ
- పెరుగు
- బాగా వండిన గుడ్లు
- సరిగ్గా వండిన కూరగాయలు
- కాల్చిన చేపలు లేదా మాంసం
- కూరగాయల సూప్‌లు
- జీడిపప్పు, పొద్దుతిరుగుడు గింజలు, కాయధాన్యాలు, హాజెల్ నట్స్ వంటి గింజలు
ప్రెగ్నెన్సీలో వికారాన్ని తగ్గించే ఇంటి చిట్కాలు (Home Remedies to Reduce Nausea in Telugu)
- అన్ని ఇతర ఆరోగ్య సమస్యల మాదిరిగానే, ప్రెగ్నెన్సీలో వికారం కోసం ఇంటి చిట్కాల కోసం చూస్తారు. గర్భిణీ స్త్రీలలో వికారం నుండి ఉపశమనం కలిగించే కొన్ని ఇంటి చిట్కాలు:
- నిమ్మరసంతో తయారు చేసిన ఎసెన్షియల్ ఆయిల్స్ వినియోగించడం, నిమ్మకాయలను వాసన చూడడం వికారాన్ని తగ్గిస్తుంది.
- ఘాటైన వాసనలు ఉన్న ప్రదేశంలో ఉన్నప్పుడు శ్వాసక్రియకు ఉపయోగపడే మాస్కును ఉపయోగించవచ్చు. మాస్క్‌లు ఆహార పదార్ధాల వాసనను ఆపడానికి సహాయపడతాయి.
- మీకు ఈ పరిస్థితి ప్రెగ్నెన్సీలో ఉంది కనుక ఆహారం తీసుకోకపోవడం మంచిది కాదు. దానికి బదులుగా, భోజనం కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినడం మీ ఆరోగ్యానికి, మీ చిన్నారి ఆరోగ్యానికి మంచిది. మార్నింగ్ సిక్‌నెస్‌ను ఎదుర్కోవడానికి, ఉదయాన్నే తృణధాన్యాలు లేదా రస్కులు తినండి.
- కడుపు నొప్పికి అల్లం మంచిది. అల్లం టీ, భావనల్లం, అల్లం నమలడం గర్భిణీ స్త్రీలకు మంచి ఎంపిక.
- చాలా మంది మహిళలు తరచుగా వ్యాయామం చేయడం వల్ల కూడా ప్రెగ్నెన్సీలో వికారాన్ని తగ్గించుకోగలుగుతారు. గర్భిణీ స్త్రీలు మార్నింగ్ వాక్ చేయవచ్చు, ప్రినేటల్ యోగా క్లాస్‌లో చేరవచ్చు లేదా ఈత కొట్టవచ్చు.
- నారింజ పండ్లలో సిట్రిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పీల్చినప్పుడు వికారం తగ్గడానికి సహాయపడుతుంది. నారింజ వాసనను పీల్చడం లేదా నారింజ రసం తాగడం ద్వారా వికారాన్ని తగ్గించుకోవచ్చు.
- పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియలో సహాయపడే మంచి బ్యాక్టీరియా. రోజూ రెండుసార్లు ఒక గిన్నె పెరుగు తినడం వల్ల వికారం రాకుండా చూసుకోవచ్చు.
- మూడు నుంచి ఆరో నెల లోపులో వచ్చే వాంతులను తగ్గించుకోవడానికి లవంగాలను తీసుకోవడం కూడా ఒక గొప్ప ఇంటి చిట్కా. మీకు వికారంగా అనిపించినప్పుడు లవంగ మొగ్గను నమలండి. ఇది అజీర్ణం, విరేచనాలు, వికారం వంటి వాటిని దూరం చేస్తుంది. వేడినీటిలో 2 నుండి 3 లవంగాలు వేసి, లవంగం టీ త్రాగాలి. దీనివల్ల వికారం తగ్గుతుంది.
- వికారం, వాంతులను తగ్గించడానికి అరోమాథెరపీ ఒక మంచి చిట్కా. రుమాలుపై లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, పిప్పరమెంటు ఎసెన్షియల్ ఆయిల్ చల్లి, పీలిస్తే కాస్త ఉపశమనంగా ఉంటుంది.
ప్రెగ్నెన్సీలో వికారం వల్ల వచ్చే డీహైడ్రేషన్‌ను ఎలా ఎదుర్కోవాలి? (How to Fight With Dehydration Due to Nausea in Telugu?)
ప్రెగ్నెన్సీలో మార్నింగ్ సిక్‌నెస్ వల్ల కలిగే డీహైడ్రేషన్‌ను ఎదుర్కోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.
- రోజూ కనీసం 8 గ్లాసుల నీరు లేదా 2 లీటర్ల ద్రవ పదార్థాలను తీసుకోవాలి. రోజు మొత్తంలో కొద్దికొద్దిగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి.
- గర్భిణీ స్త్రీకి మామూలు నీరు పడకపోతే, డీహైడ్రేషన్‌ను ఎదుర్కోవడానికి పలుచని పండ్ల రసం, ఫిజ్ లేని క్లియర్ సోడా, ఐస్ చిప్స్, సూప్స్, వీక్ టీ, నోటితో తీసుకునే రీహైడ్రేషన్ సొల్యూషన్స్, పాప్సికల్స్ వంటివి తీసుకోవచ్చు.
వికారాన్ని తగ్గించే చిట్కాలు (Tips to Reduce Nausea in Telugu)
- తినే ఆహారంతో పాటు ద్రవపదార్థాలు తీసుకోకండి. అలా తీసుకుంటే పొట్టపైన ఒత్తిడి పెరిగి వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది.
- గర్భిణీ స్త్రీలు ఆకలిగా అనిపించినప్పుడల్లా తప్పనిసరిగా తినాలి. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా వారికి నచ్చే ఆహారాన్ని తినాలి.
- ప్రతి రెండు మూడు గంటలకొకసారి కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం వల్ల వికారం రాకుండా ఉంటుంది. ఖాళీ కడుపుతో ఉంటే వికారం ఇంకా పెరుగుతుంది.
- ఆహారాన్ని మెల్లిగా నమిలి తినండి. ఆహారాన్ని చాలా వేగంగా తినడం వల్ల గర్భిణీ స్త్రీలు తాము తినగలిగిన దాని కంటే ఎక్కువ తినే అవకాశం ఉంటుంది.
- ఆహారం తీసుకున్న తర్వాత, పడుకోకుండా ఉండాలి. తిన్న తర్వాత ముప్పై నిమిషాల పాటు శరీరాన్ని వాలుగా ఉంచి వల్ల ఆహారం కిందికి దిగుతుంది.
ప్రెగ్నెన్సీలో వికారానికి చికిత్స ఏమిటి? (What is The Treatment for Nausea in Telugu?)
- చికిత్సతో మార్నింగ్ సిక్‌నెస్ తగ్గుతుంది. మార్నింగ్ సిక్‌నెస్ చాలా కాలం పాటు ఉంటే, ప్రెగ్నెన్సీలో వికారం తగ్గించటానికి డాక్టర్ విటమిన్ బి -6 సప్లిమెంట్లను, అల్లం సూచిస్తారు. లక్షణాలు కొనసాగితే, అప్పుడు డాక్టర్ వికారం తగ్గటానికి మందులను సూచిస్తారు.
- ప్రెగ్నెన్సీలో మోస్తరు, తీవ్రమైన వికారం ఉండే స్త్రీలకు డీహైడ్రేషన్, శరీరంలో సోడియం, పొటాషియం తగ్గడం వంటివి జరగవచ్చు.
- పరిస్థితిని ఎదుర్కోవటానికి ఎక్కువ ద్రవ పదార్థాలు, డాక్టర్ సూచించిన మందులను తీసుకోవడం వంటివి చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
- మీరు మార్నింగ్ సిక్‌నెస్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు, డాక్టర్ ఎన్నిసార్లు వాంతులవుతున్నాయి లేదా ద్రవ పదార్థాలు ఆగుతున్నాయా వంటి వాటి గురించి ప్రశ్నిస్తారు. పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి, డాక్టర్ తగిన మందులు రాస్తారు.
- తీవ్రమైన మార్నింగ్ సిక్‌నెస్‌తో బాధపడే వారు ఆసుపత్రిలో IV ఫ్లూయిడ్స్, వికారం తగ్గించే మందులతో చికిత్స పొందవలసి ఉంటుంది.
కొంతమంది ఆడవాళ్ళకి మార్నింగ్ సిక్‌నెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందా? (Do Some Women Will Have High Chances of Having Nausea?)
- అవును, కొంతమంది మహిళల్లో మార్నింగ్ సిక్‌నెస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇవి దీనికి కారణాలు కావచ్చు:
- బస్సులో, కార్లో ప్రయాణించేటప్పుడు వికారం ఉండటం. (ప్రెగ్నెన్సీకి ముందే)
- గర్భధారణతో ఉన్న మహిళకు ఆ ప్రెగ్నెన్సీ ద్వారా ఒకరి కంటే ఎక్కువగా, ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు కలిగే అవకాశం ఉన్నప్పుడు
- మైగ్రెయిన్ ఉండటం
- అధిక బరువు
- గర్భంలో అసాధారణ కణాల అభివృద్ధికి కారణమయ్యే ట్రోఫోబ్లాస్టిక్ వ్యాధి
- అంతకుముందు ప్రెగ్నెన్సీలో మార్నింగ్ సిక్‌నెస్ ఉండటం
మార్నింగ్ సిక్‌నెస్ బిడ్డకు హానికరమా? (Is Morning Sickness Harmful to Baby?)
కొద్దిపాటి వికారం బిడ్డకు గానీ, తల్లికి గానీ ఏ రకమైన హాని కలిగించదు. కానీ తల్లి ఏ ఆహారాన్ని, లేదా ద్రవ పదార్థాలను ఇముడ్చుకోలేక పోతుంటే, దానివల్ల డీహైడ్రేషన్‌కు గురై, బరువు తగ్గుతూ ఉంటే అది పెద్ద సమస్యగా మారుతుంది. వికారం తగ్గకపోతే, వాంతులు అవుతూనే ఉంటే, ఆ తల్లికి అవసరమైన పోషకాలు అందవు. దీనివల్ల బిడ్డ బరువు పైన, ప్రసవం పైన ప్రభావం పడుతుంది.
చివరిగా (In the End..)
ప్రెగ్నెన్సీలో మార్నింగ్ సిక్‌నెస్ చాలామంది స్త్రీలకు తరచుగా ఉండే లక్షణం. నిజానికి దీని పేరు మార్నింగ్ సిక్‌నెస్ కానీ రోజులో ఎప్పుడైనా ఈ ఇబ్బంది తలెత్తవచ్చు. గర్భిణీ స్త్రీకి ఉన్న లక్షణాలు సరిగ్గా గమనిస్తూ దానిని తగ్గించే విధానాలను అవలంబిస్తూ, ఆమెను ప్రెగ్నెన్సీలో ప్రశాంతంగా ఉంచవచ్చు. ప్రెగ్నెన్సీలో వికారానికి చికిత్స కూడా ఉంది. ఇది అటువంటి సమస్యలను చాలా వరకు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
Tags:
Nausea during pregnancy in telugu, symptoms of nausea in telugu, treatment for nausea in telugu, How to cure nausea during pregnancy in telugu, Is nausea harmful to baby in telugu?.
Also Read In:
Bengali: গর্ভাবস্থায় বমি বমি ভাব আর বমি হওয়া (Nausea and Vomiting during Pregnancy in Bengali)
English: Nausea & Vomiting During Pregnancy: Causes, Prevention, Treatment, and Red Flags