Daily Care Tips
3 November 2023 న నవీకరించబడింది
గర్భధారణ సమయంలో సౌకర్యం అనేది చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో స్త్రీ శరీరం చాలా మార్పులకు గురవుతుంది. ఈ సమయంలో మీ రొమ్ములు మరియు పొత్తి కడుపు విస్తరిస్తాయి. అక్కడ సున్నితత్వం పెరుగుతుంది. గర్భం దాల్చడం అనేది ఆనందం, గందరగోళం వంటి మిక్స్డ్ ఎమోషన్స్‌ను తీసుకొస్తుంది. ఈ సమయంలో సరైన దుస్తులను ఎంచుకోవడం కొంత గందరగోళంగా ఉంటుంది. దుస్తులలో మార్పును పరిగణలోనికి తీసుకోవడం చాలా అవసరం. దుస్తుల మార్పులో అత్యంత ముఖ్యమైనవి ప్యాంటీలు.
నేటి సమాజంలో స్త్రీ తన వృత్తిపరమైన జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సమాంతరంగా నిర్వహించుకుంటూ వస్తోంది. తన అజాగ్రత్త మరియు అలసత్వం వల్ల ఎటువంటి బాధలు అనుభవించడం లేదు. గర్భం దాల్చడం అనేది జీవితాన్ని, శరీర ఆకృతిని, బరువును మారుస్తుంది. ఈ సమయంలో మీకు కొత్త దుస్తుల సెట్ అవసరం అయిన విధంగానే కొత్తలో దుస్తుల సెట్ కూడా అవసరం.
దుస్తులను ఎంచుకునే ముందు ప్రధానంగా చూసేది అవి సౌకర్యంగా ఉన్నాయా? లేదా? అనేది. గర్భధారణ సమయంలో లోదుస్తులను ఎంచుకునేటపుడు మన శరీరానికి ఎటువంటి చికాకు కలిగించని, మన చర్మానికి గీసుకుపోని ప్యాంటీలను ఎంచుకోవడం ఉత్తమం. మనం ఎంచుకునే ప్యాంటీలు మన శరీర కదలికలను నియంత్రించకుండా ఉండడం అవసరం. కానీ కొంత మంది గర్భిణులు సాధారణ ప్యాంటీలనే గర్భధారణ సమయంలో కూడా వాడతారు. గర్భం పెరిగే కొద్దీ ఇది కష్టంగా ఉంటుంది. గర్భవతిగా ఉన్నపుడు మెటర్నటీ (ప్రసూతి) ప్యాంటీలను కొనుగోలు చేయడం చాలా మంచి ఎంపిక. ఎందుకంటే వీటిని మీరు ప్రసవం అయిన తర్వాత కూడా ఉపయోగించచ్చు.
మెటర్నటీ (ప్రసూతి) ప్యాంటీలు గర్భస్త మహిళల కొరకు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఇవి గర్భస్త మహిళలకు మరింత సౌకర్యాన్ని అందిస్తాయి. మీరు గర్భవతిగా ఉన్నపుడు మీ పొట్ట అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు సాధారణ లోదుస్తులు మీకు సరిపోవు. మీ సాధారణ దుస్తులతో పోలిస్తే మెటర్నటీ (ప్రసూతి) లోదుస్తులు అనేవి పరిమాణం, ఆకృతిలో మీకు సరిపోయేలా ఉంటాయి. మీ సాధారణ లో దుస్తులలో మీ వెయిస్టెడ్ బ్యాండ్ (నడుం పట్టీ) చాలా ఎత్తుగా ఉన్నట్లు మీకు అనిపించవచ్చు. మరియు ఇబ్బందికర ప్రదేశాన్ని తాకినట్లు అనిపించవచ్చు. కాబట్టి మెటర్నటీ (ప్రసూతి) ప్యాంటీలు పెరుగుతున్న మీ బంప్ సైజ్‌కు తగిన విధంగా ఉంటాయి.
ఒక వేళ మీ రెగ్యులర్ అండర్వేర్(లో దుస్తులు) మీకు సరిపోయినప్పటికీ.. మీ పొట్ట పెరిగే కొద్దీ వెయిస్టెడ్ బ్యాండ్ (నడుం పట్టీ) విస్తరించాలి. మీరు అలా చేస్తే అవి తర్వాత ఉపయోగపడవు. అందుకోసమే మంచి మెటర్నటీ (ప్రసూతి) లో దుస్తులు తీసుకోవడం చాలా మంచిది.
ఈ ఓవర్ బంప్ ప్యాంటీలు మీ బేబీ బంప్‌ను పూర్తిగా కవర్ చేయగలవు. ఈ ప్యాంటీలు లోయర్ కట్ స్టైల్స్ మీద మరింత సౌకర్యవంతంగా మరియు సపోర్టివ్‌గా ఉంటాయి.
ఈ లో వెయిస్టెడ్ ప్యాంటీలు బంప్ కింద సెట్ అవుతాయి. వేడిగా ఉండే ఎండాకాలంలో ఈ రకం ప్యాంటీలు సరైన ఎంపిక.
ఈ మిడ్ బంప్ (పొత్తి కడుపు ఉబ్బెత్తుగా ఉండడం) అండర్వేర్ అనేది మధ్యస్థంగా ఉండి.. మీ బంప్ మధ్యలో ఇది ఫిట్ అవుతుంది. పైన పేర్కొన్న రెండు మోడల్స్‌కు ఇది మంచి ప్రత్యామ్నాయం. ఆ మోడల్స్ తీసుకోవాలి అనుకునే వారిని ఇది చక్కగా కాంప్రమైజ్ చేస్తుంది. ఈ ప్యాంటీస్ వెయిస్ట్ బ్యాండ్ (నడుం పట్టీ) అనేది సాధారణంగా సాగుతుంది. అందువల్ల మీ బంప్ పెరిగినపుడు.. అది సౌకర్యవంతంగా ఉంటుంది.
మీరు గర్భవతిగా ఉన్న సమయంలో ఊహించని విధంగా బరువు పెరుగుతూ ఉంటే.. మీ మెటర్నటీ (ప్రసూతి) ప్యాంటీ మారేందుకు ఇదే సరైన సమయం. వైద్యులు సాధారణంగా ఇటువంటి వారికి హై వెయిస్టెడ్ (నడుం సగం వరకు వచ్చేవి) ప్యాంటీలను సిఫారసు చేస్తారు. ఎందుకంటే వాటి వల్ల కదలిక సులభం అవుతుంది. అంతే కాకుండా ఈ రకమైన ప్యాంటీలలో ఉండే ఎలాస్టేన్ (ఒక రకమైన ఫాబ్రిక్) మరింత స్ట్రెచబులిటీ (సాగే లక్షణం) అందిస్తుంది. మరియు వీటిని ఎక్కువ కాలం సేపు ఉపయోగించొచ్చు.
గర్భవతిగా ఉన్న సమయంలో మీ పొత్తి కడుపులో బరువు క్రమక్రమంగా పెరుగుతూనే ఉంటుంది కనుక మీరు హై వెయిస్టెడ్ (సగం నడుము వరకు వచ్చేవి) ప్యాంటీలను ఎంచుకోవచ్చు. ఈ సందర్భంలో మీ సాధారణ లోదుస్తులు అంత సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. అంతే కాకుండా ఇవి ఎక్కువగా విస్తరించి ఉండవచ్చు. మంచి సౌకర్యం కొరకు మెటర్నటీ(ప్రసూతి) హై వెయిస్టెడ్ (సగం నడుము వరకు వచ్చేవి) ప్యాంటీలు ఉత్తమమైనవి. ఈ ప్యాంటీలు చివరి త్రైమాసికంలో ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. చివరి త్రైమాసికంతో పాటుగా.. డెలివరీ తర్వాత కూడా ఇవి ఉపయోగపడతాయి. హై వెయిస్టెడ్ (నడుం సగం వరకు ఉండేవి) ప్యాంటీల ఎలాస్టిసిటీ (స్థితిస్థాపకత– ఫ్రీ మూవ్మెంట్) వల్ల రొమ్ము పాలిచ్చేటపుడు ఈజీగా కదిలేందుకు వీలవుతుంది. ఈ ప్యాంటీలు గర్భవతిగా ఉన్న సమయంలో మంచి సహాయకారిగా ఉంటాయి.
మీరు హై వెయిస్టెడ్ (సగం నడుము వరకు వచ్చేవి) ప్యాంటీలను కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను గురించి తెలుసుకోవాలి. అవేంటంటే..
మీరు చాలా కాలం నుంచి హై వెయిస్టెడ్ (సగం నడుము వరకు వచ్చేవి) ప్యాంటీలను ఉపయోగిస్తున్నారు. కాబట్టి మీ ప్రాధాన్యతలు మీకు సౌకర్యంగా ఉన్నాయా? లేదా అనేది నిర్ధారించుకోవాలి. మీ గర్భధారణ సమయంలో మీ బేబీ బంప్ ఎంతలా పెరుగుతుందనేది అంచనా వేయడం కష్టం. అందుకోసమే చాలా బిగుతుగా లేదా చాలా వదులుగా ఉండే ప్యాంటీలకు దూరంగా ఉండండి. అధిక బిగుతుగా ఉండే హై వెయిస్టెడ్ (సగం నడుము వరకు వచ్చేవి) ప్యాంటీలు మీకు చికాకు కలిగించొచ్చు. మరీ వదులుగా ఉండే అది మీకు పనికి రాకుండా మారొచ్చు.
హై వెయిస్టెడ్ (సగం నడుము వరకు వచ్చేవి) మెటర్నటీ ప్యాంటీల ఎలాస్టిసిటీ (సాగే గుణం) మీ ప్రాథమిక కార్యకలాపాలను సౌకర్యవంతంగా నిర్వహించడంలో మీకు సహాయం చేస్తుంది. మీ బేబీ బంప్ అనేది పెరిగినపుడు మీరు ఎక్కువ సేపు సరైన పరిమాణం ఉన్న ప్యాంటీని ధరించాల్సి వస్తుంది. అందుకోసమే మెటర్నటీ (ప్రసూతి) ప్యాంటీలను ఎన్నుకునే సమయంలో ఎలాస్టిసిటీ (సాగే గుణం) అనేది ముఖ్య కారకంగా మారుతుంది.
డెలివరీ తర్వాత కూడా మీకు మెటర్నటీ (ప్రసూతి) ప్యాంటీ అవసరం కావొచ్చు. అందుకోసమే మీరు హై వెయిస్టెడ్ (సగం నడుము వరకు వచ్చేవి) మెటర్నటీ (ప్రసూతి) ప్యాంటీని కొనుగోలు చేసినపుడు మీరు దాని మన్నికను కూడా అంచనా వేయవలసి ఉంటుంది. ఫాబ్రిక్ యొక్క నాణ్యతను తనిఖీ చేస్తే మన్నిక తెలిసిపోతుంది. అది సాగుతుందా లేదా మృదువుగా ఉందా? చాలా తొందరగా సాగే గుణాన్ని కోల్పోయే ఫాబ్రిక్ను తీసుకోవద్దు.
ప్రస్తుత రోజుల్లో చాలా మట్టుకు హై వెయిస్టెడ్ (సగం నడుము వరకు వచ్చేవి) ప్యాంటీలు ఆన్లైన్ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఇవి చాలా సౌకర్యవంతంగా మరియు ఫ్యాషన్‌గా కూడా ఉంటున్నాయి. అనేక రకాల ఆకృతుల నుంచి మీరు ఎంచుకోవచ్చు. ఇవి మిమ్మల్ని ఆకర్షితులను చేస్తాయి. అందుకోసమే ఈ రోజే ఒకదానిని కొనుగోలు చేయండి.
ఇదే మీ మనసును తొలుస్తున్న ప్రశ్న కావొచ్చు. హై వెయిస్టెడ్ (సగం నడుము వరకు ఉండేవి) ప్యాంటీలు మరియు గర్భం కలిసి ఉండకపోవచ్చునని మీరు అనుకోవచ్చు. (గర్భధారణ సమయంలో హై వెయిస్టెడ్ ప్యాంటీలు వేసుకోవడం మంచిది కాదని మీరు భావించవచ్చు.) హై వెయిస్టెడ్ (సగం నడుము వరకు ఉండేవి) ప్యాంటీలు చూసేందుకు షేప్ వేర్ మాదిరిగా ఉంటాయి. కానీ మీ శరీర అవయవాలను డిఫైన్ చేసే విధంగా ఉంటాయి. గర్భవతిగా ఉన్నపుడు ఆ ప్రాంతంలో ఎక్కువ భాగం శిశువు ఉంటుంది. మీరు మీ షేప్‌ను పరిమితం చేస్తే మీ బిడ్డకు హాని కలుగుతుంది.
కానీ మీరు గర్భవతిగా ఉన్నపుడు హై వెయిస్టెడ్ (సగం నడుము వరకు వచ్చేవి) ప్యాంటీలను ఎందుకు ధరించలేరు అనే ప్రశ్నకు వైద్యపరమైన కారణం ఏమీ లేదు. శిశువు చుట్టూ ఉమ్మ నీరు మరియు ఇతర రక్షణ వలయాలు ఉండడం వల్ల ఈ ప్యాంటీలు ధరించడం పూర్తిగా సురక్షితం. కావున హై వెయిస్టెడ్ (సగం నడుము వరకు వచ్చేవి) ప్యాంటీల కంప్రెషన్ (శరీరానికి అతుక్కుపోవడం) వల్ల శిశువుకు ఎటువంటి హాని కలగదు. అయితే మీ సౌకర్యం మరియు సంతృప్తి కొరకు మీరు చేయాల్సిన మరియు చేయకూడని కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.
గర్భధారణ సమయంలో మీ శరీరం అనేక మార్పులకు గురవుతుంది. పెరుగుతున్న బంప్ వల్ల హై కంప్రెషన్ (చర్మానికి అతుక్కుపోయేలా ఉండేవి) ఉండే కొన్ని హై వెయిస్టెడ్ (సగం నడుము వరకు వచ్చేవి) మెటర్నటీ ప్యాంటీల వల్ల అసౌకర్యంతో పాటు హాని కూడా కలుగుతుంది. అందుకోసమే లైట్ నుంచి మీడియం కంట్రోల్ ప్యాంటీలను ఎంచుకోవడం మంచిది. అప్పుడు మీకు హాయిగా సౌకర్యంగా ఉంటుంది.
గర్భధారణ సమయంలో హై వెయిస్టెడ్ (సగం నడుము వరకు వచ్చే) ప్యాంటీలు బాగానే ఉంటాయి. కానీ వెయిస్ట్ (నడుం) ట్రైనర్‌ని నియమించుకోవద్దు. చాలా మంది వెయిస్ట్ ట్రైనర్స్ చేసే మెటర్నటీ (ప్రసూతి) షేప్‌వేర్ మీ అంతర్గత అవయవాలైన పక్కటెముకలు, పొత్తి కడుపు, లేదా కాలేయం వంటి వాటిని కంప్రెస్ చేస్తుంది. ఇది మీ పక్కటెముకల పగుళ్లకు కారణం అవుతుంది. అంతే కాకుండా మీ శ్వాససామర్థ్యాన్ని, భంగిమను ప్రభావితం చేస్తుంది. ఇది మీ కడుపులో ఉన్న బిడ్డకు ఎటువంటి హాని కలిగించకపోవచ్చు. కానీ మీకు మాత్రం హాని కలిగిస్తుంది.
· ప్రత్యేకమైన వాటిని పొందండి: గర్భంతో ఉన్న మహిళల కోసం ప్రత్యేకమైన ప్యాంటీలు ఉన్నాయి. వాటికి వివిధ రకాల పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి బెల్లీ బ్యాండ్. ఇది ట్యూబ్ వలే ఉంటుంది. ఇది మీ నడుముకు మరియు వెనకాల సపోర్ట్ చేస్తుంది. మీ నడుం సైజ్‌ను బట్టి ఈ ప్యాంటీ సైజ్ అడ్జస్ట్ అవుతుంది. మీరు ఈ ప్యాంటీలను ధరించినా కూడా.. తేలికపాటిగా ఉంటాయి.
· క్రోచ్లో (జననేంద్రియాలు ఉండే ప్రదేశం) బిగుతుగా ఉండకుండా చూసుకోండి: గర్భిణీ స్త్రీలు ప్యాంటీలను ఎంచుకునేటపుడు క్రోచ్ (జననేంద్రియాలు ఉండే ప్రదేశం/పంగ) బిగుతుగా ఉండకుండా చూసుకోవాలి. అంతే కాకుండా అక్కడ గాలి ఆడేలా కంఫర్ట్‌గా ఉండాలి. చాలా మంది స్త్రీలలో ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, అదనపు ఉత్సర్గ అవుతూ ఉంటుంది. ఇవన్నీ మెటర్నటీ (ప్రసూతి) లోదుస్తులను జిగటగా మారుస్తాయి. కనుక లోదుస్తులలో క్రోచ్ (జననేంద్రియాలు ఉండే ప్రదేశం) కాటన్ ఫ్యాబ్రిక్‌తో తయారు చేయబడిందని నిర్ధారించుకోవడం అవసరం. అంతే కాకుండా అది బిగుతుగా లేకుండా చూసుకోవాలి.
మెటర్నటీ (ప్రసూతి) ప్యాంటీలు గర్భవతిగా ఉన్న మహిళ శరీరాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత సపోర్ట్, కంఫర్ట్ అందించేందుకు రూపొందించబడ్డాయి. ఈ ప్యాంటీలను వీలైనంత సాగేలా తయారు చేస్తారు. గర్భవతిగా ఉన్న సమయంలో బ్యాక్ సపోర్ట్ అందించేందుకు కూడా.. ఇది సహాయం చేస్తుంది. అంతే కాకుండా పెల్విక్ కండరాలపై భారాన్ని తగ్గించేందుకు ఇవి మృదువుగా ఉంటాయి. ఇవి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్‌తో తయారు చేయబడ్డాయి. ఈ ప్యాంటీలు మీకు సౌకర్యాన్ని అందించేందుకు మీ బంప్‌కు అనుగుణంగా సాగుతాయి. మెటర్నటీ (ప్రసూతి) ప్యాంటీలు కాటన్ మిశ్రమంతో తయారు చేయబడతాయి. ఉత్తమంగా ఉండే ఇతర మెటీరియల్స్ కూడా వాడతారు. మెటర్నటీ (ప్రసూతి) ప్యాంటీలను కొనుగోలు చేసేందుకు వెళ్లేటపుడు అన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవడం మంచిది.
మీ శరీరానికి సూటయ్యే ప్రసూతి లోదుస్తులు కింద కొన్ని ఇవ్వబడ్డాయి.
ఈ ప్యాంటీలు పూర్తి స్టైల్‌గా ఉంటాయి. ఇవి కాటన్ మరియు స్పాండెక్స్‌తో తయారు చేయబడతాయి. ఇవి ఎటంటే అటు సాగుతూ.. సౌకర్యవంతంగా ఉంటాయి. వీటిని మీ బంప్ మీద లేదా కిందకి మడిచేందుకు వీలుంటుంది. మీకు ఏది సౌకర్యవంతంగా ఉంటుందో అది చేస్తే సరిపోతుంది.
ఇవి ముందు వైపు చిన్నవిగా (తక్కువ ఎత్తులో) ఉండి నడుం వద్ద కరెక్టుగా ఫిట్ అవుతాయి. కానీ వెనుకవైపు మొత్తం కవర్ చేస్తాయి. దీని లోపల కాటన్ లైనింగ్ ఉంటుంది. ఇది మీకు పూర్తి సౌకర్యాన్ని అందిస్తుంది. అంతే కాకుండా ఏవైనా మరకలు ఉంటే గుర్తించడంలో మీకు సహాయపడతాయి.
ఈ ప్యాంటీలు పెరుగుతున్న పొట్టకు మద్దతునిస్తాయి. గర్భంలో ఉన్న శిశువు బరువు ఎక్కువగా ఉంటే.. ఈ ప్యాంటీలకు ఉండే ఇంటిగ్రేటెడ్ లైట్ సపోర్ట్ బ్యాండ్ మద్దతునిస్తుంది. ఈ ప్యాంటీలు రోజు ధరించేందుకు ఒక అద్భుతమైన ఎంపిక.
సాగే గుణం గల ఎంతో సౌకర్యవంతమైన ఈ సూపర్ ప్యాంటీలు నైలాన్ మరియు స్పాండెక్స్ మెటీరియల్‌తో తయారు చేయబడ్డాయి. ఈ ప్యాంటీలు అందమైన లేస్ డిటేలింగ్తో వస్తాయి. మిడ్ బంప్‌ను కవర్ చేసేందుకు ఇవి స్ట్రెచ్ అవుతాయి(సాగుతాయి).
ప్ కవరేజీని అందిస్తూ.. మృదువుగా, సౌకర్యవంతంగా ఉండే మెటర్నటీ (ప్రసూతి) లోదుస్తుల కోసం మీరు చూస్తున్నట్లయితే ఇవి మంచి ఎంపిక. ఈ నైలాన్ షార్ట్స్ 11 శాతం స్పాండెక్స్‌తో రూపొందించబడ్డాయి.
ఈ ఓవర్ ది బంప్ ప్యాంటీలు నాలుగు పక్కల స్ర్టెచ్ మరియు మైక్రోఫైబర్ మెష్‌తో వస్తాయి. అందువల్ల గాలి ప్రసరణ బాగా జరుగుతుంది. అంతే కాకుండా ఇవి తేమను కూడా బాగా గ్రహిస్తాయి. ఇవి పొత్తి కడుపుకు సపోర్ట్ అందజేస్తాయి. ఒక సపోర్ట్ ప్యానెల్ ఉంటుంది. మీరు రోజంతా సురక్షితంగా ఉంటారు. ఈ ప్యాంటీలు స్పాండెక్స్, నైలాన్ కలయికతో తయారు చేయబడ్డాయి. అంతే కాకుండా పీల్చుకునేందుకు కాటన్ ఇన్నర్ లైనింగ్ ఉంటుంది.
ఈ లోదుస్తులు సెల్ఫ్ డ్రెస్సింగ్ లేదా కేర్ గివర్ డ్రెస్సింగ్ (ఇతరులకు డ్రెస్ చేయడం) సులభతరం చేసేందుకు సైడ్ ఫాస్ట్నర్స్ను(పక్కలకు బటన్స్) కలిగి ఉంటాయి. ఇవి ఇన్నర్ కాటన్ లైనింగ్ మరియు యాంటీ మైక్రోబయాల్ టెక్నాలజీతో ఉండి... ట్యాగ్ ఫ్రీగా ఉంటాయి. ఇది రోజంతా తాజాగా, పొడిగా అనిపించేలా చేస్తుంది.
ఈ ప్యాంటీలు సాంకేతికంగా మెటర్నటీ (ప్రసూతి) లోదుస్తులు కావు. ఇవి బంప్ కింద సౌకర్యవంతంగా ఉండే V-షేప్ ఫ్రంట్, V-షేప్ బ్యాక్ వెయిస్ట్ బ్యాండ్ (నడుము పట్టీ) ను కలిగి ఉంటుంది. ఇది సాగే గుణం గల మెటీరియల్‌తో తయారు చేయబడింది. ఇది గర్భధారణ సమయంలో సాగుతుంది.
మీకు కనుక ప్యాంటీల మీద లైన్స్ నచ్చకపోతే ఇవి మీ కోసమే. ఇవి అతుకులు లేని ఫాబ్రిక్‌తో తయారు చేయబడ్డాయి. ఇవి ఓవర్ ది బంప్ స్టైల్లో ఎత్తుగా ఉంటుంది.
ఈ ప్యాంటీలు బంప్ స్టైల్ మెటర్నటీ (ప్రసూతి) లోదుస్తుల కింద ఉంటాయి. C-సెక్షన్ (సిజేరియన్) నుంచి కోలుకుంటున్న వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్యాంటీలు వెదురుతో తయారు చేయబడ్డాయి. ఇవి తేలికగా ఉండి.. చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ ప్యాంటీలు ముందు భాగంలో V- ఆకారంలో ఉంటాయి. వెనకాల పూర్తి కవరేజీని అందిస్తాయి.
ఈ ఓవర్ ది బంప్ రకం మెటర్నటీ (ప్రసూతి) లోదుస్తులు అడ్జస్టబుల్ (సర్దుబాటు) వెయిస్ట్ బ్యాండ్ (నడుము పట్టీ) డిజైన్‌తో వస్తాయి. అందువల్ల మీరు ఎంతలా అంటే అంత వెడల్పు నడుముకైనా వీటిని ధరించొచ్చు. ఈ హై రైజ్‌లో దుస్తులు విస్కోస్, నైలాన్, స్పాండెక్స్ మెటీరియల్స్‌తో తయారు చేయబడ్డాయి. ఇవి మెష్ ఒవెన్ మెటీరియల్‌తో డిజైన్ చేయబడ్డాయి. అందువల్ల ఇవి సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా గాలి ప్రసరణ కూడా బాగా జరుగుతుంది.
రు కనుక షేప్ వేర్లను ఉపయోగించడం ఇష్టపడితే.. మెటర్నటీ (ప్రసూతి) స్కల్ప్టింగ్ (శిల్పం) షార్ట్‌లను మీరు ధరించొచ్చు. ఇవి మరీ బిగుతుగా లేదా మరీ వదులుగా ఉండకుండా మీ పొత్తి కడుపుకు సపోర్ట్‌ను అందజేస్తాయి. ఈ షార్ట్ వెనుక భాగంలో సిలికాన్ బ్యాండ్‌ను కలిగి ఉంటుంది. ఇది కిందికి జారకుండా ఉంచడంలో సహాయపడుతుంది.
ఈ రకమైన మెటర్నటీ (ప్రసూతి) లోదుస్తులు ఓవర్ బంప్ స్టైల్‌ను కలిగి ఉంటాయి. కాటన్ మరియు స్పాండెక్స్‌తో వీటిని తయారు చేస్తారు. ఇది అడ్జస్టబుల్ బ్యాండ్‌ను కలిగి ఉంటుంది. ఇది గాలి బాగా వీచే ఫాబ్రిక్ను కలిగి ఉంటుంది. అది తేమను కూడా పీల్చుకుంటుంది. ఇది నడుమును పూర్తిగా చుట్టేస్తుంది కావున ఇది మీ పొట్టకు మంచి సపోర్ట్‌ను అందిస్తుంది. ఈ రకమైన ప్యాంటీ మీ బంప్‌ను కప్పి ఉంచినప్పటికీ ఉబ్బెత్తుగా ఉండదు.
ఈ ప్యాంటీలు గర్భధారణ సమయంలో మరియు డెలివరీ తర్వాత.. అదనపు లీక్ కాకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. తేమను పీల్చుకునే ఎలాస్టేన్ ఫాబ్రిక్ దీనిని పొడిగా ఉంచుతుంది. ఇది డబుల్ లేయర్ వెయిస్ట్ బ్యాండ్స్ (నడుం పట్టీలు)ను కలిగి ఉంటుంది. అయినప్పటికీ వీటిని మొదటి త్రైమాసికం నుంచి నాలుగో త్రైమాసికం వరకు మాత్రమే ఉపయోగిస్తారు.
మెటర్నటీ (ప్రసవ) ప్యాంటీలు గర్భధారణ సమయంలో.. కొన్ని సార్లు ప్రసవం తర్వాత కూడా మద్దతు అందించేలా రూపొందించబడ్డాయి. మీకు సాధారణ దుస్తులు సరిగ్గా ఫిట్ కావని అనిపిస్తే... మెటర్నటీ దుస్తులు మరింత కొత్త అనుభూతిని అందిస్తాయి. మెటర్నటీ (ప్రసవ) లోదుస్తులు కూడా మీకు గొప్పగా ఉంటాయి. మరియు మంచి అనుభూతిని కలిగిస్తాయి. వీటిలో చాలా రకాలు(వెరైటీస్) ఉంటాయి. ఆకర్షణీయంగా కూడా ఉంటాయి. మెటర్నటీ లోదుస్తుల వలన మీరు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. బరువు పెరగడం, సాధారణ మార్పులు, స్ట్రెచ్ మార్స్క్(సాగిన గుర్తులు) ఉన్నప్పటికీ మీరు కొన్ని రకాల మెటర్నటీ లో దుస్తులను వాడడం వలన మంచి అనుభూతి కలుగుతుంది. మీ బాడీ షేప్ మారినా మీరు మంచి అనుభూతి చెందుతారు.
Yes
No
Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |