hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Care of Mother Post Delivery arrow
  • ప్రసవానంతర బరువు తగ్గడానికి 5 ఉత్తమ ఇంటి చిట్కాలు (Top 5 Home Remedies for Postpartum Weight Loss in Telugu) arrow

In this Article

    Care of Mother Post Delivery

    ప్రసవానంతర బరువు తగ్గడానికి 5 ఉత్తమ ఇంటి చిట్కాలు (Top 5 Home Remedies for Postpartum Weight Loss in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    బొడ్డు చుట్టూ కొవ్వును తగ్గించడం దాదాపు కొత్తగా తల్లి అయిన వారందరూ ఎదుర్కోవాల్సిన సమస్య. అది సి-సెక్షన్ అయినా లేదా సాధారణ డెలివరీ అయినా, ప్రసవానంతరం బొడ్డు చాలా బిగుసుగా ఉంటుంది. కొందరు ప్రసవానంతరం బరువు తగ్గించే ఆహార ప్రణాళికను ఎంచుకుంటారు, మరికొందరు వ్యాయామాన్ని అనుసరిస్తారు. ప్రసవానంతరం బరువు తగ్గించే ఆహారంతో క్రమంగా వ్యాయామాన్ని మిళితం చేసే వారు కూడా ఉన్నారు. అదృష్టవశాత్తు, ప్రసవానంతరం బరువు తగ్గడానికి తరతరాలుగా అందించే అనేక ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఈ కథనంలో అటువంటి ఉత్తమమైన 5 చిట్కాలు వివరించాము.

    1. చనుబాలు ఇవ్వడం (Breast Feeding)

    ప్రసవానంతరం బరువు తగ్గించే చిట్కాలలో చనుబాలు ఇవ్వడం అనేది ఉత్తమమైన, అత్యంత సహజమైన చిట్కా. దీని వెనుక ఉన్న సైన్స్ చాలా సులభం - పాలను ఉత్పత్తి చేయడానికి, శరీరం మరింత నిల్వ చేయబడిన శక్తిని ఉపయోగించాలి, మరింత ఖచ్చితంగా చెప్పాలంటే 850 కిలో కేలరీలు. మరో మాటలో చెప్పాలంటే, ప్రసవం తర్వాత తల్లి పాల అవసరాలను భర్తీ చేయడానికి శరీరం అదనపు కేలరీలను ఖర్చు చేస్తుంది. చనుబాలు ఇవ్వని తల్లుల కంటే చనుబాలు ఇచ్చే తల్లులు చాలా వేగంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కోల్పోతారు. ప్రసవానంతరం బరువు తగ్గించే ఆహారం వంటి ఇతర మార్గాల ద్వారా బరువు తగ్గడం కంటే ప్రసవానంతరం బరువు తగ్గడానికి చనుబాలివ్వడం ఉత్తమ సమయం అనే వాదనకు మద్దతు ఇచ్చే అధ్యయనాలు కూడా ఉన్నాయి. చనుబాలు ఇవ్వడం ద్వారా మరొక ముఖ్యమైన ఫలితం ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల. ఇది ప్రసవానంతరం రక్తస్రావాన్ని తగ్గించేటప్పుడు గర్భాశయం యొక్క సంకోచాన్ని సులభతరం చేస్తుంది.

    2. ప్రసవానంతరం బరువు తగ్గడానికి ఆహార ప్రణాళిక (Diet Plan for Weight Loss After Delivery in Telugu)

    జనాల నమ్మకానికి విరుద్ధంగా, గర్భిణీ, పాలిచ్చే తల్లులు వాస్తవానికి 2 మంది కోసం అంటే తల్లి, బిడ్డ కోసం తినాల్సిన అవసరం లేదు. శరీరం బరువును బట్టి సుమారు 300 నుండి 500 కేలరీల అదనపు కేలరీల వినియోగాన్ని కోరుకుంటుంది, అయితే ఇది స్థిరమైన శరీర పనితీరును నిర్వహించడానికి మాత్రమే. ఇంచుమించుగా ఇవి అదనంగా అవసరం అవ్వచ్చు

    • కప్పు పాలు.
    • గుడ్డు.
    • పండు.
    • బ్రెడ్ స్లైస్.

    ప్రసవానంతరం బరువు తగ్గించే ఆహారం కోసం ఇది సరిపోతుంది. పోషకాలు పుష్కలంగా ఉండి, కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది. అటువంటి ఆహారంలో కొన్ని ముఖ్యమైన భాగాలు కూడా ఉన్నాయి, అవి కింద పేర్కొనబడ్డాయి

    • ఎక్కువ నీరు తాగడం.
    • తక్కువ ఉప్పు తినడం.
    • తక్కువ కొవ్వు ఉన్న మాంసం లేదా చికెన్ తినడం.
    • తినే ఆహారంలో చేపలను జోడించడం.

    బరువు తగ్గించే టీ నిజంగా బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుందా?

    3. సురక్షితమైన డిటాక్సిఫికేషన్ (Safe Detoxification)

    డిటాక్సింగ్ అనేది సాధారణంగా ప్రతికూల అర్థాన్ని కలిగి ఉంటుంది, ఎందుకంటే చాలా డిటాక్సింగ్ విధానాలు వ్యక్తుల నిర్బంధ స్వభావం కారణంగా వారు పోషకాహార లోపానికి గురి అవుతారు. కానీ సురక్షితమైన డిటాక్సింగ్ వాస్తవానికి మూత్రపిండాలు, కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది, ముఖ్యంగా సి-సెక్షన్ తర్వాత, చదునైన పొట్టను సాధించడానికి శక్తివంతమైనది. అందువల్ల, పోషకాహార లోపం ఉన్న తల్లి నవజాత శిశువుకు బలహీనతను కలిగిస్తుంది కాబట్టి బరువు తగ్గడానికి ప్రసవానంతరం ఆహార ప్రణాళికలో సురక్షితంగా డిటాక్స్ చేసే మార్గాలు కూడా ఉండాలి. దీన్ని చేయగల కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి,

    • ఎల్లవేళలా హైడ్రేటెడ్ గా ఉండటానికి పుష్కలంగా నీరు తాగాలి.
    • తాజా కూరగాయలు తినాలి.
    • ప్రసవానంతరం బరువు తగ్గించే ఆహారంలో అన్ని పండ్లను చేర్చాలి.
    • పేగు కదలికలను నియంత్రించే, టాక్సిన్‌లను తొలగించే సహజంగా లభించే పీచు పదార్ధం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
    • ప్రసవానంతరం బరువు తగ్గడానికి నిమ్మ లేదా తేనె నీరు లేదా అల్లం టీ లేదా ఒమేగా 3 అధికంగా ఉండేది ఏదైనా తీసుకోవాలి.

    4. ప్రసవానంతరం బరువు తగ్గడానికి వ్యాయామాలు (Exercises for Postpartum Weight Loss)

    ప్రసవానంతరం బరువు తగ్గించే మరొక చిట్కా క్రమం తప్పకుండా, తరచుగా వ్యాయామం చేయడం. ఇవి చాలా తేలికైన వర్కవుట్‌లు, ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో చేయగలిగే కొన్ని ఉత్తమ వ్యాయామాలు,

    1. ఎక్కువ ఆహారం తీసుకున్న తర్వాత 15-20 నిమిషాల పాటు వేగంగా నడవండి.
    2. మీకు సమయం మరియు శక్తి ఉంటే అబ్స్ క్రంచెస్ చేయండి.
    3. ఉదర కండరాల సంకోచాలను కలిగి ఉండే శ్వాస వ్యాయామాలు.
    4. కటి కండరాలను బలోపేతం చేసి, ఆకృతిని ఇచ్చే కెగెల్స్ లేదా వ్యాయామాలు.
    5. బేబీ గ్లైడర్, రాక్-ఎ-బేబీ స్క్వాట్‌లు మొదలైన తల్లి-బిడ్డ వ్యాయామాలు.

    5. ప్రసవానంతర మద్దతు బెల్ట్ (Postpartum Support Belt)

    ప్రసవానంతరం బరువు తగ్గించే మరొక ఉపయోగకరమైన చిట్కా ప్రసవానంతర సపోర్ట్ బెల్ట్ లేదా నడికట్టును ఉపయోగించడం. ఈ బెల్ట్‌లు పొత్తికడుపు కండరాలను బిగుతుగా చేయడంలో సహాయపడతాయి, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించగలవు. సి-సెక్షన్ ద్వారా బిడ్డను ప్రసవించినట్లయితే, సహాయక నడికట్టు కూడా భంగిమను మెరుగుపరుస్తుంది, కత్తిరించిన భాగాన్ని రక్షిస్తుంది. ఇది ప్రసవం తర్వాత చాలా సాధారణమైన వెన్నునొప్పిని తగ్గించడంలో కూడా అద్భుతాలు చేయగలదు. ప్రసవానంతర మద్దతు బెల్ట్ C-సెక్షన్ తర్వాత మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా దృఢమైన బైండింగ్, చాలా కుదింపులను అందిస్తుంది.

    ప్రసవానంతరం బరువు తగ్గడం సవాలుగా ఉంటుంది, ఏ విధంగానూ సులభంగా సాధించలేము. గర్భధారణ సమయంలో బొడ్డు, తుంటి పెరగడం అనేది సహజమైన విషయం. ప్రసవానంతరం బరువు తగ్గించే ఆహారం శరీరం యొక్క శారీరక కదలికతో పాటు కొంత వరకు మాత్రమే సహాయపడుతుంది. శరీరం తిరిగి ఆకృతిని పొందడానికి, ప్రక్రియ వేగంగా అవ్వాలని తొందరపడకుండా ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. బరువు తగ్గడానికి ప్రసవానంతర ఆహార ప్రణాళికను నిర్ణయించే ముందు వైద్యుడిని సంప్రదించడం కూడా చాలా ముఖ్యం.

    Tags

    Weight loss tips in telugu, Weight loss after delivery in telugu, Top 5 Home Remedies for Postpartum Weight Loss in English, Top 5 Home Remedies for Postpartum Weight Loss in Hindi, Top 5 Home Remedies for Postpartum Weight Loss in Tamil, Top 5 Home Remedies for Postpartum Weight Loss in Bengali.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |