hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy Best Foods arrow
  • గర్భధారణ సమయంలో పచ్ఛళ్లు | ప్రయోజనాలు & ప్రమాదాలు arrow

In this Article

    గర్భధారణ సమయంలో పచ్ఛళ్లు | ప్రయోజనాలు & ప్రమాదాలు

    Pregnancy Best Foods

    గర్భధారణ సమయంలో పచ్ఛళ్లు | ప్రయోజనాలు & ప్రమాదాలు

    3 November 2023 న నవీకరించబడింది

    ప్రజలు గర్భవతి కావాలని పిల్లలను కనాలని ఆశిస్తున్నట్లయితే వారు ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ (గర్భధారణ సమయంలో తిండి కోరికలు) గురించి అనేక విషయాలను తరచూ వింటూ ఉంటారు. చాలా మంది గర్భిణీ స్త్రీలు తమకు గర్భధారణ సమయంలో పచ్చళ్లు తినాలని అనిపిస్తుందని చెబుతారు. గర్భవతులు క్రంచీ మరియు ఉప్పగా ఉండే పచ్చళ్లను ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ఎక్కువగా ఇష్టపడే ప్రసిద్ధ వంటకాలలో పచ్చళ్లు ఒకటి. గర్భధారణ సమయంలో పచ్చళ్లు తినడం మంచిదా? కాదా? ఈ ఆర్టికల్​లో ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.

    గర్భధారణ సమయంలో స్త్రీలు ఎక్కువగా పచ్చళ్లను ఎందుకు ఇష్టపడతారు

    "గర్భధారణ సమయంలో పచ్చళ్లు తినొచ్చా" అని చాలా మంది గర్భిణీ స్త్రీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఇలా పచ్చడి తినాలనే కోరిక ఎందుకు కలుగుతుందని కొంత మంది ఆలోచిస్తారు. గర్భవతిగా ఉన్నపుడు పచ్చళ్లను తినాలనే కోరిక కలగడం మామూలు ప్రెగ్నెన్సీ స్టీరియోటైప్. గర్భధారణ సమయంలో స్త్రీ క్రేవింగ్స్ ​ను బట్టి కొంత మంది శిశువు లింగం (జెండర్​) చెప్పేందుకు ఉపయోగిస్తారు. కానీ దీనికి ఎటువంటి సిద్ధాంతపరమైన మద్ధతు లేదు. స్త్రీలు పచ్చళ్లను తినాలనే క్రేవింగ్స్ (కోరికలు) ఈ కింది కారణాల వల్ల సంభవిస్తాయి.

    1. హార్మోనల్ ఎఫెక్ట్ – రుచి మరియు వాసనను మనం గురించి మనం ఆలోచించే విధానం ఈస్ట్రోజెన్ మరియు ఇతర హార్మోన్ల వల్ల ప్రభావితం అవుతాయి. ఫలితంగా ఆహారం రుచి గర్భధారణ సమయంలో గతంలోకంటే భిన్నంగా ఉంటుంది. గర్భవతులు పచ్చళ్ల వంటి ఆహారాల విషయంలో విపరీతమైన కోరికలను కలిగి ఉంటారు. అవి తిన్నపుడు గర్భిణీల నాలుకకు సంతృప్తినిస్తాయి.

    2. భావోద్వేగాల ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్): గర్భధారణ సమయంలో స్త్రీ అప్పుడపుడు ఒత్తిడికి లోనవుతుంది. ఆ సమయంలో స్త్రీ పచ్చళ్లను తినాలని అనుకుంటుంది.

    పచ్చళ్లలో ఉండే పోషకాల విలువ

    "నేను గర్భధారణ సమయంలో పచ్చళ్లు తినొచ్చా?" అని గర్భవతులు తమను తాము ప్రశ్నించుకుంటే.. అవును అనే సమాధానం వినిపిస్తోంది. పచ్చళ్లలో పోషక విలువలు ఎక్కువగా ఏమీ ఉండవు. వీటిలో ప్రొటీన్ మరియు కొవ్వులు తక్కువ స్థాయిలో ఉంటాయి. అంతకంటే తక్కువ మోతాదులో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఐరన్ మరియు సాల్ట్ అనేవి పచ్చళ్లు అందించే రెండు రకాల పోషకాలు. అంతే కాకుండా వాటిలో కాల్షియం, డైటరీ ఫైబర్ మరియు విటమిన్ C కూడా ఉంటుంది. వివిధ రకాల పచ్చళ్లలో కేలరీలు, సోడియం, కొలెస్ట్రాల్ లెవెల్స్ వేర్వేరుగా ఉంటాయి. కావున పోషకాహారం గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడం అవసరం. పచ్చళ్లు వాటి స్వతహాగా ఎక్కువగా విటమిన్స్ మరియు మినరల్స్ కలిగి ఉండకపోయినా పచ్చడిని భోజనంలో కలుపుకుని తినడం వలన భోజనం యొక్క ప్రోబయోటిక్ విలువ పెరుగుతుంది.

    గర్భధారణ సమయంలో పచ్చళ్లు తినాలని అనిపించే కోరికల గురించి పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

    గర్భధారణ సమయంలో పచ్చళ్లు ఈ కింది కారణాల వల్ల తినాలని అనిపిస్తాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి.

    1. హార్మోన్స్: హార్మోన్ల విషయంలో ఎక్కువ పరిశోధనలు చేయనప్పటికీ.. గర్భధారణ మొత్తం ప్రయాణంలో సంభవించే హార్మోన్ల మార్పుల వలన వివిధ రకాల మార్పులు వస్తాయని మనందరికీ తెలుసు.

    ఏదేమైనప్పటికీ మొదటి త్రైమాసికంలో ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరాన్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయని మనందరికీ తెలుసు. ఈ హార్మోన్ల మార్పులు తరచూ మార్నింగ్ సిక్​నెస్ మరియు వాంతులకు కారణం అవుతాయి. ఈ సమయంలో గర్భవతి ఇంద్రియాల అవగాహనలు మరీ ముఖ్యంగా ముక్కు మరియు రుచికి సంబంధించిన భావనలు గణనీయంగా మారుతాయి.

    2. పొటెన్షియల్ న్యూట్రీషినల్ డెఫిషియన్సీ: గర్భవతిగా ఉన్నపుడు రక్తపరిమాణంతో పాటుగా ఉప్పు యొక్క అవసరం కూడా పెరుగుతుందనే ఒక భ్రమ ఉంటుంది. ఈ సమయంలో పచ్చళ్ల కోసం ఆరాటం (క్రేవింగ్స్​) అనేవి మనం సోడియం లోపంతో బాధపడుతున్నట్లు సూచిస్తాయి. ఫలితంగా కొంత మంది ఆహారం కోసం కోరికలు ఏర్పడడం ఈ లోపాన్ని నివారించేందుకే అని నిర్దారించారు.

    గర్భధారణ సమయంలో పచ్చళ్ల వల్ల ప్రయోజనాలు

    పచ్చళ్లను మితంగా తీసుకోవడం వలన గర్భధారణ సమయంలో ఈ కింది ప్రయోజనాలు కలుగుతాయి.

    శరీరంలోని ఎలక్ట్రోలైట్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి

    శరీరానికి సోడియం మరియు పొటాషియం వంటి మినరల్స్ అయిన ఎలక్ట్రోలైట్స్ చాలా అవసరం. గర్భధారణ సమయంలో పెరుగుతున్న పిండం అవసరాలను తీర్చేందుకు మరిన్ని ఎలక్ట్రోలైట్స్ అవసరం అవుతాయి. పచ్చళ్లలో ఎక్కువ పరిమాణంలో ఉప్పు మరియు పొటాషియం ఉంటుంది. కావున పచ్చళ్లను మితంగా తీసుకోవడం వలన మన శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి.

    జీర్ణశక్తి మెరుగుపడుతుంది

    పచ్చళ్లు జీర్ణశక్తిని పెంచుతాయి. అంతే కాకుండా కొంత వరకు రోగనిరోధక పనితీరుకు కూడా ఇవి సహాయపడతాయి. పచ్చళ్లలో ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే బ్యాక్టీరియా ఉండవచ్చు. కావున పచ్చళ్లు తినడం వలన మన శరీరం జీర్ణవ్యవస్థలో మరింత ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది.

    ఫ్రీ రాడికల్స్​తో పోరాడుతాయి

    పచ్చళ్లు యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటాయని అంతా నమ్ముతారు. పికిల్డ్ వెజిటేబుల్స్ లేదా పండ్లలోని యాంటీఆక్సిడెంట్స్ ప్రిజర్వ్ చేయబడతాయి. ఎందుకంటే అవి ఎక్కువగా ఉడికించబడవు. ఎందుకంటే ఈ యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరాన్ని ప్రీ రాడికల్స్ నుంచి కాపాడడంలో సహాయపడతాయి.

    రోగనిరోధక శక్తి పెరుగుతుంది

    ఉసిరి వంటి వివిధ రకాల పండ్లు మరియు ఆమ్లా వంటి కూరగాయలతో తయారు చేసిన పచ్చళ్ల వలన శరీరానికి అవసరమైన విటమిన్స్ అలాగే కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్ కూడా అందుతాయి.

    గర్భధారణ సమయంలో పచ్చళ్ల వలన వచ్చే దుష్ప్రభావాలు

    ప్రపంచంలో ఎక్కడ తయారు చేసిన పచ్చడిని చూసినా కానీ వాటిల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భధారణ హైపర్​టెన్షన్​కు మరియు గుండె జబ్బుల ప్రమాదాలకు మరియు హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదకర జబ్బులకు దారి తీస్తుంది. అంతే కాకుండా మన ఇండియాలో తయారు చేసే పచ్చళ్లలో నూనె కూడా ఎక్కువ మోతాదులోనే ఉంటుంది. ఇది గర్భధారణ సమయంలో అధిక కొలెస్ట్రాల్ మరియు శరీరంలో అధిక మోతాదులో కొవ్వుకు కారణం అవుతుంది. కృతిమ ప్రిజర్వేటివ్స్​ లేదా చాలా కారంగా ఉండే పచ్చళ్లను తిన్నా గర్భధారణ సమయంలో ఉబ్బరంగా లేదా గ్యాసీగా అనిపించవచ్చు.

    గర్భధారణ సమయంలో పచ్చళ్లు తినేటపుడు తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలు

    గర్భధారణ సమయంలో పచ్చళ్లు తినడం సౌలభ్యంగా ఉంటుంది. కానీ వాటిని తినే ముందు కొన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం వలన దాని దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు. అవి ఈ కింది విధంగా ఉంటాయి.

    • ఎల్లప్పుడూ హైడ్రేటెడ్​గా ఉండండి.
    • గర్భిణీ స్త్రీలు గ్యాస్ట్రిటిస్​కు (కడుపులో పుండ్లు పడడం) గురయ్యే ప్రమాదం ఉన్నట్లయితే పచ్చళ్లు తినకుండా ఉండడం మంచిది.
    • గుండెల్లో మంటను నివారించేందుకు పచ్చళ్లు తినడం మానేయండి.
    • అధిక ప్రిజర్వేటివ్ లెవెల్స్ ఉన్న పచ్చళ్లను తినకుండా నివారించండి.
    • అధిక బరువును నివారించేందుకు తీపిగా ఉండే పచ్చళ్లకు దూరంగా ఉండండి.

    అప్పుడప్పుడూ కోరికలకు లొంగడం మంచిదే అయినప్పటికీ వాటిని అతిగా తీసుకోకుండా జాగ్రత్త పడండి. గర్భధారణ సమయంలో పచ్చళ్లను తక్కువ మోతాదులో తీసుకుంటే కొన్ని ప్రయోజనాలుంటాయి. కానీ అధికంగా వినియోగించినపుడు అది దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |