hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Scans & Tests arrow
  • నాన్ ఇన్వాసివ్ ప్రినేటల్ టెస్టింగ్ (NIPT) | మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు (Noninvasive Prenatal Testing (NIPT) Details in Telugu) arrow

In this Article

    నాన్ ఇన్వాసివ్ ప్రినేటల్ టెస్టింగ్ (NIPT) | మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు (Noninvasive Prenatal Testing (NIPT) Details in Telugu)

    Scans & Tests

    నాన్ ఇన్వాసివ్ ప్రినేటల్ టెస్టింగ్ (NIPT) | మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు (Noninvasive Prenatal Testing (NIPT) Details in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    నాన్-ఇన్వాసివ్(శరీరంలోకి పరికరాలను ప్రవేశపెట్టకుండా) ప్రినేటల్ టెస్టింగ్ (NIPT టెస్ట్)ని తరచుగా నాన్-ఇన్వాసివ్ ప్రినేటల్ స్క్రీనింగ్ (NIPS) అని కూడా పిలుస్తారు. ఇది శిశువు నిర్దిష్ట జన్యుపరమైన అసాధారణతలతో జన్మించే అవకాశాన్ని నిర్ధారించే ఒక ప్రక్రియ. ఈ పరీక్షలో గర్భిణీ స్త్రీ రక్తంలో ప్రసరించే చిన్న DNA ముక్కలను విశ్లేషిస్తారు. జీవకణ కేంద్రకంలో ఉండే DNA వలె కాకుండా.. ఈ ముక్కలను సెల్-ఫ్రీ DNA (cfDNA) అని పిలుస్తారు ఇంకా అవి కణాల లోపల ఉండకుండా స్వేచ్ఛగా రకంలో తేలియాడుతూ ఉంటాయి. ఈ చిన్నముక్కలు సాధారణంగా DNA బిల్డింగ్ బ్లాక్స్(నిర్మించే భాగాలు) (బేస్ పెయిర్స్) కంటే తక్కువగా ఉంటాయి. మృతకణాల నుండి DNAతో సహా వేరుపడినప్పుడు ఇవి రక్తప్రవాహంలోకి విడుదలైనప్పుడు ఉద్భవిస్తాయి.

    NIPs అంటే ఏమిటి? (What is NIPs in Telugu?)

    NIPT గర్భ పరీక్ష అనేది చాలా ఖచ్చితమైన నిర్ధారణ పరీక్ష. శిశువుకు జన్యుపరమైన అస్తవ్యస్తత కలిగే అవకాశముందో లేదో తెలుసుకోవడానికి ఈ స్క్రీనింగ్ పరీక్షలు చేయబడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో డౌన్స్ సిండ్రోమ్ ఇంకా ఇతర క్రోమోజోమ్ తేడాలు లాంటివి కూడా ఉన్నాయి. NIPT గర్భ పరీక్ష అనేది గర్భధారణలోని మొదటి త్రైమాసికంలో సులువుగా చేయగలిగే రక్త పరీక్ష లాంటిది. శిశువు ఆరోగ్యాన్ని తెలుసుకొనేందుకు వివిధ రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఏ పరీక్షను ఎంచుకోవాలో తల్లి నిర్ణయించుకోవాలి. గైనకాలజిస్ట్‌తో లేదా జెనెటిక్ కౌన్సెలర్‌తో గాని అందుబాటులో ఉన్న ఎంపికల గురించి మాట్లాడటం మంచిది. గర్భవతిగా ఉన్నప్పుడు.. వారి రక్తప్రవాహంలో ఆమె జీవకణాలు ఇంకా మాయలోని కణాలలో నిల్వ చేయబడిన cfDNA మిశ్రమం ఉంటుంది. మాయ అనేది గర్భాశయంలోని కణజాలం, ఇది పిండానికి తల్లి రక్త సరఫరాను సంధానం చేస్తుంది. ఇలాంటి కణాలు గర్భావధి కాలమంతటా తల్లి రక్తప్రవాహంలోకి వదలబడుతాయి. మాయ కణాలలోని DNA సాధారణంగా గర్భస్థ పిండం DNAకి సరిపోలి ఉంటుంది. మాయ నుండి తీసుకున్న cfDNAని విశ్లేషించడం వలన పిండానికి హానికలిగించే కొన్ని రకాల జన్యుపరమైన అసాధారణతల నిర్ధారణకు అవకాశం లభిస్తుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: అనెన్స్‌ఫాలీ: కారణాలు, లక్షణాలు, ప్రమాదం & చికిత్స

    నాన్-ఇన్వాసివ్ ప్రినేటల్ టెస్టింగ్ ఎప్పుడు చేయించుకోవాలి? (When to Take the Non-Invasive Prenatal Testing in Telugu)

    గర్భధారణ సమయంలో.. తల్లిలోని ఈ DNA ముక్కలు లేదా మాయ లేదా పిండం DNA నుండి వచ్చి చేరినవై ఉంటాయి. ప్రామాణిక NIPT పరీక్షలో సాధారణ పరిమాణంలోని గర్భస్థ పిండం DNA నుండి గుర్తించదగిన వ్యత్యాసామున్న గర్భాలను గుర్తించవచ్చు. ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది పుట్టబోయే బిడ్డకు కొన్ని పుట్టుకతో వచ్చే అసాధారణతలను సికిల్ సెల్‌ను అభివృద్ధి చేసే అవకాశాన్ని తెలుసుకొనేలా కాబోయే తల్లికి అవకాశమిస్తుంది. అయినప్పటికీ.. NIPS పరీక్షను చేయించుకొనే సరైన సమయం ఏదనే విషయంపై విస్తృతమైన చర్చ కొనసాగుతోంది. కొంతమంది నిపుణులు దీనిని 9-10 వారాల గర్భధారణ సమయంలో చేయించుకోవచ్చని చెబుతారు. కొందరు దీనిని 13-14 వారాలలో సిఫార్సు చేస్తారు. సాధారణంగా.. ప్రయోగశాల ఆధారంగా, NIPT పరీక్ష తరచుగా గర్భధారణలోని 10వ వారం తర్వాత ఇంకా సాధారణంగా 24 వారాల ముందు ఎప్పుడైనా చేస్తారు.

    తల్లి రక్తంలో దాదాపు 10% సెల్-ఫ్రీ DNA (cfDNA) పిండం నుండి చేరినదై ఉంటుంది. ఇది NIPT పరీక్ష ద్వారా విశ్లేషించబడుతుంది. సాధారణంగా.. NIPT ఫలితాన్ని పొందడానికి 2 వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. గర్భిణీ స్త్రీ చేయి నుండి తీసిన ఒక ట్యూబ్ రక్తంతో ఈ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షా ఫలితాల వల్ల, గర్భానికి ప్రమాదావకాశాలు తక్కువగా ఉన్నాయా లేదా క్రింద కనబరిచిన క్రోమోజోమ్ సమస్యలు కలిగి ఉండే ప్రమాదం ఎక్కువగా ఉందా అనేది నిర్ణయించవచ్చు,

    • డౌన్స్ సిండ్రోమ్ (ట్రిసోమి 21).
    • ఎడ్వర్డ్ సిండ్రోమ్ (ట్రిసోమి 18).
    • పటౌ సిండ్రోమ్ (ట్రిసోమి 13).
    • సికిల్ సెల్ (సికిల్ సెల్ NIPT పరీక్ష చేయించుకున్న వారికి).

    NIPT గర్భ పరీక్ష ఎవరు ఎంచుకోవాలి (Who Needs to Opt for NIPT Test Pregnancy in Telugu?)

    NIPT చాలా సున్నితమైన పరీక్ష. NIPS పరీక్ష 99% కంటే ఎక్కువ శాతం డౌన్స్ సిండ్రోమ్ కేసులను గుర్తించగలదు. అయితే ఇది రోగనిర్ధారణ పరీక్ష కాదు. కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. జన్యు వైవిధ్యాల వల్ల హాని కలిగే అవకాశం ఉందో లేదో ఇది తెలియజేస్తుంది. కానీ ఇది సాధారణంగా ఖచ్చితమైన సమాధానాన్ని ఇవ్వబోదు. అయితే ఎంతో మంది తల్లిదండ్రులు, ఈ స్క్రీనింగ్ పరీక్షల వల్ల పొందే సమాచారం తరువాత వారు రోగనిర్ధారణ పరీక్షను చేయించుకోవాలసిన అవసరం ఉందా లేక లేదా అని నిర్ణయించుకొనేందుకు దోహదపడుతుంది.

    గర్భధారణ సమయంలో ఈ కింది పరిస్థితులలో NIPT పరీక్ష చేయించుకోవడం మంచిది -

    • మొదటి త్రైమాసికంలో కంబైన్డ్ స్క్రీనింగ్ పరీక్షల ఫలితాలు డౌన్స్ సిండ్రోమ్‌తో బిడ్డను ప్రసవించే అవకాశం ఎక్కువగా ఉందని రుజువు చేస్తే. ఈ పరీక్ష సాధారణంగా గర్భధారణలోని 10 నుండి 12 వారాల మధ్య రక్త పరీక్ష ద్వారా లేదా 11 నుండి 13 వారాల మధ్య అల్ట్రాసౌండ్ ద్వారా చేయబడుతుంది.
    • కొన్ని కారణాల వల్ల మొదటి త్రైమాసికంలో కంబైన్డ్ స్క్రీనింగ్ పరీక్ష కుదరకపోయినప్పుడు.
    • గర్భస్థ పిండం ఆరోగ్యంగా ఉందో లేదో అంచనా వేయడానికి ఇంకా డౌన్ సిండ్రోమ్‌తో పుట్టే ప్రమాదం లేనప్పుడు.
    • CVS (కోరియోనిక్ విల్లస్ శాంప్లింగ్) లేదా అమ్నియోసెంటెసిస్ వంటి రోగనిర్ధారణ పరీక్షలకు వెళ్లే ముందు జన్యుపరమైన వైకల్యాల కోసం పరీక్షించేందుకు.
    • భర్త/భాగస్వామి కన్నా పెద్దవారైనా తోబుట్టువులు ఇప్పటికే డౌన్ సిండ్రోమ్ కలిగి ఉంటే.
    • NIPS పరీక్ష ఖరీదైనది కావచ్చు కానీ సాధారణంగా వైద్య బీమా కింద కవర్ చేయబడుతుంది. కాబోయే తల్లిదండ్రులు నాన్-ఇన్వాసివ్ ప్రినేటల్ టెస్టింగ్‌పై మంచి సలహాను పొందేందుకు, వారు తప్పనిసరిగా డాక్టరుగారిని సంప్రదించాలి.

    Tags:

    Noninvasive Prenatal Testing in Telugu, What is Noninvasive Prenatal Testing in telugu, Noninvasive Prenatal Testing during pregnancy in telugu, why Noninvasive Prenatal Testing required during pregnancy in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |