Diet & Nutrition
3 November 2023 న నవీకరించబడింది
గర్భధారణ సమయంలో గసగసాలు సురక్షితమేనా? అనే ప్రశ్నకు ఏళ్లుగా అవుననే సమాధానమే వస్తోంది. గర్భధారణ సమయంలో తెల్ల గసగసాలు తినడం చాలా సురక్షితం. సరైన ప్రణాళికతో వీటిని తీసుకుంటే మీరు గర్భవతి అయ్యే అవకాశాలను కూడా ఇవి మెరుగుపరుస్తాయి. సీడ్ ఫార్మేషన్ యొక్క మొదటి దశలలో ఇవి చాలా చురుగ్గా ఉన్నప్పటికీ.. బెటా-సిటోస్టిరాల్ అనే రసాయనం ఇందులో తక్కువ సాంద్రతలో ఉన్నట్లు కనుగొనబడింది. ఇది మానవులలో ఉండే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్‌ను ప్రభావితం చేస్తుందని అనేక శాస్త్రీయ అధ్యయనాలలో తేలింది. గర్భధారణ సమయంలో గసగసాలు తినడం గురించి ఇక్కడ కొన్ని ముఖ్యమైన వివరాలు ఉన్నాయి.
గసగసాల మొక్క గసగసాలను (పాపీ సీడ్స్) ఉత్పత్తి చేస్తుంది. ఇవి దగ్గు, ఆస్తమా(ఉబ్బసం), మలబద్ధకం, డయేరియా, నిద్రలేమి (ఇన్సోమ్నియా) వంటి వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేస్తాయనే విస్తృతమైన వాదనలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేక్స్, పాస్ట్రీస్, ఫిల్లింగ్స్, గ్లేజెస్ మరియు పార్డీజెస్ వంటి ఆహారాలలో గసగసాలను ఉపయోగిస్తారు. పెయింట్స్, వార్నిషెస్, బట్టల సబ్బులలో గసగసాల నూనె ఒక ముఖ్యమైన పదార్థం.
గర్భిణీ స్త్రీ తీసుకునే ఆహారం సమతుల్యంగా మరియు ఆరోగ్యకరంగా ఉండాలి. గర్భవతులు పౌష్టికాహారం తినాలి. ఇది వారి కడుపులో బిడ్డ పెరుగుదల మీద ఎంతో ప్రభావం చూపుతుంది. గసగసాలు ప్రొటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉండడం వలన గర్భధారణ సమయంలో తెల్ల గసగసాలను తినడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక గర్భవతి ఎంత మొత్తంలో మరియు రోజులో ఎప్పుడెప్పుడు గసగసాలను తీసుకుంటే సురక్షితంగా ఉంటుందనే విషయం గురించి తెలుసుకునేందుకు గైనకాలజిస్ట్ నుంచి సలహా తీసుకోండి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో బాదం పప్పులు తినడం!
గర్భధారణ సమయంలో గసగసాలు వాటి ప్రయోజనాలతో పాటుగా అనేక దుష్ర్పభావాలను కూడా కలిగి ఉంటాయి. ఈ కింది కారణాల వల్ల గర్భిణీ స్త్రీ గసగసాలు తినేటపుడు జాగ్రత్త వహించాలని గుర్తు పెట్టుకోండి. గసగసాలు వెరీ కామన్ ఎందుకంటే వాటిలో ఎక్కువగా ఓపియేట్ కంటెంట్ ఉంటుంది. గసగసాలలో ఉండే ఓపియిడ్ కోడైన్ వల్ల కలిగే సంభావ్య ప్రమాదాల వల్ల మహిళలు దూరంగా ఉండాలి. రెండవ లేదా మూడో త్రైమాసికంలో అధిక మోతాదులో కోడైన్ కనుక తీసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డ శ్వాసకోస సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. గసగసాలలలో అధిక మోతాదులో టాక్సిన్స్(విషాలు), మార్ఫిన్స్ ఉండడం వలన అవి తల్లి మరియు పిండానికి ప్రమాదకరం. అందువల్ల గర్భధారణ సమయంలో గసగసాలను అధిక మోతాదులో తీసుకోకూడదు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో బ్రౌన్ రైస్: తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అరుదుగా కనిపించినప్పటికీ కొంత మంది వ్యక్తులకు గసగసాలు తిన్న వెంటనే దురదు రావచ్చు. కండ్లకలక, దద్దుర్లు, వాంతులు, నోటి లోపలి భాగంలో వాపు, అంతే కాకుండా కొన్ని రకాల శ్వాససంబంధిత సమస్యలు కూడా ఉన్నాయి. గసగసాలను పీల్చడం ద్వారా చర్మం ఎర్రబడడం, చర్మం కింద ఎడెమా వంటి ఎలర్జీ లక్షణాలు కూడా కనిపిస్తాయి.
కొన్ని రకాల ఆహార పదార్థాలు గసగసాలను కలిగి ఉంటాయి. అవి -
చియా విత్తనాలు అందించే మల్టీపుల్ ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఇవి ఎక్కువ ఇష్టపడే జాబితాలోకి చేరిపోయాయి. ఇతర న్యూట్రియంట్ల వలే ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ మరియు ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. వాటికి ఈ సీడ్స్ గ్రేట్ సోర్స్. గసగసాల వలే చియా సీడ్స్ కూడా చిన్న ఆకృతిని కలిగి ఉంటాయి. అవి పూర్తి పొడిగా ఉన్నపుడు బాగా వర్క్ చేస్తాయి. ఎందుకంటే అవి ద్రవాలను పీల్చుకుని జెల్ (జిగట) వంటి పదార్థాన్ని తయారు చేస్తాయి. క్యాస్రోల్లో కలపడం మరియు కాల్చడం కంటే బదులుగా బేగిన్స్, మఫిన్స్‌లో ఆ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేయండి.
అవిసె గింజలు అనేవి అడిషనల్ ఆప్షన్, కానీ వాటిని కేవలం పైన వేయకుండా పిండిలో కలపాల్సి ఉంటుంది. మీరు కేవలం ఈ గింజలను మాత్రమే తింటే అవి అంత రుచిగా ఉండవు. కానీ అవిసెగింజలు కాల్చిన పదార్థాలకు మంచి రుచిని అందిస్తాయి.
హెంప్ గింజలను గసగసాలకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. ఇవి పాపీ సీడ్స్ ఫిల్లింగ్ చేసే వంటకాలను పూర్తి చేస్తాయి. తిన్నా కానీ పాపీ సీడ్స్ (గసగసాలు) వలే రుచిని కలిగి ఉంటాయి. ఇవి గసగసాలకు ప్రత్యామ్నాయంగా ఉంటాయి కానీ వీటిని మొదట చూర్ణంలా తయారు చేయాలి.
కాల్చినపుడు నువ్వులు గసగసాల వలే గొప్పగా ఉంటాయి. కాల్చని నువ్వుల రుచి వేరేగా ఉంటుంది. వాటి రుచి గసగసాలకు దగ్గరగానే ఉంటుంది కానీ ఇవి డిఫరెంట్ ఆకృతిని కలిగి ఉంటాయి. కావున గసగసాల వలే ఉండేందుకు నువ్వులను చూర్ణం చేయవచ్చు లేదా ముక్కలుగా చేసుకోవచ్చు. వంటకాలలో గసగసాలకు బదులుగా నువ్వులను వేసుకోవచ్చు. వీటిల్లో కూడా ప్రొటీన్, ఫైబర్, మరియు విటమిన్ B పెద్ద మొత్తంలో ఉన్నాయి.
1. Lo DS, Chua TH. (1992). Poppy seeds: implications of consumption. Med Sci Law.
2. Fotschki B, Opyd P, Juśkiewicz J, Wiczkowski W, Jurgoński A. (2020). Comparative Effects of Dietary Hemp and Poppy Seed Oil on Lipid Metabolism and the Antioxidant Status in Lean and Obese Zucker Rats. Molecules.
Tags
Poppy seeds during pregnancy in Telugu, What are poppy seeds during pregnancy in Telugu, Is it safe to eat poppy seeds during pregnancy in Telugu, Risk of poppy seeds during pregnancy in Telugu, Side effects of poppy seeds during pregnancy in Telugu, Poppy Seeds During Pregnancy in English, Poppy Seeds During Pregnancy in Hindi, Poppy Seeds During Pregnancy in Tamil, Poppy Seeds During Pregnancy in Bengali
Yes
No
Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |