Vaccinations
3 November 2023 న నవీకరించబడింది
మీరు ఇప్పుడే మీ నవజాత శిశువుకు వేయించే టీకాల జాబితాను పొందారు. మీ బిడ్డ వ్యాక్సిన్లకు ఎలా స్పందిస్తుందో అని మీరు దిగులు చెందుతున్నారా? ఇంజెక్షన్లకు ఎవరు భయపడరు. మీరు ప్రస్తుతం ఒక తల్లి. అయినా కానీ ఇంజెక్షన్లను ఎలా తప్పించుకోవాలని చూస్తూ ఉంటారు. అవునా? కాదా? ఇదే నియమం మీ బిడ్డకి కూడా వర్తిస్తుంది. వారు కూడా టీకాలంటే భయపడతారు. శిశువులకు టీకాలు వేసిన తర్వాత కొంచెం నలతగా మారొచ్చు. టీకా వేసిన చోట వారికి కాస్త నొప్పిగా, ఇంకా కాస్త అసహనంగా కూడా అనిపించొచ్చు. ఇలాంటి సమయంలో వారిని ఏడవకుండా ఉంచేందుకు మీరు కొన్ని పద్ధతులు తెలుసుకోవాలి. టీకా వేసిన తరువాత వారికి అప్పుడప్పుడూ కొంత జ్వరం కూడా వస్తుంది. ఇలా జ్వరం రావడం అనేది టీకా సరిగ్గా పని చేస్తుందని అర్ధం.
అందరి తల్లితండ్రుల లాగానే టీకా వేసిన తర్వాత బిడ్డ ఏడవడం సాధారణమేనా అని మీరు ఆలోచిస్తున్నట్లైతే, దానికి సమాధానం అవును. అందుకే బేబీ టీకా చార్ట్‌ను ఫాలో అయి సరైన సమయంలో సరైన వ్యాక్సిన్లు అందేలా చూడండి. ఇండియాలో శిశువులకు వేసే టీకా చార్ట్‌ను చూడండి. ఇందులో నవజాత శిశువుల టీకా చార్ట్ కూడా ఉంది.
వయసు |
వ్యాక్సిన్స్ (టీకాలు) |
అనారోగ్యాలు |
నవజాత శిశువు వ్యాక్సినేషన్ |
BCG – డోస్ 1 |
క్షయ వ్యాధి |
OPVD - డోస్ 0 |
పోలియో |
|
Hep B - డోస్ 1 |
హెపటైటిస్ B |
|
6-8 వారాలు |
DTaP/DTwP - డోస్ 1 |
డిప్తీరియా, టేటానస్, మరియు పెర్టుసిస్ |
Hib డోస్ 1 |
హీమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా |
|
రొటావైరస్ డోస్ 1 |
రోటావైరస్ సంక్రమణ |
|
IPV (ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్) డోస్ 1 |
పోలియో |
|
Hep B డోస్ 2 |
హెపటైటిస్B |
|
10-16 వారాలు |
DTaP/DTwP డోస్ 2 |
డిప్తీరియా, టెటానస్, పెర్టుసిస్ |
Hib డోస్ 2 |
హేమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా |
|
రొటా వైరస్ డోస్ 2 |
రొటావైరస్ ఇన్ఫెక్షన్ |
|
IPV డోస్ 1 |
పోలియో |
|
14-24 వారాలు |
DTaP/DTwP డోస్ 3 |
డిప్తీరియా, టెటానస్, పెర్టుసిస్ |
Hib డోస్ 3 |
హేమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా |
|
రొటా వైరస్ డోస్ 3 |
రొటావైరస్ ఇన్ఫెక్షన్ |
|
IPV డోస్ 3 |
పోలియో |
|
6 నెలలు |
OPV డోస్ 2 |
పోలియో |
Hep B డోస్ 3 |
హెపటైటిస్B |
|
9 నెలలు |
OPV డోస్ 2 |
పోలియో |
Measles డోస్ 1 |
మసిల్స్ |
|
MMR డోస్ 1 |
మసిల్స్, మమ్స్, రుబెల్లా |
|
9-12 నెలలు |
Typhoid CV డోస్ 1 |
టైఫాయిడ్ |
12 నెలలు |
Hep A Vaccine) డోస్ 1 |
హెపటైటిస్ A |
15 నెలలు |
PCV బూస్టర్ |
న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ |
MMR డోస్ 2 |
మసిల్స్, మమ్స్, రుబెల్లా |
|
16-18 నెలలు |
IPV బూస్టర్ |
పోలియో |
Hib B టైప్ వ్యాక్సిన్ బూస్టర్ |
హేమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా |
|
DTaP/DTwP బూస్టర్ |
డిప్తీరియా, టెటానస్, పెర్టుసిస్ |
|
18నెలలు |
Hep A డోస్2 |
హెపటైటిస్ A |
2 సంవత్సరాలు |
టైఫాయిడ్ బూస్టర్ |
టైపాయిడ్ |
4-6 సంవత్సరాలు |
OPV డోస్ 3 |
పోలియో |
టైఫాయిడ్ బూస్టర్ |
టైపాయిడ్ |
|
DTaP/DTwP బూస్టర్ |
డిప్తీరియా, టెటానస్, పెర్టుసిస్ |
మీ ఆరోగ్య సంరక్షణాధికారి మీ శిశువుల కోసం ఈ జాబితాను మీకు అందిస్తారు. వ్యాక్సినేషన్ చార్ట్‌లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీ శిశువులకు అన్ని టీకాలు సరైన సమయంలో వేస్తున్నారని మీరు నిర్ధారించుకోవాలి. వ్యాక్సిన్ల జాబితా మీరు సరైన సమయంలో మీ బిడ్డకు వ్యాక్సిన్ వేయించడంలో సహాయపడుతుంది.
మీకు 6 వారాల బేబీ వ్యాక్సినేషన్ చార్ట్ సమాచారం రుసుముతో సహా కావాలంటే లేదా ఇతర వయసు పిల్లల వ్యాక్సినేషన్ రుసుము కావాలంటే, మీరు బేబీ వ్యాక్సినేషన్ చార్ట్ ఇన్ ఇండియా విత్ ప్రైసెస్ అని సెర్చ్ చేస్తే సరిపోతుంది. మీరు ప్రభుత్వ వ్యాక్సినేషన్ చార్ట్‌ను కూడా ధరల కోసం రిఫర్ చేయొచ్చు.
మీ శిశువు ఆరోగ్యానికి టీకాలు చాలా ముఖ్యమైనవి. అయితే మీ బేబీ వ్యాక్సిన్ వల్ల నొప్పితో బాధపడుతుండడం మీకు కూడా బాధను కలిగిస్తుంది. చాలా మందిలో భయం కలిగేందుకు సిరంజి చాలు. ఏదేమైనా మీరు శాంతంగా ఉండి.. మీ శిశువులకు వ్యాక్సిన్స్ వేయించాలి. వ్యాక్సిన్ అనేది ప్రాణాంతక వ్యాధులతో పోరాడేందుకు మీ శిశువు రోగనిరోధక వ్యవస్థను సిద్ధం చేస్తుంది.
టీకా వేసిన తర్వాత మీ బిడ్డ అదుపు లేకుండా ఏడుస్తోందా? 6 నెలల శిశువుకు వ్యాక్సిన్ వేసినా, లేదా 9 నెలల శిశువుకు వ్యాక్సిన్ వేసినా కానీ ఏడుపు అనేది సాధారణం. టీకా తర్వాత బేబీ అసౌకర్యాన్ని తగ్గించేందుకు ఈ కింది చిట్కాలను ఉపయోగించండి. దీనిని 5-S విధానం అని అంటారు. ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది.
1. స్వాడ్లింగ్(శిశువులను గుడ్డలో చుట్టడం): శిశువులు ముఖ్యంగా ఐదు నెలల కంటే తక్కువ వయసున్న వారిని చుట్టి పట్టుకుంటేనే వారు ఇష్టపడతారు. దీనినే స్వాడ్లింగ్ అని అంటారు. మీరు మీ శిశువును వ్యాక్సినేషన్ తర్వాత ఇలా చుట్టి పట్టుకోవడం వలన వారు శాంతిస్తారు. మీరు మీ బేబీని వ్యాక్సినేషన్ కోసం క్లీనిక్‌కు తీసుకెళ్లే ముందు మెత్తటి దుప్పటిలో కూడా వ్రాప్ (చుట్టడం) చేయొచ్చు. కేవలం వ్యాక్సిన్ వేసిన ఏరియాను కవర్ చేయొద్దు.
2. సైడ్ పొజిషనింగ్: ఒకసారి టీకా వేయడం పూర్తయిన తర్వాత, మీ శిశువును పక్కకి లేదా కడుపు వైపు ఉంచేలా (సైడ్‌కు పడుకోబెట్టడం) చూసుకోండి. ఇది వారికి ఉపశమనం కలుగజేస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే వ్యాక్సినేషన్ తర్వాత నర్సులు ఇదే భంగిమలో పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్తారు.
3. ఊపడం: టీకాలు వేసినా లేకున్నా ముఖ్యంగా నవజాత శిశువులు ఊగేందుకు ఇష్టపడతారు. వారు మొదట్లో అనుభవించే అనేక సమస్యలకు ఇది విరుగుడు. వారు నిద్రలోకి జారుకున్నపుడు అంతెందుకు ఆడుకునేటపుడు కూడా ఊగేందుకు ఇష్టపడతారు. వ్యాక్సినేషన్ తర్వాత కూడా వారిని ఊపేందుకు ప్రయత్నించండి. వారు వెంటనే ఏడవడం తగ్గిస్తారు.
4. పీల్చనివ్వడం: శిశువులకు వ్యాక్సిన్ వేసిన తర్వాత నొప్పిని తగ్గించేందుకు ఉత్తమ మార్గం వారు సాధారణంగా చేసే పనిని చేయనివ్వడం. ఉదాహరణకు వారికి బాటిల్ లేదా పాసిఫయర్ పీల్చడం బాగా తెలిస్తే వారిని అదే చేయనివ్వండి. లేదా వారిని శాంతపరిచేందుకు తల్లిపాలు ఇవ్వండి. ఇది వారిని వెంటనే శాంతపరుస్తుంది.
5. షుషింగ్ (చిన్నగా శబ్దం చేయడం): టీకా వేసిన తర్వాత నొప్పి వల్ల మీ బిడ్డ గందరగోళంగా ఉంటే షుషింగ్ సౌండ్ వారిని శాంతపరుస్తుంది. మీ బిడ్డ నొప్పితో బాధపడుతున్నపుడు తక్కువగా చేసే హుష్ శబ్దాలను చేస్తూ ప్రయత్నించండి.
ఈ ఐదు శాంతపరిచే పద్ధతుల్లో మీరు మీ బిడ్డ టీకా తీసుకున్న తర్వాత కనీసం నాలుగు ఉపయోగించినా మీ బిడ్డ ఏడవడం ఆపుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ముందు తర్వాత వ్యాక్సిన్ వేసిన ప్రాంతాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. ఈ విధంగా చేయడం వలన నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |