Baby Care
3 November 2023 న నవీకరించబడింది
ప్రసవం అనేది స్త్రీ జీవితంలో ఒక మధురమైన అనుభూతి. ఈ సమయం మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. ప్రసవం తర్వాత మీ చర్మంలో మార్పులు కనిపించడం సర్వసాధారణం. ప్రసవం తర్వాత మీరు చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే మీరు గర్భధారణకు ముందు మీ చర్మం మీద ఉండే కాంతిని తిరిగి పొందుతారు.
మానవశరీరంలోని అతి పెద్ద అవయవం చర్మం. మీ కడుపులో చిన్నారి పెరిగే సమయంలో మీ చిన్నారికి అనువుగా ఉండేందుకు మీ చర్మం స్ట్రెచ్ అవుతుంది. ప్రసవానంతర చర్మ మార్పులకు కొన్ని కారణాలు ఉన్నాయి. గర్భధారణ సమయంలో చర్మ మార్పులకు కారణాలు కింది విధంగా ఉన్నాయి.
గర్భధారణ సమయంలో గుర్తించబడిన చర్మ సమస్యలు ప్రసవానంతరం కూడా కంటిన్యూ అవుతాయి. అయితే ప్రసవానంతరం మీ చర్మం మీద అకస్మాత్తుగా మొటిమలు వస్తాయి. ప్రసవం తర్వాత కొనసాగే చర్మ సమస్యల విషయంలో అతిగా ఆలోచించకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కొంతకాలం తర్వాత చర్మసమస్యలు అవే పరిష్కరించబడతాయి.
మీరు మీకు పుట్టబోయే చిన్నారిని చేతుల్లో పట్టుకోవాలని వెయిట్ చేస్తున్నపుడు గర్భధారణ సమయంలో మీ శరీరంలో భారీ మార్పులకు లోనవుతుంది. వాటి ప్రభావం మీకు బిడ్డ పుట్టిన తర్వాత కూడా కనిపిస్తుంది. గర్భం దాల్చిన తర్వాత మీరు మొటిమలు రావడాన్ని గమనించవచ్చు. చర్మం పొడిగా మారడం పొలుసులుగా మారడం కూడా గమనిస్తారు. బిడ్డ పుట్టిన తర్వాత వచ్చే సాధారణ చర్మ మార్పులలో స్ట్రెచ్ మార్క్స్ ఒకటి. గర్భధారణ సమయంలో మీ శరీరం ఒత్తిడిలో ఉంటుంది. అంతే కాకుండా మీ శరీరంలో హార్మోన్ల మార్పులు కూడా సంభవిస్తాయి. మీరు గర్భవతిగా ఉన్నపుడు బిడ్డను మోయడం వలన కలిగే అలసట కూడా.. ప్రసవానంతరం మీ చర్మం ఆకృతిని మార్చే కారకాల్లో ఒకటి.
ప్రసవానంతర దశలో చర్మ సమస్యలు సాధారణం. గర్భధారణ సమయంలో మీ శరీరంలో జరిగిన రసాయనిక చర్యలు మీ శరీరంపై గుర్తులను వదిలేస్తాయి. ప్రసవానంతరం ప్రధానంగా ఉండే చర్మ సమస్యలు:
గర్భధారణ సమయంలో మీ శరీరంలో ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరాన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది మెలస్మాకు కారణం అవుతుంది. దీని ద్వారా డార్క్ స్పాట్స్ వస్తాయి. ఈ స్థితిలో మీ చర్మంపై మెలనోసైట్స్ ట్రిగ్గర్ (ప్రేరేపించబడతాయి) అవుతాయి. నల్లమచ్చల సమస్యను తగ్గించుకునేందుకు సూర్యుడితో ప్రత్యక్ష సంబంధాన్ని తగ్గించుకోవడం మంచిది. ఒక వేళ ఈ రోజుల్లో సూర్యరశ్మి తగలకుండా ఉండడం సాధ్యం కాకపోతే.. మీరు పాలిషింగ్ కిట్లు లేదా సున్నితంగా ఉండే స్క్రబ్‌లను కూడా ఉపయోగించొచ్చు.
గర్భధారణ సమయంలో మీ శరీరంలో సంభవించే హార్మోన్ల మార్పుల వలన సాధారణంగా డెర్మాటిట్స్ (ఒక రకమైన చర్మ దురద) వస్తుంది. దీని వలన మీ ముఖం మీద ఎరుపు రంగులో పొరలుగా ఉండే పాచెస్ ఏర్పడతాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు షియా బటర్, ప్రీంరోజ్ ఆయిల్, జోజోబా సీడ్ ఆయిల్ వంటి ఓదార్పునిచ్చే (సూతింగ్) ప్రొడక్టులను మీరు ఉపయోగించొచ్చు. ఈ పదార్థాలు మీ చర్మానికి పునఃజీవనాన్ని అందజేస్తాయి.
మీరు గర్భం దాల్చిన తర్వాత మీ ముఖంపై కొన్ని సాలీడు వంటి గుర్తులను కూడా కనుక్కోవచ్చు. రక్తనాళాలను విస్తరించే మీ సిరలపై ఒత్తిడి దీనికి కారణం కావొచ్చు. చాలా సందర్భాల్లో ఈ మరకలు (గుర్తులు) వాటంతట అవే వెళ్లిపోతాయి. ఒక వేళ ఆ మరకలు తొలిగిపోకపోతే మీరు వైద్యుడిని సంప్రదించవచ్చు. లైరా లేజర్ ద్వారా వైద్యులు ఈ మరకలను తొలగిస్తారు.
గర్భధారణ సమయంలో మీ శరీరం అత్యధిక స్థాయిలో ప్రొజెస్టిరాన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా శరీరంలో ప్రొజెస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది తరచుగా తైల గ్రంథుల నుంచి స్రావాన్ని రిలీజ్ చేస్తుంది. చర్మరంధ్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇవి మీ ముఖంపై మొటిమలు వచ్చేలా చేస్తాయి. మీరు మొటిమల నుంచి విముక్తి పొందేందుకు సల్ఫర్ కలిగిన క్లెన్సింగ్ మిల్క్‌ను ఉపయోగించాలి.
గర్భధారణ సమయంలో మరియు మీ ప్రసవానంతర సమయంలో కళ్లు ఉబ్బితే మీరు ఎక్కువగా అలసిపోయారని అర్థం. పెప్టైడ్స్ ఉన్న కొన్ని రకాల క్రీమ్స్‌ను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
ప్రసవానంతర చర్మ సంరక్షణ కోసం కొన్ని అనుకూలమైన మార్గాలు కింద ఇవ్వబడ్డాయి:
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో చర్మ సంరక్షణ - అనుసరించాల్సిన చిట్కాలు
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |