hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Health & Wellness arrow
  • గర్భధారణ సమయంలో మీ మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? (How To Maintain Your Mental Health During Pregnancy in Telugu?) arrow

In this Article

    గర్భధారణ సమయంలో మీ మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? (How To Maintain Your Mental Health During Pregnancy in Telugu?)

    Health & Wellness

    గర్భధారణ సమయంలో మీ మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? (How To Maintain Your Mental Health During Pregnancy in Telugu?)

    3 November 2023 న నవీకరించబడింది

    ఎటువంటి భావోద్వేగాలు రావచ్చు? (What Emotions Can Occur in Telugu?)

    గర్భధారణ సమయంలో మూడ్ స్వింగ్స్ అనేవి సాధారణం. కానీ మీరు అన్ని వేళలా భయంభయంగా లేదా నెర్వస్​గా ఫీల్ అయితే.. ఇది తీవ్రమైన సమస్యలకు సంకేతం కావచ్చు. గర్భధారణ ఒత్తిడి మరియు హార్మోన్ల మార్పులు అనేవి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తాయి. కొంత మంది గర్భిణీ స్త్రీలు ఈ కింది వాటిని అనుభవిస్తారు.

    1. ఆందోళన (Anxiety):

    ఆందోళన అనేది ప్రస్తుతం సంభవిస్తున్న ఘటనల వల్ల కలిగేది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి భయం పెట్టుకోవడం, తల్లి కావడం, పిల్లలను పెంచడం వంటి వాటి గురించి కలిగే భయం. ఈ భయాలు మరియు చింతలన్నీ ఆందోళనకు దారి తీయొచ్చు. దీనికి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

    2. నిరాశ (Depression):

    నిరాశ, నిస్పృహ అనేది చాలా వారాలు, నెలల పాటు లో ఫీలింగ్ మరియు బాధను కలిగి ఉంటుంది. ఇది చికాకును కూడా కలిగిస్తుంది. కొంత మంది స్త్రీలు గర్భధారణకు ముందు కూడా డిప్రెషన్​ను అనుభవించవచ్చు. అయితే తల్లి గర్భవతిగా ఉన్నపుడు సంతోషంగా లేకపోతే లేదా ఇంటిలో లేదా పని చేసే ప్రాంతంలో ఏదైనా ఒత్తిడికి గురైనపుడు డిప్రెషన్ సంభవిస్తుంది.

    గర్భిణీ స్త్రీలలో కనిపించే ఇతర భావోద్వేగాలు

    1. భయాందోళనలు (Panic attacks): ఇది కొన్ని తీవ్రమైన శారీరక ప్రతిచర్యలకు దారితీసే ఆకస్మిక భయం.
    2. ఈటింగ్ డిజార్డర్స్ (తినాలనిపించకపోవడం) (Eating disorders): ఈటింగ్ డిజార్డర్స్ అంటే అతిగా తినడం లేదా ఏమీ తినాలని అనిపించకపోవడం.
    3. బైపోలార్ డిజార్డర్(ఒక రకమైన మానసిక వ్యాధి) (Bipolar disorder): విపరీతమైన ఉత్సాహం నుంచి విపరీతమైన దు:ఖానికి కారణమయ్యే విపరీతమైన మూడ్ స్వింగ్స్.
    4. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (Obsessive-compulsive disorder): కొన్ని చర్యలను పదే పదే పునరావృతం చేయడం. వాటిని ఆపడం చాలా కష్టమవుతుంది.

    నేను ఎలా సహాయం పొందగలను? (How Can I Get Assistance?)

    మీరు ఆందోళనగా లేదా డిప్రెషన్​గా ఉన్నట్లయితే వెంటనే మీ వైద్యుడిని లేదా థెరపిస్ట్​ను సంప్రదించాలి. తల్లి మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనది కాబట్టి మీరు సాధ్యమైనంత త్వరగా చికిత్స చేసుకోవాలి. మీ మెడికల్ హిస్టరీని గురించి వైద్యుడితో పంచుకోండి. అప్పుడు గర్భధారణ సమయంలో మీకు సంభవించే సంఘటనల గురించి మీ వైద్యుడికి తెలిసిపోతుంది. కొంత మంది తల్లులు సరైనవి కాని మందులు లేదా ఆల్కహాల్ తీసుకోవడం మొదలుపెడతారు. ఇది తల్లి లేదా కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మీకు ఏవైనా మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురైతే వీలైనంత త్వరగా మీ థెరపిస్ట్​ను సంప్రదించండి.

    ఈ సమస్యలు ఎలా హ్యాండిల్ చేయబడతాయి? (How Are Issues Handled?)

    మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స పద్ధతులు వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటాయి. ఈ కింది రకాల చికిత్సలను వ్యక్తులకు ఇస్తారు.

    1. ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ (Prescription Medicine):

    శిక్షణ పొందిన వైద్యుడి నుంచి ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఎల్లప్పుడూ మందులు తీసుకోండి. ఏదైనా ఔషధాన్ని తీసుకోవడం ఆకస్మికంగా ఆపకండి. ఎందుకంటే ఇవి తల్లి మరియు బిడ్డను ప్రభావితం చేసే ఉపసంహరణ దుష్ప్రభావాలను కలిగి ఉండవచ్చు. మీ పూర్తి వైద్య చరిత్రను గురించి ఎల్లప్పుడూ వైద్యులకు అందించండి. ఎందుకంటే కొన్ని రకాల మందులు శిశువు మరియు శిశువు పెరుగుదల మీద కూడా ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఇది అనేక సమస్యలకు దారి తీస్తుంది. మీకు ఏవైనా మానసిక సమస్యలు ఉండి.. గర్భవతి కావాలని ఆలోచిస్తున్నట్లయితే మీ వైద్యుడికి తెలియజేయండి. భవిష్యత్​లో మీకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మీ వైద్యుడు మీకు మందులను సిఫారసు చేయవచ్చు.

    2. టాక్ థెరపీ (Talk Therapy):

    మీ వైద్యుడు లేదా థెరపిస్ట్​తో టాక్​ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. మీ అవసరాలు మరియు మానసిక ఆరోగ్యం గురించి వైద్యుడు ఒక అంచనాకు వస్తాడు. మీకు సుఖంగా ఉండేలా మీ ఫ్రెండ్స్​ గ్రూప్​తో మీ సమస్యలను పంచుకోండి. మీ మానసిక ఒత్తిడిని పెంపొందించుకోవద్దు. ఇది మీకు తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తుంది. మీరు ఇతర గర్భిణీ స్త్రీలతో కమ్యూనికేట్ చేయాలని అనుకోవచ్చు. మీ సమస్యలను ఇతరులతో పంచుకోవడం వలన మీకు అవగాహన వస్తుంది. అంతే కాకుండా అపారమైన మద్దతు లభిస్తుంది. మీరు మీ గర్భం లేదా ఇతర సమస్య గురించి ఆందోళన చెందుతుంటే మీ కుటుంబం లేదా తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ప్రయత్నించండి. తద్వారా వారు మీకు మద్దతును అందిస్తారు. ఇది మీ ఆందోళన లేదా డిప్రెషన్​ను తగ్గించడంలో సహాయపడుతుంది.

    3. ఇతర పద్ధతులు (Other Methods):

    కొన్ని రకాల సాధారణ వ్యాయామాలైన యోగా, ధ్యానం అనేవి ఒత్తిడిని తగ్గించుకోవడంలో సహాయం చేస్తాయి. మీకు ఎప్పుడైనా ఆతృతగా అనిపిస్తే ఇంటి పని చేయడం, మీకు ఇష్టమైన టీవీ షోలు చూడడం, లేదా మీ స్నేహితులతో బయటకు వెళ్లడం వంటి పనులు చేసేందుకు ప్రయత్నించండి. మీకు ఆందోళనగా మరియు డిప్రెషన్​గా అనిపించినపుడు లోతైన శ్వాసను తీసుకోండి. లేదా మీ స్నేహితులు లేదా కుటుంబసభ్యులకు కాల్ చేయండి. మీకు మంచి అనుభూతి కలుగుతుంది.

    4. హ్యాపీ ఫుడ్స్ (Happy Foods):

    గర్భధారణ సమయంలో మనం తీసుకునే ఆహారపు అలవాట్లు గర్భధారణ సమయంలో మానసిక స్థితిని మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కానీ ఇది నిజం. రంగురంగుల ప్లేట్​లో మంచి ఆహారం ఎల్లప్పుడూ తినాలనే ఉత్సాహాన్నిస్తుంది. మంచి ఆహారం తీసుకుంటే ఒకరిలో సంతోషకరమైన హార్మోన్లను పెంచుతాయి. ఎండార్పిన్లు, డోపమైన్, మరియు సెరిటోనిన్ వంటి వాటి స్థాయిని పెంచుతాయి. గర్భధారణ సమయంలో సరైన విధంగా తినడం వల్ల వీటి ఉత్పత్తి పెరుగుతుంది. అందువల్ల మంచి ఆహారం గర్భధారణ సమయంలో మంచి శారీరక ఆరోగ్యంతో పాటు మంచి మానసిక ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ఎమోషనల్ వెల్ బీయింగ్ అంటే ఏమిటి | దాని ప్రాముఖ్యత & లక్షణాలను అర్థం చేసుకోవడం

    Tags:

    Mental health during pregnancy in telugu, How to maintain good mental health during pregnancy in telugu, Things that effect mental health in telugu, Things that keep your mental health stable in telugu, emotions occur if mental health disturbed in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |