Gas & Bloating
3 November 2023 న నవీకరించబడింది
గర్భధారణ స్త్రీ శరీరంలో అనేక మార్పులను కలిగిస్తుంది. ఇది శరీరంలోని చాలా భాగాలను సున్నితంగా చేస్తుంది. ఊహించని జుట్టు పెరుగుదల నుండి మలబద్ధకం మరియు త్రేనుపు వరకు, గర్భం అనేక శారీరక మార్పులకు కారణమవుతుంది. వీటిలో, గ్యాస్ కూడా గర్భిణీ స్త్రీలలో కలిగే ఒక సాధారణ మార్పు. ఇది ఇబ్బందిగా అనిపించినా, సిగ్గుపడాల్సిన పనిలేదు. గర్భధారణ సమయంలో దుర్వాసన గల గ్యాస్ అన్నది హార్మోన్ల పెరుగుదల కారణంగా సంభవిస్తుంది. ఈ హార్మోన్ల విడుదల జీర్ణశయాంతర ప్రేగులలోని ప్రక్రియలను నెమ్మదిస్తుంది.
కాకపోతే, శుభవార్త ఏమిటంటే ఈ గ్యాస్ ను అదుపులో ఉంచవచ్చు. ఇది పూర్తిగా తొలగించబడనప్పటికీ, గ్యాస్ లేదా దాని వాసనను పరిమితం చేయడానికి ఉపయోగించే కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. ఇంకో శుభ వార్త ఏమిటంటే, ఈ రెమెడీలలో పుష్కలంగా నీరు త్రాగడం, మంచి వ్యాయామం చేయడం మరియు కృత్రిమమైన తీపి లేదా కార్బోనేటేడ్ పానీయాలను నివారించడం వంటి ప్రాథమిక జాగ్రత్తలు ఉన్నాయి.
గర్భధారణ సమయంలో, సాధారణ శరీరానికి ఉండే నియంత్రణను గర్భిణీ స్త్రీ శరీరంకలిగి ఉండదు; కండరాల కదలికను నియంత్రించడం అంత సులభం కాదు. కాబట్టి, గ్యాస్ ఉండటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది గర్భం యొక్క ప్రారంభ సూచిక. మొదటి వారంలో, స్త్రీ శరీరం వాయువు నిండినదిగా మారుతుంది. మీరు గర్భవతి అయినట్లయితే, మొదటిసారి ఋతుస్రావం తప్పిపోయిన 1-2 వారాలలో, మీ శరీరం వాయువు నిండినట్లుగా మీరు గమనించవచ్చు.
కుళ్ళిన గుడ్లు వంటి వాయువు వాసన అనేది ప్రారంభ గర్భం యొక్క అత్యంత సాధారణ సంకేతాలలో ఒకటి . దీనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అదనపు హార్మోన్ల విడుదల స్త్రీల జీర్ణవ్యవస్థను ఉబ్బిపోయేలా చేస్తుంది.దానివల్ల ప్రెగ్నెన్సీ గ్యాస్ ఎక్కువ ఉండేందుకు కారణమవుతుంది. ఈ గ్యాస్ ఏర్పడటం అసౌకర్యంగా కూడా ఉంటుంది మరియు పొత్తికడుపు నొప్పి, త్రేనుపు లేదా ఉబ్బరం కలిగిస్తుంది. కొన్నిసార్లు, ఇది మొత్తం తొమ్మిది నెలల గర్భం లోనూ ఉంటుంది.
గర్భధారణ సమయంలో, శరీరం ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది, ఇది అదనపు గ్యాస్‌కు ప్రధాన కారణాలలో ఒకటి. గర్భధారణకు మద్దతుగా హార్మోన్ ఎక్కువ పరిమాణంలో విడుదల చేయబడుతుంది, ఇది శరీర కండరాలను సడలించడానికి దారితీస్తుంది. ప్రేగు యొక్క కండరాలు సడలించినప్పుడు, అవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. ఇది గ్యాస్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఈ గ్యాస్ ఏర్పడటం వల్ల గర్భధారణ సమయంలో దుర్వాసన గల గ్యాస్ వస్తుంది.
గర్భధారణ సమయంలో మహిళలు గ్యాస్ సమస్యను ఎదుర్కోవడం సాధారణమైనప్పటికీ, ఇది సాధారణంగా ఆహారం మరియు పానీయాలు సరిగా తీసుకోకపోవడం వల్ల కలుగుతుంది. బిడ్డను ఆశించే తల్లులు వారు తీసుకుంటున్న ఆహారం యొక్క రికార్డు ను ఉంచడం చాలా ముఖ్యం. దాని వల్ల ఏ ఆహారాలు గ్యాస్‌ను ప్రేరేపించే అవకాశం ఎక్కువగా ఉందో వారు అర్థం చేసుకోవచ్చు.
వేగంగా తినడానికి బదులుగా నెమ్మదిగా తినండి మరియు మరింత జాగ్రత్త గా ఉండండి; మీ ఆహారాన్ని బాగా నమలండి మరియు అదనపు గాలిని పీల్చుకోకుండా ఉండండి. దీనివల్ల శరీరంలో గ్యాస్ చిక్కుకుపోదు. నీరు ఎక్కువగా త్రాగండి మరియు తీపి లేదా కార్బోనేటేడ్ పానీయాలను తగ్గించడంపై దృష్టి పెట్టండి.
గర్భధారణ ప్రారంభంలో గ్యాస్ వాసన సాధారణమైనప్పటికీ, గర్భధారణ సమయంలో గ్యాస్ నుండి ఉపశమనం పొందేందుకు కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. నీరు మరియు తాజా రసాలు వంటి ద్రవాలు పుష్కలంగా త్రాగడానికి ప్రయత్నించండి. ఎక్కువ ఫైబర్ మరియు ఫైబర్ సప్లిమెంట్లను తీసుకోవడం గురించి జాగ్రత్త వహించండి. గ్యాస్‌ను అరికట్టడానికి మీరు చేయగలిగే ఇతర విషయాలు ఏమిటంటే, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, శరీరాన్ని అతుక్కునే బట్టలు కాకుండా సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం చేయండి. అంతే కాకుండా మీ ఒత్తిడి స్థాయిలు తక్కువగా ఉన్నాయని ధృవీకరించుకోండి.
ప్రెగ్నెన్సీ గ్యాస్ కొన్ని నెలలు లేదా మొత్తం గర్భధారణ చక్రం ముగిసేవరకు ఉండవచ్చు. ముఖ్యంగా ఇది హార్మోన్ల విడుదల కారణంగా సంభవిస్తుంది. కొంతమంది మహిళలు దుర్వాసన గల గర్భధారణ గ్యాస్‌ను అనుభవిస్తారు. అయితే ఇది ప్రధానంగా వారి ఆహారం మరియు నీటి తీసుకోవడంపై దృష్టి పెట్టకపోవడం వల్ల జరుగుతుంది. ఉబ్బరం, త్రేనుపు మరియు దుర్వాసనతో కూడిన గ్యాస్‌ను నివారించడానికి, ఎక్కువ నీరు త్రాగండి. ఫైబర్ ఉన్న ఆహారాన్ని తినండి లేదా ఫైబర్ సప్లిమెంట్లను తీసుకోండి మరియు మీ శరీరానికి పుష్కలంగా శారీరక వ్యాయామం ఉండేలా చూసుకోండి. మీరు గ్యాస్ ఏర్పడటాన్ని నిరోధించలేకపోయినప్పటికీ , మీరు గ్యాస్ నుండి ఉపశమనం పొందవచ్చు లేదా మీ శరీరంలో చిక్కుకునే మొత్తాన్ని పరిమితం చేయవచ్చు.
గర్భిణీ స్త్రీలకు గర్భధారణ సమయంలో విడుదలయ్యే హార్మోన్ల కారణంగా ఉబ్బరం లేదా గ్యాస్ నిండటం వలన వారు సాధారణంగా అసౌకర్యాన్ని అనుభవిస్తారు. అయినప్పటికీ, ఈ లక్షణాలు శిశువును లేదా గర్భధారణ చక్రాన్ని ప్రభావితం చేయవు. గ్యాస్ ఎక్కువ కాలం పాటు ఉంటే లేదా తీవ్రమైన కడుపు నొప్పితో పాటుగా ఉంటే దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి.
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |