Water Break
3 November 2023 న నవీకరించబడింది
అభినందనలు! ఇప్పుడు మీరు మీ గర్భధారణ చివరి దశకు చేరుకున్నారు. మీరు చాలా విషయాల గురించి కలతచెంది ఉంటారు. మీ గర్భదారణ చివరి దశకు చేరుకున్నప్పుడు, ఉమ్మనీటి విచ్ఛిన్నం (వాటర్ బ్రేకింగ్) గురించిన ఆందోళన మీకు ఉండవచ్చు. చాలా తరచుగా.. ప్రసవ సమయం వరకు ఉమ్మనీటి విచ్ఛిన్నం అనేది జరగదు. ఇటువంటివి సంభవిస్తే.. అది శిశువు బయటి ప్రపంచానికి వచ్చేందుకు సిద్ధంగా ఉందని సూచిస్తుంది.
చాలా సినిమాల్లో ఉమ్మనీరు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగజిమ్మడం చూపిస్తారు. కానీ అది నిజంగా అలా జరగదు. వాస్తవానికి.. గర్భిణీ స్త్రీలలో 15 నుండి 16 శాతం మంది మాత్రమే ప్రసవానికి ముందు ఉమ్మనీటి సంచి చిరిగిన అనుభూతిని పొందారు. కొందరు మహిళలకు ఇది ప్రసవసమయంలో, కాన్పు జరిగేటప్పుడు, ప్రసవానికి ముందు సమయంలో కూడా ఇలా అనిపించవచ్చు.
గర్భధారణ సమయంలో, శిశువు ఉమ్మనీరు (అమ్నియోటిక్ ఫ్లూయిడ్) అనే ద్రవంతో ఆవరింపబడి ఉంటుంది. ఈ అమ్నియోటిక్ యాసిడ్ కలిగి ఉన్న సంచిని అమ్నియోటిక్ శాక్(ఉమ్మనీటి సంచి) అంటారు. అమ్నియోటిక్ శాక్ అనేది కణాలు ఇంకా కణజాలాలతో రూపొందించబడి ఉంటుంది. ఇవి ఒక పొరను ఏర్పరుస్తాయి. కాన్పు సమయంలో లేదా అంతకు ముందు అనేక కారణాల వల్ల.. ఈ కణజాలపు బయటి పొర చిరిగి, అందులోని ద్రవం లీక్ అయ్యే దారి ఏర్పడేలా చేస్తుంది.. దీనినే వాటర్ బ్రేకింగ్ అని అంటారు. ఈ ద్రవం శిశువుకు మంచి కుషన్‌గా పనిచేస్తుంది. అమ్నియోటిక్ ద్రవం అనేది కడుపులో ఉన్న బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు. ప్రసవం ప్రారంభంలో.. కానుపు జరుగుతున్నప్పుడు లేదా శిశువుని బయటికి నెట్టే సమయంలో ఈ పొర చిరిగిపోతుంది.. దీనినే వాటర్ బ్రేకింగ్ అంటారు. ఈ పొర కూర్పులో ఇంకా ఎంజైములలో కలిగే మార్పులు, శిశువు వల్ల ఒత్తిడి పెరగడం వంటివి వాటర్ బ్రేకింగ్(ఉమ్మనీటి సంచి చిరగడానికి) కి గల కారణాలు.
అయితే కొన్ని సందర్భాల్లో ఉమ్మనీటి సంచి చిరగదు. అందువల్ల వైద్యులు దానిని చిరిగేల ప్రేరేపిస్తారు. ఇది సాధారణంగా సమస్యలు కలిగిన సంధార్భాల్లో లేదా గర్భావది కాలం పూర్తయినప్పుడే ప్రేరేపించబడుతుంది. ప్రసవానికి ముందు ఈ పొర విచ్ఛిన్నమైతే, దానిని పొరల అకాల విచ్ఛితి (ప్రిమేచర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్, PROM) అంటారు. వాటిలో చాలా వరకు ఈ పొర చిరిగిన సంధార్భాల్లో 24 గంటల లోపు ప్రసవపు నొప్పులకు గురవుతారు. ఉమ్మనీరు ముందస్తుగా బయటపడితే.. అది తల్లీ బిడ్డకు మరింత ప్రమాదాన్ని కలిగించే అవకాశముంది..
సాధారణంగా.. ప్రసవ సమయంలో ఈ ఉమ్మనీటి సంచి చిరిగిపోయి నీరు బయటపడుతుంది. అయితే.. కొన్నిసార్లు ప్రసవ సమయానికి ముందే ఇలా జరగవచ్చు. ఎంజైమ్‌లు ఇంకా హార్మోన్ల వల్ల శరీర ప్రేరేపణల పరంపరాల వల్ల ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నమౌతుంది. అందువల్ల ఈ పొర బలహీనపడి చివరికి చిరిగిపోతుంది.
కొంతమంది గర్భిణీ స్త్రీలు తాము నియంత్రించలేని వెల్లువలాంటి స్రావాలను గమనిస్తారు. ఇంకా ఆ స్రావాలు క్రిందివైపుకి ప్రసరిస్తాయి. దానివల్ల లోదుస్తులు తడిగా అవవచ్చు లేదా ఇది అధికమొత్తంలో తెల్లటి యోని స్రావాలను కలిగి ఉండవచ్చు. అదే సమయంలో కొంత ద్రవం పొరనుండి లీక్ అవడంవల్ల అది నెమ్మదిగా చిరిగిపోతుంది. కొంత మంది మహిళలు ఈ ద్రవాల స్రావం క్రమంగా జరుగుతున్నప్పుడు వాటిని మూత్రం అని పొరపాటున భావిస్తారు. ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నం జరిగిందో లేదో అనే అయోమయంలో ఉంటే.. మీ వైద్యుడిని పిలవాలి. విడుదలయ్యే అమ్నియోటిక్ ద్రవ పరిమాణం అనేది ఎక్కడ మొదలయ్యిందో.. ఎక్కడ చీలిక ఏర్పడిందో ఇంకా శిశువు ఉన్న స్థానం మీద ఆధారపడి ఉంటుంది.
ద్రవం రంగును బట్టి అది యోని స్రావాలా లేదా ఉమ్మ నీరా అనేది నిర్ణయించవచ్చు. ఇది తెల్లగా ఇంకా చిక్కగా ఉన్నట్లయితే.. అది బహుశా యోని స్రావం కావచ్చు. పసుపు రంగులో ఉండి వాసన వస్తూంటే అది ఉమ్మనీరు అయివుంటుంది. కానీ అది మూత్రం అయినట్లయితే ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. ఉమ్మనీటి సంచి చిరిగినట్లయితే నిలబడి ఉన్నప్పుడు అందులోని అమ్నియోటిక్ ద్రవం క్రిందికి ప్రవహిస్తుంది. ఇది కొద్దిసేపు నిరంతరాయంగా కారుతూ ఉండవచ్చు.
ప్రసవ సమయానికి చేరుకున్నప్పుడు సాధారణంగా ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నమౌతుంది. అయితే.. గర్భం దాల్చిన 37 వారాల కంటే ముందు ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నమయితే, దానిని ప్రీ టర్మ్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్ లేదా PPROM అంటారు. అంటే ప్రసవానికి ముందస్తుగానే ఉమ్మనీటి సంచి చిరగటం అని దీనర్థం. ఇలా ఉమ్మనీటి సంచి ముందస్తుగానే చిరిగేందుకు అనేక కారణాలు ఉన్నాయి.
• గత గర్భధారణ సమయంలో ఉమ్మనీటి సంచి పొర ముందస్తుగానే చిరిగిన సందర్భం
• ఇంట్రా అమ్నియోటిక్ ఇన్ఫెక్షన్ లేదా ఉమ్మనీటి సంచి పొర వాపు
• గర్భధారణలో యోని నుండి రక్తస్రావం
• తక్కువ బరువు ఉండటం ఇంకా పోషకాహార లోపం
• చిన్నదైన గర్భాశయం
• గర్భాశయ వికాసంలో లోపాలు
• కృత్రిమ గర్భాశయ సంకోచాలు
• గతంలో జరిగిన గర్భాశయ శస్త్రచికిత్సలు
• ఉమ్మనీటి సంచి ఎక్కువ సాగడం ఇంకా దానిపై ఒత్తిడి పెరగడం
సాధారణ పరీక్షల ద్వారా ఉమ్మనీటి సంచి చిరిగిందో లేదో నిర్ధారించుకోవచ్చు.
37 వారాల తర్వాత, శిశువు బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది. ప్రసవం అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టినట్లయితే.. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఇంకాస్త ఎక్కువ అవుతాయి. ఉమ్మ సంచిని పగలగొట్టడం ద్వారా 24 గంటలలోపు పురిటి నొప్పులను పురికొల్పి తద్వారా ప్రసవాన్ని ప్రేరేపించవచ్చు.
34 నుండి 37 వారాల మధ్య ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నమైతే డాక్టర్ ప్రసవాన్ని ప్రేరేపించడాన్ని పరిశీలిస్తారు. కనీసం 38 వారాల తర్వాత బిడ్డ పుట్టాలి కాబట్టి డాక్టర్ ప్రసవానికి ముందు కొన్ని వారాలు వేచి ఉండవచ్చు. అయితే.. ఈ మధ్య కాలంలో పుట్టే బిడ్డకి ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
24 నుండి 34 వారాల మధ్య ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నమైతే, శిశువు ముదస్తుగానే బయటకు వచ్చేందుకు తగిన సమయం కానందున, శిశువు పెరుగుదలకు స్టెరాయిడ్లను ఇచ్చేందుకు డాక్టర్ పరిశీలించవచ్చు. స్టెరాయిడ్లు ఊపిరితిత్తుల వేగవంతమైన అభివృద్ధికి ఇంకా శిశువు సంపూర్ణ ఎదుగుదలకి సహాయపడతాయి. అయితే.. సురక్షితమైన ప్రసవం అయ్యే వరకు ఆసుపత్రిలో చేరాలని వైద్యుల సలహా.
32 వారాల కంటే తక్కువ గర్భంతో ఉన్నట్లయితే.. 7 రోజులలోపు ప్రసవించే ప్రమాదం ఉన్నట్లయితే కార్టికోస్టెరాయిడ్స్ వాడేలా ప్రతిపాదించబడవచ్చు.
24 వారాల కంటే తక్కువ గర్భవతిగా ఉన్నట్లయితే, నెలలు నిండకుండానే బిడ్డ పుట్టే ప్రమాదాన్ని, ఇంకా ప్రసవాన్ని ఆలస్యం చేసేందుకు ప్రయత్నించడం వల్ల కలిగే హాని మరియు ప్రయోజనాలను వైద్యులు వివరిస్తారు. అవి శారీరక లేదా మానసిక లోపాలను కలిగించేవిగా ఉండవచ్చు.
అది సినిమాల్లో చూపించినంత నాటకీయంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇది ప్రసవం జరుగుతోందా లేదా ఎపిడ్యూరల్ (వెన్నెముకకు నొప్పినివారిణి ఇంజెక్షన్ ఇవ్వడం) కలిగి ఉన్నారా ఇంకా ఎంత ద్రవం స్రవించబడిందనే దానిపై ఆధారపడి ఉంటుంది. అది మూత్రాశయం నుండి వెచ్చని ద్రవం వేగంగా స్రవించడం ఇంకా మూత్రాశయం ఖాళీ అయ్యీ ఉపశమనం పొందినట్లుండే అనుభూతిని కలిగిస్తుంది. ఇది ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నాన్ని తెలిపే సంకేతం కాబట్టి పొత్తికడుపులో ఒత్తిడి కూడా పెరుగుతుంది. కొన్నిసార్లు నొప్పిలేకుండా తటాలున జరిగే స్రావం ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నానికి మరొక సంకేతం.
ఒక్కోసారి ఇది బొట్లు బొట్లుగా స్రావం అవుతున్నట్లు కూడా ఉంటుంది. ఇది తక్కువ మొత్తంలో ఉండటం వల్ల మూత్రం లీకవుతుందని పొరబడుతారు. మూత్రస్రావం లేదా ఉమ్మనీటి స్రావాల మధ్య తేడాను గుర్తించలేకపోతే.. వైద్యుడిని పిలవడం మంచిది.
కొన్నిసార్లు ప్రసవంలో లేదా కానుపు సమయంలో ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నమవుతుంది. ఎందుకంటే గర్భాశయ సంకోచాల తీవ్రత ఎక్కువవుతుంది. గర్భాశయం ఇంకా శిశువు మధ్య మెత్తటి కుషన్ వంటి ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నం తర్వాత పురిటి నొప్పులు తీవ్రమవుతాయి.
ప్రసవం జరుగుతూన్నప్పటికీ ఆలస్యం అవుతున్నట్లయితే.. డాక్టరు చిన్న కొక్కీ చివరిలో ఉండే పొడవాటి ప్లాస్టిక్ రాడ్‌ను ఇంజెక్ట్ చేసి ఉమ్మనీటి సంచికి చిధ్రం చేయవచ్చు. ఇది అనుకునేంత బాధాకరంగా ఉండదు. దానివల్ల కడుపులో బిడ్డ క్రిందికి నెట్టబడటం వలన కలిగే సంకోచాలు పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది.
ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నం బాధాకరంగా ఉండవలసిన అవసరం లేదు. ఇంకా అది మనమనుకునేంత బాధగా అనిపించదు. ఇది సాధారణ నీటి స్రావంలా ఉండవచ్చు. అయితే ఈ క్రింది కొన్ని విధానాలు దానిని గుర్తించడంలో మీకు దోహదపడవచ్చు.
ఉమ్మనీరు బొట్లు బొట్లుగా కారుతుంటే.. దాని వాసన ద్వారా ఉమ్మనీటి సంచి చిరిగినట్లు మీరు ఊహించవచ్చు. అమ్నియోటిక్ ద్రవం సాధారణంగా మూత్రంలా కాక వాసన లేకుండా ఉంటుంది. ఇది బలమైన, ఘాటైన వాసన కలిగిన మూత్రానికి భిన్నంగా వాసనను కలిగి ఉండదు.
దాని రంగును బట్టి ఊహించవచ్చు. ఇది సాధారణంగా ఎలాంటి రంగు లేనిదై ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఇది లేత రంగును కలిగి ఉండవచ్చు లేదా రక్తపు మరకలు కలిగి ఉండవచ్చు. ఇది మామూలుగా సాధారణమైనదిగా పరిగణించబడుతుంది.
అమ్నియోటిక్ ద్రవం యొక్క ఆకృతి యోని స్రావాల వలె మందపాటి శ్లేష్మం, పసుపు రంగు ఇంకా ఆకృతిలో చిక్కగా కాకుండా, సరళంగా, నీరులా ఇంకా స్పష్టంగా ఉంటుంది.
కొన్నిసార్లు ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నమైనట్లు అనుభూతి కలగవచ్చు. కొంతమంది గర్భిణీ స్త్రీలు ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నమైనప్పుడు నొప్పి, ఉపశమనం ఇంకా ఒత్తిడి అనిపించే అనుభూతిని పొందుతారు. ఇది చాలా మందికి భావనకు తగినదని అనిపిస్తుంది.
ఉమ్మనీటి సంచి విచ్ఛిన్న సమయంలో ప్రవహించే ద్రవం మొత్తం కొంచెంగా లేదా కొన్ని కప్పులు నిండేలా నిరంతరంగా ఉండవచ్చు. ఇది మొదలవడం, శిశువు చుట్టూ ఎంత ద్రవం పరిమాణం ఉంది అనేటువంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇది సాధారణంగా మూత్రాశయ లీకేజీ కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది.
ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నం అయ్యిందా లేక అది కేవలం మామూలు స్రావమా అని మీకు తెలియకుంటే వైద్యుడిని సంప్రదించాలి. బ్యాగ్ సర్దుకుని వెంటనే ఆసుపత్రికి వెళ్లడం మంచిది.
· రక్తస్రావం అవుతువుంటే.
· స్రావం ఆకుపచ్చ పసుపు రంగులో ఉంటే.
· స్రావం దుర్వాసన ఇంకా వాసన కలిగి ఉంటే.
· జ్వరం రావడం లేదా శరీర ఉష్ణోగ్రత మామూలు కంటే ఎక్కువగా ఉంటే.
· ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నం తర్వాత మీకు పొత్తికడుపు ఇంకా బొడ్డు ప్రాంతం చుట్టూ నొప్పి లేదా తాకితే నొప్పిపుట్టడం ఉంటే.
ఇండక్షన్ టెక్నిక్‌లను ప్రయత్నించడానికి ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నం తర్వాత డాక్టర్ 24 గంటలు వేచి ఉంటారు. ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నం తర్వాత, శిశువుకు ఆక్సిజన్ ఇంకా ఇతర అవసరాలను తీర్చడంలో మాయ దోహదపడుతుంది. ఆందోళన చెందలసిన విషయమేమిటంటే ఉమ్మనీటి సంచి ముందస్తుగానే విచ్ఛిన్నం అయితే.. దానివల్ల తల్లికి శిశువుకు ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. ఎటువంటి ప్రమాద కారకాలు లేనట్లయితే.. పురిటినొప్పులు వాటంతకు అవే వచ్చేవరకు డాక్టర్ వేచి చూస్తారు. వారు మీ శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేయడమే కాకుండా ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయేమో అని తెల్ల రక్త కణాల సంఖ్యను కూడా తనిఖీ చేస్తారు. ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నం తర్వాత శిశువు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షణ కల్పించడానికి యాంటీబయాటిక్స్ ఇవ్వబడతాయి.
ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నం అవడానికి సంచి చుట్టూ ఉన్న కణజాల పొరలలో చీలిక కారణమని కూడా అంటారు. అమ్నియోటిక్ యాసిడ్ నిండిన ద్రవంలో శిశువు ఎదుగుతుంది. బిడ్డ ప్రసవ సమయంలో కనిబడితే లేదా బయటికి నెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు.. ఉమ్మనీటి సంచి చిరుగుతుంది లేదా చీలిపోతుంది. ఇంకా యోని ద్వారం ద్వారా అమ్నియోటిక్ ద్రవం బయటకి పంపబడుతుంది.
ఒక్కోసారి శిశువు ఈ పొరపై సృష్టించే సంకోచాలు లేదా ఒత్తిళ్ల కారణంగా ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నమవుతుంది. ఇది ప్రసవ సమయంలో లేదా ప్రసవానికి ముందస్తుగా కూడా సంభవించవచ్చు. ఈ సంచి ఒత్తిడిని పెంచినప్పుడు ఉబ్బే బెలూన్ వంటిది. మీరు ప్రసవ సమయానికి చేరుకున్నప్పుడు మిగిలిన పొర బలహీనపడుతుంది.
బలహీనపడిన ఉమ్మసంచి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఇది అమ్నియోటిక్ సంచిలో అదనపు ద్రవం వల్ల లేదా పేలవమైన పోషణ వల్ల కావచ్చు. కొన్నిసార్లు సంకోచాల అనంతరం కూడా ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నం జరగదు. సిజేరియన్ అయితే.. శస్త్రచికిత్స సమయంలో ఇది చిరుగుతుంది. కొన్నిసార్లు డెలివరీ తర్వాత కూడా ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నమవదు. శిశువులు ఎన్ కౌల్ బర్త్ (చాలా అరుదుగా పుట్టిన శిశువు చిరగని ఉమ్మనీటి సంచి లోపల ఉండటం) అని పిలిచే సంచితో ఆవరించబడిన స్థితిలో పుడతారు.
ఉమ్మనీటి సంచి చిరిగిపోయినప్పుడు, ఎంజైమ్‌ల ఉత్పత్తి అధికమౌతుంది. గర్భాశయం ఇంకా పిండం మధ్య కుదుపులను తట్టుకునే మెత్తదనం తగ్గుతుంది. ఈ ప్రక్రియ ఎక్కువ శక్తి ఇంకా అధిక స్థాయిలో గర్భాశయ సంకోచాన్ని పురికొల్పుతుంది.
శిశువు స్థానం క్రిందివైపుకి లేకపోతే, సంచి పొర చీలిక వల్ల బొడ్డు తాడులో చీలిక సంభవించడం లేదా ప్రోలాప్స్‌కు (గర్భసంచి క్రిందికి దిగజారే స్థితి) కారణమవుతుంది. బొడ్డుత్రాడు ప్రోలాప్స్ అనేది ఆకస్మిక అత్యవసర పరిస్థితి. ఎందుకంటే వాలుగా ఉన్న శిశువు తల ప్లాసెంటల్ సర్క్యులేషన్‌కు ఆటంకం కలిగిస్తుంది.
ఈ పొర పగిలితే.. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల బారినపడటం ఇంకా అది శిశువుకు ప్రాణాంతకం కూడా కావచ్చు. ఇది శిశువు ఇన్ఫెక్షన్లతో సంబంధమున్న అమ్నియోనిటిస్‌కు కూడా దారితీస్తుంది.
ఈ పొరల ఊహించని విచ్ఛిన్నం పిండంపై అనేక రకాల ప్రభావాలను కలిగి ఉంటుంది. అవి ముందస్తుగా ప్రసవమయ్యే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇంకా నియోనాటల్ లేదా పెరినాటల్ (ప్రసవానంతర) ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.
ఈ జటిలమైన ప్రశ్నకు సులువైన సమాధానం లేదు. ప్రతి గర్భం దేనికదే భిన్నంగా ఉండటమే కాక వాటికవే ప్రత్యేకమైనవి. ఏమైతేనేమీ.. కొన్ని కారకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
· గర్భాశయ సంకోచాలు ఉన్నాయా ఇంకా అవి ఎలా ఉన్నాయి:
ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నం తర్వాత సంకోచాలు (పురిటినొప్పులు) ఉంటే, త్వరలో శిశువు పుడుతుంది. కానీ ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నం తర్వాత కూడా పురిటినొప్పులు మొదలు కాకపోతే, ప్రసవించేందుకు ముందు ఆమె ఎంత సమయం వేచి ఉండాలో తెలుసుకొనేందుకు వైద్యుడిని సంప్రదించాలి. కొందరు వైద్యులు 12 గంటలు వేచి ఉండగా మరికొందరు 6 నుంచి 8 గంటల సమయం ఇస్తున్నారు. ఇంకా కొంతమంది వైద్యులు అస్సలు వేచి ఉండక వెంటనే కానుపుకు సిఫార్సు చేస్తారు. ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నం తర్వాత, ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం స్వల్పంగా పెరుగుతుంది. ఉమ్మనీటి సంచి శిశువుకు ఒక రక్షక కవచంలాగా పనిచేస్తుంది కానీ దాని విచ్ఛిన్నం తర్వాత రక్షణ కల్పించలేదు.
· గర్భధారణలోని శిశువు వయస్సు తను త్వరగా లేక ఆలస్యంగా వస్తుందో లేదో నిర్ణయిస్తుంది. పూర్తి గర్భావధి కాలం ఇంకా ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నమైతే పరిస్థితులను ఎలా కొనసాగించాలో శరీరానికి బాగా తెలుసు. కానీ 36 వారాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే.. వైద్యులు ఇన్ఫెక్షన్ ప్రమాదం లేనంత వరకు గర్భధారణను కొనసాగించడానికి సాధ్యమైన ప్రతి విధానాన్ని అవలంబించేందుకు ప్రయత్నిస్తారు. శిశువులోని అభివృద్ధి చెందని ఊపిరితిత్తులు పరిపూర్ణంగా వృద్ధి చెందడానికి డాక్టర్లు వాటిని స్టెరాయిడ్లతో ప్రేరేపిస్తారు.
గర్భధారణ సమయంలో ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నం ఎప్పుడు జరుగుతుందనే దానిపై ఎటువంటి భరోసా లేదు. కాబట్టి చిన్న సందేహం వచ్చినా సరే వైద్యుడిని సంప్రదించాలి. పైన పేర్కొన్నవే కాకుండా ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నానికి చాలా అరుదుగా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ముందస్తుగా ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నం అయినా కూడా కొన్నిసార్లు కానుపు అయ్యేందుకు మనం ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పడుతుంది. గడువు తేదీ తర్వాత కూడా ఇలా అయినప్పటికీ.. అత్యవసర పరిస్థితుల్లో మీ వైద్య ప్రదాతని సంప్రదించాలి.
చాలా మంది గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీటి సంచి విచ్ఛిన్నం అనేది ఒక సాధారణ ప్రక్రియ, ఇది ప్రసవానికి దారితీస్తుంది. అలాంటప్పుడు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. భాగస్వామి సహాయం తీసుకోవాలి ఇంకా ఉమ్మనీరు బయటకు స్రవిస్తే వెంటనే ఆసుపత్రిలో చేరాలి.
Yes
No
Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |