Diet & Nutrition
3 November 2023 న నవీకరించబడింది
గర్భవతులు గుడ్లు తినవచ్చా? ఇది మామూలుగా కలిగే సందేహం. గుడ్లను ఉడికించి, గిలకొట్టిన, వేయించి లేదా ఎండలో వేడిచేయడంతో సహా వివిధ పద్ధతుల్లో తయారు చేసుకొని తీసుకోదగ్గ మంచి అల్పాహారం. గుడ్లు సాధారణంగా ఉదయపు భోజనానికి మంచి పోషకాలను చేర్చుతుంది. అయితే, గర్భవతిగా ఉన్నప్పుడు గుడ్లు తీసుకోవడం సురక్షితమేనా అని మీరు తెలుసుకోవాలనుకోవచ్చు. మంచి విషయమ ఏమిటంటే, గుడ్లను చక్కని పద్ధతుల్లో సిద్ధం చేసినప్పుడు నిరభ్యంతరంగా తినవచ్చు. గర్భధారణ సమయంలో గుడ్లు తీసుకోవడం గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతీ విషయం ఇక్కడ ఉంది.
అవును, గర్భధారణ సమయంలో గుడ్లు తినడం మంచిది, అయితే వాటిని సరిగ్గా ఉడికించాలి లేదా పాశ్చరైజ్ చేయాలి. ఉడికించని లేదా పచ్చి గుడ్లలో ఫుడ్ పాయిజనింగ్ కలిగించే సాల్మొనెల్లా బ్యాక్టీరియా లాంటి వ్యాధికారక క్రిములు ఉండవచ్చు. గర్భవతులకు ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధుల అవకాశం అధికం, ఎందుకంటే గర్భధారణ వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థ పనితీరును తాత్కాలికంగా మందగిస్తుంది. సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ల వల్ల అధిక జ్వరం, వాంతులు, విరేచనాలు ఇంకా శరీర డీహైడ్రేషన్ ను కలిగిస్తాయి. ఈ లక్షణాల తీవ్రత ఎక్కువైనట్లయితే, కొన్ని తీవ్రమైన కేసుల విషయంలో అది అకాల ప్రసవానికి దారితీయవచ్చు లేదా గర్భస్రావం కూడా కావచ్చు. అన్ని బ్యాక్టీరియాలు నిర్మూలించబడ్డాయని నిర్ధారించుకోవడానికి, గర్భధారణ సమయంలో పూర్తిగా ఉడికించిన లేదా పాశ్చరైజ్ చేసిన గుడ్లను మాత్రమే తీసుకోవడం ఎంతో ముఖ్యం. గర్భధారణ సమయంలో ఉడికించిన గుడ్లు తినడం కూడా మంచిదే.
మీకు ఇది కూడా నచ్చుతుంది: తెలియకుండా అబార్షన్: దీనికి కారణాలు ఏమిటి? ఈ పరిస్థితి లక్షణాలు ఎలా ఉంటాయి?
గుడ్లలో అధిక ప్రోటీన్ సారం ఉంటుంది. అంతేకాక, గర్భధారణ మొదటి త్రైమాసికంలో గుడ్లు తీసుకోవడం వల్ల ఆహారంలో పోషకాలను పెంచుకొనేందుకు ఇదొక మంచి పద్ధతి. గుడ్లలో అధిక కోలిన్ సారం ఉంటుంది, ఇది కొవ్వు ఇంకా ఖనిజాల మంచి సమ్మేళనం, అందువల్ల ఇది గర్భవతులకు అద్భుతమైనది. దీనితో పాటు, గుడ్లలో సెలీనియం, జింక్, విటమిన్ ఎ, విటమిన్ డి ఇంకా విటమిన్ బి కాంప్లెక్స్ లాంటివి ఉన్నాయి, ఇవి గర్భధారణ సమయంలో ఎంతో ఆవశ్యకమైనవి. గర్భధారణ సమయంలో గుడ్లు తీసుకొంటే, ఈ పోషకాలు మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
గుడ్డు తినడం వల్ల అది గర్భస్థ శిశువు మెదడు ఇంకా నరాల వృద్ధికి సహాయపడుతుంది. బిడ్డ ఎదుగుదలకు గుడ్లు ఎంతగానో సహకరిస్తాయి కాబట్టి గర్భధారణ సమయంలో గుడ్లు తీసుకోవడం మంచిది. గర్భిణీ స్త్రీలు గుడ్లను తీసుకొన్నప్పుడు, వారికి అనేక ప్రయోజనాలు చేకూర్చే పోషకమైన కోలిన్ లభిస్తుంది.
గర్భిణీ స్త్రీలు అనారోగ్యం లేదా అలాంటి పరిస్థితులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, శరీర కణాలు దెబ్బతిన్నట్లయితే, అవి గర్భిణీ స్త్రీ శరీరం లోపల పిండం పెరుగుదలను కూడా ఆటంకపరచవచ్చు. గర్భధారణ సమయంలో ఉడికించిన గుడ్లు తినడం వల్ల చక్కని పోషక విలువలను అందుకొనేందుకు ఇదొక మంచి మార్గం.
నవజాత శిశువులలో 72% లేదా అంతకంటే తక్కువ మందికి పిండ దశలో లేదా పుట్టిన తర్వాత కూడా అసాధారణతలు ఉండే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు తెలిపాయి. ఇది ఎక్కువగా గర్భిణీ స్త్రీలలో కోలిన్ లోపం వల్ల వస్తుంది. గర్భధారణ మొదటి త్రైమాసికంలో గుడ్లు తినడం వల్ల, అది ఈ సమస్యను కలగకుండా చేసే అద్భుతమైన నివారణోపాయం.
గర్భవతులు చాలా సార్లు ఆందోళన ఇంకా నిరాశకు గురవుతుంటారు. గర్భవతులు గుడ్లు తీసుకోవడం వల్ల అందులోని కోలిన్ శరీరంలోని DNA ఇంకా హార్మోన్ల కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. కోలిన్ ఎక్కువగా తీసుకునే గర్భిణీ స్త్రీలు వారి బిడ్డలు పిండ దశ నుండి యుక్తవయస్సు వరకు ఎంత చక్కగా ఎదుగుతారో ఆ మార్పులను కూడా గమనించవచ్చు.
నవజాత శిశువులు ఎక్కువసార్లు అనారోగ్యానికి గురవుతువుంటారు. పుట్టిన తర్వాత, పిల్లలు తమ పరిసరాలకు అనుగుణంగా తమను తాము అనుకూల పరచుకోవాల్సివుంటుంది. ఎందుకంటే శిశువులు గర్భం నుండి బయటి ప్రపంచానికి వచ్చినపుడు వారికి ఏవైనా ఆటంకాలు లేదా అనారోగ్యాలు కలగకుండా, తల్లి కడుపులో ఉన్నప్పుడూ అందుకున్న కోలిన్ ఇలాంటి ప్రభావాలు శిశువుపై పడకుండా ఆసరాగా ఉంటుంది.
గర్భవతులు గుడ్లు తినవచ్చా అనే సందేహం ఉంటే, దానికి అవుననే సమాధానం వస్తుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: కుంకుమపువ్వు - ప్రయోజనాలు, దోషాలు ఇంకా మరికొన్ని వివరాలు
వారి కొలెస్ట్రాల్ స్థాయిని బట్టి, సిఫార్సు చేయబడిన గుడ్లను తీసుకోవడం మంచిది, అది ప్రతిరోజూ ఒకటి నుండి రెండు గుడ్లు వరకు ఉంటుంది. ప్రతి గుడ్డులో 185 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది మరియు శరీరానికి ప్రతిరోజూ 300 మిల్లీ గ్రాములు అవసరమవుతుంది. గర్భధారణ సమయంలో గుడ్డులోని పచ్చసొన కూడా తినవచ్చు కానీ పచ్చిగా కాదు; దానిని సరిగ్గా ఉడికించాల్సివుంటుంది.
అవును, గర్భిణీ స్త్రీలు ఉడికించిన గుడ్లను తినవచ్చు, ఎందుకంటే వాటిలో విటమిన్లు, ఖనిజాలు ఇంకా మంచి కొవ్వు ఉంటుంది. గర్భవతులు ఉడికించిన గుడ్లు తీసుకోవడం వల్ల తల్లీబిడ్డలకు ఆవశ్యకమైన పోషకాలన్నీ అందుతాయి. సిఫార్సు చేయబడినన్ని గుడ్లను తీసుకోవడం తల్లి కొలెస్ట్రాల్ స్థాయిని బట్టి రోజుకు 1-2 గుడ్ల వరకు మారుతుంది. గర్భధారణ సమయంలో ఉడికించిన గుడ్లు తినడం ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారమవుతుంది. గర్భవతిగా ఉన్నప్పుడు, కొన్ని చేయవలసినవి ఇంకా చేయకూడని విషయాలు ఉన్నాయి; సాధారణ ఆహార పదార్థాలు కూడా అకస్మాత్తుగా అనారోగ్య కారకంగా మారవచ్చు. అలాంటి ఆహారంలో గుడ్డు కూడా ఒకటి. బాక్టీరియాను మానవ శరీరాలు సులభంగా జీర్ణించుకోగలిగినప్పటికీ, గర్భధారణ సమయంలో రోగనిరోధక వ్యవస్థ మందగిస్తుంది, తద్వారా గర్భవతులు సునాయాసంగా వ్యాధుల బారిన పడతారు. ఈ కారణంగా, గర్భవతిగా ఉన్నప్పుడు పచ్చి గుడ్లను తీసుకోకపోవడమే మంచిది.
References
1. Christifano DN, Chollet-Hinton L, Hoyer D, Schmidt A, Gustafson KM. (2023). Intake of eggs, choline, lutein, zeaxanthin, and DHA during pregnancy and their relationship to fetal neurodevelopment. Nutr Neurosci.
2. Schnefke CH, Lutter CK, Thuita F, Webale A, Flax VL, Bentley ME. (2019). Is It Possible to Promote Egg Consumption During Pregnancy? Findings From a Study on Knowledge, Perceptions, and Practices in Kenya. Food Nutr Bull.
Eggs during pregnancy in Telugu, Benefits of eggs during pregnancy in Telugu, Risk of eating eggs during pregnancy in Telugu, Eggs During Pregnancy: Benefits And Nutrition Value in English, Eggs During Pregnancy: Benefits And Nutrition Value in Hindi, Eggs During Pregnancy: Benefits And Nutrition Value in Tamil, Eggs During Pregnancy: Benefits & Nutrition Value in Bengali
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |