Care for Baby
3 November 2023 న నవీకరించబడింది
శిశువు ఎందుకు అంత బిగ్గరగా ఏడుస్తోంది? శిశువు ఏడుపు ఆపడం ఎలా? తల్లిదండ్రులకు, ముఖ్యంగా, కొత్త తల్లిదండ్రులకు ఎదురయ్యే అత్యంత సాధారణమైన ప్రశ్నలు ఇవి. నిజాయితీగా మాట్లాడితే.. ఏడుస్తున్న శిశువును సముదాయించడం పెద్ద సవాలుగా ఉంటుంది. తమ బిడ్డ ఏడుస్తున్నప్పుడు తల్లిదండ్రులు చేయగలిగే కొన్ని విభిన్న విషయాలను ఈ బ్లాగ్ విశ్లేషిస్తుంది.
పిల్లలు అనేక కారణాల వల్ల ఏడుస్తారు. కానీ అవన్నీ చివరికి ఒకే ప్రశ్నగా మారుతాయి. వారికి ఏమి కావాలి? పిల్లలు తమ అవసరాలు మరియు కోరికలను తెలియజేయడానికి అంతర్గత అవసరంతో జన్మించారు. కాకపోతే.. వారు వారి తల్లిదండ్రులతో కమ్యూనికేట్ చేయలేరు. కాబట్టి వారు దానికి బదులుగా ఏడుస్తారు. ఫలితంగా.. శిశువు ఎందుకు ఏడుస్తుందో అర్థం చేసుకోవడం ముఖ్యం.
ఏడుస్తున్న శిశువు చాలా మంది తల్లిదండ్రులు ఎదుర్కొనే ఒక సాధారణ సవాలు. ఏడుస్తున్న శిశువును శాంతపరచడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ అవన్నీ ప్రతి శిశువుకు పని చేయవు. వాస్తవంగా శిశువు యొక్క ఏడుపును ఆపడానికి ఒకే ఒక పరిష్కారం అంటూ లేదు. వివిధ పద్ధతులతో ప్రయోగాలు చేయడం, మీ బిడ్డకు ఏది పని చేస్తుందో చూడటం ద్వారా ఏడుస్తున్న శిశువుకు ఏది సహాయపడుతుందో తెలుసుకోవడానికి ఉత్తమ మార్గం.
మీకు ఇది కూడా నచ్చుతుంది: నవజాత శిశువు ఏడుపు: దీని అర్థం ఏమిటి మరియు దానిని ఎలా ఎదుర్కోవాలి?
పిల్లలు ఏడ్వడం సహజం, పెద్దలు తమ శిశువు ఏడుపు ఆపలేనప్పుడు, బిడ్డ ఏడుపుతో విసుగు చెందడం కూడా సహజమైనదే. శిశువు ఏడుపులో సహాయం చేయడానికి తల్లిదండ్రులు చేయగలిగే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి:
శిశువు లేదా చిన్న పిల్లవాడిని బలవంతంగా ఊపడం వల్ల కలిగే మెదడుకు గాయం కలిగే పరిస్థితిని షేకెన్ బేబీ సిండ్రోమ్ (SBS) అని అంటారు. వేగంగా ఊపడం అన్నది మెదడు పుర్రె లోపల ముందుకు వెనుకకు బౌన్స్ అయ్యేలా చేస్తుంది. దీనివల్ల గాయాలు, రక్తస్రావం మరియు (కొన్ని సందర్భాల్లో) మెదడు శాశ్వతంగా దెబ్బతినవచ్చు. ఇది మెదడుకు, మెదడు నుండి వచ్చే నరాలు మరియు రక్త నాళాలకు నష్టం కలిగించడంతో పాటు వాపును కూడా కలిగిస్తుంది.
షేకెన్ బేబీ సిండ్రోమ్ మెంటల్ రిటార్డేషన్ మరియు అంధత్వం వంటి జీవితకాల సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో.. షేకెన్ బేబీ సిండ్రోమ్ ప్రాణాంతకం కావచ్చు. గాయం యొక్క కనిపించే సంకేతాలు లేనందున సిండ్రోమ్‌ను నిర్ధారించడం చాలా కష్టం. అయినప్పటికీ.. ఒకరికి SBS ఉందన్న అనుమానం ఉంటే, అంతర్గత రక్తస్రావం లేదా వాపు ఉందో లేదో తెలుసుకోవడానికి శిశువుకు మెదడు స్కాన్ లేదా MRI చేయాలి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: మీరు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి పిల్లలు మారాం చేయడానికి కారణాలు ఏమిటి?
పిల్లలు ఏడవడానికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి మురికి డైపర్లు. మురికి నిండిన డైపర్లు వల్ల పిల్లలకు డైపర్ రాషెస్ వచ్చి శిశువులకు చాలా చికాకు కలిగించే పరిస్థితికి కారణమవుతాయి. శిశువు ఏడుస్తుంటే.. వారిని తనిఖీ చేసి డైపర్ మార్చడం వారిని ఏడుపు మాన్పించడంలో సహాయపడుతుంది.
పిల్లల ఏడుపుకు ఒక సాధారణ కారణం ఆకలి. శిశువు ఏడుస్తూ ఉంటే.. మునుపటి ఫీడింగ్ నుండి కొంత సమయం అయినట్లయితే , వారికి ఒక సీసా లేదా తల్లిపాలు అందించడానికి ప్రయత్నించండి. అతిగా తినిపించడం వల్ల కలిగే అసౌకర్యానికి పిల్లలు కూడా ఏడుస్తారు.
డైపర్ శుభ్రంగా ఉంది అని దృకీకరించుకొని, శిశువుకు ఆహారం ఇచ్చినా కూడా శిశువు ఏడుస్తుంటే.. తల్లిదండ్రులు చేయవలసిన మొదటి మరియు ప్రధాన విషయం వారి ఉష్ణోగ్రత చూడటం. వారి ఉష్ణోగ్రత సగటుగా ఉందో లేదో, వారికి జ్వరం ఉందేమో అని తనిఖీ చేయండి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే.. వైద్య నిపుణుడిని సందర్శించండి.
పాలు మాత్రమే తీసుకునే శిశువులకు కూడా గ్యాస్ ఉంటుంది. శిశువు ఏడుపు ఆగకుండా ఉంటే మరియు వారికి గ్యాస్ ఉందని తల్లిదండ్రులు భావిస్తే, వారికి బర్ప్ చేయడం లేదా కడుపు మసాజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇవి వారికి సహాయపడతాయి.
కొన్నిసార్లు పెద్ద శబ్దాల కారణంగా శిశువు ఏడుస్తుంది. శిశువు పెద్ద శబ్దాలతో ఆశ్చర్యపోయినట్లైతే, బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం మృదువైన శబ్దాన్ని ప్లే చేయడానికి ప్రయత్నించండి. ప్రశాంతమైన, ఊరటనిచ్చే పాటలు శిశువును నిద్రపోయేలా చేస్తాయి.
పిల్లలు అందరిలాగే విసుగు చెందుతారు. శిశువు ఏడుస్తుంటే, వారు విసుగు చెందుతారు. అప్పుడు వారితో మృదువుగా మాట్లాడటం లేదా మృదువైన పాట లేదా లాలిపాట పాడటానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు శిశువుకు శారీరకమైన సౌకర్యం, శ్రద్ధ అవసరం అవుతుంది. పిల్లలను ఎత్తుకుని, పాడేటప్పుడు లేదా వారితో మాట్లాడుతున్నప్పుడు మెల్లగా ముందుకు వెనక్కు ఊపండి.
గది చాలా చల్లగా లేదా చాలా వేడిగా ఉండటం వలన కూడా శిశువు ఏడుపు వస్తుంది. తల్లిదండ్రులు గది ఉష్ణోగ్రతను తనిఖీ చేయాలి. శిశువుకు చాలా వేడిగా లేదా చల్లగా లేకుండా చూసుకోవాలి. తరచుగా ఉష్ణోగ్రత లో జరిగే హెచ్చుతగ్గులు శిశువులు తట్టుకోలేకపోవచ్చు. శిశువు యొక్క ఏడుపు సాధారణంగా సంక్లిష్టంగా ఉండదు. తల్లిదండ్రులు మరియు కొత్త వారు కూడా కొద్ది సమయంలో బిడ్డను అర్థం చేసుకుంటారు. వారి దినచర్యను గమనిస్తూ ఉండటం, కొన్ని ట్రయల్-అండ్-ఎర్రర్లను ప్రయత్నించడం అనేవి తల్లిదండ్రులు తమ బిడ్డను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి.
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |